రూ.3 లక్షలిస్తేనే ప్రమోషన్స్‌.. హీరోయిన్‌పై నిర్మాత ఫైర్‌! | Suresh Kamatchi Slams Abarnathi for Demanding Rs 3 Lakh to Attend Narkarappor Promotions | Sakshi
Sakshi News home page

ఇలాంటి హీరోయిన్లు దూరంగా ఉంటేనే సినిమాకు మేలు.. నిర్మాత సెటైర్లు

Published Wed, Jul 31 2024 2:01 PM | Last Updated on Wed, Jul 31 2024 2:55 PM

Suresh Kamatchi Slams Abarnathi for Demanding Rs 3 Lakh to Attend Narkarappor Promotions

కోలీవుడ్‌ బ్యూటీ అబర్నతి ఇటీవలే మాయ పుత్తగం అనే సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. తాను ప్రధాన పాత్రలో నటించిన మరో మూవీ నరకప్పర్‌ ఆగస్టు 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్‌ జూలై 30న చెన్నైలో ఓ ప్రమోషనల్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి అబర్నతి డుమ్మా కొట్టింది.

డబ్బు కావాలి
హీరోయిన్‌ తీరుపై నిర్మాత సురేశ్‌ కామాక్షి మండిపడ్డాడు. ప్రమోషన్స్‌కు రావాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసిందని బయటపెట్టాడు. అంతేకాకుండా స్టేజీపై ఎవరి పక్కన కూర్చోవాలనేది కూడా తానే నిర్ణయించుకుంటానని చెప్పినట్లు తెలిపాడు. అయితే తన వైఖరితో చిత్రయూనిట్‌ ఇబ్బందిపడుతోందని గమనించిన బ్యూటీ వారికి సారీ చెప్పింది. ఇక మీదట ప్రమోషన్స్‌కు వస్తానని హామీ ఇచ్చింది.

హీరోయిన్‌పై సెటైర్లు
ప్రమోషన్స్‌కు వస్తానని చెప్పి మాట తప్పిన అబర్నతిపై నిర్మాత మరోసారి ఫైరయ్యాడు. తమిళ సినిమా, తమిళ నిర్మాతలు బతకాలంటే ఇలాంటివారు శాశ్వతంగా దూరంగా ఉండటమే మంచిదని సెటైర్లు వేశాడు. ఈ వ్యవహారంపై చిత్రయూనిట్‌.. తమిళ సినీ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసింది. కాగా అబర్నతి.. జైల్‌, తేన్‌, ఇరుగపట్రు వంటి చిత్రాలతో పాపులర్‌ అయింది.

చదవండి: సిగరెట్‌ తాగిన హీరోయిన్‌? అబ్బే, మా అమ్మాయికి అలవాటు లేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement