పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి పోస్ట్ వైరల్ | Actress Vidya Pradeep Announce Pregnancy After 13 Years Marriage | Sakshi
Sakshi News home page

Vidya Pradeep: డాక్టర్ కమ్ యాక్టర్.. గుడ్ న్యూస్‌తో సర్‌ప్రైజ్

Published Sat, Nov 9 2024 10:57 AM | Last Updated on Sat, Nov 9 2024 12:03 PM

Actress Vidya Pradeep Announce Pregnancy After 13 Years Marriage

ప్రముఖ తమిళ నటి విద్యా ప్రదీప్ శుభవార్త చెప్పింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నానని, త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కడుపుతో ఉ‍న్న ఫొటోలని షేర్ చేసింది. ఇందులో భర్తతో కలిసి హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: 'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఖరీదైన గిఫ్ట్)

కేరళకు చెందిన విద్యా ప్రదీప్.. 2010 నుంచి సినిమాల్లో ఉంది. స్వతహాగా డాక్టర్ అయిన ఈమె.. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు నటిగా కొనసాగుతోంది. సహాయ పాత్రలతో పాటు పలు తమిళ చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

13 ఏళ్ల క్రితం మైకేల్ అనే ఫొటోగ్రాఫర్‌ని పెళ్లి చేసుకుంది. చాన్నాళ్లుగా వీళ్లిద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. సినిమాలు ఏవైనా ఉంటే విద్యా ప్రదీప్.. ఇండియా వచ్చి వెళ్తుండేది. ఇప్పుడు తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని చెప్పి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.

(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement