'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఖరీదైన గిఫ్ట్ | Amaran Siva karthikeyan Gifts Gv Prakash Kumar Costly Watch | Sakshi
Sakshi News home page

Amaran Gv Prakash Kumar: క్యూట్ అండ్ స్వీట్ బహుమతి.. రేటు ఎంతంటే?

Published Sat, Nov 9 2024 10:03 AM | Last Updated on Sat, Nov 9 2024 11:51 AM

Amaran Siva karthikeyan Gifts Gv Prakash Kumar Costly Watch

గతవారం దీపావళి సందర్భంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కిరణ్ అబ్బవరం 'క', దుల్కర్ 'లక్కీ భాస్కర్' లాంటి తెలుగు మూవీస్‌తో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం 'అమరన్' కూడా హిట్‌గా నిలిచింది. పెద్దగా ప్రమోషన్ లేకుండా తెలుగులోనూ రిలీజైనప్పటికీ జనాలకు నచ్చేసింది.

ఇప్పటికే 'అమరన్' మూవీకి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో శివకార్తికేయన్, సాయిపల్లవి తమదైన యాక్టింగ్‌తో కట్టిపడేశారు. కంటెంట్ కూడా అంతకు మించి అనేలా క్లిక్ అయింది. 'హే రంగులే' లాంటి పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‍‌తో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్.. సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాడు.

(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి)

సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన జీవీ ప్రకాశ్ కుమార్‌కి హీరో శివకార్తికేయన్ ఖరీదైన బహుమతి ఇచ్చాడు. దాదాపు రూ.3 లక్షల విలువ చేసే టీఏజీ హ్యూయర్ మెన్స్ ఫార్ములా 1 బ్రాండ్‌కి చెందిన స్టెయిన్ లెస్ స్టీల్ స్టైలిష్ వాచీని తనకు ఇచ్చినట్లు జీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా హీరోకి థ్యాంక్స్ చెప్పాడు.

కశ్మీర్‌లో తీవ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ముకుందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా 'అమరన్' సినిమా తీశారు. ట్రైలర్ రిలీజైనప్పుడు అడివి శేష్ 'మేజర్'తో పోల్చి చూశారు. కానీ మూవీ రిలీజైన తర్వాత అలాంటివేం వినిపించలేదు. 

(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement