మిల్కీ బ్యూటీ తమన్నా ఇంకా ఫామ్‌లోనే ఉంది. అడపాదడపా సినిమాలు చేస్తోంది. గ్యాప్ దొరికితే ఐటమ్ సాంగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. మలయాళంలోనూ గతేడాది ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఆ చిత్రమే తెలుగులోనూ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది.
(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)
ఉత్తరాదికి చెందిన తమన్నా.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 'బాంద్రా' అనే మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. గతేడాది నవంబర్‌లో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఘోరంగా ఫెయిల్ అయింది. రూ.35 కోట్లు బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల వసూళ్లు మాత్రం వచ్చాయి. దీంతో డిజిటల్ మార్కెట్ కూడా జరగలేదు. అలా మూలన పడిపోయింది.
ఇన్నాళ్లకు 'బాంద్రా' డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 15న లేదా 22న స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావొచ్చు. 'బాంద్రా' విషయానికొస్తే.. మాఫియా డాన్ నుంచి తప్పించుకున్న ఓ హీరోయిన్.. గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడుతుంది. ఊహించని పరిస్థితుల్లో ఆమె చనిపోతుంది. తర్వాత ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?)
Comments
Please login to add a commentAdd a comment