ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఏది ఎందులో? | Devara And Vettaiyan Movies Streaming On OTT, Check OTT PLatform Details Inside | Sakshi
Sakshi News home page

OTT Movies: దేవర, వేట్టయన్‌తోపాటు ఆ మూడు డోంట్ మిస్!

Published Fri, Nov 8 2024 7:27 AM | Last Updated on Fri, Nov 8 2024 11:10 AM

Devara And Vettaiyan Movies OTT Streaming Latest

చాలారోజుల ఓటీటీలు కళకళలాడిపోతున్నాయి. ఎందుకంటే ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు హిట్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. వీటిలో ఎన్టీఆర్, రజనీకాంత్, సమంత.. ఇలా స్టార్ హీరోహీరోయిన్లు నటించిన పలు చిత్రాలు ఉండటం విశేషం. ఇవన్నీ ఒకటి రెండు రోజుల్లో ఓటీటీల్లోకి రావడంతో మూవీ లవర్స్ ఉబ్బితబ్బిబయిపోతున్నారు. ఇంతకీ ఏది ఏ ఓటీటీలో ఉందంటే?

దేవర
ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ 'దేవర'.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీసిన ఈ సినిమాలో ఫైట్స్, సాంగ్స్ అదిరిపోయాయి. జాన్వీ కపూర్ అందాల గురించి చెప్పేదేముంది. సినిమా చూస్తే మీరే ఫిదా అయిపోతారు. అక్కడక్కడ చిన్న లోపాలు ఉన్నప్పటికీ తారక్-అనిరుధ్ తమదైన శైలిలో అదరగొట్టేశారు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్)

వేట్టయన్
రజనీకాంత్, అమితాబ్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియన్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ నటించిన 'వేట్టయన్'.. అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఫేక్ ఎన్ కౌంటర్ అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా.. థియేటర్లలో తెలుగు వరకు అంతంత మాత్రంగానే ఆడింది. ఓటీటీలో కాబట్టి ఆడుతూపాడుతూ చూసేయొచ్చు.

జనక అయితే గనక
యంగ్ హీరో సుహాస్ లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. పిల్లలు వద్దనుకునే ఓ మధ్య తరగతి వ్యక్తి.. తండ్రి అయ్యాయని తెలిసి కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. ఏకంగా కోటి రూపాయల దావా వేస్తాడు. బోల్డ్ సబ్జెక్టే కానీ డైరెక్టర్ బాగానే డీల్ చేశారు. కాకపోతే కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఓటీటీలోనే కాబట్టి ఓ లుక్ వేయొచ్చు.

(ఇదీ చదవండి: ‘జితేందర్‌ రెడ్డి’ మూవీ రివ్యూ)

సిటాడెల్: హనీబన్నీ
సమంత నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఆరు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్.. అమెజాన్ ప్రైమ్‪‌లోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్‌పై మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో సమంత లిప్ లాక్ కూడా ఇచ్చేసింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఏఆర్ఎమ్
ఇది మలయాళ డబ్బింగ్ సినిమా. పీరియాడికల్ కాన్సెప్ట్‌తో తీశారు. '2018' మూవీతో మనకు కాస్త పరిచయమైన టొవినో థామస్ హీరో. హాట్‌స్టార్‌లో ప్రస్తుతం తెలుగులోనే అందుబాటులో ఉంది. కాస్త టైముంది డిఫరెంట్‌గా ఏదైనా చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు. ఇలా ఈ వీకెండ్‌లో ఐదు సినిమాలు డిఫరెంట్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement