Janaka Aithe Ganaka Movie
-
ప్రశాంత్ నీల్ ముందే సినిమా చూసి బ్లాక్ బస్టర్ అన్నాడు
-
ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఏది ఎందులో?
చాలారోజుల ఓటీటీలు కళకళలాడిపోతున్నాయి. ఎందుకంటే ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు హిట్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. వీటిలో ఎన్టీఆర్, రజనీకాంత్, సమంత.. ఇలా స్టార్ హీరోహీరోయిన్లు నటించిన పలు చిత్రాలు ఉండటం విశేషం. ఇవన్నీ ఒకటి రెండు రోజుల్లో ఓటీటీల్లోకి రావడంతో మూవీ లవర్స్ ఉబ్బితబ్బిబయిపోతున్నారు. ఇంతకీ ఏది ఏ ఓటీటీలో ఉందంటే?దేవరఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ 'దేవర'.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తీసిన ఈ సినిమాలో ఫైట్స్, సాంగ్స్ అదిరిపోయాయి. జాన్వీ కపూర్ అందాల గురించి చెప్పేదేముంది. సినిమా చూస్తే మీరే ఫిదా అయిపోతారు. అక్కడక్కడ చిన్న లోపాలు ఉన్నప్పటికీ తారక్-అనిరుధ్ తమదైన శైలిలో అదరగొట్టేశారు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్)వేట్టయన్రజనీకాంత్, అమితాబ్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియన్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ నటించిన 'వేట్టయన్'.. అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఫేక్ ఎన్ కౌంటర్ అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా.. థియేటర్లలో తెలుగు వరకు అంతంత మాత్రంగానే ఆడింది. ఓటీటీలో కాబట్టి ఆడుతూపాడుతూ చూసేయొచ్చు.జనక అయితే గనకయంగ్ హీరో సుహాస్ లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. పిల్లలు వద్దనుకునే ఓ మధ్య తరగతి వ్యక్తి.. తండ్రి అయ్యాయని తెలిసి కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. ఏకంగా కోటి రూపాయల దావా వేస్తాడు. బోల్డ్ సబ్జెక్టే కానీ డైరెక్టర్ బాగానే డీల్ చేశారు. కాకపోతే కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఓటీటీలోనే కాబట్టి ఓ లుక్ వేయొచ్చు.(ఇదీ చదవండి: ‘జితేందర్ రెడ్డి’ మూవీ రివ్యూ)సిటాడెల్: హనీబన్నీసమంత నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఆరు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్.. అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్‌పై మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో సమంత లిప్ లాక్ కూడా ఇచ్చేసింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఏఆర్ఎమ్ఇది మలయాళ డబ్బింగ్ సినిమా. పీరియాడికల్ కాన్సెప్ట్‌తో తీశారు. '2018' మూవీతో మనకు కాస్త పరిచయమైన టొవినో థామస్ హీరో. హాట్‌స్టార్‌లో ప్రస్తుతం తెలుగులోనే అందుబాటులో ఉంది. కాస్త టైముంది డిఫరెంట్‌గా ఏదైనా చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు. ఇలా ఈ వీకెండ్లో ఐదు సినిమాలు డిఫరెంట్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు) -
'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. దీంతో అందరి దృష్టి ఓటీటీలపై పడింది. ఇందుకు తగ్గట్లే దేవర, వేట్టయన్ సినిమాలతో పాటు సమంత 'సిటాడెల్' సిరీస్ ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. మరోవైపు సుహాస్ 'జనక అయితే గనక' లాంటి కామెడీ ఎంటర్టైనర్ వచ్చేది కూడా ఈ వీకెండ్లోనే. ఇంతకీ ఈ శుక్రవారం ఏయే మూవీస్ ఏయే ఓటీటీల్లోకి రాబోతున్నాయంటే?(ఇదీ చదవండి: రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ డిమాండ్!)ఈ వీకెండ్ రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 8వ తేదీ)అమెజాన్ ప్రైమ్వేట్టయన్ - తెలుగు డబ్బింగ్ సినిమాఎవ్రీ మినిట్ కౌంట్స్ - స్పానిష్ సిరీస్సిటాడెల్: హన్నీ బన్నీ - తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)హాట్స్టార్ఏఆర్ఎమ్ - తెలుగు డబ్బింగ్ సినిమాద ఫైరీ ప్రియస్ట్ సీజన్ 2 - కొరియన్ సిరీస్నెట్ఫ్లిక్స్దేవర - తెలుగు సినిమాబ్యాక్ అండర్ సీజ్ - స్పానిష్ సిరీస్ఇన్వెస్టిగేషన్ ఏలియన్ - ఇంగ్లీష్ సిరీస్మిస్టర్ ప్లాంక్టన్ - కొరియన్ సిరీస్ద బకింగ్హమ్ మర్డర్స్ - హిందీ మూవీద కేజ్ - ఫ్రెంచ్ సిరీస్ఉంజోలో: ద గాన్ గర్ల్ - ఇంగ్లీష్ సినిమావిజయ్ 69 - తెలుగు డబ్బింగ్ మూవీఆర్కేన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (నవంబర్ 09)ఇట్ ఎండ్స్ విత్ అజ్ - ఇంగ్లీష్ సినిమా (నవంబర్ 09)10 డేస్ ఆఫ్ ఏ క్యూరియస్ మ్యాన్ - టర్కిష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)బార్న్ ఫర్ ద స్పాట్లైట్ - మాండరిన్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)కౌంట్ డౌన్: పాల్ vs టైసన్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్‌లో ఉంది)ఆహాజనక అయితే గనక - తెలుగు మూవీబుక్ మై షోబాటో: రోడ్ టూ డెత్ - నేపాలీ సినిమాజియో సినిమాక్వబూన్ క జమేలా - హిందీ మూవీ(ఇదీ చదవండి: నాని ఈసారి 'ది ప్యారడైజ్') -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్
దీపావళి అయిపోయింది. గతవారం రిలీజైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఇకపోతే ఈ వారం కూడా చిన్న సినిమాలు క్యూ కట్టేశాయి. ఏకంగా తొమ్మిది మూవీస్ బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కానున్నాయి. 'ధూం ధాం', 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో', 'జితేందర్ రెడ్డి', 'బ్లడీ బెగ్గర్', 'జాతర', 'ఈసారైనా', 'రహస్యం ఇదం జగత్', 'వంచన', 'జ్యూయల్ థీఫ్' సినిమాలు ఈ లిస్టులో ఉన్నాయి. వీటిలో బ్లడీ బెగ్గర్.. 7వ తేదీన రానుండగా మిగిలినవన్నీ 8వ తేదీన రిలీజ్ కానున్నాయి. కానీ ఒక్కదానిపై కూడా బజ్ లేదు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్: నయని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 23 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 'సిటాడెల్ హన్నీ బన్నీ' వెబ్ సిరీస్‌తో పాటు 'వేట్టయన్', 'జనక అయితే గనక', 'ఏఆర్ఎమ్', 'విజయ్ 69' మూవీస్ మాత్రం అస్సలు మిస్సవొద్దు. వీకెండ్లో సడన్గానూ కొన్ని రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ సినిమా రిలీజ్ కానుందంటే?ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు)అమెజాన్ ప్రైమ్సిటాడెన్: హన్నీ బన్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 07వేట్టయన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 08నెట్ఫ్లిక్స్లవ్ విలేజ్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) - నవంబర్ 05లవ్ ఈజ్ బ్లైండ్: అర్జెంటీనా (స్పానిష్ సిరీస్) - నవంబర్ 06మీట్ మీ నెక్స్ట్ క్రిస్మస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 06పెడ్రో పరామో (స్పానిష్ సినిమా) - నవంబర్ 0610 డేస్ ఆఫ్ ఏ క్యూరియస్ మ్యాన్ (టర్కిష్ మూవీ) - నవంబర్ 07బార్న్ ఫర్ ద స్పాట్లైట్ (మాండరిన్ సిరీస్) - నవంబర్ 07కౌంట్ డౌన్: పాల్ vs టైసన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 07ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 07బ్యాక్ అండర్ సీజ్ (స్పానిష్ సిరీస్) - నవంబర్ 08ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 08మిస్టర్ ప్లాంక్టన్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 08ద బకింగ్హమ్ మర్డర్స్ (హిందీ మూవీ) - నవంబర్ 08ద కేజ్ (ఫ్రెంచ్ సిరీస్) - నవంబర్ 08ఉంజోలో: ద గాన్ గర్ల్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 08విజయ్ 69 (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 08ఆర్కేన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 09ఇట్ ఎండ్స్ విత్ అజ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 09హాట్స్టార్ఏఆర్ఎమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 08ఆహాజనక అయితే గనక (తెలుగు మూవీ) - నవంబర్ 08జియో సినిమాడెస్పికబుల్ మీ 4 (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 05బుక్ మై షోట్రాన్స్ఫార్మర్స్ వన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 06(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?) -
ఓటీటీలోకి క్రేజీ సినిమా.. కండోమ్ కంపెనీపై కేసు పెడితే?
మరో తెలుగు సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. మిడిల్ క్లాస్ కథల్లో ఎక్కువగా కనిపించిన సుహాస్ లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. దసరాకి థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఎప్పుడు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?సుహాస్ 'జనక అయితే గనక' సినిమా కాన్సెప్ట్ బాగుంది. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. కానీ థియేటర్లలో సరిగా ఆడలేదు. మూవీ సాగదీసినట్లు అనిపించిందనే టాక్ రావడంతో తేడా కొట్టేసింది. థియేటర్లలో సరిగా ఆడలేదు కానీ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చేస్తుంది. నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నా ఉద్దేశం అదికాదు.. 'బిగ్‌బాస్ 8' వివాదంపై మెహబూబ్ వీడియో)'జనక అయితే గనక' విషయానికొస్తే.. తండ్రి అయితే ఖర్చులు పెరుగుతాయనే భయపడే ఓ కుర్రాడు, భార్య నెల తప్పిందని చెప్పడంతో షాకవుతాడు. తాను కండోమ్ ఉపయోగించినప్పటికీ తండ్రి కావడం ఇతడిని ఆలోచనలో పడేస్తుంది. దీంతో సదరు కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.చెప్పుకోవడానికి కాస్త వల్గర్ అనిపిస్తుంది కానీ ఏ మాత్రం గీత దాటకుండా సున్నితమైన హాస్యంతో సినిమా తీశారు. కాసేపు అలా సరదాగా నవ్వుకునే సినిమా చూద్దానుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?
తెలుగు రాష్ట్రాల్లో దసరా జోష్ కనిపిస్తుంది. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లని ఎంటర్టైన్ చేయడానికా అన్నట్లు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కాస్త ఎక్కువగానే రిలీజయ్యాయి. వీటిలో రజినీకాంత్ 'వేట్టయన్', గోపీచంద్ 'విశ్వం', సుహాస్ 'జనక అయితే గనక', సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేశాయి. ఇంతకీ ఇవి ఎలా ఉన్నాయంటే?వేట్టయన్రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ నటించిన ఈ సినిమాని.. పోలీసులు- ఫేక్ ఎన్ కౌంటర్ చేయడం అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించారు. తమిళనాడులో హిట్ టాక్ వచ్చింది గానీ తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చింది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టుండాల్సిందని అంటున్నారు. ఓవరాల్ రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేసేయండి. (రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)మా నాన్న సూపర్ హీరోసుధీర్ బాబు హీరోగా నటించిన ఈ మూవీని తండ్రి సెంటిమెంట్ స్టోరీతో తీశారు. చిన్నప్పుడే కన్న తండ్రి నుంచి దూరమైన పిల్లాడు.. మరొకరి దగ్గర పెరిగి పెద్దవుతాడు. సవతి తండ్రికి ఇతడంటే అస్సలు ఇష్టముండదు. మరి సొంత తండ్రి-కొడుకు చివరకు ఎలా కలుసుకున్నారనేది తెలియాలంటే సినిమా చూడాలి. మంచి ఎమోషనల్ కంటెంట్‌తో తీసిన ఈ చిత్రం ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి. పూర్తి రివ్యూ ఇదిగో ('మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)విశ్వంగోపీచంద్ లేటెస్ట్ మూవీ ఇది. దాదాపు ఆరేళ్ల తర్వాత శ్రీనువైట్ల ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రెగ్యులర్ రొటీన్ స్టోరీ కావడంతో తొలి ఆట నుంచే మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కమర్షియల్ మూవీకి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నప్పటికీ రెగ్యులర్ ఫార్మాట్లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్ రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేసేయండి. (‘విశ్వం’ మూవీ రివ్యూ)జనక అయితే గనకసుహాస్ లీడ్ రోల్ చేసిన మూవీ ఇది. ఓ వ్యక్తి పిల్లల్ని వద్దనుకుంటాడు. సేఫ్టీ కూడా వాడుతుంటాడు. అయినా సరే భార్య గర్భవతి అవుతుంది. దీంతో కండోమ్ కంపెనీపై కేసు వేస్తాడు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ. ప్రస్తుత కాలంలో పిల్లల్ని కనడం, పెంచడం ఖరీదైన వ్యవహారం. ఇదే పాయింట్ తీసుకుని, ఎంటర్టైనింగ్ చెప్పారు. ప్రీమియర్లు వేస్తే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పూర్తి రివ్యూ కూడా చదివేయండి. (‘జనక అయితే గనక’మూవీ రివ్యూ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా) -
‘జనక అయితే గనక’మూవీ రివ్యూ
టైటిల్: జనక అయితే గనకనటీనటులు: సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ, వెన్నెక కిశోర్, మురళీ శర్మ తదితరులునిర్మాణ సంస్థ: దిల్ రాజు ప్రొడక్షన్స్నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత్ రెడ్డిదర్శకత్వం: సందీప్‌రెడ్డి బండ్లసంగీతం: విజయ్ బుల్గానిక్సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్విడుదల తేది: అక్టోబర్ 12, 2024ఈ మధ్యే ‘గొర్రె పురాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుహాస్.. ఇప్పుడు ‘జనక అయితే గనక’ అనే సినిమాతో మరోసారి థియేటర్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు(అక్టోబర్ 12) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? సుహాస్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ప్రసాద్ (సుహాస్) కి పిల్లలు కనడం అస్సలు ఇష్టం లేదు. ఈ రోజుల్లో పిల్లలను పోషించాలంటే లక్షల్లో డబ్బులు అవసరమని, అంత డబ్బు తన వద్ద లేదని పిల్లలే వద్దనుకుంటాడు. భార్య(సంగీత విపిన్) కూడా అతని మనసును అర్థం చేసుకుంటుంది. కుటుంబ నియంత్ర కోసం కండోమ్ వాడుతారు. అయినప్పటికీ ప్రసాద్ భార్య గర్భం దాల్చుతుంది. దీంతో కండోమ్ సరిగ్గా పని చేయలేదని వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తాడు ప్రసాద్. తాను వాడిన కండోమ్ సరిగా పనిచేయలేకపోవడంతో తన భార్య గర్భం దాల్చిందని, నష్టపరిహారంగా రూపాయలు కోటి ఇవ్వాలని ఆ కంపెనీపై కేసు వేస్తాడు. ఈ కేసు ప్రసాద్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? అసలు ప్రసాద్ భార్య గర్భం ఎలా దాల్చింది? చివరకు ఈ కేసులో ప్రసాద్ గెలిచాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..మానవ జీవితంలో వస్తు వినియోగం తప్పని సరి. ఏదైనా ఒక వస్తువు కొని ఆ వస్తువు నకిలీ లేదా నాసిరకం అయితే అమ్మిన వ్యాపారిపై లేదా ఉత్పత్తిదారులపై కేసు వేయొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. వినియోగదారుల చట్టం పై జనాలకు అవగాహన లేదు. ఈ పాయింట్ తో తెరకెక్కిన చిత్రమే జనగా అయితే గనక. ప్రస్తుతం సమాజం ఫేస్ చేస్తున్న ఓ సీరియస్ ఇష్యూ ని కామెడీ వేలో చూపిస్తూ చివరకు ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దర్శకుడు రాసుకున్న కథ బాగుంది. కండోమ్ మీద కేసు పెట్టడమనే పాయింట్ ఆసక్తికరంగా ఉంది. కానీ అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోయాడు.వినోదాత్మకంగా చూపించాలనే ఉద్దేశంతో చాలా చోట్ల లాజిక్ లెస్ సన్నివేశాలను జోడించాడు. ముఖ్యంగా కీలకమైన కోర్టు సన్నివేశాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి . వెన్నెల కిషోర్ చేసే కామెడీ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. కోర్టు డ్రామా మొదలవగానే సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.ఇంటర్వెల్ ముందు వరకు అసలు కథను ప్రారంభించకుండా కథనాన్ని నడిపించాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించేందుకు ప్రసాద్ పాత్ర చుట్టు అల్లిన సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. ఈ రోజుల్లో పిల్లలను కనాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రాక్టికల్‌గా చూపించే సీన్ నవ్వులు పూయించడంతో పాటు ఆలోచింపచేస్తుంది. ఫస్టాఫ్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించి, సెకండ్ హాఫ్ లో వారి ఎమోషన్స్ తో కొందరు చేస్తున్న మోసపూరిత వ్యాపారాల చూపించారు. వైద్యం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న దందా, నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న మోసాన్ని వినోదాత్మకంగా చూపించారు. అయితే ముందుగా చెప్పినట్లుగా కోర్డు డ్రామాలో బలం లేదు. కొన్ని చోట్ల ప్రసాద్ పాత్ర చేసే ఆర్గ్యుమెంట్స్‌కి అర్థం ఉండదు. ఇక చివర్లో వచ్చే చిన్న ట్విస్ట్ అయితే అదిరిపోతుంది.ఎవరెలా చేశారంటే..సుహాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు . మిడిల్ క్లాస్ యువకుడు ప్రకాష్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కోటి సీన్లలో అతను చెప్పే డైలాగులు ఆలోచింపజేస్తాయి. హీరోయిన్ పాత్రనిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. సినిమా కథంతా చుట్టే తిరుగుతుంది. లాయర్ కిషోర్ గా వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. జడ్జి ధర్మారావుగా రాజేంద్రప్రసాద్ కొన్నిచోట్ల నవ్విస్తాడు. లాయర్ గా మురళి శర్మ, హీరో తండ్రిగా గోపరాజు, బామ్మ పాత్రను పోషించిన నటితోపాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మీద చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పరవాలేదు. సంగీతం బావుంది. పాటలు కథలో భాగంగానే వస్తాయి. అయితే ఒక పాట మినహా మిగిలినవేవి గుర్తుండవు. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
హీరో సుహాస్ 'జనక అయితే గనక' మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
వర్షాల ఎఫెక్ట్.. వాయిదా పడిన సుహాస్ సినిమా
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. అవసరముంటే తప్పితే జనాలు పెద్దగా బయటకు రావట్లేదు. ఈ వర్షం వల్ల గతవారం థియేటర్లలో రిలీజైన 'సరిపోదా శనివారం' సినిమాకు పెద్ద దెబ్బ పడింది. బాగుందనే టాక్ వచ్చినప్పటికీ వర్షం వల్ల కలెక్షన్స్ పడిపోయాయి. 5 రోజుల్లో రూ.65 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్ భారీ విరాళం.. మీరు విన్నది నిజం కాదు!)ఇలా వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలతో పాటు తెలుగు స్టార్ హీరోలు చాలామంది లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మాణ సంస్థ తీసిన 'జనక అయితే గనక' సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.లెక్క ప్రకారం సెప్టెంబరు 7న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలి. ముందు రోజు ప్రీమియర్లు కూడా ప్లాన్ చేశారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇంతలోనే మరోసారి తెలుగు రాష్ట్రాలకు వర్షం పోటెత్తనుందనే హెచ్చరిక వచ్చింది. 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడబోతున్నాయని అంటున్నారు. దీనిబట్టి చూస్తే వాయిదా వేసి మంచి పనే చేశారనిపిస్తోంది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!) -
దిల్ రాజు వాట్సాప్ చాట్ బయటపెట్టిన సుహాస్!
చిన్న సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టం. ఎంత ప్రచారం చేసినా..కొన్ని చిన్న చిత్రాలు రిలీజ్ అయిన విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు. అందుకే మేకర్స్ డిఫరెంట్ వేలో ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రాంక్ వీడియోలు చేస్తూ..కాంట్రవర్సీ క్రియేట్ చేసి సినిమా పేరును ప్రేక్షకులను చేరవయ్యేలా చేస్తున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్స్ కూడా డిఫరెంట్‌గానే ప్లాన్ చేస్తున్నారు. తాజాగా హీరో సుహాస్ తన కొత్త సినిమా ప్రచారం కోసం ఏకంగా దిల్ రాజు వాట్సాప్ చాట్నే బయటపెట్టాడు.ప్రీమియర్ షో ఫిక్స్!సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. దిల్ రాజు ప్రోడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. సందీర్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. రిలీజ్‌కి ఒక రోజు ముందు అంటే.. సెప్టెంబర్ 6న ప్రీమియర్ షో వేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ..నిర్మాత దిల్ రాజుతో చేసిన వాట్సాప్ చాట్‌ని హీరో సుహాస్ బయటపెట్టాడు.వాట్సాప్ చాట్‌లో ఏముందంటే..సుహాస్: సర్ మనం ప్రీమియర్ షో వేస్తే బాగుంటుంది. ఈ మధ్య ప్రీమియర్స్ వేసిన సినిమాలన్నీ బాగా వర్కౌట్ అవుతున్నాయి.దిల్ రాజు: చూడాలి సుహాస్. ఇప్పటికిప్పుడు అంటే ప్లాన్ చేయాలి. చెక్ చేసి చెబుతా.సుహాస్: ఈ నెల 6న సాయంత్రం ఏఎంబీ, నెక్సెస్ ఇలా అన్ని ఓపెన్ చేద్దాం సర్.దిల్ రాజు: కొంచెం టైమ్ ఇవ్వు సుహాస్.. చెప్తా.సుహాస్: వాయిస్ రికార్డుదిల్ రాజు: 6న కన్ఫామ్ సుహాస్. ప్రీమియర్స్ వేసేద్దాంసుహాస్: క్లాప్ కొడుతున్న ఎమోజీThat's how @ThisIsDSP Garu helped us 🤗❤️#JanakaAitheGanaka premieres on September 6th 🤗#JAGOnSeptember7th pic.twitter.com/i1Kog2gh2y— Suhas 📸 (@ActorSuhas) September 3, 2024