మరో తెలుగు సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. మిడిల్ క్లాస్ కథల్లో ఎక్కువగా కనిపించిన సుహాస్ లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. దసరాకి థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఎప్పుడు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?
సుహాస్ 'జనక అయితే గనక' సినిమా కాన్సెప్ట్ బాగుంది. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. కానీ థియేటర్లలో సరిగా ఆడలేదు. మూవీ సాగదీసినట్లు అనిపించిందనే టాక్ రావడంతో తేడా కొట్టేసింది. థియేటర్లలో సరిగా ఆడలేదు కానీ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చేస్తుంది. నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: నా ఉద్దేశం అదికాదు.. 'బిగ్‌బాస్ 8' వివాదంపై మెహబూబ్ వీడియో)
'జనక అయితే గనక' విషయానికొస్తే.. తండ్రి అయితే ఖర్చులు పెరుగుతాయనే భయపడే ఓ కుర్రాడు, భార్య నెల తప్పిందని చెప్పడంతో షాకవుతాడు. తాను కండోమ్ ఉపయోగించినప్పటికీ తండ్రి కావడం ఇతడిని ఆలోచనలో పడేస్తుంది. దీంతో సదరు కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
చెప్పుకోవడానికి కాస్త వల్గర్ అనిపిస్తుంది కానీ ఏ మాత్రం గీత దాటకుండా సున్నితమైన హాస్యంతో సినిమా తీశారు. కాసేపు అలా సరదాగా నవ్వుకునే సినిమా చూద్దానుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)
Comments
Please login to add a commentAdd a comment