బిగ్‌బాస్ 8 నుంచి రీసెంట్‌గా ఎలిమినేట్ అయిన మెహబూబ్.. అందరికీ క్షమాపణలు చెప్పాడు. కంటెస్టెంట్‌గా ఫెయిల్ అయ్యానని బాధంతా బయటపెట్టాడు. అలానే కొన్నాళ్ల క్రితం హౌస్‌లో ఉన్నప్పుడు కమ్యూనిటీ ఓటింగ్ గురించి మాట్లాడటం, అదేమో హాట్ టాపిక్ అయిపోవడం పైనా స్పందించాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
మెహబూబ్ ఏం చెప్పాడంటే?
'బిగ్‌బాస్‌లో గంటలు గంటలు మాట్లాడితే వాళ్లు చూపించేది 30 సెకన్లు. అయితే నేను మాట్లాడిన దానిలో చిన్న క్లిప్ బయట చాలా రాంగ్‌గా ప్రొజెక్ట్ అవుతోంది. దాని గురించి మట్లాడుదాం అనే వచ్చాను. మనం బిగ్‌బాస్ లాంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌లో ఉన్నప్పుడు మనం మంచిగా ఆడితే, మంచిగా ప్రవర్తిస్తే.. అరె మనలో ఒకడు అని మనల్ని ఇష్టపడతారు. మనకు ఓట్ చేస్తారు అని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ నేను అన్న మాట చాలామందిని బాధపెట్టింది. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ప్రామిస్ చేసి చెబుతున్నా.. నా ఉద్దేశం అదికాదు. దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను.'
(ఇదీ చదవండి: ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం)
'డబ్ స్మాష్, టిక్ టాక్, యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ ఇక్కడివరకు వచ్చారు. ఏ కాస్ట్ ఫీలింగ్ లేకుండా మీరు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. త్వరలోనే నేను స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాను. ఆడియెన్స్‌గా మీరందరూ గెలిచారు. కంటెస్టెంట్‌గా నేను ఫెయిలయ్యాను. ఐ యామ్ సారీ' అని మెహబూబ్ వీడియోలో తన బాధనంతా బయటపెట్టాడు.
బిగ్‌బాస్ దెబ్బకు బలి
నాలుగో సీజన్ పాల్గొని బాగానే ఫెర్‌ఫార్మ్ చేసిన మెహబూబ్.. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు. కానీ పెద్ద ఇంప్రెసివ్‌గా ఆడలేదు. దీంతో ఎలిమినేట్ అయిపోయాడు. కొన్నాళ్ల క్రితం హౌస్‌లో నబీల్‌తో మాట్లాడుతూ మన కమ్యూనిటీ ఓట్లు మనకు పడతాయ్, భయమెందుకు అనేలా మాట్లాడాడు. మెయిన్ ఎపిసోడ్‌లో ఇది లేనప్పటికీ లైవ్ స్ట్రీమింగ్ నుంచి ఈ వీడియోని తీసుకొచ్చి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో మెహబూబ్‌పై చాలా వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవడంలో భాగంగా సారీ చెప్పాడు. మంచిగా ఆల్బమ్ సాంగ్స్ చేసుకుంటున్నవాడు కాస్త బిగ్‌బాస్ దెబ్బకు బలైపోయాడు!
(ఇదీ చదవండి: Bigg Boss 8: నిఖిల్ వయలెన్స్.. అమ్మాయిలని కూడా చూడకుండా)
Comments
Please login to add a commentAdd a comment