
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఓ సినిమాలో తనని ట్రోల్ చేయడంపై ఫైర్ అయ్యాడు. అలానే తనపై వస్తున్న ఫేక్ ఆర్టికల్స్ గురించి కూడా ఓ రేంజ్ రెచ్చిపోయాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'క'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీంతో కిరణ్ స్పీచ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
(ఇదీ చదవండి: 'జై హనుమాన్' నుంచి సడన్ సర్‌ప్రైజ్)
'నాతో మీకేంటి సమస్య? నా గురించి ఏది పడితే అది ఎందుకు రాస్తున్నారు. ఒకడేమో నేను బాగా డబ్బున్న వాడినని రాస్తాడు. మరొకడేమో రాజకీయ నాయకుడి కొడుకుని అని రాస్తాడు. అసలు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. కొవిడ్ టైంలో ఎస్ఆర్ కల్యాణ్ మండపం సినిమాతో హిట్ కొట్టాం. ఓ సినిమాలోనూ నాపై ట్రోలింగ్ చేశారు. అసలు అలా చేసేంతలా మీకు నేను ఏం చేశాను? నేను ఎదగకూడదా? నా మీద మీకు ఎందుకు అంత జెలసీ?' అని కిరణ్ అబ్బవరం ఫుల్ ఫైర్ అయ్యాడు.
కిరణ్ అబ్బవరంని ఏ సినిమాలో ట్రోల్ చేశారా? అని చాలామంది అనుకుంటున్నారు. గతేడాది 'హాస్టల్ బాయ్స్' అనే కన్నడ డబ్బింగ్ చిత్రం రిలీజైంది. టైటిల్స్ పడుతున్న టైంలో కిరణ్ అబ్బవరం ప్రస్తావన ఉంటుంది. 'రేయ్ కిరణ్ అబ్బవరం కొత్త ట్రైలర్ వచ్చిందిరా! ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో?' అని రెండు పాత్రలు మాట్లాడుకుంటాయి. చిన్న హీరో కాబట్టి కిరణ్‌పై ఇలా ట్రోల్ చేశారు. అదే పెద్ద హీరోపై సదరు చిత్రబృందం ఇలాంటి డైలాగ్స్ పెట్టగలదా? అనేది ఇక్కడ ప్రశ్న.
(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ)
మీ సినిమాలో నా మీద డైలాగ్ పెట్టి ట్రోల్ చేసేంత మీకు నేనేం చేశాను..?#KiranAbbavaram fire on Someone in Industry!! pic.twitter.com/Albba9JfDl
— Rajesh Manne (@rajeshmanne1) October 29, 2024