'జై హనుమాన్' నుంచి సడన్ సర్‌ప్రైజ్ | Jai Hanuman Movie Latest Update Prasanth Varma | Sakshi
Sakshi News home page

Jai Hanuman: దీపావళికి అప్‌డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్

Oct 29 2024 4:01 PM | Updated on Oct 29 2024 5:00 PM

Jai Hanuman Movie Latest Update Prasanth Varma

సడన్ సర్‌ప్రైజ్ అన్నట్లు 'జై హనుమాన్' సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆంజనేయుడు నడిచి వెళ్తుండటాన్ని వెనక వైపు నుంచి చూపించారు. 30న అంటే బుధవారం లుక్ బయటపెడతారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో మరో క్రేజీ మూవీ.. ఇది 69 ఏళ్ల వృద్ధుడి కథ)

ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన 'హనుమాన్'.. ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. చివర్లో సీక్వెల్ 'జై హనుమాన్' ఉంటుందని ప్రకటించారు. కానీ దానికి సంబంధించిన పనులేం జరిగినట్లు కనిపించలేదు. కానీ ఇప్పుడేమో ఫస్ట్ లుక్ అని చెప్పి షాకిచ్చారు.

తొలి భాగంలో హనుమంతుడు పాత్రధారి ఎవరనేది రివీల్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా చూపిస్తారు. అయితే 'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి.. హనుమంతుడిగా కనిపిస్తాడని అంటున్నారు. తొలి భాగాన్ని నిరంజన్ రెడ్డి నిర్మించగా.. 'జై హనుమాన్'ని మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. పూర్తి వివరాలు రేపు తెలుస్తాయేమో?

(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement