ఓటీటీలో మరో క్రేజీ మూవీ.. ఇది 69 ఏళ్ల వృద్ధుడి కథ | Anupam Kher's Vijay 69 Movie OTT Trailer In Telugu | Sakshi
Sakshi News home page

Vijay 69 OTT: ఇదేదో వర్కౌట్ అయ్యే మూవీలా ఉందే!

Oct 29 2024 2:22 PM | Updated on Oct 29 2024 2:38 PM

Anupam Kher's Vijay 69 Movie OTT Trailer In Telugu

థియేటర్లలో అంటే కమర్షియల్ అంశాలు ఉండాలి, లేదంటే ప్రేక్షకులు చూడరు అంటుంటారు. ఓటీటీలకు అలాంటి ఇబ్బందులేం ఉండవు. ఏం చెప్పాలి అనిపిస్తే అది చెప్పేయొచ్చు. బౌండరీలు ఉండవు. దీంతో అప్పుడప్పుడు కొన్ని మంచి కథలు వస్తుంటాయి. తాజాగా రిలీజైన 'విజయ్ 69' అనే హిందీ మూవీ ట్రైలర్ చూస్తుంటే అదే అనిపించింది. ఇంతకీ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే?

(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ)

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ లీడ్ రోల్ చేసిన సినిమా 'విజయ్ 69'. పేరుకి తగ్గట్లే 69 ఏళ్ల వయసులో ట్రయథ్లాన్ పూర్తి చేసి రికార్డ్ సాధించాలనేది ఇతడి కల. ఇందులో భాగంగా 1.5 కిలోమీటర్ల స్విమ్మింగ్, 40 కి.మీ సైక్లింగ్, 10 కి.మీ రన్నింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ విజయ్‌ని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్, ఇలా ప్రతి ఒక్కరూ డిసప్పాయింట్ చేసేవాళ్లే. కానీ కలలకు వయసుతో సంబంధం లేదు. చెప్పాలంటే వాటికి ఎక్స్‌పైరీ డేట్ ఉండదని చివరకు నిరూపిస్తాడు. ఇదే కాన్సెప్ట్.

నవంబరు 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయనున‍్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే వర్కౌట్ అయ్యేలా ఉంది. కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా బాగానే దట్టించినట్లు ఉన్నారు. ప్రస్తుతానికి హిందీ మాత్రమే అని చెప్పారు కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేటప్పుడు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఎమోషనల్ డ్రామా మూవీస్ అంటే ఇష్టముంటే మాత్రం దీన్ని మిస్ కావొద్దు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement