ఈసారి బిగ్‌బాస్ షోలో కాస్తోకూస్తో కూల్‌గా, స్ట్రాటజీతో ఆడుతున్నది నిఖిల్ ఒక్కడే. ఫైనల్ రేసులో ఉన్న ఇతడు.. ఇప్పుడు వయలెంట్ అయిపోయాడు. మంగళవారం ఎపిసోడ్ సందర్భంగా అమ్మాయిలని కూడా చూడకుండా కంట్రోల్ తప్పి ప్రవర్తించాడు. గేమ్ కోసమే అయ్యిండొచ్చు కానీ మరీ ఈ రేంజ్‌లో అరాచకం చూపించడం మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇంతకీ తాజాగా(అక్టోబర్ 29) హౌస్‌లో ఏమేం జరిగిందనేది 58వ రోజు హైలైట్స్‌లో చూద్దాం.
రెండు కాదు ఒక్కటే క్లాన్
గౌతమ్, హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, యష్మి ఈ వారం నామినేషన్స్‌లో ఉండటంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. రాయల్, ఓజీ క్లాన్స్ కాదు ఇకపై అందరూ బీబీ క్లాన్‌లోనే ఉంటారని బిగ్‌బాస్ చెప్పడంతో మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. ఈసారి కెప్టెన్ కంటెండర్‌షిప్ కోసం 'బీబీ ఇంటికి దారేది' అనే గేమ్ పెడుతున్నట్లు బిగ్‌బాస్ చెప్పాడు. ఇందుకోసం హౌస్‌మేట్స్‌ని నాలుగు టీమ్స్‌గా విడగొట్టారు. టీమ్ రెడ్‌లో గౌతమ్-ప్రేరణ-యష్మీ.. టీమ్ బ్లూలో అవినాష్-నిఖిల్-హరితేజ.. టీమ్ గ్రీన్‌లో తేజ-విష్ణుప్రియ-నబీల్.. టీమ్ ఎల్లోలో రోహిణి-పృథ్వీ-నయని పెట్టారు. గంగవ్వని ఏదో ఓ జట్టులోకి తీసుకోవాలని చెప్పాడు. దీంతో ఆమెని బ్లూ టీమ్ తీసుకుంది.
(ఇదీ చదవండి: ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం)
తొలి టాస్క్ బ్లూ టీమ్‌దే
ఒక్కో టీమ్‌లో హరితేజ, పృథ్వీ, నబీల్‌ని లీడర్లుగా ఎంచుకున్నారు. ఇక తొలి టాస్క్ మంచు మనిషిని తయారు చేయడం. ఇందులో భాగంగా టీమ్స్‌లోని ముగ్గురు సభ్యులు ఒకే స్కీ బోర్డ్‌ని ఉపయోగించి బొమ్మకి రూపు తీసుకురావాలి. ఇందులో గెలిచిన టీమ్.. రెండు డైస్‌ని రోల్ చేసే అవకాశంతో పాటు ఓడిపోయిన మిగిలిన టీమ్ నుంచి ఓ టీమ్‌కి ఎల్లో కార్డ్ ఇవ్వొచ్చు. ఎప్పుడైతే ఓ టీమ్‌కి రెండు ఎల్లో కార్డ్స్ వస్తాయో ఆ టీమ్ లీడర్ తమ టీమ్ నుంచి ఓ సభ్యుడ్ని ఆట నుంచి తప్పించాల్సి ఉంటుంది. తొలి పోటీలో గెలిచిన బ్లూ టీమ్.. టీమ్ రెడ్‌కి ఎల్లో కార్డ్ ఇచ్చింది. డైస్ రెండు సార్లు రోల్ చేయగా.. 6,3 పడ్డాయి. దీంతో 6 పాయింట్లని హరితేజ తీసుకుంది, 3 పాయింట్లని అవినాష్‌కి ఇచ్చింది.
నీళ్ల ట్యాంక్ తెచ్చిన తంట
'పానిపట్టు యుద్ధం' అని రెండో టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా చిన్నసైజు ట్యాంకుల్లో ఉన్న నీటిని ఆయా టీమ్స్.. బజర్ మోగేంతవరకు కాపాడుకోవాలి. నీటి ఎత్తు తగ్గిన టీమ్.. పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు బజర్ మోగిన తర్వాత ట్యాంక్‌లోని నీటిని తగ్గించేందుకు అపోజిట్ టీమ్స్ నుంచి ఒక్కొక్కరు ప్రయత్నించొచ్చు. అయితే ఈ గేమ్ సాఫీగా సాగిపోతే బాగుండేది కానీ నిఖిల్.. అందరితో గొడవ పెట్టుకోవడం రచ్చ రచ్చ అయింది.
(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ)
నిఖిల్ టీమ్‌కి కలిసిరాలేదు
తొలిసారి బజర్ మోగగానే నబీల్, నిఖిల్ లైన్ దాటి లోపలికి వచ్చారు. దీంతో నీటిని తగ్గించే అవకాశం వీళ్లకు ఇచ్చింది సంచాలక్ గంగవ్వ. తర్వాత ఛాన్స్.. నబీల్-పృథ్వీకి రాగా వీళ్లిద్దరూ కలిసి బ్లూ టీమ్‌ని టార్గెట్ చేశారు. ఓసారి బజర్ ఆగిపోయిన తర్వాత బ్లూ టీమ్ ప్లగ్గులని పృథ్వీ విసిరేశాడు. దీంతో నిఖిల్-పృథ్వీ మధ్య కాసేపు డిష్యూం డిష్యూం జరిగింది. మూడోసారి పృథ్వీ, గౌతమ్‌కి ఛాన్స్ వచ్చింది. హరితేజని పక్కకు లాగిన గౌతమ్.. బ్లూ టీమ్ ట్యాంక్‌లోని నీరంత పోయేలా చేశాడు. దీంతో బ్లూ టీమ్ గేమ్ నుంచి ఔట్ అయిపోయింది.
అమ్మాయిలపై నిఖిల్ అరాచకం
తర్వాత ఛాన్స్ నిఖిల్‌కి వచ్చింది. తమని గేమ్ నుంచి తప్పుకొనేలా చేసిన గౌతమ్ ఉన్న టీమ్ రెడ్‌ని టార్గెట్ చేశాడు. వాటర్ దగ్గర అడ్డుగా ఉన్న యష్మి-ప్రేరణని పక్కకి లాగేశాడు. అటు ఇటు విసిరేస్తూ రచ్చ రచ్చ చేశాడు. ఇలా చేయకూడదని రూల్స్‌లో ఉందా అని ఉల్టా గౌతమ్‌తోనే గొడవ పెట్టుకున్నాడు. నిఖిల్ అరాచకం దెబ్బకు హౌస్‌మేట్స్ చాలా హెచ్చరించాడు. అయినా సరే అమ్మాయిలిద్దరినీ కాస్త కంట్రోల్ తప్పి ప్రవర్తించాడు.
గౌతమ్ పాయింట్స్
బజర్ మోగి ఈ రచ్చ అంతా ఆగిపోయిన తర్వాత.. అక్కడ అమ్మాయి ఉందనే సెన్స్ లేదా అని గౌతమ్, నిఖిల్‌తో గొడవ పెట్టుకున్నాడు. నీకుందా అని నిఖిల్ కూడా గౌతమ్‌పై రెయిజ్ అయ్యాడు. ప్రేరణ కూడా ఏదో తిట్టడంతో మైండ్ యూ ఆర్ వర్డ్స్ అని నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. ఒకరిపై ఒకరు వచ్చి కొట్టేసుకుంటారా అన్నంతలా హడావుడి చేశాడు. చివరకు హౌస్ అంతా వీళ్లని విడదీయడంతో ఎపిసోడ్‌కి ఎండ్ కార్ట్ పడింది.
(ఇదీ చదవండి: మా ఆయన కోసం సినిమా చూడండి: హీరో కిరణ్ అబ్బవరం భార్య)
Comments
Please login to add a commentAdd a comment