Mehboob
-
నా ఉద్దేశం అదికాదు.. 'బిగ్‌బాస్ 8' వివాదంపై మెహబూబ్ వీడియో
బిగ్‌బాస్ 8 నుంచి రీసెంట్గా ఎలిమినేట్ అయిన మెహబూబ్.. అందరికీ క్షమాపణలు చెప్పాడు. కంటెస్టెంట్‌గా ఫెయిల్ అయ్యానని బాధంతా బయటపెట్టాడు. అలానే కొన్నాళ్ల క్రితం హౌస్‌లో ఉన్నప్పుడు కమ్యూనిటీ ఓటింగ్ గురించి మాట్లాడటం, అదేమో హాట్ టాపిక్ అయిపోవడం పైనా స్పందించాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.మెహబూబ్ ఏం చెప్పాడంటే?'బిగ్‌బాస్‌లో గంటలు గంటలు మాట్లాడితే వాళ్లు చూపించేది 30 సెకన్లు. అయితే నేను మాట్లాడిన దానిలో చిన్న క్లిప్ బయట చాలా రాంగ్గా ప్రొజెక్ట్ అవుతోంది. దాని గురించి మట్లాడుదాం అనే వచ్చాను. మనం బిగ్‌బాస్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు మనం మంచిగా ఆడితే, మంచిగా ప్రవర్తిస్తే.. అరె మనలో ఒకడు అని మనల్ని ఇష్టపడతారు. మనకు ఓట్ చేస్తారు అని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ నేను అన్న మాట చాలామందిని బాధపెట్టింది. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ప్రామిస్ చేసి చెబుతున్నా.. నా ఉద్దేశం అదికాదు. దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను.'(ఇదీ చదవండి: ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం)'డబ్ స్మాష్, టిక్ టాక్, యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ ఇక్కడివరకు వచ్చారు. ఏ కాస్ట్ ఫీలింగ్ లేకుండా మీరు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. త్వరలోనే నేను స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాను. ఆడియెన్స్‌గా మీరందరూ గెలిచారు. కంటెస్టెంట్‌గా నేను ఫెయిలయ్యాను. ఐ యామ్ సారీ' అని మెహబూబ్ వీడియోలో తన బాధనంతా బయటపెట్టాడు.బిగ్‌బాస్ దెబ్బకు బలినాలుగో సీజన్ పాల్గొని బాగానే ఫెర్ఫార్మ్ చేసిన మెహబూబ్.. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు. కానీ పెద్ద ఇంప్రెసివ్‌గా ఆడలేదు. దీంతో ఎలిమినేట్ అయిపోయాడు. కొన్నాళ్ల క్రితం హౌస్‌లో నబీల్‌తో మాట్లాడుతూ మన కమ్యూనిటీ ఓట్లు మనకు పడతాయ్, భయమెందుకు అనేలా మాట్లాడాడు. మెయిన్ ఎపిసోడ్లో ఇది లేనప్పటికీ లైవ్ స్ట్రీమింగ్ నుంచి ఈ వీడియోని తీసుకొచ్చి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో మెహబూబ్‌పై చాలా వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవడంలో భాగంగా సారీ చెప్పాడు. మంచిగా ఆల్బమ్ సాంగ్స్ చేసుకుంటున్నవాడు కాస్త బిగ్‌బాస్ దెబ్బకు బలైపోయాడు!(ఇదీ చదవండి: Bigg Boss 8: నిఖిల్ వయలెన్స్.. అమ్మాయిలని కూడా చూడకుండా) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) -
బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్లో ఇద్దరు!
బిగ్‌బాస్ 8వ వారం కూడా చివరకొచ్చేసింది. ఈసారి ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. ఓజీ క్లాన్ నుంచి నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, పృథ్వీ.. రాయల్ క్లాన్ నుంచి నయని పావని, మెహబూబ్ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎవరికి వాళ్లు గేమ్స్ పరంగా తమ బెస్ట్ ఇచ్చేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ డేంజర్ జోన్లో మాత్రం ఇద్దరు ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కావొచ్చు?లెక్క ప్రకారం ఈసారి ఏడుగురు నామినేట్ అయ్యారు. కానీ మెగా చీఫ్ గౌతమ్ తన సూపర్ పవర్ ఉపయోగించి, హరితేజ నుంచి తప్పించాడు. మిగిలిన వాళ్లలో నిఖిల్.. ఓటింగ్‌లో ఎప్పుడు అగ్రస్థానంలో ఉంటాడు. ఈసారి మాత్రం అతడిని ప్రేరణ దాటిపోయినట్లు కనిపిస్తుంది. చెప్పాలంటే విన్నర్ రేసులోనూ ఈమె ఉందని టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)ఓటింగ్ పరంగా చూసుకుంటే తొలి రెండు స్థానాల్లో ప్రేరణ, నిఖిల్ ఉండగా.. తర్వాతి స్థానాల్లో ప్రేమ పక్షులు పృథ్వీ, విష్ణుప్రియ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో మెహబూబ్, నయని ఉన్నారు. గేమ్స్ పరంగా మెహబూబ్ అంతంత మాత్రమే కనిపిస్తుండగా.. గొడవల్లో తప్పితే నయని ఎక్కడా కనిపించట్లేదు. అంతా చూస్తుంటే వీళ్లిద్దరిలో ఒకరు వెళ్లిపోవడం గ్యారంటీ అనిపిస్తుంది. మరోవైపు గంగవ్వని బయటకు పంపే సూచనలు కనిపిస్తున్నాయి.అప్పుడెప్పుడో 2022లో చేసిన ఓ వీడియో కారణంగా గంగవ్వతో పాటు రాజు అనే యూట్యూబర్‌పై పోలీస్ కేసు నమోదైంది. దీని విచారణలో భాగంగా గంగవ్వని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈసారి మాత్రం రాయల్ క్లాన్ నుంచి ఒకరు ఎలిమినేట్ కావడం పక్కా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ) -
బిగ్‌బాస్ 8లో 'కమ్యూనిటీ' ఓటింగ్? మెహబూబ్ షాకింగ్ వీడియో
బిగ్‌బాస్ షోలో గెలవాలంటే ఏం కావాలి? అయితే కండబలం లేదంటే బుద్ధి బలం ఉండాలి. ఒకవేళ ఇవన్నీ లేకపోతే కనీసం గ్లామర్ అయినా ఉండాలి. అలా అయితే కొన్ని వారాలు నెట్టుకురావచ్చు. కానీ చివరకు ఇక్కడికి కూడా మతాన్ని, కులాన్ని తీసుకొచ్చేసినట్లు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం తెలుగులో 8వ సీజన్ నడుస్తోంది. 14 మంది వస్తే ఒక్కరూ సరిగా ఎంటర్టైన్ చేయలేకపోయారని, వైల్డ్ కార్డ్ పేరిట మరో ఎనిమిది మందిని తీసుకొచ్చారు. వీళ్లలో మెహబూబ్ ఒకడు. నాలుగో సీజన్లో పాల్గొన్నాడు. గెలవలేదు గానీ చివరలో సొహెల్ డబ్బు దక్కించుకునేందుకు సాయపడ్డాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి.(ఇదీ చదవండి: నాన్నతో నేను మాట్లాడలేదు.. విష్ణుప్రియ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న గంగవ్వ)అదంతా పక్కనబెడితే ఇప్పుడు కూడా హౌస్‌లోకి వచ్చిన తర్వాత గేమ్స్ ఆడుతున్నాడు సరే. నబీల్‌తో కమ్యూనిటీ ఓటింగ్ గురించి చర్చించాడు. వివాదం అవ్వొచ్చని ఆ వీడియోని ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్‌లో వచ్చినట్లుంది. ఎవరో దాన్ని తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.వీడియోలో మెహబూబ్ ఏమన్నాడంటే.. 'మన ప్లస్ ఏంటంటే కమ్యూనిటీ ఉంది. దారుణంగా ఓట్లు పడతాయి. ఎటొచ్చి ఇద్దరం ఒకేసారి నామినేషన్లలో లేకుండా చూసుకోవాలంతే' అని నబీల్‌తో అంటున్నాడు. ఈ వీడియోలో నబీల్ చేతికి మెగా చీఫ్ బ్యాడ్జి ఉంది. అంటే ఇది పాత వీడియోనే అనిపిస్తుంది. మిగతా వాటిలో ఏమో గానీ చివరకు బిగ్‌బాస్ షోలో కులం-మతం ప్రాతిపదికన ఓట్లు వేస్తారా? నిజంగా అది వర్కౌట్ అవుతుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!)#Mehboob and #nabeel discussion about Community Mana Community votes manake padathay just manam iddaru okesari nominations lo lekunda chuskovali anthe pedha plan thone vacharu ga vellu 🙉🙉🙉 Konni sensitive topics matladakudadu bb house lo asalu 🙂🙏🙏#BiggBossTelugu8… pic.twitter.com/vEjeJtHptB— World Discovery By SP (@WorldDiscoverSP) October 15, 2024 -
లగ్జరీ కారు కొన్న మెహబూబ్ దిల్సే, ఎన్ని లక్షలో తెలుసా?
గుంటూరు మిర్చి లాంటి కుర్రోడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సే కొత్త కారు కొన్నాడు. ఈద్ పండగ సందర్భంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును ఇంటికి తెచ్చుకున్నాడు. దీని ధర రూ.15 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్ కలర్లో మెరిసిపోతున్న కారు ముందు దిగిన ఫోటోలను మెహబూబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది చూసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సోహైల్, శ్రీరామచంద్ర, కాజల్, అర్జున్ కల్యాణ్, రవికృష్ణ తదితరులు అతడికి శుభాకాంక్షలు చెప్తున్నారు. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి అన్నా అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. రంజాన్ మాసం కావడంతో తన స్నేహితులకు ఇఫ్తార్ పార్టీ కూడా ఇచ్చాడు మెహబూబ్. కాగా మెహబూబ్ టిక్‌టాక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయ్యాడు. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌తో అతడికి కావాల్సినంత గుర్తింపు లభించింది. బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలే వేదికగా చిరంజీవి అందించిన పది లక్షల రూపాయలకు తోడు తను సంపాదించిన డబ్బులను జత చేసి గుంటూరులో సొంతిల్లు కట్టుకున్నాడు. నిత్యం యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో మెహబూబ్ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) చదవండి: సినిమా హిట్.. థియేటర్‌కు వెళ్లిన దర్శకుడికి షాక్.. -
అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!
సాక్షి, హైదరాబాద్: అత్యంత ఉత్సాహభరితంగా సాగిన గ్రాండ్ఫినాలేలో అందరూ ఊహించినట్టుగానే బిగ్ బాస్ సీజన్-4 టైటిల్‌ను అభిజీత్ ఎగరేసుకుపోయాడు. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫైనల్ సందర్భంగా అభిజీత్‌ను మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ తెలుగు 4 విజేతగా ప్రకటించారు. మొదటి నుండి నామినేషన్స్ లోకి వచ్చిన అభిజిత్ ప్రతీవారం సేఫ్ గేమ్ ఆడుతూ చివరికి టైటిల్ సాధించాడు. కానీ టైటిల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుని తుదికంటూ పోరాడిన అఖిల్ సార్థక్ మాత్రం రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. అంతేకాదు రన్నరప్ అఖిల్‌కు నగదు బహుమతి ఏమీ ఇవ్వకపోవచ్చని కూడా సోషల్ మీడియా కోడై కూస్తోంది. టాప్ 2 వరకు వెళ్లిన అఖల్ చివరికి భంగపాటు తప్పలేదంటూ సోషల్‌మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అభిజిత్‌తో గొడవ, మోనాల్‌తో లవ్ ట్రాక్ తనను గెలిపిస్తాయని ఆశపడిన అఖిల్ ట్రోఫీ దక్కించు కోలేకపోయాడు. అంతేకాదు గ్రాండ్ ఫినాలే వేదికగా టాప్-5 లో నిలిచిన సోహైల్, మెహబూబ్‌లపై ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి మాటలకు అందరూ ఫిదా అయ్యారు. వారిద్దరి గురించి చిరు ఎక్కువగా హైలెట్ చేయడం, అఖిల్ గురించి చాలా తక్కువ మాట్లాడడం కూడా అఖిల్‌కు దెబ్బేనని పేర్కొంటున్నారు. వాళ్లనలా పొగుడుతూంటూ.. అఖిల్ మాత్రం బేలగా నిలబడిపోయాడని అలాగే దివి, హారికలతో చిరు రొమాంటిక్ సంభాషణ, మెహబూబ్‌కి 10 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం లాంటివి అంశాలు అఖిల్‌కి బాధాకర విషయాలని ఫ్యాన్స్ అంటున్నారు. దీనిపై మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క రేసు నుంచి తప్పుకుని, తనకు వచ్చిన 25 లక్షల రూపాయల్లో అనాథాశ్రమానికి రూ. 10 లక్షలు ఇవ్వాలనుకుంటున్నానని ఆ గోల్డ్ బాక్స్ తీసుకొని బయటకు వచ్చేశాడు సొహేల్. ఇది నెటిజనుల ప్రశంసలను దక్కించుకుంది. దీనికి తోడు తనకొచ్చిన ప్రైజ్‌మనీలో 10 లక్షలు దానం చేస్తానని సోహైల్ ప్రకటించడం బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున మురిసిపోయి, ఆ పది లక్షలూ తానే ఇస్తాననడం మరింత హైలెట్‌గా నిలిచింది. అయితే హౌస్‌లో తన ఆట పాటలతో అలరించిన అఖిల్ మోనాల్ గజ్జర్‌తో ప్రేమాయణంద్వారా మొదట్లో బాగా చర్చల్లో నిలిచాడు. ఆ తరువాత ఆమెను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతూ అఖిల్ చివరికి బకరాగా మిగిలిపోయాడు. మోనాల్ చుట్టూనే తిరుగుతూ హగ్స్ ఇస్తూ.. ముద్దులు పెట్టుకుంటూ బిగ్ బాస్ గేమ్‌ను బాగానే రక్తికట్టించినా, విన్నర్ మాత్రం అభిజిత్ అయ్యాడు. అయితే ఎలాంటి ఫేమ్ లేని అఖిల్ బిగ్ బాస్ టాప్ 2 వరకు రావడం విశేషమే. మరి అఖిల్ కెరీర్‌కు ఇదిఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాల్సిందే. కాగా మొదట్లో అఖిల్-మోనాల్-అభిజిత్ మధ్య లవ్ ట్రాక్ నడిచింది. ఆ తర్వాత మోనాల్ డబుల్ గేమ్ తెలిసి మోనాల్ ని అభిజిత్ దూరం పెట్టాడు. అయితే మోనాల్ ది డబుల్ గేమ్ తెలిసినా ఆమెతో కనెక్షన్, ఎమోషన్ పెంచుకోవడమే కాదు శృతి మించి ప్రవర్తించాడు. ఈ సందర్భంగా ఇది ఆయన అభిమానులకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో మోనాల్ విషయంలో అఖిల్ పెద్ద బకరాగా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే కొనసాగితే ఓ బకరాగా బయటికి రాకతప్పదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరికి వారి జోస్యం నిజం కావడంతో అయ్యో అఖిల్ అంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. An entertaining finale to most talked about season. While #Abhijeet won well deserved title, #Sohel with street smart moves and character won all hearts, #Akhil continued making mess of his chances and abilities.. Disappointed to miss #Ariyana in final 2. #BiggBossTelugu4 pic.twitter.com/GHXHRefxlv — Sampath Murki (@anytime_sampath) December 21, 2020 -
టిక్‌టాక్ హీరో.. సినీ స్టార్స్ ఫాలోయింగ్
సెలబ్రిటీస్‌కి ఒక రేంజ్ ఉంటుంది. వాళ్లు టీవీలో, పేపర్లో కనిపిస్తే ఫ్యాన్స్‌కి పండగే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి వాటిలో ప్రత్యక్షమవుతూ.. ఫ్యాన్స్‌ను పలకరిస్తున్నారు. అయితే, ప్రస్తుతం వాటన్నింటిలోనూ ‘టిక్‌టాక్’ హావానే నడుస్తోంది. పిల్లలు నుంచి పెద్దల వరకు తమక నచ్చిన వీడియోలు చేస్తూ ఈ యాప్‌లో తమ ప్రతిభతో సందడి చేస్తున్నారు. పైగా ఈ టిక్‌టాక్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వారిని ఫాలో అవుతున్నారు మన టాలీవుడ్ స్టార్స్. వారివారి సినిమా ప్రమోషన్స్‌ని టిక్‌టాక్ స్టార్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇదే కోవలో సిటీకి చెందిన ‘మెహబూబ్’ సినీ సెలబ్రిటీలు మెచ్చిన సెలబ్రిటీ అయిపోయాడు. సాక్షి, సిటీబ్యూరో: మణికొండకు చెందిన మెహబూబ్ షేక్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే మహాపిచ్చి. ఫ్రెండ్స్‌తో కలసి సరదగా డ్యాన్స్ చేస్తుండేవాడు. ఇదే సమయంలో ‘టిక్‌టాక్’ యాప్ సోషల్ మీడియాలోకి వచ్చింది. ఆ యాప్ సాయంతో ఇతడు చిన్న చిన్న డైలాగ్‌లు చేస్తూ వాటిని పోస్ట్ చేయడంతో నెటిజన్లు హిట్స్ కొట్టడం మొదలు పెట్టారు. ఇదేదో బాగుందని ఇప్పుడు పూర్తిగా ఇందులోనే మునిగిపోయాడు. ఇప్పుడు మహబూబ్‌ను టిక్‌టాక్‌లో 12 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అంతేకాదు.. యూట్యూబ్‌లో 2.90 లక్షల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 2.28 లక్షల మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు. సినీ స్టార్స్ ట్రెండీ ప్రమోషన్ టాలీవుడ్ సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్ కోసం టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ సైట్లలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వారిని ఆశ్రయిస్తున్నారు. సిటీలో మెహబూబ్‌కు టిక్‌టాక్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉండడంతో సినిమా ప్రొడ్యూసర్లు మెహబూబ్‌ని తమ సెలబ్రిటీగా ఎంచుకుంటున్నారు. అతడి ద్వారా వీడియోస్ చేసి ‘సోషల్’ సైట్లలో అప్లోడ్ చేస్తూ.. నెటిజన్లును మెప్పిస్తున్నారు. ఓ పక్క తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీని సినిమా ప్రొడ్యూసర్లు సొంతం చేసుకుంటుండగా.. మరోపక్క సినీసార్టు సోషల్ మీడియా సెలబ్రిటీస్‌తో కలసి నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టడం విశేషం. యూట్యూబ్‌లోనూ రారాజే ఇప్పటి వరకు 20కి పైగా షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోగా చేసిన మెహబూబ్.. యూట్యూబ్‌లోనూ తన సత్తా చాటుతున్నాడు. ఇతడు చేసిన ‘మారీ–2’ సినిమాలోని ‘రౌడీబేబీ’ పాటకు యూట్యూబ్‌లో 1.60 కోట్ల మంది(16ఎం) వీక్షించడం విశేషం. ఇతడు చేసే ప్రతి వీడియో పది లక్షలకు పైగా వ్యూస్, వేలల్లో కామెంట్స్, లక్షల్లో హిట్స్‌ని సొంతం చేసుకోవడం మెహబూబ్‌కే సాధ్యమైంది. సినిమా, కార్పొరేట్, ఫ్యాషన్, వైద్యం ఇలా ప్రతి రంగం మెహబూబ్ స్టార్‌డమ్‌ని కోరుకుంటున్నారు. అతని ద్వారా వారి వారి ఉత్పత్తులకు ప్రచారకర్తగా వాడుకుంటున్నారు. మహబూబ్ సరదాగా టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన చిన్న వీడియోలు ఇప్పుడు అతడిని స్టార్‌ను చేశాయంటే విశేషమే మరి. నాని.. కాజల్.. నిధి.. నభా.. అగ్ర సినీ తారలు సైతం తమ చిత్ర ప్రమోషన్‌కు ఈ మార్గం ఎంచుకుంటున్నారు. ఇటీవల విడుదలైన అగ్రహీరో నాని ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా ప్రమోషన్ని మెహబూబ్‌తో కలిసి చేశాడు. ఆ సినిమాలో బాగా పాపులర్ అయిన ‘హోయిన హోయినా’ అనే సాంగ్‌ని టిక్‌టాక్ యాప్‌తో మెహబూబ్ చేస్తుండగా.. మధ్యలో నాని వచ్చి అతడితో కలిసి స్టెప్పులేశాడు. శర్వానంద్, కాజల్ అగర్వాల్ నటించిన ‘రణరంగం’ సినిమా ప్రమోషన్లో భాగంగా మెహబూబ్.. కాజల్‌కు ఐలవ్యూ చెప్పి ప్రొపోజ్ చేస్తాడు. ‘ఇస్మార్ట్ శంకర్’లో నభా నటేష్‌తో కలసి డ్యాన్స్ చేశాడు. నిధి అగర్వాల్‌తో కలసి కాన్సెప్ట్ వీడియో చేశాడు. ఇతడో బ్రాండ్ అంబాసిడర్ కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు.. ప్రపంచ టాప్ దుస్తుల షోరూంలు సైతం మెహబూబ్ స్టార్‌డమ్‌ని వాడుకుంటున్నాయి. ఇటీవల ‘ఫ్లైయింగ్ మిషన్’ సంస్థ ఆఫర్లు, డిస్కౌంట్స్ ఉన్నాయంటూ మెహబూబ్‌తో ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు సిటీలోని టాప్ మోస్ట్ డిజైనర్స్ తమ దుస్తులకు మెహబూబ్‌నే మోడల్‌గా పెట్టుకున్నారు. ఇతడే తమ బ్రాండ్ అంబాసిడర్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ‘పక్కా లోకల్’.. హుషార్ రోడ్డుపై సడన్‌గా వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న ఓ వ్యక్తి సడన్‌గా ఆపి మైక్ పెడతాడు. ‘మీ ఫస్ట్ కిస్’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తాడు. ఏం అడుగుతున్నాడో అని మనం ఆలోచించే లోపే మరో ప్రశ్న వేస్తాడు. చెప్పాలనుకునేవారు సమాధానం ఇస్తారు.. లేదంటే లేదు.. ఇలాంటి అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సిటీకి రిలేటెడ్‌గా ఉన్న ‘పక్కా లోకల్ టీం’ యూట్యూబ్ చానెల్ రోజుకో కొత్త రకమైన థీమ్‌తో ప్రజల్లోకి వస్తోంది. ఆ థీమ్ ఆధారంగా పార్కు, రెస్టారెంట్స్, ట్యాంక్‌బండ్, చార్మినర్ వంటి ప్రాంతాల్లోయుతను టార్గెట్ చేస్తుంది. చానెల్‌కి చెందిన యాంకర్ అమ్మాయిలు, అబ్బాయిలకు ప్రశ్నలు వేస్తాడు. ఆ క్వశ్చన్‌కి పగలబడీ మరీ నవ్వుతూ సమాధానం చెప్పడం విశేషం. ఒక్కోసారి ఆ క్వశ్చన్స్ డబల్ మీనింగ్‌ను తలపిస్తాయి. ఫైనల్‌గా ఆన్సర్ మాత్రం ఆదర్శంగా, తెలివిగా ఉంటుంది. యూట్యూబ్‌లో వీరు చేస్తున్న డిఫ్రెంట్ ప్రొగ్రామ్స్‌కు నెటిజన్లు లక్షల్లో హిట్స్, లైక్‌లు ఇవ్వడం గమనార్హం. -
రైడర్‌గా రైజ్..తెరపై క్రేజ్
చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి. నటుడు కావాలనే కోరిక. సినీ రంగంలోకి అడుగు పెట్టాలని, ఓవైపు చదువుకుంటూ మోడలింగ్‌పై దృష్టిసారించాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. బైక్ రైడర్‌గానూ గుర్తింపు పొంది, టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. రైడర్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించి... హీరో, విలన్‌గా నటిస్తూ తెరపై దూసుకుపోతున్నాడు నగరవాసి విష్షురెడ్డి. హిమాయత్‌నగర్: విష్షురెడ్డికి చిన్నప్పటి నుంచి బైక్ రైడింగ్ అంటే పిచ్చి. బెంగళూర్‌లో మోడలింగ్ చేస్తుండగా బైక్ రైడింగ్ పోటీల్లో పాల్గొనేవాడు. 2009లో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘జోష్’ సినిమాకు మంచి బైక్ రైడర్ కావాలని వెతికిన డైరెక్టర్... విష్షురెడ్డి గురించి తెలుసుకొని అతనికి అవకాశం ఇచ్చాడు. సినిమా సెకండాఫ్‌లో హీరోతో విష్షురెడ్డి చేసిన బైక్ రైడింగ్ విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. అలా రైడర్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన విష్షురెడ్డి విభిన్న పాత్రలు పోషిస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నాడు. త్వరలో ‘త్రయం’... ‘జోష్’ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించిన విష్షురెడ్డి.. లవ్‌చేస్తే, నీ జతలేక, త్రయం సినిమాల్లో హీరోగా నటించారు. ఇందులో త్రయం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులోనూ బైక్ రైడర్‌గా ప్రేక్షకులను అలరించనున్నాడు. డూప్ లేకుండా బైక్ రైడింగ్ విన్యాసాలు, మార్షల్ ఆర్ట్స్ చేశానని చెప్పాడు విష్షురెడ్డి. ఆకాశ్‌తో విలన్‌గా... ఓవైపు హీరోగా నటిస్తూనే విలన్ పాత్రలకూ ఓటేస్తున్నాడు విష్షురెడ్డి. ఇందులో భాగంగా ‘పూరీ కనెక్ట్స్ సంస్థ’ ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘మెహబూబా’ సినిమా నిర్మిస్తున్నాడు. ఇందులో ఆయన తనయుడు ఆకాష్ హీరో కాగా, విష్షురెడ్డి విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినమా దాదాపు పూర్తయిందని చెప్పాడు. అవకాశాలొస్తున్నాయి.. ఇప్పటివరకు చేసిన సినిమాలు నాకు సంతృప్తినిచ్చాయి. బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయి. కథలను బట్టి అక్కడా సినిమాలు చేస్తాను. – విష్షురెడ్డి -
వ్యవసాయ అధికారి ఇంట్లో చోరీ
చిత్తూరు జిల్లా కుప్పం మండల మండల కేంద్రంలో ఓ ఆలస్యంగా వెలుగు చూసింది. శాంతిపురం మండల వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో)గా పనిచేస్తున్న మహబూబ్ .. కుప్పం హెచ్‌పీ రోడ్డులో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం ఆయన కుటుంబసమేతంగా బంధువుల ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం వారు ఇంటికి చేరుకోగా దొంగతనం విషయం తెలిసింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక నుంచి ప్రవేశించి ఇంట్లో ఉన్న రూ.2.50 లక్షల నగదుతోపాటు 20 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.