బిగ్‌బాస్ 8లో 'కమ్యూనిటీ' ఓటింగ్? మెహబూబ్ షాకింగ్ వీడియో | Bigg Boss 8 Telugu: Mehboob, Nabeel Community And Voting Video | Sakshi
Sakshi News home page

Mehboob Bigg Boss 8: చివరకు బిగ్‌బాస్‌ని కూడా వదలట్లేదా?

Published Wed, Oct 16 2024 12:07 PM | Last Updated on Wed, Oct 16 2024 12:17 PM

Bigg Boss 8 Telugu: Mehboob, Nabeel Community And Voting Video

బిగ్‌బాస్ షోలో గెలవాలంటే ఏం కావాలి? అయితే కండబలం లేదంటే బుద్ధి బలం ఉండాలి. ఒకవేళ ఇవన్నీ లేకపోతే కనీసం గ్లామర్ అయినా ఉండాలి. అలా అయితే కొన్ని వారాలు నెట్టుకురావచ్చు. కానీ చివరకు ఇక్కడికి కూడా మతాన్ని, కులాన్ని తీసుకొచ్చేసినట్లు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం తెలుగులో 8వ సీజన్ నడుస్తోంది. 14 మంది వస్తే ఒక్కరూ సరిగా ఎంటర్‌టైన్ చేయలేకపోయారని, వైల్డ్ కార్డ్ పేరిట మరో ఎనిమిది మందిని తీసుకొచ్చారు. వీళ్లలో మెహబూబ్ ఒకడు. నాలుగో సీజన్‌లో పాల్గొన్నాడు. గెలవలేదు గానీ చివరలో సొహెల్‌ డబ్బు దక్కించుకునేందుకు సాయపడ్డాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి.

(ఇదీ చదవండి: నాన్నతో నేను మాట్లాడలేదు.. విష్ణుప్రియ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న గంగవ్వ)

అదంతా పక్కనబెడితే ఇప్పుడు కూడా హౌస్‪‌లోకి వచ్చిన తర్వాత గేమ్స్ ఆడుతున్నాడు సరే. నబీల్‌తో కమ్యూనిటీ ఓటింగ్ గురించి చర్చించాడు. వివాదం అవ్వొచ్చని ఆ వీడియోని ఎపిసోడ్‌లో చూపించలేదు కానీ లైవ్‌లో వచ్చినట్లుంది. ఎవరో దాన్ని తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

వీడియోలో మెహబూబ్ ఏమన్నాడంటే.. 'మన ప్లస్ ఏంటంటే కమ్యూనిటీ ఉంది. దారుణంగా ఓట్లు పడతాయి. ఎటొచ్చి ఇద్దరం ఒకేసారి నామినేషన్లలో లేకుండా చూసుకోవాలంతే' అని నబీల్‌తో అంటున్నాడు. ఈ వీడియోలో నబీల్ చేతికి మెగా చీఫ్ బ్యాడ్జి ఉంది. అంటే ఇది పాత వీడియోనే అనిపిస్తుంది. మిగతా వాటిలో ఏమో గానీ చివరకు బిగ్‌బాస్ షోలో కులం-మతం ప్రాతిపదికన ఓట్లు వేస్తారా? నిజంగా అది వర్కౌట్ అవుతుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement