బిగ్బాస్ 8లో ఏడో వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగింది. ఎంతలా అంటే పృథ్వీ నిజంగా పిచ్చోడిలా ప్రవర్తించాడు. ప్రేరణని టార్గెట్ చేశాడు. అవినాష్ వ్యక్తిగత విషయాలు తీసి దారుణంగా మాట్లాడాడు. ఇంతా చేశాడు గానీ ఏదైనా గట్టిగా అనుకున్నాడో అది మాత్రం సాధించలేకపోయాడు. వీళ్లిద్దరి వల్ల హరితేజ అడ్డంగా బుక్ అయింది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో (అక్టోబర్ 15) ఏమేం జరిగిందనేది హైలైట్స్‌లో చూద్దాం.
యష్మి డబుల్ ఫేస్
ఏడో వారం నామినేషన్స ప్రక్రియ మధ్యలో ఆగడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. మళ్లీ అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. టోపీని ప్రేరణకి దక్కకుండా చేయాలని నయని, పృథ్వీ అడ్డుకున్నారు. ప్రేరణకి సపోర్ట్ చేస్తూ, వీళ్లని డిఫెండ్ చేసే క్రమంలో యష్మి కింద పడిపోయింది. తనకు కాలు విరిగినా పర్లేదు కానీ ఏది కరెక్టో దానివైపే నిలబడతా అని చెప్పింది.
యష్మి కన్ఫ్యూజన్ మాటలు
పోడియం పైకి తేజ, నబీల్ వచ్చారు. నబీల్.. తేజని నామినేట్ చేశాడు. సొంత ఫ్రెండ్‌ని చెప్పి ప్రేరణని నామినేట్ చేస్తానని యష్మి చెప్పిందని, ఇది తనకు నచ్చలేదని యష్మిని నామినేట్ చేశాడు. అయితే యష్మి.. ఫ్రెండ్ అనే ముసుగు వేసుకుని మరీ ప్రేరణని మోసం చేస్తోంది అని, యష్మిది డబుల్ స్టాండర్డ్ అని చెప్పుకొచ్చాడు. ఈ హంగామా అంతా కాసేపు నడిచింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చేసిన కంటెస్టెంట్.. అదే కారణం!)
టార్గెట్ తేజ
ఓజీ క్లాన్ అందరూ కలిసి తేజని టార్గెట్ చేయాలనుకున్నారు. నిఖిల్ చాలా తెలివిగా తన క్లాన్ అందరికీ ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో పోడియంపైకి వచ్చిన విష్ణుప్రియ.. నయని పావనిని రివేంజ్ నామినేషన్ చేయాలనుకుంటున్నానని చెప్పింది. ఇదంతా చెల్లదు అని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే ఇదంతా తనని టార్గెట్ చేయడానికే అని తేజ బయటపెట్టాడు. విష్ణుప్రియ డమ్మీ నామినేషన్ వేస్తే.. పక్కనోళ్లు తన పేరు చెబుతారని.. అలా తను నామినేషన్ లోకి వచ్చేలా ఇదంతా చేస్తున్నారని ఓజీ క్లాన్ బండారాన్ని తేజ బయటపెట్టాడు. కానీ నిఖిల్, తేజ పేరే చెప్పాడు. టోపీ ఉన్న హరితేజ.. తేజ పేరునే నామినేట్ చేస్తూ ఫైనల్ చేసింది. దీని తర్వాత గౌతమ్ మరోసారి పసలేని వాదన తీసుకొచ్చి నబీల్ పేరు చెప్పాడు. కాస్త హంగామా నడిచిన తర్వాత ఊహించని విధంగా నబీల్ నామినేట్ అయ్యాడు.
పృథ్వీ చీప్ కామెంట్స్
బిగ్‍బాస్ ఎపిసోడ్స్ ఏం చూడకుండా తనని గతవారం అవినాష్ నామినేట్ చేశాడని, అందుకే ఈ వారం అతడిని నామినేట్ చేస్తున్నానని పృథ్వీ చెప్పాడు. దీంతో అవినాష్ నిజాయతీగా తన వాదన వినిపించాడు. షూటింగ్స్ వల్ల తాను అన్ని ఎపిసోడ్స్ చూడలేదని, ఈ విషయాన్ని నాగ్ సర్‌కి కూడా చెప్పానని అన్నాడు. తన భార్య ఎపిసోడ్స్ అన్నీ చూసి తనకు కొన్ని పాయింట్స్ చెప్పిందని, వాటి వల్ల పృథ్వీని నామినేట్ చేశానని అన్నాడు. అలాంటప్పుడు మీరెందుకు వచ్చారు, మీ భార్యనే ఇక్కడకు రావాల్సింది అని పృథ్వీ చీప్ కామెంట్స్ చేశాడు. వైఫ్ మ్యాటర్ తీయకు అని అవినాష్ ఫుల్ సీరియస్ అయ్యాడు.
నోరు జారిన పృథ్వీ
షూటింగ్స్‌లో బిజీగా ఉండటం తాను చూడలేకపోయానని అవినాష్ ఎంత చెబుతున్నా సరే పృథ్వీ ఊరుకోలేదు. సరికదా సైకోలా ప్రవర్తించి బిగ్‍బాస్‍లోకి వచ్చేందుకు షూటింగ్స్ లేవా? అని వెటకారంగా మాట్లాడాడు. పృథ్వీ పనేం చేయట్లేదని, గంగవ్వ కూడా అదే పాయింట్ చెప్పిందని గుర్తుచేశాడు. 'గంగవ్వ అని ఎందుకు చెప్తావ్ రా' అని పృథ్వీ అనేసరికి.. 'రేయ్ రా అనకు' అని అవినాష్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నేను అలానే అంటాను అని పృథ్వీ పైపైకి వచ్చాడు. అలా తన్నుకోవడం ఒక్కటే తక్కువైంది అనే రేంజులో తగాదా పడ్డారు. మరో పోడియంపై నిలబడ్డ నయని.. విష్ణుప్రియ పేరు చెప్పింది. కానీ పాయింట్‌లో బలం లేకపోయింది. దీంతో పృథ్వీ చెప్పిన అవినాష్ పేరునే పరిగణలోకి తీసుకుంది.
అనుకున్నది జరగలే
ఈ తతంగం అంతా పూర్తయిన తర్వాత గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మి, టేస్టీ తేజ, నబీల్, మణికంఠ నామినేషన్స్‌లో ఉన్నారని.. అలానే తక్కువసార్లు టోపీ పట్టుకున్న కారణంగా ప్రేరణ నామినేట్ అయిందని బిగ్‌బాస్ ప్రకటించాడు. ఓజీ క్లాన్ దగ్గర ఇమ్యూనిటీ ఉన్నందున ఒకరిని సేవ్ చేసుకోవచ్చని కానీ మరొకరిని ఆ స్థానంలో పెట్టాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో అవినాష్.. తన బదులు హరితేజ పేరుని చెప్పాడు. అలా ఈసారి ఓజీ క్లాన్ నుంచి ఆరుగురు.. రాయల్ క్లాన్ నుంచి ముగ్గురు నామినేషన్స్‌లోకి వచ్చారు.
పృథ్వీ మనిషి కాదు సైకో?
రెండు రోజుల పాటు జరిగిన నామినేషన్స్‌లో అందరూ గేమ్ పరంగా ఎంత ఉండాలో అంతలా కనిపించారు. పృథ్వీ మాత్రం సైకోలా ప్రవర్తించాడు. ప్రేరణ తనని కావాలనే టార్గెట్ చేసిందని, ఆమెని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక అవినాష్‌తో అయితే కనీసం బుర్ర లేని పిచ్చోడిలా ప్రవర్తించాడు. ఇలాంటి వాడిని అసలు బిగ్‌బాస్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడో? ప్రేక్షకుల మైండ్ ఎందుకు కలుషితం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment