బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చేసిన కంటెస్టెంట్.. అదే కారణం! | Advocate Gunaratna Sadavarte Out Of Salman Khan Bigg Boss 18 Show, Know Reason Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss Hindi 18 Show: బిగ్‌బాస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న కంటెస్టెంట్..!

Oct 15 2024 9:20 PM | Updated on Oct 16 2024 10:23 AM

Advocate Gunaratna Sadavarte out of Salman Khan Bigg Boss show

బాలీవుడ్‌లో ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ రియాలిటీ షోకు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌ ఊహించని విధంగా బయటకొచ్చేశాడు. అడ్వకేట్ అయిన గుణరత్న సదావర్తే బిగ్‌ బాస్‌ హౌస్‌కు గుడ్‌ బై చెప్పారు. 

కారణమిదే...

తాజా సమాచారం ప్రకారం అడ్వకేట్ గుణరత్న సదావర్తే సోమవారం కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ అతను రాలేదు. దీంతో న్యాయమూర్తులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గుణరత్న సదావర్తే బిగ్‌బాస్ షో నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. అయితే అతను మళ్లీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి తిరిగి వస్తాడా? లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

న్యాయవాది గుణరత్న కేసు

అంతకుముందు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నందున గుణరత్న సదావర్తే కోర్టుకు హాజరు కాలేకపోయాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో ముఖ్యమైన సమస్య అయిన మరాఠా రిజర్వేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కోర్టు విచారిస్తోంది. కాగా.. సదావర్తే తన సతీమణి జైశ్రీ పాటిల్‌తో కలిసి రిజర్వేషన్‌పై పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 19కి కోర్టు వాయిదా వేసింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement