నాన్నతో నేను మాట్లాడలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న గంగవ్వ | Bigg Boss 8 Telugu Day 45 Vishnu Priya Emotional | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Promo: తండ్రితో మాట్లాడని విష్ణుప్రియ.. లేటెస్ట్ ప్రోమో రిలీజ్

Published Wed, Oct 16 2024 10:56 AM | Last Updated on Wed, Oct 16 2024 11:26 AM

Bigg Boss 8 Telugu Day 45 Vishnu Priya Emotional

బిగ్‌బాస్ ఏడో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. రెండు రోజుల పాటు రచ్చ రచ్చగా సాగింది. మొత్తం తొమ్మిది మంది లిస్టులో ఉన్నారు. అసలు ఘట్టం అయిపోయింది కాబట్టి కాస్త ఎంటర్ టైన్‌మెంట్, ఎమోషన్స్ బయటపడ్డాయి. విష్ణుప్రియ తన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండటం గురించి చెప్పగా.. గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక నామినేషన్‌లో జరిగిన సీరియస్ విషయాన్ని రోహిణి-తేజ-అవినాష్ కలిసి ఫుల్ కామెడీ చేసేశారు.

ఉదయం లేచిన తర్వాత ముచ్చట్లు పెట్టిన టైంలో విష్ణుప్రియ తన కుటుంబంలో గొడవ గురించి బయటపెట్టింది. 'నాన్న ఊరిలో ఉంటారు. ఆయనతో మాట్లాడటం అమ్మకు ఇష్టం లేదు. అమ్మ కోసం నాన్న మీద ఎంత ప్రేమ ఉన్నా, ఎంత మిస్ అయినా కూడా నాన్నతో నేను మాట్లాడలేదు' అని చెప్పింది. దీంతో గంగవ్వ ఎమోషనల్ అయింది. కళ్లలో నీళ్లు రావడంతో విష్ణుప్రియ ఓదార్చింది. ఇకపోతే కొన్నేళ్ల క్రితం విష్ణుప్రియ తల్లి చనిపోయింది.

(ఇదీ చదవండి: పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!)

మరోవైపు మనిద్దరం డీలింగ్ చేసుకుందామని గంగవ్వతో మణికంఠ మాట్లాడాడు. ఈ వారం గనక తాను సేవ్ అయితే బంగారు ముక్కు పుడక చేయిస్తానని గంగవ్వతో అన్నాడు. దీంతో పక్కనే ఉన్న హరితేజ.. నాకు బంగారు వడ్డనం ఇస్తావా చెప్పు అని జోక్ చేసింది. నాకు ఏమిస్తావ్ అని రోహిణి అడగ్గా.. ముద్దు ఇస్తానని చెప్పాడు. ఎనిమిదో వారం సేవ్ అయితే నాకు తులం బంగారం పెట్టు అని గంగవ్వ మణితో చెప్పింది.

ఏడో వారం సేవ్ కావాలి, తొమ్మిదో వారం సేవ్ కావాలి అనే మణికంఠ చెప్పేసరికి.. నువ్వు అప్పటివరకు ఉండవ్, ఎనిమిదో వారమే ఎలిమినేట్ అయిపోతావ్ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వారం నామినేషన్స్‌లో గొడవ గొడవ చేసిన గౌతమ్, పృథ్వీలని ఇమిటేట్ చేస్తూ అవినాష్-తేజ-రోహిణి ఫుల్ కామెడీ చేశారు. అలా ప్రోమో కాస్త ఎమోషనల్, కాస్త ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. 10 నెలల తర్వాత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement