ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. 10 నెలల తర్వాత | Currency Nagar 2023 Telugu Movie Released In OTT On Rent Basis, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Currency Nagar OTT Release: ఆంథాలజీ తెలుగు మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్

Published Wed, Oct 16 2024 10:18 AM | Last Updated on Wed, Oct 16 2024 11:24 AM

Currency Nagar Movie Telugu OTT Details

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు చాలా నెలల తర్వాత కూడా స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా గతేడాది డిసెంబరు చివర్లో రిలీజైన ఓ తెలుగు మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. డబ్బు చుట్టూ తిరిగే ఆంథాలజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ఇంతకీ దీని సంగతేంటంటే?

(ఇదీ చదవండి: ఓటీటీలో 'దేవర'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?)

డబ్బులున్న ఓ ఇనుప పెట్టె.. ఓ దొంగతో ఎనిమిది కథలు చెబుతుంది. మనిషి డబ్బు కోసం ఏమేం చేస్తాడు? ఎలా ప్రవర్తిస్తాడు? అనే కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం 'కరెన్సీ నగర్'. గతేడాది డిసెంబరు 29న థియేటర్లలో రిలీజైంది. చిన్న మూవీ కావడం, పెద్దగా పేరున్న యాక్టర్స్ ఎవరూ లేరు. దీంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.

ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయినా నేరుగా స్ట్రీమింగ్ చేయకుండా ఈ చిన్న మూవీని కూడా అద్దె విధానంలో పెట్టడమేంటో అర్థం కాలేదు. ఏదైతేనేం ఓటీటీలోకి కొత్త తెలుగు మూవీ వచ్చేసింది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు.

(ఇదీ చదవండి: పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement