దసరాకు దాదాపు అరడజను సినిమాలు రిలీజయ్యాయి. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. దీంతో అప్పటికే థియేటర్లలో ఉన్న 'దేవర' హవా కాస్త కొనసాగింది. ఈ క్రమంలోనే రూ.500 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసినట్లు నిర్మాతలు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు 'దేవర' ఓటీటీ రిలీజ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తీసిన సినిమా 'దేవర'. యాక్షన్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కించారు. సెప్టెంబరు 27న థియేటర్లలో రిలీజైంది. తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ వచ్చి, పికప్ అయింది. అలా 16 రోజుల్లో రూ.500 కోట్ల మార్క్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
'దేవర' మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే ఆరు వారాల ఒప్పందం కుదిరిందట. ఈ లెక్కన నవంబరు 8 నుంచి ఓటీటీలో 'దేవర' స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి)
Comments
Please login to add a commentAdd a comment