ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు | Here's The List Of 25 New Movies And Web Series Releasing In OTT In October 3rd Week 2024 | Sakshi
Sakshi News home page

This Week OTT Movie Releases: ఓటీటీల్లోకి 25 మూవీస్.. ఇవి ఏంటంటే?

Oct 14 2024 8:35 AM | Updated on Oct 14 2024 10:06 AM

Upcoming OTT Movies Telugu October 3rd Week 2024

దసరా హడావుడి అయిపోయింది. సొంతూళ్లకు వెళ్లిన వాళ్లందరూ తిరిగి పనుల్లో బిజీ అయిపోయారు. ఇక పండగ సందర్భంగా థియేటర్లలో అరడజను సినిమాలు రిలీజయ్యాయి. దీంతో పెద్దగా చెప్పుకోవడానికి ఈ వారం కొత్త మూవీస్ ఏం లేవు. ఉన్నంతలో కల్లు కాంపౌండ్, వీక్షణం, సముద్రుడు అనే చిన్న చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. ఓటీటీలో మాత్రం 25 సినిమాలు/వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయాయి.

(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత)

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం లేవు. స్నేక్స్ అండ్ ల్యాడర్స్, 1000 బేబీస్ అనే డబ్బింగ్ సిరీస్‌లు మాత్రమే ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా అయితే లాఫింగ్ బుద్ధా అనే కన్నడ మూవీ మాత్రం చూడొచ్చులే అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇవే. ఒకవేళ వీకెండ్ వచ్చేసరికి కొత్తగా ఏమైనా సడన్ సర్‌ప్రైజ్ ఇస్తాయేమో చూడాలి?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (అక్టోబర్ 14-20వ తేదీ వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • మైటీ మాన్‌స్టర్ వీలిస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14

  • రేచల్ బ్లూమ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 15

  • స్వీట్ బాబీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 16

  • గుండమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17

  • జూరాసిక్ వరల్డ్ కేవోస్ థియరీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17

  • ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18

  • ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్‌ఓస్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 18

  • ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18

అమెజాన్ ప్రైమ్

  • ద ప్రదీప్స్ ఆఫ్ పిట్స్‌బరో (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17

  • కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబర్ 18

  • కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) - అక్టోబర్ 18

  • లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ) - అక్టోబర్ 18

  • స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18

  • ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18

  • ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18

  • ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) - అక్టోబర్ 18

హాట్‌స్టార్

  • రీతా సన్యల్ (హిందీ సిరీస్) - అక్టోబర్ 14

  • 1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18

  • రైవల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18

  • రోడ్ డైరీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18

జియో సినిమా

  • క్రిస్పీ రిస్తే (హిందీ మూవీ) - అక్టోబర్ 18

  • హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 19

  • హిస్టీరియా (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 19

ఆపిల్ ప్లస్ టీవీ

  • స్రింకింగ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 16

బుక్ మై షో

  • బీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 8: కిర్రాక్‌ సీత పారితోషికం ఎంతంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement