బిగ్‌బాస్‌ 8: కిర్రాక్‌ సీత పారితోషికం ఎంతంటే? | Bigg Boss Telugu 8: Kirrak Seetha Remuneration For Six Weeks In BB8 House, Deets Inside | Sakshi
Sakshi News home page

Kirrak Seetha Remuneration: ఆరువారాలకు సీత ఎంత సంపాదించిందంటే?

Oct 13 2024 10:09 PM | Updated on Oct 14 2024 11:56 AM

Bigg Boss Telugu 8: Kirrak Seetha Remuneration for Six Weeks

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో కిర్రాక్‌ సీత ఎలిమినేట్‌ అయింది. పోయిన వారం నైనిక, ఈ వారం సీత బిగ్‌బాస్‌ ఇంటిని వీడి వెళ్లిపోయారు. చూస్తుంటే పవర్‌ ఆఫ్‌ గర్ల్స్‌ గ్యాంగ్‌లో ఒక్కొక్కరూ వరుసగా ఎలిమినేట్‌ అవుతున్నట్లున్నారు. ఈ గ్యాంగ్‌లో ఉన్నదే ముగ్గురు. సీత, నైనిక, విష్ణు.. ఇప్పటికే ఇద్దరు వెళ్లిపోయారు. 

విష్ణు కంటే నయం
గేమ్‌ను సీరియస్‌గా తీసుకోకుండా చిల్‌ అవుతున్న విష్ణును వచ్చేవారం పంపించాలని పలువురూ అభిప్రాయపడుతున్నారు. నిజానికి విష్ణు కన్నా సీతకు ఇంట్లో ఉండేందుకు ఎక్కువ అర్హత ఉంది. కానీ ఫ్యాన్‌ బేస్‌లో వెనకబడి ఉండటంతో తనకు ఓట్లు తక్కువగా వచ్చాయి. పైగా తనకు పీఆర్‌ టీమ్‌ కూడా లేనట్లుంది.

నెగెటివిటీ..
దీంతో ప్రచారంలోనూ ఓ అడుగు వెనకే ఉంది. వీటికి తోడు తన ప్రవర్తన కూడా ఆమెపై నెగెటివిటీ పెంచింది. కసిగా ఆడినప్పటికీ తను వేసిన తప్పటడుగులు ఎగ్జిట్‌ గేట్‌కు దారి చూపాయి. ఈమె రెమ్యునరేషన్‌ విషయానికి వస్తే వారానికి రూ.2 లక్షలు వెనకేసిందట.. ఈ లెక్కన ఆరువారాలకుగానూ దాదాపు రూ.12 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement