Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత | Bigg Boss 8 Telugu Eliminated Contestant Buzz Interview: Kirrak Seetha Comments On Housemates, Watch Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Kirrak Seetha: కిరాక్ సీత ఎలిమినేషన్‌కి అదే కారణమా?

Published Mon, Oct 14 2024 7:39 AM | Last Updated on Mon, Oct 14 2024 9:45 AM

Bigg Boss 8 Telugu Buzz Interview Kirrak Seetha

బిగ్‌బాస్ 8 హౌస్ నుంచి ఆరో వారం కిరాక్ సీత ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. తన తమ్ముడు నబీల్ విజేతగా నిలవాలని కోరింది. అలానే స్టేజీపై బోలెడన్ని విశేషాలు పంచుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఎలిమినేషన్ తర్వాత జరిగే బజ్ ఇంటర్వ్యూలోనూ అర్జున్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. మంచితనమే కొంపముంచిందా అనే దానికి కూడా క్లారిటీ ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: సీత ఎలిమినేట్‌.. 'అతడు గెలిస్తే చూడాలనుంది')

బిగ్ బాస్ అనేది లైఫ్ టైమ్ అవకాశం, మీరు దాన్ని సరిగా ఉపయోగించానని అనుకున్నారా? అని అడగ్గా.. 100 శాతం అయితే నేను ఇచ్చానని సీత చెప్పింది. హౌసులో మీ పతనం ఎప్పుడు మొదలైందో గమనించారా? అని అడగ్గా.. టాస్క్ వచ్చినప్పుడు వేరే వాళ్లని పంపినప్పుడు డౌన్ అయ్యానని నేను అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

ఏడవటం స్ట్రాంగా? అని అడగ్గా.. మరి అరవడం స్ట్రాంగా? అని అర్జున్‌కే కౌంటర్ వేసింది. ఎలిమినేట్ అయిన తర్వాత మంచితనమే కొంపముంచిందా అని మీకు అనిపించలేదా? అని అడగ్గా.. కొంప మునగదు కదా అని క్యారెక్టర్ మార్చుకోలేను కదా అని సీత ఆన్సర్ ఇచ్చింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 8: కిర్రాక్‌ సీత పారితోషికం ఎంతంటే?)

ఇక హౌసులో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. టేస్టీ తేజ చిరాకులా అనిపించాడని, వారం అయినా సరే పెద్దగా ఫెర్ఫార్మ్ చేసినట్లు, కాన్ఫిడెన్స్ పెద్దగా కనిపించలేదని సీత చెప్పింది. గౌతమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని అనిపించిందని చెప్పింది. గేమ్ పరంగా చూస్తే నిఖిల్ ట్రాన్స్‌పరెన్సీతో లేడని అంది.

మీ అమ్మ ఓ లెటర్ పంపించారు కదా అందులో ఏముంది? అని అర్జున్ అడిగేసరికి.. సీత ఎమోషనల్ అయిపోయింది. ఏం జరిగిందో పక్కనబెడితే, నాకు దాని గురించి ఆలోచించాలని లేదు. ఎందుకంటే నేను నాలానే ఉన్నాను, సంతోషంగా బయటకొచ్చాను. మా అమ్మని హౌసులో చూడాలనుకున్న ఒక్కటే కల. అది తీరలేదు అని సీత ఏడ్చేసింది. ఏడుస్తూ, హౌసులో కాస్త మెతకగా ఉండటమే సీత ఎలిమినేషన్‌కి కారణం అయ్యుండొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: Bigg Boss 8: తేజ చేతిలో సీత బలి.. ఈ వేట ఆగదా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement