సీత ఎలిమినేట్‌.. 'అతడు గెలిస్తే చూడాలనుంది' | Bigg Boss 8 Telugu October 13th Full Episode Review And Highlights: Dasara Special And Kirrak Seetha Elimination | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Day 42 Highlights: ఆ ముగ్గురికీ మనసిచ్చిన సీత.. ఈమె కోసం పెద్ద మాటిచ్చిన మెహబూబ్‌

Published Sun, Oct 13 2024 7:11 PM | Last Updated on Mon, Oct 14 2024 12:13 PM

Bigg Boss Telugu 8: Dasara Special Episode Live Updates

దసరా సందర్భంగా బిగ్‌బాస్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ ప్లాన్‌ చేశారు. హీరోయిన్ల డ్యాన్స్‌, గెస్టుల రాక, టీమ్స్‌ మధ్య పోటీతో నేటి ఎపిసోడ్‌ వినోదాత్మకంగా సాగింది. పండగ సందర్భంగా నాగ్‌ పంచెకట్టుకుని సాంప్రదాయంగా ముస్తాబయ్యాడు. అటు హౌస్‌మేట్స్‌ కూడా అంతే కలర్‌ ఫుల్‌గా రెడీ అయ్యారు. మరి ఈ దసరా ఎపిసోడ్‌ ఎలా సాగిందో లైవ్‌ అప్‌డేట్స్‌లో చూసేయండి..

అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌ కావాలి!
నాగార్జున మొదటగా యష్మిని సేవ్‌ చేశాడు. ఆ వెంటనే ఓ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. ఇన్ఫినిటీ రూమ్‌కు వెళ్లి బిగ్‌బాస్‌ను ఏదైనా కోరిక కోరవచ్చని ఆఫర్‌ ఇచ్చాడు. కానీ ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు. ఓజీ టీమ్‌లో ఒకరికే ఈ ఛాన్స్‌ ఉంటుందన్నాడు. ఈ బంపర్‌ ఆఫర్‌ ఎవరికివ్వాలని అడిగినప్పుడు రాయల్‌ టీమ్‌లోని మెజారిటీ సభ్యులు నబీల్‌ పేరు సూచించారు. దీంతో అతడు ఇన్ఫినిటీ రూమ్‌కు వెళ్లి.. ప్రతివారం మార్కెట్‌కు వెళ్లే బాధ లేకుండా అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌ కావాలన్నాడు. దీనికి బిగ్‌బాస్‌ ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఎలాంటి కండీషన్స్‌ పెడతాడనేది సస్పెన్స్‌లోనే ఉంచారు

ఫస్ట్‌ టాస్క్‌లో ఓజీ టీమ్‌ గెలుపు
తర్వాత లడ్డు తయారుచేసి మరీ స్పూన్‌తో తినిపించాలంటూ మొదటగా ఫన్‌ టాస్క్‌ ఇవ్వగా ఇందులో ఓజీ టీమ్‌ గెలిచింది. అనంతరం అమృత అయ్యర్‌ దాండియా పాటతో స్టేజీ దద్దరిల్లేలా చేసింది.  ఇక నాగ్‌.. విష్ణుప్రియను సేవ్‌ చేశాడు. పకడో.. పకడో అనే రెండో గేమ్‌లో రాయల్‌ టీమ​ గెలుపొందింది. 

బతుకమ్మ
సింగర్‌ మంగ్లీ మాస్‌, లవ్‌, భక్తి పాటలు పాడుతూ అదరగొట్టేసింది. హౌస్‌లోకి వెళ్లి రెండు టీమ్స్‌తో బతుకమ్మ తయారు చేయించింది. గంగవ్వ అందంగా బతుకమ్మ పేర్చడంతో ఈ మూడో టాస్క్‌లో రాయల్‌ టీమ్‌ గెలిచింది. అనంతరం విశ్వం డైరెక్టర్‌ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్‌ స్టేజీపైకి వచ్చి కాసేపు కబుర్లాడారు. విశ్వం సినిమా ట్రైలర్‌ కూడా ప్లే చేశారు.

ఫరియా డ్యాన్స్‌
దసరా దోస్తీ పేరిట హౌస్‌మేట్స్‌తో నాలుగో గేమ్‌ ఆడించారు. ఇందులో రాయల్‌ టీమ్‌ గెలిచింది. తర్వాత డింపుల్‌ హయాతి డ్యాన్స్‌తో అలరించగా అటు గంగవ్వ సేవ్‌ అయినట్లు ప్రకటించారు. మాట-పాట-టాటా అని హౌస్‌మేట్స్‌తో ఐదో గేమ్‌ ఆడించారు. ఇందులోనూ రాయల్‌ టీమే గెలిచింది. అనంతరం ఫరియా అబ్దుల్లా ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌తో ఓ ఊపు ఊపేసింది.

రాయల్‌ టీమ్‌కు బంపర్‌ ఆఫర్‌
నాగ్‌ హౌస్‌మేట్స్‌తో ఆర్మ్‌ రెజ్లింగ్‌ అని ఆరో గేమ్‌ ఆడించారు. ప్రేరణ.. హరితేజను, విష్ణుప్రియ.. రోహిణిని ఓడించింది. మెహబూబ్‌.. నిఖిల్‌ను, గౌతమ్‌.. పృథ్వీని ఓడించారు. ఈ గేమ్‌లో ఓజీ టీమ్‌ గెలిచింది. అయితే మెజారిటీ టాస్కులు గెలుపొందిన రాయల్‌ టీమ్‌ ఓవరాల్‌ విజేతగా నిలిచింది. దీంతో ఈవారం మెగా చీఫ్‌ అయ్యేందుకు రాయల్‌ టీమ్‌కు మాత్రమే అవకాశం ఉంటుందన్నాడు. రాయల్‌ టీమ్‌లోని వారే మెగా చీఫ్‌ కంటెండర్స్‌ అవుతారని నాగ్‌ తెలిపాడు.

ముగ్గురికీ హార్ట్‌ ఇచ్చిన సీత
చివర్లో నామినేషన్స్‌లో మిగిలినవారిలో మెహబూబ్‌ను సేవ్‌ చేసి సీతను ఎలిమినేట్‌ చేశారు. దీంతో విష్ణు ఎమోషనలైంది. నీకు నీ తల్లిని మర్చిపోయేంత మంచి పార్ట్‌నర్‌ దొరకాలని ఆశీస్సులు ఇచ్చింది. ఎలాంటి ముసుగు లేకుండా ఉండే నబీల్‌ గెలవాలంది. అవినాష్‌ పాజిటివ్‌ ఎనర్జీని తీసుకొచ్చాడంది. అలా ఈ ముగ్గురికీ వైట్‌ హార్ట్‌ ఇచ్చింది.

సీత కోసం మాటిచ్చిన మెహబూబ్‌
తర్వాత నిఖిల్‌, గౌతమ్‌, నయనికి బ్లాక్‌ హార్ట్‌ ఇచ్చింది. నిఖిల్‌.. హజ్బెండ్‌ మెటీరియల్‌ అని చెప్పింది. గౌతమ్‌.. చిన్నచిన్నవాటికే హర్ట్‌ అవొద్దని సూచించింది. నయనికి.. వచ్చినప్పుడు నన్ను క్రై బేబీ అన్నావ్‌.. కానీ నాకన్నా ఎక్కువ ఏడుస్తున్నావ్‌.. ఈసారి చాలారోజులు ఉండమంటూ బాగా ఆడమని సూచించింది. చివర్లో మెహబూబ్‌ లేచి.. సీత తన తండ్రికివ్వాలనుకున్న బైక్‌ను తాను గిఫ్ట్‌గా ఇస్తానని మాటిచ్చాడు.

 

 

 

 

 

మరిన్ని బిగ్‌బాస​ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement