Singer Mangli
-
వాహ్... ఉస్తాద్‌లు
ఇటీవల ఢిల్లీలో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువపురస్కారం అందుకున్న తెలుగు మహిళలు.ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్... ప్రఖ్యాత సంగీత విద్వాంసులు. నాదం ఆయన షెహనాయ్లో ప్రణవనాదంగా భాసిల్లింది. ఆయన ఉఛ్వాస నిశ్వాసలు నాదంతోనే... నాదస్వరంతోనే. ఆ నాదం స్మృతిగా మిగలరాదు... శ్రుతిగా కొనసాగాలి. కళాసాధనకు అంకితమైన కళాకారులే ఆయన వారసులు. బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న మన మహిళలు వీళ్లు.సరిగమల సాగరంలో నేనో బిందువునిఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయ్ వాద్యం అంటే నాకెంతో ఇష్టం. ఇప్పటికి వందల సార్లు కాదు వేలసార్లు విని ఉంటాను. రాత్రి నిద్రపోయే ముందు కూడా బిస్మిల్లా ఖాన్ సంగీత కార్యక్రమం వింటూ నిద్రపోతాను. మహా సముద్రం అంతటి సంగీతప్రపంచంలో ఆయన ఒక సముద్రం అయితే నేను ఒక నీటిబిందువుని. ఇలాంటి గొప్పవారు నాలాంటి ఎందరో సింగర్స్‌కు స్ఫూర్తినిస్తుంటారు. సంగీతమే శ్వాసగా జీవించిన బిస్మిల్లా ఖార్ పేరు మీద పురస్కారం అందుకోవడం అంటే సంతోషశిఖరాన్ని అధిరోహించినట్లే భావిస్తున్నాను. నాకు ఈ ఏడాది ఎన్నో మధురానుభూతులనిచ్చింది. కన్నడ పాటకు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్‌గా సైమా అవార్డు, కర్నాటక ‘విశ్వమన్య’ పురస్కారం, తెలుగులో బలగం సినిమా పాటకు ఐఫా అవార్డు అందుకున్నాను. ఇంకా గొప్ప సంతృప్తి ఏమిటంటే... నేపథ్యగాయని పద్మభూషణ్ ఉషాఉతుప్, పద్మభూషణ్ సుధా రఘునాధన్ వంటి మహోన్నత గాయనీమణులతో కలిసి వేదిక పంచుకోవడం. బాలికల సంరక్షణ కోసం స్వచ్ఛందంగా నిర్వహించిన సంగీతకార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కలిగిన అనుభూతి చాలా గొప్పది. ఇప్పుడు ఈ జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం ఊహించనిది. ఈ ఏడాది నాకు ప్రత్యేకం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. – సత్యవతి ముదావత్ (మంగ్లీ), సినీ నేపథ్య గాయనిలక్ష్యం మారిందిచిత్తూరులో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన రెడ్డి లక్ష్మి ఐఏఎస్ లక్ష్యంతో గ్రాడ్యుయేషన్‌కి ఢిల్లీకి వెళ్లారు. ఆమె మీద కళా తపస్వి విశ్వనాథ్ సినిమాల ప్రభావం కూడా ఎక్కువే. డిగ్రీ చదువుతూ కూచిపూడి నాట్యంలో శిక్షణ మొదలుపెట్టారు. ఆ ఆసక్తి ఆమెను ఏకంగా ఢిల్లీలో డాన్స్ ఆకాడమీ స్థాపించేవరకు తీసుకెళ్లింది. కళ కోసం జీవితాన్ని అంకితం చేసిన వారికి ఇలాంటి పురస్కారాలు భుజం తట్టి ఇచ్చే ప్రోత్సాహం వంటివన్నారు లక్ష్మి. పన్నెండేళ్లుగా ఢిల్లీలో ‘నృత్యవాహిని – అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ను నిర్వహిస్తున్నారామె. ఢిల్లీ వంటి నగరంలో నాట్యప్రదర్శన పట్ల ఆసక్తితో సుశిక్షితులై సాధన చేసినప్పటికీ చాలా మందికి ప్రదర్శనకు సరైన అవకాశం దొరకదు. అలాంటి వారికి నాట్య ప్రదర్శనకు అనువైన ఈవెంట్స్ ద్వారా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు లక్ష్మి. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులు తీసుకోవడం వల్ల ఆమె సేవ ఎల్లలు దాటింది. ఆన్లైన్లో వివిధ దేశాల నుంచి విదేశీయులతోపాటు ఎన్నారైలు కూడా ఆమె దగ్గర నాట్యంలో మెళకువలు నేర్చుకున్నారు. ఢిల్లీలో రెగ్యులర్‌గా నిర్వహించే క్లాసుల్లో తెలుగు వాళ్లతోపాటు వివిధ భాషల వాళ్లున్నారు. బిస్మిల్లా ఖాన్ యువపురస్కారం అందుకున్న సందర్భంగా ఆమె తన గురువు గారి మార్గదర్శనాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఈ రోజు ఈ పురస్కారం అందుకున్నానంటే మా గురువుగారు పద్మశ్రీ గురు జయరామారావుగారి సూచనను పాటించడం వల్లనే. ఆయన పిఠాపురంలో పుట్టారు. కూచిపూడికి వెళ్లి నాట్యం నేర్చుకున్నారు. కాకతాళీయంగా ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో డాన్స్ అకాడమీ అవసరం చాలా ఉంది. మన కళారీతులను విశ్వవ్యాప్తం చేయడానికి నీ వంతు ప్రయత్నం చెయ్యి... అని నాకొక డైరెక్షన్ ఇచ్చారు. వారి సహకారంతోనే ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్లో డాన్స్ టీచర్‌గా ఉద్యోగం చేశాను. ఎనిమిదేళ్లపాటు ఢిల్లీలోని ఓ ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేసినప్పటికీ నాట్యం కోసం పని చేస్తున్నప్పుడు కలిగిన సంతోషం ఉండేది కాదు. నాట్యంలో నా కళాతృష్ణను తీర్చుకోవడానికే పూర్తి సమయం కేటాయించాలనుకున్నాను. ఆ తర్వాత భరతనాట్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఇప్పుడు కూచిపూడి నాట్యంలో పీజీ చేస్తున్నాను. ఇతర నాట్యరీతుల్లోనూ ప్రవేశాన్ని సాధించాను. నాట్యంలో పీహెచ్డీ చేయడం నా ప్రస్తుత లక్ష్యం’’ అన్నారు రెడ్డి లక్ష్మి.నా పాట నాకు నచ్చాలి!‘‘ఇది నా తొలి జాతీయ పురస్కారం. తప్పకుండా నా జీవితంలో మధురమైన ఘట్టమే. చెన్నైలో నా గానం విన్న ప్రముఖులు గోల్డెన్ వాయిస్ అని ప్రశంసించినప్పుడు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకోవడం కూడా...’’ అన్నారు కర్ణాటక సంగీతకారిణి శ్వేతాప్రసాద్. ‘‘మా ఇల్లు ఒక సంగీతం విశ్వవిద్యాలయం వంటిది. నానమ్మ గాయని, తాతయ్య (రక్తకన్నీరు నాగభూషణం) రంగస్థల ప్రదర్శనల్లో నానమ్మ పాల్గొనేది. అమ్మ వీణలో సిద్ధహస్తురాలు. మరో తాతయ్య (అమ్మ వాళ్ల నాన్న) మోహన్‌రావు. ఆయన హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభ స్థాపించడం, నిర్వహించడంలో కీలకంగా పనిచేశారు. అలాంటి ఇంట్లో పుట్టడం ఒక వరం. మూడేళ్ల వయసు నుంచి సరిగమలు కూడా నాతోపాటు పెరిగాయి. శోభానాయుడు, అలేఖ్య పుంజల వంటి ప్రముఖ నాట్యకారుల కార్యక్రమాలకు గానమిచ్చాను. నాకు సంగీతమే జీవితం. మరొకటి తెలియదు. నా భర్త నట్టువాంగం కళాకారులు. మేమిద్దరం ముప్పైకి పైగా దేశాల్లో ప్రదర్శనలిచ్చాం. మా తాతగారిలాగే ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఉండడమే నా విజయరహస్యం. రక్తకన్నీరు స్ఫూర్తితో... నాగభూషణం తాతయ్య రక్తకన్నీరు నాటకాన్ని ఎనిమిది వేల సార్లు ప్రదర్శించారు. ప్రతి ప్రదర్శన దేనికది భిన్నంగా ఉండేలా చూసుకునేవారు. నిన్నటి కంటే నేడు మరికొంత భిన్నంగా, రేపు మరింత వైవిధ్యంగా ఉండేలా చూసేవారు. అలాగే ఒక ప్రదర్శనకంటే మరో ప్రదర్శన ఇంకా మెరుగ్గా ఉండేటట్లు నాకు నేను మెరుగులు దిద్దుకుంటాను. గాయకులు కానీ చిత్రకారులు కానీ గురువు దగ్గర నేర్చుకున్న విద్య దగ్గరే ఆగిపోకూడదు. సాధన ద్వారా తనవంతుగా మరికొన్ని మెళకువలను అద్దగలగాలి. మన నైపుణ్యం మీద మనకు నమ్మకం ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా ఫలితం సంతోషకరంగా ఉంటుంది. నా మట్టుకు నేను ‘నన్ను నేను మెప్పించుకోవాలి’ అనే కొలమానం పెట్టుకుని పాడుతాను. నా పాట నాకే నచ్చకపోతే మరొకరికి ఎలా నచ్చుతుంది? అనేదే నా ప్రశ్న. నా లక్ష్యం భవనాలు, కోట్ల రూపాయలు సంపాదించడం కాదు. సంగీతం నా ప్యాషన్. శుద్ధ సంగీతాన్ని పాడుతాను. సంగీతంతోనే జీవిస్తాను’’ అంటూ సంగీతం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు శ్వేతాప్రసాద్.– వాకా మంజులా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిది -
సీత ఎలిమినేట్.. 'అతడు గెలిస్తే చూడాలనుంది'
దసరా సందర్భంగా బిగ్‌బాస్ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. హీరోయిన్ల డ్యాన్స్, గెస్టుల రాక, టీమ్స్ మధ్య పోటీతో నేటి ఎపిసోడ్ వినోదాత్మకంగా సాగింది. పండగ సందర్భంగా నాగ్ పంచెకట్టుకుని సాంప్రదాయంగా ముస్తాబయ్యాడు. అటు హౌస్మేట్స్ కూడా అంతే కలర్ ఫుల్‌గా రెడీ అయ్యారు. మరి ఈ దసరా ఎపిసోడ్ ఎలా సాగిందో లైవ్ అప్డేట్స్లో చూసేయండి..అన్లిమిటెడ్ ఫుడ్ కావాలి!నాగార్జున మొదటగా యష్మిని సేవ్ చేశాడు. ఆ వెంటనే ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. ఇన్ఫినిటీ రూమ్‌కు వెళ్లి బిగ్‌బాస్‌ను ఏదైనా కోరిక కోరవచ్చని ఆఫర్ ఇచ్చాడు. కానీ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఓజీ టీమ్‌లో ఒకరికే ఈ ఛాన్స్ ఉంటుందన్నాడు. ఈ బంపర్ ఆఫర్ ఎవరికివ్వాలని అడిగినప్పుడు రాయల్ టీమ్‌లోని మెజారిటీ సభ్యులు నబీల్ పేరు సూచించారు. దీంతో అతడు ఇన్ఫినిటీ రూమ్‌కు వెళ్లి.. ప్రతివారం మార్కెట్‌కు వెళ్లే బాధ లేకుండా అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్నాడు. దీనికి బిగ్‌బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఎలాంటి కండీషన్స్ పెడతాడనేది సస్పెన్స్‌లోనే ఉంచారుఫస్ట్ టాస్క్‌లో ఓజీ టీమ్ గెలుపుతర్వాత లడ్డు తయారుచేసి మరీ స్పూన్‌తో తినిపించాలంటూ మొదటగా ఫన్ టాస్క్ ఇవ్వగా ఇందులో ఓజీ టీమ్ గెలిచింది. అనంతరం అమృత అయ్యర్ దాండియా పాటతో స్టేజీ దద్దరిల్లేలా చేసింది. ఇక నాగ్.. విష్ణుప్రియను సేవ్ చేశాడు. పకడో.. పకడో అనే రెండో గేమ్‌లో రాయల్ టీమ గెలుపొందింది. బతుకమ్మసింగర్ మంగ్లీ మాస్, లవ్, భక్తి పాటలు పాడుతూ అదరగొట్టేసింది. హౌస్‌లోకి వెళ్లి రెండు టీమ్స్‌తో బతుకమ్మ తయారు చేయించింది. గంగవ్వ అందంగా బతుకమ్మ పేర్చడంతో ఈ మూడో టాస్క్‌లో రాయల్ టీమ్ గెలిచింది. అనంతరం విశ్వం డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ స్టేజీపైకి వచ్చి కాసేపు కబుర్లాడారు. విశ్వం సినిమా ట్రైలర్ కూడా ప్లే చేశారు.ఫరియా డ్యాన్స్దసరా దోస్తీ పేరిట హౌస్‌మేట్స్‌తో నాలుగో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ గెలిచింది. తర్వాత డింపుల్ హయాతి డ్యాన్స్‌తో అలరించగా అటు గంగవ్వ సేవ్ అయినట్లు ప్రకటించారు. మాట-పాట-టాటా అని హౌస్‌మేట్స్‌తో ఐదో గేమ్ ఆడించారు. ఇందులోనూ రాయల్ టీమే గెలిచింది. అనంతరం ఫరియా అబ్దుల్లా ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఓ ఊపు ఊపేసింది.రాయల్ టీమ్‌కు బంపర్ ఆఫర్నాగ్ హౌస్‌మేట్స్‌తో ఆర్మ్ రెజ్లింగ్ అని ఆరో గేమ్ ఆడించారు. ప్రేరణ.. హరితేజను, విష్ణుప్రియ.. రోహిణిని ఓడించింది. మెహబూబ్.. నిఖిల్‌ను, గౌతమ్.. పృథ్వీని ఓడించారు. ఈ గేమ్‌లో ఓజీ టీమ్ గెలిచింది. అయితే మెజారిటీ టాస్కులు గెలుపొందిన రాయల్ టీమ్ ఓవరాల్ విజేతగా నిలిచింది. దీంతో ఈవారం మెగా చీఫ్ అయ్యేందుకు రాయల్ టీమ్‌కు మాత్రమే అవకాశం ఉంటుందన్నాడు. రాయల్ టీమ్‌లోని వారే మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారని నాగ్ తెలిపాడు.ముగ్గురికీ హార్ట్ ఇచ్చిన సీతచివర్లో నామినేషన్స్‌లో మిగిలినవారిలో మెహబూబ్‌ను సేవ్ చేసి సీతను ఎలిమినేట్ చేశారు. దీంతో విష్ణు ఎమోషనలైంది. నీకు నీ తల్లిని మర్చిపోయేంత మంచి పార్ట్నర్ దొరకాలని ఆశీస్సులు ఇచ్చింది. ఎలాంటి ముసుగు లేకుండా ఉండే నబీల్ గెలవాలంది. అవినాష్ పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చాడంది. అలా ఈ ముగ్గురికీ వైట్ హార్ట్ ఇచ్చింది.సీత కోసం మాటిచ్చిన మెహబూబ్తర్వాత నిఖిల్, గౌతమ్, నయనికి బ్లాక్ హార్ట్ ఇచ్చింది. నిఖిల్.. హజ్బెండ్ మెటీరియల్ అని చెప్పింది. గౌతమ్.. చిన్నచిన్నవాటికే హర్ట్ అవొద్దని సూచించింది. నయనికి.. వచ్చినప్పుడు నన్ను క్రై బేబీ అన్నావ్.. కానీ నాకన్నా ఎక్కువ ఏడుస్తున్నావ్.. ఈసారి చాలారోజులు ఉండమంటూ బాగా ఆడమని సూచించింది. చివర్లో మెహబూబ్ లేచి.. సీత తన తండ్రికివ్వాలనుకున్న బైక్‌ను తాను గిఫ్ట్‌గా ఇస్తానని మాటిచ్చాడు. మరిన్ని బిగ్‌బాస వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Singer Mangli: పాట పల్లకీ ఎక్కి
‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ బతుకమ్మను కీర్తిస్తూ మంగ్లీ పాడారు. ఆ పాటతో ప్రపంచవ్యాప్తంగా ఆమె కీర్తి సాధించారు. బతుకమ్మ సంబరాల్లో ఈ పాట వినిపించకుండా ఉండదు. బతుకమ్మ అంటే ‘తంగేడు’ పువ్వు ప్రత్యేకం. బతుకమ్మ పాటల్లో మంగ్లీ పాడిన పాటలు ప్రత్యేకం. నవరాత్రి సందర్భంగా తాను పాడిన తొలి బతుకమ్మ పాట గురించి, ఇతర విశేషాలను గాయని మంగ్లీ ‘సాక్షి’తో ఈ విధంగా పంచుకున్నారు. ‘‘బతుకమ్మ పండగ అంటే మంగ్లీ పాటలు ఉండాల్సిందే అన్నట్లుగా నన్ను అభిమానిస్తున్నారు. ఇది నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా... ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగువాళ్లు ఉన్నారో అక్కడ బతుకమ్మ పండగ అంటే నా పాట వినపడుతోంది. ‘ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి దూసి తెచ్చి... తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి... పచ్చి తంగెడుతో గుమ్మాడీ పూలు చేర్చి... బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి...’ అంటూ నేను పాడిన బతుకమ్మ పాటలో ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అని కూడా ఉంటుంది. అలా నా ఈ ఫస్ట్ పాట నన్ను శ్రోతలకు ఎంత దగ్గర చేసిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ పాట పాడమని అడుగుతుంటారు. నా లైఫ్‌లో బతుకమ్మ అంటేనే చాలా ప్రత్యేకం. నా కెరీర్లోనే ప్రాథమిక గీతంగా మారిపోయింది ‘బతుకమ్మ’. విదేశాల్లో బతుకమ్మ ఆడాను నేను విదేశాల్లోని తెలుగువారితో కలిసి బతుకమ్మ పండగ చేసుకున్నాను. బతుకమ్మ ఆడాను... పాడాను... వాళ్లతోనూ ఆడించాను. మంగ్లీ పాట ఎప్పుడు వస్తుందంటూ వాళ్లు ఎదురు చూడటం నాకో మంచి అనుభూతి. నా తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గొప్పగా ఓన్ చేసుకున్నారు. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను.రెండూ ప్రకృతి పండగలే... మేం తీజ్ పండగ చేసుకుంటాం. బతుకమ్మ పండగ కూడా అలానే. తీజ్ పండగకు మేం మొలకలను పూజిస్తాం. బతుకమ్మను పూలతో పూజిస్తాం. మొలకలు, పువ్వులు... రెండూ చెట్ల నుంచే వస్తాయి కాబట్టి రెండూ ప్రకృతి పండగలే. అందుకే బతుకమ్మ పాట పాడే తొలి అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ మిట్టపల్లి సురేందర్ అన్న అద్భుతంగా రాయడం, నేను పాడటం, బొబ్బిలి సురేష్ మ్యూజిక్ చేయడం అన్నీ బాగా కుదిరాయి. పాటలు అందరూ బాగా పాడతారు... బాగా రాస్తారు... బాగా మ్యూజిక్ చేస్తారు. కానీ ఆ పాటను ఎంత బాగా చూపించామన్నది చాలా ముఖ్యం. దామోదర్ రెడ్డి తన డైరెక్షన్‌తో ఈ పాటను బాగా చూపించాడు. అన్నీ బాగా కుదరడంతో ఈ పాట జనాల్లోకి వెళ్లింది.ప్రతి ఇల్లూ ఆమెకు నిలయమే నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. దేవుడు లేనిదే మనం లేము. ప్రతి ఒక్క దేవుడికి గుడి ఉంటుంది కానీ బతుకమ్మకు మాత్రం గుడి ఉండదు. మిట్టపల్లె సురేందర్ అన్న ‘పచ్చి పాల వెన్నెలా...’ పాటలో ఈ విషయాన్ని ఎంత గొప్పగా వర్ణించాడంటే... ఆ పాటలో ఆమెకి ఉన్నన్ని గుళ్లు ఏ దేవుడికీ ఉండవని రాశాడు. గుడి లేని ఆ దైవానికి ప్రతి ఒక్క ఇల్లూ నిలయమే. ప్రతి ఇంట్లో ఆమెను పూజిస్తారు కదా. ప్రతి ఇంట్లోనూ ఆమెను తయారు చేస్తారు. ఏ దేవతనూ తయారు చేసి పూజ చేయరు. కానీ గౌరమ్మను తయారు చేసి మరీ పూజిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇల్లూ ఆమెకు గుడే.సంబరాలన్నీ జనాలతోనే... నేను బతుకమ్మను తొలిసారి తయారు చేసింది 2013లో. ఒక చానెల్ కోసం చేశాను. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నాను. మా ఇంట్లో బతుకమ్మ పండగను జరుపుకుంటాం. అయితే తొమ్మిది రోజులు అమ్మవారి అలంకారం వంటివి చేసే వీలుండదు. నేనెక్కువగా బయటే జనాలతో పండగ చేసుకుంటా. నా బతుకమ్మ సంబరాలు మొత్తం జనాలతోనో అయిపోతాయి. ఇది కూడా అదృష్టమే.పూలనే దేవుడిలా పూజిస్తాం మనం ప్రతి దేవుణ్ణి పూలతో పూజిస్తాం. కానీ పూలనే దేవుడిలా పూజించి, కొబ్బరికాయ కొట్టి, అగరుబత్తులు వెలిగించడం అనేది బతుకమ్మకే జరుగుతుంది. ఈ పండగలో ఉన్న గొప్పతనం ఏంటంటే మగవాళ్లంతా ముందుండి తమ ఇంటి ఆడవాళ్లను దగ్గరుండి ఆడమని... పాడమని ప్రోత్సహిస్తుంటారు. తెలంగాణలో మహిళల్ని గౌరవించినంతగా ఇంకెక్కడా గౌరవించరు. అమ్మని అయినా బిడ్డల్ని అయినా ఎంతో గౌరవంగా చూస్తారు. ముందుండి నడిపిస్తారు. అంత గొప్ప కల్చర్ తెలంగాణాది. ఉన్నోళ్లు... లేనోళ్లు... మంచి చీరలు కట్టుకుని పండగ చేసుకుంటారు’’ అంటూ మా ఇంట్లో అమ్మకి, ఇంకా అందరికీ కొత్త బట్టలు కొంటాను. ఆనందంగా పండగ జరుపు కుంటాం అన్నారు మంగ్లీ.ఇది సందర్భం కాకపోయినా చెబుతున్నాను... నేను హనుమంతుణ్ణి బాగా పూజిస్తాను. ఆయన గుడి కట్టించాను. నేను కట్టించాలనుకున్నాను.... ఆయన కట్టించుకున్నాడు. గుడి లేకుండా నేను ఆయన్ను చూడలేకపోయాను. నా సంకల్పం నెరవేర్చు తండ్రీ అనుకున్నాను... నెరవేర్చాడు. నేను చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో కట్టించాను. ఆయన ఆజ్ఞ లేనిదే అది జరుగుతుందా? ఇది అద్భుతమైన అవకాశమే కదా. – డి.జి. భవాని -
సింగర్ మంగ్లీ డిఫరెంట్ లుక్.. హాయిగా నవ్వుతూ (ఫొటోలు)
-
సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం
సింగర్ మంగ్లీ.. ఈ పేరు తెలియని సంగీతప్రియులుండరంటే అతిశయోక్తి కాదు. అంతలా జనాల్లోకి చొచ్చుకుపోయిందీ సింగర్. జానపద పాటలతో గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ పండగకు తగ్గట్లుగా పాటలు రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అటు సినిమా పాటలతోనూ తన సత్తా చాటుతోంది. ఇటీవలే స్వధా ఫౌండేషన్ నిర్వహించిన ‘మార్గా 2024’ ఈవెంట్లో ఉషా ఉతుప్, సుధా రఘునాథన్ లాంటి గాయకులతో కలిసి మంగ్లీ వేదిక పంచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గానూ సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ యువ పురస్కారానికి మంగ్లీ ఎంపికైంది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మున్ముందు మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. చదవండి: ఆ రోజు జుట్టు ఊడిపోయి, మంచం మీద లేవలేని స్థితిలో.. ఏడ్చేసిన కుమారుడు -
కారు ప్రమాదం.. ఆ రూమర్స్ గురించి నమ్మొద్దు: సింగర్ మంగ్లీ
టాలీవుడ్లో సెన్సేషనల్ సింగర్ మంగ్లీ.. రోడ్డు ప్రమాదానికి గురి కావడం జరిగిందని వార్తలు వచ్చాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్-బెంగళూర్ దారిలో ప్రయాణిస్తుండగా ఆమె కారుని ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టిందని. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. ఈ ఘటనలో మంగ్లీకి చిన్న గాయాలైనప్పటికీ ఆమె సురక్షితంగా బయటపడ్డారని పలు కథనాలు వైరల్ అయ్యాయి. ఈ సంఘటన గురించి మంగ్లీ రియాక్ట్ అయ్యారు. మంగ్లీ తన సోషల్ మీడియాలో.. 'నేను క్షేమంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇది రెండు రోజుల క్రితం అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం. దయచేసి ఈ సంఘటన గురించి వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దు. నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.' అని ఆమె పోస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో తాజాగా ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. దీనికి హాజరైన మంగ్లీ.. అర్థరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వస్తుండగా తొండుపల్లి బ్రిడ్జి దగ్గర కర్ణాటకు చెందిన డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి.. మంగ్లీ కారుని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే డీసీఎం వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
స్టార్ సింగర్ మంగ్లీ కారుకి ప్రమాదం
సినిమా పాటలు, ఆల్బమ్ సాంగ్స్‌తో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ.. ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారుని ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మంగ్లీకి చిన్న గాయాలైనప్పటికీ సురక్షితంగా బయటపడింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో తాజాగా ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. దీనికి హాజరైన మంగ్లీ.. అర్థరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వస్తుండగా తొండుపల్లి బ్రిడ్జి దగ్గర కర్ణాటకు చెందిన డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి.. మంగ్లీ కారుని బలంగా గుద్దింది. అయితే ఈ ప్రమాదంలో మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మంగ్లీ ప్రయాణిస్తున్న కారు వెనక భాగం కాస్త దెబ్బతింది. అయితే డీసీఎం వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్) -
Singer Mangli Photos: సింగర్ మంగ్లీ గ్లామరస్ (ఫోటోలు)
-
పీపుల్స్ ప్లాజాలో జాతీయ సంస్కృతి మహోత్సవాలు–2024 (ఫొటోలు)
-
ఏపీ సీఎం జగన్ పై మంగ్లీ పాటకు పాఠశాల విద్యార్థులు డ్యాన్స్ చేశారు
-
Prabuthwa Junior Kalashala: మంగ్లీ మార్కుతో ‘డూడుం డుక్కుడుం’
కాలేజీ నేపథ్యంలో టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో చాలా వరకు సూపర్ హిట్లుగా నిలిచాయి. త్వరలోనే మరో కాలేజీ ప్రేమ కథ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ యదార్థ సంఘటన ఆధారంగా డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం తెరకెక్కించిన తాజా చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు టీజర్ రిలీజ్ చేయగా అన్ని మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మోస్ట్ హపెనింగ్ సింగర్ మంగ్లీ పాడిన డూడుం డుక్కుడుం సాంగ్ ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ చేతులమీదుగా రిలీజ్ చేశారు. కాలేజీ జంట మధ్య డూడుం డుక్కుడుం అంటూ సాగుతున్న ఈ సాంగ్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ పాటకు కార్తీక్ రోడ్రిగ్జ్ అందించిన బాణీలు అందించగా.. శ్రీ సాయి కిరణ్ అర్థవంతమైన లిరిక్స్ రాశాడు. మంగ్లీ అద్భుతంగా ఆలపించారు. -
మంగ్లీ నోటా ఆడ నెమలి పాట అదరహో..!
-
జగనన్న అంటే నాకు చాలా అభిమానం: సింగర్ మంగ్లీ
-
కాసర్ల శ్యామ్ జోర్దార్ పాటలు
-
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మంగ్లీ? స్పందించిన సింగర్!
ఈ మధ్య జానపద పాటలు సినిమాల్లో వాడటం ట్రెండ్ అయిపోయింది. అయితే ఎక్కడ జానపదం ఉంటే అక్కడ మంగ్లీ ఉండాల్సిందే! బతుకమ్మ, బోనాలు.. ఇలా పండగల పాటలే కాదు, జానపదాలు, సినిమా పాటలూ పాడుతూ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది సింగర్ మంగ్లీ. అయితే మంగ్లీ త్వరలో పెళ్లి చేసుకోనుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మరో రెండు నెలల్లో ఆమె పెళ్లి పీటలెక్కనుందని, స్వయానా తన బావతోనే మనువాడనుందని సదరు వార్త సారాంశం. ఇప్పటికే తను సైన్ చేసిన ప్రాజెక్టులను చకాచకా పూర్తి చేసి ఆ తర్వాత పెళ్లి పనుల్లో నిమగ్నం కానుందని జోరుగా ప్రచారం నడిచింది. తాజాగా ఈ రూమర్స్ విన్న మంగ్లీ ఘొల్లున నవ్వేసింది. ఏంటి? నాకు పెళ్లా? ఓరి భగవంతుడా.. నాక్కూడా తెలియకుండానే నాకు పెళ్లి చేసేస్తున్నారా? అని సదరు వార్తలు కేవలం పుకార్లేనని కొట్టిపారేసింది. సోషల్ మీడియా తన పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేసింది. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచనే లేదంటోంది. ఇంతకీ బావతో ఏడడుగులు వేస్తున్నానన్నారు. నాకు తెలియక అడుగుతున్నా.. నాకే తెలియని నా బావ ఎవరో చెప్తారా? ఈ పుకారు సృష్టించినవాళ్లైనా దీనికి సమాధానం చెప్పండయ్యా.. అంటూ సెటైర్లు వేసింది. చదవండి: హారర్ సిరీస్‌తో భయపెడతానంటున్న ఓంకార్ అన్నయ్య.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే? -
యాడున్నాడో.. పాటతో దుమ్మురేపిన సింగర్ మంగ్లీ..
అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా 'కొరమీను' ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్గా నటించిన చిత్రం 'తెప్ప సముద్రం'. రవి శంకర్ ప్రధాన పాత్రలో నటించగా సతీష్ రాపోలు దర్శకత్వం వహించాడు. శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి.ఆర్ మ్యూజిక్ అందించాడు. అయితే వినాయక చవితి సందర్భంగా సినీ ప్రేక్షకులను తన గాత్రంతో ఉర్రూతలూగిస్తోన్న సింగర్ మంగ్లీ పడిన మాస్ బీట్ పాట “యాడున్నాడో” ను ఎమ్ ఆర్ టి (MRT) ఆడియో ద్వారా విడుదల చేసారు. ఈ సందర్భంగా నిర్మాత రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ “తెప్ప సముద్రం” కథ బాగా నచ్చి ఖర్చుకు వెనకాడకుండా నిర్మించడం జరిగింది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. అయితే ఈరోజు సింగర్ మంగ్లీ పడిన మాస్ బీట్ పాట “యాడున్నాడో” ను ఎమ్ ఆర్ టి (MRT) ఆడియో ద్వారా విడుదల చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం" అని తెలిపారు. దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ “గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో పని చేసాను. తెప్ప సముద్రం కథ చాలా కొత్తగా ఉంటుంది. మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. షూటింగ్ అంత పూర్తి అయింది. వినాయక చవితి సందర్భంగా సింగర్ మంగ్లీ గారు పడిన యాడున్నాడో పాట ను విడుదల చేస్తున్నాం. పి.ఆర్ గారు అద్భుతమైన పాటలు అందించారు. సినిమా ని త్వరలోనే విడుదల చేస్తాము" అని తెలిపారు. -
షూటింగ్లో సింగర్ మంగ్లీకి గాయాలు!
టాలీవుడ్ స్టార్ సింగర్ మంగ్లీకి గాయాలు అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రతి సంవత్సరం బోనాలు జరుగుతున్న సందర్భంగా ఒక పాటను చిత్రీకరించి యూట్యూబ్‌లో మంగ్లీ విడుదల చేస్తుంది. అయితే ఆ పాటను షూట్ చేస్తున్న సమయంలో ఆమె కింద పడ్డారు. దీంతో ఆమె కాలికి స్వల్పంగా గాయమైనట్లు తెలుస్తోంది. వెంటనే యూనిట్ సభ్యులు స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలు కావడంతో మంగ్లీ త్వరగానే కోలుకుంటారని వైద్యులు తెలుపుతున్నారు. (ఇదీ చదవండి: నాడు విజయ్ దేవరకొండ పేరుతో వైరల్.. నేడు లగ్జరీ కారుతో హీరోయిన్ ఇలా) తెలంగాణ యాసలో పాటలు పాడుతూ.. బతుకమ్మ సాంగ్స్‌తో మంగ్లీ ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం.. అందులో ఆమె పాడిన పాటలన్నీ సూపర్ హిట్ కావడంతో మంగ్లీ ఇప్పుడు బిజీ సింగర్‌గా మారిపోయింది. -
ఆ పాటని మంగ్లీ చేత పాడించడానికి కారణం...
-
Antheema Theerpu: మంగ్లీ ‘టిప్ప.. టిప్ప’ సాంగ్ అదిరిందిగా..
సాయి ధన్సిక, విమలారామన్, గణేష్ వెంకట్రామన్, అమిత్ తివారీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘అంతిమ తీర్పు’. అభిరాం దర్శకత్వంలో సిద్ధి వినాయక డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘టిప్పా టిప్పా..టిప్ప.. టిప్పర్ లారీ నా ఒళ్లే.. రప్ప..రప్ప.. రప్ప వత్తే యాక్సిడేంటేలే’ అంటూ సాగే పాటను సాంగ్ ఇటీవల విడుదల చేశారు. కోటి సంగీతం అందించారు. (చదవండి: ఒకప్పటిలా కాదు.. హీరోయిన్స్ అంటే వాటికే పరిమితం కాదు) కాసర్ల శ్యామ్ రచించిన పాట ఇది. మంగ్లీ ఆలపించారు. అమిత్‌తివారీ, స్నేహా గుప్తా ఆ పాటలో ఆడాపాడారు. ఈశ్వర్ పెంటి ఈ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. మంగ్లీ హస్కీ వాయిస్‌తో పాడిన ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘చక్కని కథాంశంతో రూపొందిన చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. మంగ్లీ ఆలపించిన పాటకు మంచి స్పందల లభిస్తోంది. త్వరలోనే లో సెకెండ్ లిరికల్ సాంగ్, టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. -
Ari: మంగ్లీ పాటకు విదేశీ యువతులు స్టెప్పులు.. వీడియో
‘పేపర్ బాయ్ ’చిత్రంతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ‘అరి’.. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన సినిమా ఇది. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘చిన్నారి కిట్టయ్య’పాటకు ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రముఖ గాయని మంగ్లీ ఆలపించిన ఈ పాటకు విదేశీ యువతులు సైతం ఫిదా అయ్యారు. ఈ పాటకు తమదైన శైలీలో స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీకృష్ణుడి గొప్పదనం గురించి తెలియజేస్తూ సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ స్వరపరిచాడు. -
Ari: మంగ్లీ ఆలపించిన ‘చిన్నారి కిట్టయ్య’ పాట విన్నారా?
పేపర్ బాయ్` ఫేమ్ జయశంకర్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘అరి’. మై నేమ్ ఈజ్ నోబడీ అనేది ట్యాగ్ లైన్. ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా, ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. అనసూయ భరద్వాజ్, సాయికుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట విడుదలైంది. కృష్ణుడు గొప్పదనం గురించి తెలియజేసే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ప్రముఖ గాయని మంగ్లీ అద్భుతంగా ఆలపించింది. అనూప్ రూబెన్స్ మైమరిపించే సంగీతం అందించారు. ఇక అరి విషయానికొస్తే.. జయశంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో జెలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్‌గా సాయి కుమార్, ఆంగర్ క్యారెక్టర్లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్ మెంట్ క్యారెక్టర్లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి విడుదలకు రెడీ అయిన ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. థియేటర్స్‌లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయడానికి రూ.10 కోట్లతో డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో ‘అరి’ ని కచ్చితంగా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించడానికి సిద్దమైందట. అయితే చిత్రబృందం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. థియేటర్స్‌లో విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. అసలు ఏం జరిగిందంటే..
ప్రముఖ సింగర్ మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది.ఫోక్ సింగర్‌గా గుర్తింపు సంపాదించుకున్న మంగ్లీ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ సింగర్‌గా కొనసాగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె పాడిన పాటలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. తాజాగా మరోసారి మంగ్లీ పాడిన ఓ పాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలె మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలోని కాలభైరవ స్వామి ఆలయంలో‘భం భం భోలే’ అనే సాంగ్‌ని చిత్రీకరించారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను మంగ్లీ శివరాత్రి స్పెషల్ సాంగ్‌గా రిలీజ్ చేయడంతో వివాదం మొదలైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆలయం లోపల వీడియోలు, ఫోటోలు తీసేందుకు అనుమతి లేదు. అలాంటిది గర్భగుడిలో మంగ్లీ అండ్ టీం షూటింగ్ ఎలా చేస్తారంటూ కొందరు పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీరికి పర్మీషన్ ఎలా ఇచ్చారంటూ నిలదీస్తున్నారు.ఎవరికి తెలియకుండా తెల్లవారుజామున గర్భగుడిలో ఈ పాట చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సాంగ్‌లో ఆలయ అర్చకులు కూడా కనిపిస్తుండటంతో చాన్నాళ్లుగా వస్తున్న ఆచారాలను ఎలా పక్కన పెడతారంటూ భక్తులు కన్నెర్ర జేస్తున్నారు. -
సింగర్ మంగ్లీ ఒక్కో పాటకు ఎన్ని లక్షలు తీసుకుంటుందో తెలుసా?
సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరర్లేదు. మట్టిలో నుంచి పుట్టిన మాణిక్యం ఆమె. న్యూస్ చానల్లో యాంకర్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసి.. స్టార్ సింగర్‌గా మారిపోయారు. మొదట్లో తెలంగాణ యాసలో పాటలు పాడుతూ.. బతుకమ్మ సాంగ్స్‌తో ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం.. అందులో ఆమె పాడిన పాటలన్నీ సూపర్ హిట్ కావడంతో మంగ్లీ జీవితమే మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఆమె స్టార్ సింగర్‌గా కొనసాగుతుంది. ఆమె ఆలపించిన పాటల్లో ‘రాములో రాముల’, ‘సారంగదరియా’, ‘జింతక్ చితక్’, ‘ఊరంతా’, ‘బుల్లెట్’, ‘జ్వాలా రెడ్డి’, ‘రా రా రక్కమ్మ’, ‘కన్నె అదిరింది’ వంటి సాంగ్స్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ని తెచ్చిపెట్టాయి. ఇలా ఆమె పాడిన పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలవడంతో .. పారితోషికాన్ని ఆమాంతం పెంచేసిందట మంగ్లీ. ఒకప్పుడు ఒక్కో పాటు కేవలం రూ.20,000 మాత్రమే తీసుకున్న మంగ్లీ.. ఇప్పుడు రూ.2-3 లక్షల వరకు వసూలు చేస్తుందట. సినిమా విజయంలో మంగ్లీ పాటలు కూడా కీలకం అవుతుండడంతో నిర్మాతలు అంత మొత్తంలో ఇవ్వడానికి వెనకడుగు వేయడం లేదట. మంగ్లీకి సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. అందులో ఆమె సొంతంగా నిర్మించిన పాటలను విడుదల చేస్తుంది. దాని ద్వార కూడా మంగ్లీకి మంచి ఇన్కమే వస్తోంది. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇలా నాలుగైదు రకాలుగా మంగ్లీ భారీగా సంపాదిస్తోందని ఇండస్ట్రీ టాక్. చిత్తూరు జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన సత్యవతి రాథోడ్(మంగ్లీ అసలు పేరు)..ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇలా స్టార్ సింగర్‌గా రాణించడం నిజంగా అభినందించాల్సిన విషయమే. -
ఎలాంటి దాడి జరగలేదు.. ఇదంతా తప్పుడు ప్రచారం: మంగ్లీ
సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగిందన్న వార్తలను ఆమె ఖండించారు. కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్నయంటూ మంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ నోట్ విడుదల చేశారు. నోట్లో మంగ్లీ రాస్తూ.. 'నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఫోటోలు, వీడియోల నుండి మీరందరూ చూడగలిగే విధంగా ఈవెంట్ భారీ విజయాన్ని సాధించింది. నా ఉత్తమ ఈవెంట్లలో ఇది ఒకటి. కన్నడ ప్రజలు నాపై కురిపించిన ప్రేమ, మద్దతు అపారమైనది. ఈవెంట్లో నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇది మాటలలో వర్ణించలేనిది .ఇదంతా నా ప్రతిష్టను కించపరచడానికి చేస్తున్నారు. ఈ విధమైన తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నా. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.' అని నోట్ విడుదల చేసింది. -
సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. అసలేం జరిగిందంటే?
సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కొంతమంది యువకులు ఆమె వెళ్తున్న కారుపై రాళ్లు విసిరగా అద్దాలు ధ్వంసమయ్యాయి. బళ్లారిలో ఓ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. బళ్లారిలోని మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటి రోజు కావడంతో ఉత్సవంలో సింగర్ మంగ్లీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె స్టేజ్ మీద పాటలు పాడారు. అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు ఆమెను చూసేందుకు యువకులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆ తర్వాత కొంతమంది యువకులు ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారు. అయితే ఆమె కన్నడలో మాట్లాడలేదని దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.