![Attack On Singer Mangli car At Bellary In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/22/WhatsApp%20Image%202023-01-22%20at%2017.53.56.jpeg.webp?itok=HZCx9LJY)
సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కొంతమంది యువకులు ఆమె వెళ్తున్న కారుపై రాళ్లు విసిరగా అద్దాలు ధ్వంసమయ్యాయి. బళ్లారిలో ఓ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..
బళ్లారిలోని మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటి రోజు కావడంతో ఉత్సవంలో సింగర్ మంగ్లీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె స్టేజ్ మీద పాటలు పాడారు. అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు ఆమెను చూసేందుకు యువకులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆ తర్వాత కొంతమంది యువకులు ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారు. అయితే ఆమె కన్నడలో మాట్లాడలేదని దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment