సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగిందన్న వార్తలను ఆమె ఖండించారు. కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్నయంటూ మంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ నోట్ విడుదల చేశారు.
నోట్‌లో మంగ్లీ రాస్తూ.. 'నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఫోటోలు, వీడియోల నుండి మీరందరూ చూడగలిగే విధంగా ఈవెంట్ భారీ విజయాన్ని సాధించింది. నా ఉత్తమ ఈవెంట్‌లలో ఇది ఒకటి. కన్నడ ప్రజలు నాపై కురిపించిన ప్రేమ, మద్దతు అపారమైనది. ఈవెంట్‌లో నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇది మాటలలో వర్ణించలేనిది .ఇదంతా నా ప్రతిష్టను కించపరచడానికి చేస్తున్నారు. ఈ విధమైన తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నా. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.' అని నోట్ విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment