ballary
-
ఉగ్రవాదానికి కాంగ్రెస్ వెన్నుదన్ను
సాక్షి, బళ్లారి/తుమకూరు: ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ పార్టీ ఉగ్రవాదానికి అండగా నిలుస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, వారి ముందు సాగిలపడుతోందని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారిలో శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘ద కేరళ స్టోరీ’ చిత్రం గురించి ప్రస్తావించారు. సుందరమైన రాష్ట్రంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారని అన్నారు. కాంగెస్ మాత్రం ఈ చిత్రాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. కేరళలో చోటుచేసుకున్న ఉగ్ర కుట్రలను ‘ద కేరళ స్టోరీ’ చిత్రం బట్టబయలు చేస్తోందని ప్రశంసించారు. కేవలం ఒక రాష్ట్రంలో ముష్కర మూకల ఆగడాలు, మోసపూరిత విధానాలపై ఈ చిత్రం నిర్మించారని పేర్కొన్నారు. దేశాన్ని నాశనం చేసే ఉగ్రవాదానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుండడం నిజంగా దురదృష్టకరమని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నవారికి ఆ పార్టీ వత్తాసు పలుకుతోందని, వారితో తెరవెనుక రాజకీయ బేరసారాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అసలు నైజం ఏమిటో కర్ణాటక ప్రజలు తెలుసుకోవాలని కోరారు. కర్ణాటకను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చాలంటే ఇక్కడ శాంతి భద్రతలు చాలా ముఖ్యమని ప్రధాని మోదీ చెప్పారు. ఉగ్రవాద రహిత రాష్ట్రంగా ఉండడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకున్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీకి కడుపు నొప్పి వస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించబోతున్నామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం తుమకూరులో భారీ రోడ్డు షోలో పాల్గొన్నారు. ఆ కుట్ర శబ్దాలు వినిపించవు మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఉగ్రవాదం కూడా స్వభావం మార్చుకుంటోందని, స్మగ్లింగ్, డ్రగ్స్ వ్యాపారం, మత ఘర్షణలకు ఉగ్రవాదంతో సంబంధం ఉంటోందని మోదీ గుర్తుచేశారు. గత కొన్నేళ్లలో కొత్తరకం ఉగ్రవాదం పుట్టుకొచ్చిందన్నారు. ఈ ఉగ్రవాదంలో సమాజాన్ని గుల్లబార్చే కుట్రల శబ్దాలు వినిపించవని చెప్పారు. నిశ్శబ్దంగానే కార్యకలాపాలు సాగిపోతుంటాయని, దీనిపై కోర్టులు కూడా ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. -
PM Modi:వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కేరళలో ప్రకంపనలు సృష్టించిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ఉగ్ర కుట్రల ఆధారంగా తీశారని, తీవ్రవాదానికి సంబంధించిన చేదు నిజాన్ని ఈ చిత్రంలో చూపించారని పేర్కొన్నారు. కర్ణాటక బల్లారీలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసింగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ది కేరళ స్టోరీ చిత్రంపై తొలిసారి స్పందిస్తూ దానికి మద్దతు తెలిపారు. 'కొద్ది రోజులుగా ది కేరళ స్టోరీ చిత్రంపై పెద్ద చర్చ జరుగుతోంది. కేరళలో ఉగ్ర శక్తుల గురించి ఈ చిత్రం బహిర్గతం చేసింది. ఉగ్రవాదం గురించి తెలియజేసింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయల కోసం కాంగ్రెస్ ఉగ్ర శక్తులకు మద్దతుగా నిలుస్తోంది. అంతేకాదు ఉగ్రశక్తులతో ఆ పార్టీ గుట్టుగా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి' అని మోదీ పేర్కొన్నారు. కాగా.. ది కేరళ స్టోరీ చిత్రంపై సీఎం పినరయి విజయన్ సహా చాలా మంది ప్రముఖులు విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రం గురించి ఈ సినిమాలో తప్పుగా చూపించారని, కేవలం తమపై ధ్వేషంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని మండిపడ్డారు. కేరళవ్యాప్తంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేఫథ్యంలో గురువారం కొచ్చిలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న పీవీఆర్ సినిమాస్.. షోను అర్ధాంతరంగా రద్దు చేసింది. మరోవైపు చిత్ర నిర్మాత, దర్శకులు మాత్రం దీన్ని వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించామని చెబుతున్నారు. కేరళకు చెందిన 32 వేల మంది అమ్మాయులు మతం మార్చుకుని సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇది పూర్తిగా అసత్యమని, విద్వేషంతో రూపొందించిన చిత్రమని కేరళ సహా దేశంలోని పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పించారు. చదవండి: శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించిన ఎన్సీపీ కమిటీ -
ఎలాంటి దాడి జరగలేదు.. ఇదంతా తప్పుడు ప్రచారం: మంగ్లీ
సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగిందన్న వార్తలను ఆమె ఖండించారు. కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్నయంటూ మంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ నోట్ విడుదల చేశారు. నోట్లో మంగ్లీ రాస్తూ.. 'నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఫోటోలు, వీడియోల నుండి మీరందరూ చూడగలిగే విధంగా ఈవెంట్ భారీ విజయాన్ని సాధించింది. నా ఉత్తమ ఈవెంట్లలో ఇది ఒకటి. కన్నడ ప్రజలు నాపై కురిపించిన ప్రేమ, మద్దతు అపారమైనది. ఈవెంట్లో నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇది మాటలలో వర్ణించలేనిది .ఇదంతా నా ప్రతిష్టను కించపరచడానికి చేస్తున్నారు. ఈ విధమైన తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నా. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.' అని నోట్ విడుదల చేసింది. -
Bharat Jodo Yatra: బీజేపీ ఎస్సీ, ఎస్టీ వ్యతిరేకి: రాహుల్
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వ్యతిరేకి అని, 40% కమిషన్ ప్రభుత్వమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు అణచివేతకు గురవుతున్నారని, వారిపై నేరాలు 50% పెరిగాయన్నారు. ఏ పని అయినా 40 శాతం కమిషన్ ముట్టజెప్పనిదే కావడం లేదని విమర్శించారు. భారత్ జోడో యాత్ర 1,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని శనివారంతో బళ్లారిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ సర్కార్ ఎస్సై ఉద్యోగానికి రూ.80 లక్షలు వసూలు చేసింది, ఇలాంటి అవినీతి ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు. ‘రూ.80 లక్షలు ముట్టచెపితే మీరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అవుతారు. మీ దగ్గర డబ్బుంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని కొనుక్కోవచ్చు. డబ్బు లేని వాళ్లకు జీవితంలో ఉద్యోగం రాదు’ అని రాహుల్ అన్నారు. -
పెళ్లైన మరుసటి రోజే వరుడి మృతి
హుబ్లీ: విధి విలాసమో.. వైచిత్రమో తెలియదు కానీ వివాహమైన మరుసటి రోజే వరుడిని మృత్యువు బలితీసుకుంది. పచ్చటి తోరణాలు కళకళలాడుతుండగానే పెళ్లింట చావుడప్పు మోగింది. అటు వరుడు, ఇటు వధువు ఇళ్లలో విషాదాన్ని మిగిల్చిన ఈఘటన జిల్లాలోని కలఘటిగి తాలూకా తబకహొన్నళ్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన శశికుమార్ పట్టణ శెట్టికి శనివారం అతని స్వగృహంలో హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా మూకబసరికట్టికి చెందిన యువతితో వివాహమైంది. తిరుగు పెళ్లిలో భాగంగా వధువు ఇంటికి నవదంపతులు వెళ్లారు. ఆదివారం శశికుమార్ గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. కళ్లముందే జరిగిన ఈ ఘోరాన్ని చూసి అటు వధువు, పెళ్లికి వచ్చిన బంధువులు విషాదంలో మునిగిపోయారు. కరోనాతోఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మృతి భార్యకు, కుమార్తెకు పాజిటివ్ సాక్షి, బళ్లారి: వారం రోజుల క్రితం ఆ ఇంటిలో వివాహం జరిగింది. బంధువుల సందడి ఇంకా తగ్గలేదు. ఇంతలోనే కరోనా రూపంలో ఆ ఇంటిని విషాదం కమ్మేసింది. కరోనాతో భర్త మృతి చెందగా భార్యకు, ఇటీవల వివాహం జరిగిన కుమార్తెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వివరాలు...బళ్లారిలోని విశాల్ నగర్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హనుమంతప్ప నివాసం ఉంటున్నారు. వారం రోజుల క్రితం అతని మూడవ కుమార్తెకు వివాహం చేశారు. పెళ్లికి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈక్రమంలో హనుమంతప్పకు కరోనా సోకింది. శనివారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో విమ్స్‌కు తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ హనుమంతప్ప ఆదివారం మృతి చెందాడు. కాగా హనుమంతప్ప భార్య, ఇటీవల వివాహమైన కుమార్తెకు కూడా పాజిటివ్‌గా తేలింది. చదవండి: బెంగళూరులో ఒక్కరోజే 20 వేలకు పైగా కేసులు -
కోవిడ్ సెంటర్లో కరోనా రోగుల డాన్స్!
బెంగుళూరు: కరోనా వైరస్ మహమ్మారి బారిన చిక్కుకున్న వారిలో ఉత్సాహాన్ని నింపడానికి కరోనా లక్షణాలు లేని రోగులు కొంతమంది వినూత్న ప్రయత్నం చేశారు. జూలై 19న కర్ణాటకలోని బళ్లారిలోని ఒక కోవిడ్ -19 సంరక్షణ కేంద్రంలో వారు ఒక ఫ్లాష్ మాబ్‌ను నిర్వహించారు. కొంత మంది బృందం ఫేస్ మాస్క్‌లు ధరించి, బళ్లారిలోని కేర్ సెంటర్లో వరుసలో నిలబడి, 1999లో విడుదలైన హీరో ఉపేంద్ర చిత్రంలోని కన్నడ పాట మస్తు మస్తు హుడుగి పాటకు చాలా ఉత్సాహంగా డాన్స్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. వారి స్ఫూర్తిని చూసి పలువురు నెటిజన్లు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం కర్ణాటకలో 63 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక భారత్ మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య 11 లక్షలు దాటింది. చదవండి: కరోనా బాధితురాలిని ఇంటికి రానివ్వని అత్త -
కరోనా రోగుల డాన్స్!
-
ఉప ఎన్నికల్లో సీఎం భార్య, కుమారుడు..!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఖాళీ అయిన మూడు పార్లమెంట్ స్థానాలతో పాటు, రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నపట్నం, రామ్‌నగర స్థానాల్లో నుంచి కుమార స్వామి పోటీ చేసి విజయం సాధించారు. రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించడంతో రామ్‌నగర స్థానానికి రాజీనామా చేయక తప్పలేదు. రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కుమార స్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కాగా ఉప ఎన్నికలు జరగాల్సిన బళ్ళారి, శివమెగ్గ, మండ్యా లోక్‌సభ స్థానాలతో పాటు, రామ్‌నగర, జంఖాడీ అసెంబ్లీ స్థానాల కోసం రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. కుమార స్వామి భార్య పోటీ.. కుమారస్వామి రాజీనామా చేసిన రామ్‌నగర స్థానం నుంచి ఆయన సతీమణి అనిత కుమారస్వామి పోటీ చేస్తారనే ఊహాగానాలు కన్నడనాట కోడైకూస్తున్నాయి. ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల ప్రకటన విడుదలైన మరునాడే ఆమె రామ్‌నగర నియోజకవర్గంలో పర్యటించడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అనితనే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొంతమంది ఆమె మద్దతుదారులు ఇదివరికే ప్రకటించారు. ఈ వార్తలను జేడీఎస్ ఖండిచకపోగా.. మరో రెండో రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపింది. ఇదిలా వుండగా జేడీఎస్ నేత సీఎస్ పుట్టరాజు ప్రాతినిథ్యం వహించిన మండ్యా లోక్‌సభ స్థానం నుంచి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేస్తారని సమాచారం. నిఖిల్ ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు. ఆయన జాగ్వార్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. లోక్‌సభ సీటుకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుండడంతో ఆ స్థానంలో జేడీఎస్ విజయం నల్లేరుమీద నడకే. ఇక బీజేపీ సీనియర్ నేత రాములు ప్రాతినిథ్యం వహించిన బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి ఆయన సోదరి శాంతను బరిలో నిలపే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీరాములు ఇటీవల ఎంపీకి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఎన్నికలేంటీ.. మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై ప్రధాన పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సమయం ఇంకా కేవలం నాలుగు నెలలే ఉన్నందుకు వాటికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నవంబర్ మూడున ఎన్నికల నిర్వహించి నవంబర్ 6 ఫలితాలను విడుదల చేస్తామని ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసిన విషయం తెలిసిందే. -
బళ్లారి బెల్ట్‌లో గాలి సోదరుల హవా
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగిన గాలి జనార్దన్‌రెడ్డి సోదరులు బళ్లారి బెల్ట్‌లో ముందంజలో ఉన్నారు. ఊహించినట్టుగానే తమకు గట్టి పట్టున్న బళ్లారి ప్రాంతంలో గాలి సోదరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బళ్లారి నియోజకవర్గంలో గాలిసోమశేఖరరెడ్డి ముందంజలో ఉండగా.. హరప్పనహళిలో గాలి కరుణాకరరెడ్డి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. గాలి సోదరులు సన్నిహితుడు శ్రీరాములు కూడా బాదామిలో సీఎం సిద్దరామయ్యకు గట్టిపోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీరాములుపై సిద్దరామయ్య స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో నియోజకవర్గం మొలుకాల్మూరులోనూ బరిలోకి దిగిన శ్రీరాములు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి బీజేపీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేవిధంగా లెక్కింపులో గాలి సోదరులు ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక శ్రీరాములు మాట్లాడుతూ.. గాలి జనార్దన్‌రెడ్డి తనకు స్నేహితుడు మాత్రేమేనని, ప్రస్తుత ఎన్నికలతో ఆయనకు సంబంధం లేదని చెప్పారు. -
ఆ సమయంలో చంపేసినా నేరంకాదు:నటి మాళవిక
బళ్లారి (కర్ణాటక) : లైంగిక వేధింపులు, అత్యాచార సమయాల్లో మగాళ్లను చంపినా నేరం కాదని ప్రముఖ నటి మాళవిక అవినాష్ అన్నారు. బళ్లారిలోని గాంధీభవన్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘సబల శక్తి విద్యార్థిని' సదస్సులో ఆమె ప్రసంగించారు. మహిళలు, యువతులే కాకుండా చిన్నారులకూ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాలు, వేధింపులకు పాల్పడే వారిపై 1886లో ఇంగ్లండ్ కోర్టు జారీ చేసిన సెక్షన్ 376 కింద శిక్ష అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆత్మరక్షణ కోసం ప్రతి విద్యార్థిని ఓ చిన్న కత్తిని ఉంచుకోవాలని సూచించారు. ఇరుగుపొరుగు ఇళ్లలో మహిళలపై వేధింపులు ఉంటే వెంటనే బాధితురాలి పక్షాన నిలిచి ఆదుకోవాలన్నారు. దేశంలో 40 లక్షల మంది మహిళలు అంతర్జాతీయ సెక్స్ మాఫియాలో బందీలయ్యారని మాళవిక ఆవేదన వ్యక్తం చేశారు. -
బళ్లారిలో రూ.8.52 కోట్లు నగదు పట్టివేత
బెంగళూరు : ఎన్నికల సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున నగదు బయటపడింది. కర్ణాటకలోని బళ్లారిలో పోలీసుల తనిఖీల్లో రూ.8.52 కోట్ల నగదు పట్టుబడింది. దాంతో పాటు మరో రూ.10 కోట్ల విలువైన కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును రాజకీయ పార్టీలకు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పోలీసులకు సమాచారం అందడంతో చోర్బాబూలాల్, పరశురామ్పురి అనే వ్యక్తుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి బాబులాల్ చోర్ను పోలీసులు విచారిస్తున్నారు. -
ఆగడు షూటింగ్లో గాయపడ్డ మహేష్