
బళ్లారిలో రూ.8.52 కోట్లు నగదు పట్టివేత
బెంగళూరు : ఎన్నికల సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున నగదు బయటపడింది. కర్ణాటకలోని బళ్లారిలో పోలీసుల తనిఖీల్లో రూ.8.52 కోట్ల నగదు పట్టుబడింది. దాంతో పాటు మరో రూ.10 కోట్ల విలువైన కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును రాజకీయ పార్టీలకు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పోలీసులకు సమాచారం అందడంతో చోర్‌బాబూలాల్, పరశురామ్‌పురి అనే వ్యక్తుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి బాబులాల్ చోర్ను పోలీసులు విచారిస్తున్నారు.