
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగిన గాలి జనార్దన్‌రెడ్డి సోదరులు బళ్లారి బెల్ట్‌లో ముందంజలో ఉన్నారు. ఊహించినట్టుగానే తమకు గట్టి పట్టున్న బళ్లారి ప్రాంతంలో గాలి సోదరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బళ్లారి నియోజకవర్గంలో గాలిసోమశేఖరరెడ్డి ముందంజలో ఉండగా.. హరప్పనహళిలో గాలి కరుణాకరరెడ్డి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. గాలి సోదరులు సన్నిహితుడు శ్రీరాములు కూడా బాదామిలో సీఎం సిద్దరామయ్యకు గట్టిపోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీరాములుపై సిద్దరామయ్య స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో నియోజకవర్గం మొలుకాల్మూరులోనూ బరిలోకి దిగిన శ్రీరాములు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి బీజేపీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేవిధంగా లెక్కింపులో గాలి సోదరులు ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక శ్రీరాములు మాట్లాడుతూ.. గాలి జనార్దన్‌రెడ్డి తనకు స్నేహితుడు మాత్రేమేనని, ప్రస్తుత ఎన్నికలతో ఆయనకు సంబంధం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment