Gali Somashekhar Reddy
-
బళ్లారి బెల్ట్‌లో గాలి సోదరుల హవా
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగిన గాలి జనార్దన్‌రెడ్డి సోదరులు బళ్లారి బెల్ట్‌లో ముందంజలో ఉన్నారు. ఊహించినట్టుగానే తమకు గట్టి పట్టున్న బళ్లారి ప్రాంతంలో గాలి సోదరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బళ్లారి నియోజకవర్గంలో గాలిసోమశేఖరరెడ్డి ముందంజలో ఉండగా.. హరప్పనహళిలో గాలి కరుణాకరరెడ్డి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. గాలి సోదరులు సన్నిహితుడు శ్రీరాములు కూడా బాదామిలో సీఎం సిద్దరామయ్యకు గట్టిపోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీరాములుపై సిద్దరామయ్య స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో నియోజకవర్గం మొలుకాల్మూరులోనూ బరిలోకి దిగిన శ్రీరాములు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి బీజేపీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేవిధంగా లెక్కింపులో గాలి సోదరులు ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక శ్రీరాములు మాట్లాడుతూ.. గాలి జనార్దన్‌రెడ్డి తనకు స్నేహితుడు మాత్రేమేనని, ప్రస్తుత ఎన్నికలతో ఆయనకు సంబంధం లేదని చెప్పారు. -
గాలి జనార్దన్ రెడ్డి వినతిని తోసిపుచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు బళ్లారి జిల్లాలో ప్రవేశానికి అనుమతి కోసం గాలి జనార్దన్ రెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శుక్రవారం గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీం బెంచ్ విచారణ చేపట్టింది. తన సోదరుడు సోమశేఖర్ రెడ్డి తరఫు ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. అది సహేతుక కారణంగా తాము భావించటం లేదంటూ బెంచ్ ఆ వినతిని తిరస్కరించింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆయన కుటుంబసభ్యులు, అనుచరులైన 9 మందికి బీజేపీ టికెట్లిచ్చింది. ఏపీలో అనంతపురం, కర్ణాటకలోని బళ్లారిల్లో ఇనుప ఖనిజం అనధికార మైనింగ్, ఎగుమతుల ఆరోపణలపై 2009లో జనార్దన్‌రెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. 2015లో ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. -
పాలకుల కళ్లు తెరిపించు దుర్గమ్మతల్లీ!
ఆగిపోయిన కనక దుర్గమ్మ ఆలయ లభివృద్ధి పనులు పట్టించుకోని జిల్లా మంత్రి,ఎమ్మెల్యేలు సాక్షి, బళ్లారి : కనక దుర్గమ్మ బళ్లారి నగర ప్రజల ఆదిదేవత. ఆమెను తలచుకోనిదే జిల్లా ప్రజలు ఏపని మొదలు పెట్టరు. ఆమె దర్శనం కోసం జిల్లా వాసులే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి మంగళ, శుక్ర వారాలతోపాటు అమావాస్య రోజుల్లో వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దీంతో ఆలయం కిటకిటలాడుతుంటోంది. భక్తులపై అంతటి కరుణ చూపుతున్న అమ్మవారిపై పాలకులు అశ్రద్ధ కనబరుస్తున్నారు. అమ్మవారి ఆలయ పునరుద్ధరణ పనులు ఆగిపోవడమే ఇందుకు తార్కాణం. 2009లో పనులకు శ్రీకారం 2009లో అప్పటి జిల్లా ఇన్చార్జ మంత్రి గాలి జనార్దనరెడ్డి, బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూ. 10 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నాలుగు గోపురాలు, పుష్కరిణీ, ప్రహరీ, సముదాయ భవనం, రాతిక ట్టడాలు, స్నానపు గదులు నిర్మించాల్సి ఉంది. జనార్దనరెడ్డి హయాంలో పనులు ఊపందుకున్నా ప్రభుత్వాలు మారిన తర్వాత పనులు ఆగిపోయాయి. ఏ ఒక్క పని కూడా పూర్తి కాలేదు. దీంతో వ్యయం రూ.14 కోట్లుకు మేరకు చేరుకుందని, పైగా నిధుల కొరత ఉందని ఆలయ వర్గాలు పేర్కొంటున్నారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం దేదీప్యమానంగా వెలుగిపోతండగా వెలుపల మాత్రం కళావిహీనంగా కనబడుతోంది. జిల్లా ఇన్చార్జ పరమేశ్వరనాయక్, బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్ ఆలయ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి చుట్టపుచూపులా జిల్లా, నగరానికి వచ్చిపోతుండటం వల్ల అభివృద్ధి జరగడం లేదని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. బళ్లారి నగర ఆదిదేవతనే పాలకులు పట్టించుకోనప్పుడు ఇక జిల్లాలో అభివృద్ధి పనులు గురించి ఏ పాటిగా పట్టించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పాలకులు శ్రీకనక దుర్గమ్మ ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టి వెంటనే పనులు పూర్తి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. -
6 తర్వాత బీజేపీలో బీఎస్సార్సీపీ విలీనం
సాక్షి, బళ్లారి(కర్ణాటక): ఈ నెల ఆరో తేదీ తర్వాత తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి. శ్రీరాములు తెలిపారు. ఆయన ఆదివారం కంప్లిలో విలేకరులతో మాట్లాడారు. దేశ శ్రేయస్సు దృష్ట్యా పార్టీని విలీనం చేస్తామన్నారు. బీజేపీ అంతర్గత కుమ్ములాటలతోనే రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేజేపీ విలీనంతో బీజేపీకి కొండంత బలం వచ్చిందని పేర్కొన్నారు. తర్వాత బళ్లారిలో విలేకరులతో మాట్లాడుతూ బళ్లారి ఎంపీ శాంత, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, మిత్రులు గాలి జనార్దనరెడ్డి, గాలి సోమశేఖరరెడ్డి తదితర పార్టీ నేతలతో మాట్లాడి నాలుగైదు రోజుల్లో పార్టీ విలీనంపై ప్రకటన చేస్తానన్నారు. తాను బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.