గాలి జనార్దన్‌ రెడ్డి వినతిని తోసిపుచ్చిన సుప్రీం | SC rejects Janardhana Reddy’s plea to campaign in Ballari | Sakshi
Sakshi News home page

గాలి జనార్దన్‌ రెడ్డి వినతిని తోసిపుచ్చిన సుప్రీం

Published Sat, May 5 2018 5:14 AM | Last Updated on Sat, Sep 15 2018 3:04 PM

SC rejects Janardhana Reddy’s plea to campaign in Ballari - Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు బళ్లారి జిల్లాలో ప్రవేశానికి అనుమతి కోసం గాలి జనార్దన్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శుక్రవారం గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీం బెంచ్‌ విచారణ చేపట్టింది.

తన సోదరుడు సోమశేఖర్‌ రెడ్డి తరఫు ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. అది సహేతుక కారణంగా తాము భావించటం లేదంటూ బెంచ్‌ ఆ వినతిని తిరస్కరించింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆయన కుటుంబసభ్యులు, అనుచరులైన 9 మందికి బీజేపీ టికెట్లిచ్చింది. ఏపీలో అనంతపురం, కర్ణాటకలోని బళ్లారిల్లో ఇనుప ఖనిజం అనధికార మైనింగ్, ఎగుమతుల ఆరోపణలపై 2009లో జనార్దన్‌రెడ్డిని అధికారులు అరెస్ట్‌ చేశారు. 2015లో ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement