Gali Janardhan reddy
-
బీజేపీలో చేరాను.. నా సొంతింటికి తిరిగొచ్చా : గాలి జనార్థన్ రెడ్డి
-
బీజేపీలో కేఆర్పీపీ విలీనం.. గాలి జనార్ధన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన పార్టీని బీజేపీ విలీనం చేశారుఉ. ఈ క్రమంలో జనార్థన్ రెడ్డితో పాటు ఆయన భార్య కూడా బీజేపీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీ గూటికి చేరుకున్నారు. తన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ)ని సోమవారం బీజేపీలో విలీనం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సమక్షంలో జనార్ధన్ రెడ్డి తన పార్టీని బీజేపీలో కలిపారు. దీంతో, లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. కేఆర్పీపీ పార్టీని బీజేపీలో విలీనం చేశానని, బీజేపీలో చేరానని తెలిపారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పని చేస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరానని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పుకొచ్చారు. #WATCH | Bengaluru: Kalyana Rajya Pragathi Paksha leader G Janardhana Reddy merges his party with BJP and his wife and politician Aruna Lakshmi also joins the party, in the presence of party leader BS Yediyurappa and state BJP President BY Vijayendra. pic.twitter.com/9ZYQmLMeLJ — ANI (@ANI) March 25, 2024 అనంతరం, మాజీ సీఎం యడియూరప్ప మాట్లాడుతూ.. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన భార్య బీజేపీలో చేరారు. ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జనార్దన్ రెడ్డి చేరిక బీజేపీని మరింత బలపరుస్తుందని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన కీలక నేతలు, జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక, గత వారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని ప్రకటించారు. కర్ణాటకలో బీజేపీ కొత్త వ్యూహం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. బంపర్ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీ నుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఫలితంతో కంగుతిన్న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిపోరు సరికాదనే భావనకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే మాజీ ప్రధానమంత్రి దేవెగౌడకు చెందిన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీతో బీజేపీ సీట్లను సర్దుబాటు చేసుకుంది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని కల్యాణ కర్ణాటక ప్రాంతంపై మంచి పట్టు కలిగిన గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేఆర్పీపీ)ను కమలదళం విలీనం చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉన్న రెడ్డి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఓట్లను ఏకీకృతం చేయొచ్చని బీజేపీ భావిస్తోంది -
మళ్లీ బీజేపీలో చేరను
సాక్షి,బళ్లారి: బీజేపీలోకి మళ్లీ చేరాలనే ఆలోచన తనకు లేదని, కలలో కూడా బీజేపీలో చేరాలనుకోనని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. గురువారం కొప్పళ జిల్లా గంగావతిలో ఆయన కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితులోను తాను బీజేపీలో చేరే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. విజయేంద్ర బీజేపీ అధ్యక్షుడైనందుకు అభినందించానని, ఇందులో రాజకీయ ఉద్దేశం లేదన్నారు. తాను ఎవరికీ తల వంచే వ్యక్తిని కాదని, అప్పట్లో తాను సోనియాగాంధీకే భయపడలేదని అన్నారు. కేఆర్పీపీని బలోపేతం చేసి, రాష్ట్రంలో 8 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. అన్ని స్థానాల్లో గెలుపొందేందుకు ప్రయత్నిస్తామన్నారు. బీజేపీ ఉనికిని కాపాడుకునేందుకు, కాంగ్రెస్ నాయకులు కేసుల నుంచి దొడ్డిదారిన బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శ్రీరాముని పేరు చెప్పుకుని అఽధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు అంజనాద్రి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని అన్నారు. -
గాలి జనార్దనరెడ్డికి బీజేపీ గాలం?
సాక్షి, బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, కేఆర్పీపీ వ్యవస్థాపకులు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిని మళ్లీ సొంత గూటిలోకి చేర్చుకునేందుకు బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారా? రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు విజయేంద్ర గాలితో చర్చలు జరిపారా అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గాలి జనార్దనరెడ్డి లేకపోతే బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలతో పాటు రాష్ట్రంలో మరో ఐదారు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆయన ప్రభావంతో పార్టీకి నష్టం జరుగుతుందన్న భయంతో గాలికి బీజేపీ గాలం వేస్తోందని సమాచారం. పార్టీ బలోపేతానికి గాలి జనార్దనరెడ్డికి బీజేపీతో అవినాభావ సంబంధం ఉండేది. అయితే గనుల కేసులు, అరెస్టుల నేపథ్యంలో పార్టీతో దూరం పెరిగింది. గత ఎన్నికల్లో సొంతంగా పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మారిన పరిస్థితుల్లో రాష్ట్రంలో బలం పెంచుకోవాలంటే బలమైన నాయకులందరినీ చేర్చుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో గాలి జనార్దనరెడ్డితో విజయేంద్ర సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
2028లో అధికారం సాధించడమే నా లక్ష్యం
తిరుమల: అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీని ఎప్పటికీ ఏ పార్టీలోనూ విలీనం చేయబోమని స్పష్టం చేశారు. 2028లో అధికారం సాధించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తామన్నారు. -
నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా
గంగావతి: గంగావతి నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి పరచి రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తామని కేఆర్పీపీ సంస్థాపకులు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన నగరంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఓటర్ల అభినందన కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను రెండేళ్లలో పూర్తి చేస్తానని చెప్పారు. ఆరు నెలలలోపు మహిళలకు గార్మెంట్ ఫ్యాక్టరీని నిర్మించి వారికి ఉపాధి కల్పిస్తానని అన్నారు. నియోజక వర్గంలోని ఇరకల్గడ ఏరియా మెట్ట ప్రాంతంలో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తానని, ఇందుకోసం నాలుగు సమాంతర జలాశయాలను నిర్మిస్తానని తెలిపారు. యువకులకు ప్రధానంగా స్థానికంగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రమాణికంగా కృషి చేస్తానన్నారు. గ్రామీణ ప్రదేశాలైన వెంకటగిరి, ఆనెగుంది, ఇతర ప్రాంతాల్లో తమ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి, అందులో వలంటీర్లను నియమించి ప్రజలకు ఇంటి వద్దకే సౌకర్యాలను తీసుకెళ్లే ఏర్పాటు చేస్తానన్నారు. నగరంలో రహదారులు, స్లం ఏరియా మౌలిక సదుపాయాలు, కల్పించి మాడ్రన్ సిటీగా మారుస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లాధ్యక్షుడు మనోహర్ గౌడ హెరూరు, పార్టీ యువజన విభాగపు రాష్ట్ర అధ్యక్షులు భీమశంకర్ పాటిల్, పార్టీ మహిళ విభాగపు జిల్లాధ్యక్షురాలు రాజేశ్వరి సురేష్, చెన్నవీరణ్ణగౌడ, టీజీ బాబు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. జనార్ధన్‌రెడ్డిని ఈ సందర్భంగా నియోజక వర్గం నుంచి వచ్చిన అభిమానులు భారీ ఎత్తున పూలమాలలతో సన్మానించారు. -
గాలి జనార్దన్ రెడ్డి ఎఫెక్ట్.. బీజేపికి పెద్ద దెబ్బ..!
-
గాలి జనార్థన్‌రెడ్డి ముందంజ
-
ఓటు హక్కు వినియోగించుకున్న సుధామూర్తి, గాలి జనార్దన్ రెడ్డి సతీమణి
-
అందరి దృష్టి గాలి జనార్దనరెడ్డిపైనే
సాక్షి,బళ్లారి: గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈసారి ఎన్నికల్లో ఇక్కడి నుంచి కేఆర్పీపీ సంస్థాపకుడు, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి పోటీ చేస్తుండటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నియోజకవర్గంలో కన్నడిగుల ఓట్లతో పాటు తెలుగు వారి ఓట్లు కూడా కీలకం. వారు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున వలస వచ్చి ఇక్కడే స్థిరపడి జీవనం సాగిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 2,02,206 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 1,00,295 మంది, మహిళలు 1,01,899 మంది కాగా ఇతరులు 12 మంది ఉన్నారు. ఈ నియోజకర్గంలో కూడా మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. కులాల ప్రాతిపదికన తీసుకుంటే లింగాయత్, ముస్లిం ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండగా, కురుబ, ఎస్సీ, ఎస్టీలతో ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. అనూహ్య పరిణామాలతో గంగావతి ఎన్నికల బరిలోకి దిగిన కేఆర్పీపీ అభ్యర్థి గాలి జనార్దనరెడ్డి ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నలుగురూ హేమాహేమీలే బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి, కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి ఇక్బాల్ అన్సారీ, జేడీఎస్ తరఫున హెచ్ఆర్ చెన్నకేశవ బరిలో ఉన్నారు. వీరు నలుగురూ హేమాహేమీలే. చతుర్ముఖ పోటీ నెలకొన్నప్పటికీ కేఆర్పీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే గట్టి పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయని అంచనా. భత్తదనాడు, అన్నపూర్ణ నియోజకవర్గంగా, సాక్షాత్తు ఆంజనేయ స్వామి జన్మించిన పవిత్ర పుణ్యభూమిగా ఖ్యాతి పొందిన గంగావతి నియోజకవర్గ ఫలితాన్ని కల్యాణ కర్ణాటకలోనే కాకుండా రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల ప్రజలు, రాజకీయ ప్రముఖులు, అంజనాద్రికి వచ్చివెళుతున్న యావత్ దేశంలోని శ్రీరామభక్తులందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. వరుసగా గెలిచిన దాఖలాలు లేవు గంగావతిలో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్బాల్ అన్సారీ జేడీఎస్ తరఫున గెలుపొందారు. మళ్లీ 2008లో జరిగిన ఎన్నికల్లో పరణ్ణ మునవళ్లి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2013లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ జేడీఎస్ తరపున ఎమ్మెల్యేగా ఇక్బాల్ అన్సారీ గెలుపొందారు. 2018లో మళ్లీ బీజేపీ తరపున పరణ్ణ మునవళ్లి గెలుపొందారు. గత 20 ఏళ్లుగా ఇక్బాల్ అన్సారీ, పరణ్ణ మునవళ్లిలు గంగావతి రాజకీయాలను శాసిస్తున్నారు. ఒకరు ఒకసారి గెలిస్తే, మరోసారి ఓడిపోతున్నారు. ఈ ఇద్దరు నేతలు వరుసగా రెండుసార్లు గెలిచిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన పరణ్ణ మునవళ్లి ప్రధానంగా దాదాపు 60 వేలకు పైగా ఓటర్లు ఉన్న తన లింగాయత్ సామాజిక వర్గం ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన తన సామాజిక వర్గానికి ఎలాంటి మేలు చేయలేదనే అపవాదు ఉంది. వలసలతో బీజేపీ గుండెల్లో రైళ్లు లింగాయత్ సామాజిక వర్గం గంపగుత్తగా పరణ్ణకు ఓట్లు వేసే పరిస్థితి లేక ఆ వర్గానికి చెందిన ప్రముఖులు కేఆర్‌పీపీలో చేరుతుండటంతో బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పరణ్ణ గెలుపునకు అండగా నిలవాల్సిన ప్రముఖ సామాజిక వర్గం వలస పోతుండటంతో బీజేపీ డైలమాలో పడింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ అన్సారీ కూడా గతంలో గంగావతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగిరీ చేసినా ఆయన నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని పోలేదని, అభివృద్ధిలో కూడా ఆయన వెనుకబడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను ఈసారి ఎన్నికల్లో దూరం పెట్టి కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన కేఆర్పీపీ అభ్యర్థిని గెలిపిస్తే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఆశతో గంగావతి వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో గెలుపెవరిదో తేలాలంటే మే 13వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. -
ఒంటరి మహిళను బరిలో ఉన్నాను: గాలి లక్ష్మీఅరుణ
సాక్షి,బళ్లారి: మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి నగరాభివృద్ధికి సహకరించాలని కేఆర్పీపీ అభ్యర్థి గాలి లక్ష్మీఅరుణ పేర్కొన్నారు. ఆమె గురువారం నగరంలోని 18, 21వ వార్డుల్లో పుట్‌బాల్ చేతపట్టుకుని మండుటెండల్లో తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేశారు. ఒంటిరి మహిళను బరిలో ఉన్నానని, జనమే తనకు అండగా నిలవాలని కోరారు. ఆమె వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఈసారి నన్ను గెలిపించండి
సాక్షి,బళ్లారి: ఈసారి ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని కేఆర్పీపీ అభ్యర్థి గాలి లక్ష్మీ అరుణ పేర్కొన్నారు. ఆమె బుధవారం నగరంలో జిల్లా చాంబర్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యవర్గాన్ని కలిసి మాట్లాడారు. వేలాది మంది వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులందరూ పెద్ద మనస్సుతో తనను దీవించి గెలిపించాలని కోరారు. గతంలో తన భర్త గాలి జనార్దనరెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యాపారుల సంక్షేమం, పరిశ్రమల స్థాపన కోసం శ్రమించారని గుర్తు చేశారు. నగరంలో పార్టీని గెలిపిస్తే మరింత ఉత్సాహంగా ఈ ప్రాంత అభివృద్ధికి శ్రమిస్తారన్నారు. ఓఎంసీ డైరెక్టర్ బీ.వీ.శ్రీనివాసరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి యశ్వంత్‌రాజ్, ఉపాధ్యక్షుడు మంజునాథ్, ప్రముఖులు రమేష్బుజ్జి, దొడ్డనగౌడ, సొంతా గిరిధర్, పాలన్న, పార్టీ ప్రముఖులు వెంకటరమణ, సూరిబాబు, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కప్పగల్ రోడ్డులో ఇంటింటా ప్రచారం చేసి పుట్‌బాల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పార్టీ మహిళా నాయకులు హంపీ రమణ, లీలా శ్రీనివాసరెడ్డి, పద్మ, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు. -
25 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తాం : గాలి జనార్ధన్
-
గాలి జనార్థన్‌రెడ్డి ఒక బ్రాండ్: భార్య అరుణ
బళ్లారి: కర్నాటకలో కళ్యాణ రాజ్యప్రగతి పక్ష పార్టీని స్థాపించిన గాలి జనార్థన్‌రెడ్డి ఒక బ్రాండ్ అని అంటున్నారు ఆయన భార్య అరుణ లక్ష్మి. గత మూడు దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఉన్నామని, ఇప్పుడు కొత్త పార్టీతో ప్రజల ముందుకు వచ్చామన్నారు. తమ రాజకీయ జీవితంలో కర్నాటక ప్రజలకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, అది చెబుతూ వెళ్తే ఒక రోజు సరిపోదన్నారు జనార్థన్‌రెడ్డి భార్య అరుణ. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడిన అరుణ.. ‘ నేను ఏ ఇంటికి వెళ్లినా ఒక ఆడపడుచులా స్వాగతిస్తున్నారు. బావ సోమశేఖర్‌రెడ్డి తమ ప్రత్యర్థిగా బరిలో ఉన్నప్పటికీ, గాలి జనార్థన్‌రెడ్డికి బళ్లారి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. బళ్లారిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. బళ్లారి జనంలో గాలి జనార్థన్‌రెడ్డి అంటే ఒక బ్రాండ్ అని తెలుసు. బీజేపీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాం. మేము 12 ఏళ్లు రాజకీయ జీవితానికి దూరంగా ఉన్నాం. జనానికి మంచి పనులు చేస్తూ రాజకీయంగా దూరంగా ఉండటం సరికాదనే భావించే పార్టీ పెట్టాం. మనకు భగవంతుడు ఇచ్చేది ఒకటే జీవితమని, దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరింత సేవ చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు. బళ్లారిలో కళ్యాణ రాజ్యప్రగతి పక్ష పార్టీ తరఫున గాలి జనార్థన్‌రెడ్డి భార్య అరుణ పోటీ చేస్తుండగా, బీజేపీ తరఫున గాలి జనార్థన్‌రెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి బరిలో నిలిచారు. -
గాలి జనార్దనరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే శేఖర్
బనశంకరి: చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే గూళిహట్టి శేఖర్‌కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో అసంతృప్తికి గురైన ఆయన మంగళవారం రాత్రి కేకేపీపీ సంస్దాపకుడు గాలి జనార్దనరెడ్డిని కలిశారు. బీజేపీ హైకమాండ్ నిర్ణయంపై గూళిహట్టి శేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో టికెట్ చేజారడంతో రాత్రికి రాత్రి బెంగళూరులోని పారిజాత నివాసంలో జనార్దనరెడ్డితో చర్చలు జరిపారు. దీంతో గూళిహట్టి శేఖర్ హొసదుర్గ నుంచి కేఆర్పీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
కొత్త పార్టీ ప్రకటించిన గాలి జనార్దన్ రెడ్డి.. 2023లో అక్కడి నుంచే పోటీ!
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీని స్థాపించారు. కొద్ది రోజుల క్రితం తుమకూరు నగరంలో ఉన్న సిద్ధగంగా మఠాన్ని సందర్శించిన సందర్భంగా సొంత పార్టీపై సూత్రప్రాయంగా వెల్లడించిన గాలి జనార్దన్ రెడ్డి.. ముందుగా చెప్పినట్లుగానే డిసెంబర్ 25న కొత్త పార్టీ ప్రకటన చేశారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు బీజేపీలో కొనసాగిన ఆయన.. నాయకత్వం బుజ్జగించినప్పటికీ కొత్త పార్టీవేపై మొగ్గు చూపారు. బీజేపీతో రెండు దశాబ్దాల బందానికి తెరదించారు. మరోవైపు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పల్ జిల్లాలోని గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ‘నేను ఆ పార్టీ సభ్యుడిని కానని దానితో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ ఆ పార్టీకి చెందిన వాడినేనని ప్రజలు విశ్వసించారు. ఆ నమ్మకం అబద్ధమని తేలింది. నా సొంత ఆలోచనతో ఈ రోజు కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని ప్రకటిస్తున్నాను. మతం, కులం పేరుతో చేసే విభజన రాజకీయాలకు ఈ పార్టీ దూరంగా ఉంటుంది. నా జీవితంలో మొదలు పెట్టిన ఏ విషయంలోనూ విఫలం కాలేదు. నా చిన్నతనంలో గోళీలు ఆడుకునేప్పటి నుంచి ఇప్పటి వరకు పరాజయాన్ని ఆమోదించని వ్యక్తిని. ప్రజల ఆశిస్సులు ఉంటాయనే విశ్వాసం ఉంది. భవిష్యత్తులో కర్ణాటక కల్యాణ రాజ్యంగా(సంక్షేమ రాష్ట్రంగా) అవతరిస్తుంది.’ - గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటక మాజీ మంత్రి గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు 9 మందిపై 2009లో సీబీఐ కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబర్‌లో జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నాలుగేళ్ల తర్వాత 2015లో కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురంకు వెళ్లరాదని స్పష్టం చేసింది. అయితే, 2020లో మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లగా ఆయా జిల్లాల ఎస్పీలకు తెలియజేసిన తర్వాత వెళ్లేందుకు వీలు కల్పించింది. ఇదీ చదవండి: పొలిటికల్ పార్టీపై మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి క్లారిటీ.. 'ఆ రోజే అన్ని చెబుతా' -
‘జూనియర్’గా వస్తున్న గాలి జనార్దన్ రెడ్డి తనయుడు
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన హీరోగా దర్శకుడు రాధాకృష్ణ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జెనీలియా ఓ కీలక పాత్ర పోషించబోతుంది. వారాహి చలన చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించారు మేకర్స్. ఈచిత్రానికి ‘జూనియర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కిరిటీ బర్త్‌డేని పురస్కరించుకొని శుక్రవారం సినిమా టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ని విడుదల చేశారు. ‘చిన్నప్పటి నుంచి మనం ఏదో ఒకటి అయిపోదాం అనుకుంటాం. మనం అవ్వకపోయినా జీవితం ఏదో ఒకటి చేసేస్తుంది..’అంటూ సాగే ఈ వీడియో గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
గాలి కిరీటి ‘వారాహి’ మూవీతో స్టార్ హీరోయిన్ రీఎంట్రీ
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు రాధాకృష్ణ ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘వారాహి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్, నటీనటుల ఎంపికను పూర్తి చేసుకున్న ఈ మూవీ నిన్న(మార్చి 4) హైదరాబాద్ ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. అనంతరం హీరో గాలి కిరీటి లుక్‌ను సంబంధించిన వీడియోను చిత్రం బృందం విడుదల చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనిలియా కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగులో చివరిగా జెనిలియా నా ఇష్టం సినిమాలో కనిపించింది. దాదాపు ఆమె సినిమాలకు దూరమై పదేళ్లు పూర్తయింది. ఈనేపథ్యంలో ఆమె తిరిగి రీఎంట్రీ ఇస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. కాగా ‘సత్యం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మెప్పించిన జెనిలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్తో పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. బొమ్మరిల్లులో హాహా హాసిని అంటూ ఆందరిని ఆకట్టుకున్న జెనిలియా ఢీ, రెడీ, ఆరెంజ్ వంటి చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. తెలుగులో నితిన్, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా. మంచు విష్ణు, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సరసన నటించిన జెనిలియా తమిళ, హిందీ చిత్రాల్లో సైతం హీరోయిన్ నటించింది. అక్కడ కూడా ఆమె మంచి నటిగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో 2013లో రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు. -
హీరోగా ఎంట్రీ ఇస్తోన్న గాలి జనార్థన్‌రెడ్డి కొడుకు, దర్శకుడు ఎవరంటే..
Former Minister Gali Janardhan Reddy Son Kireeti Reddy To Debut In Films: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు. కన్నడలో డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు కిరీటీ రెడ్డి. కొడుకును హీరోగా చేసేందుకు గాలి జనార్థన్ కిరీటి రెడ్డికి నటన, డ్యాన్స్, ఫైటింగ్లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడట. కాగా రాధాకృష్ణ కన్నడలో మాయాబజార్ మూవీని తెరకెక్కించాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరక్కించబోతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక ఈ మూవీ గురించి డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘నటుడు కావాలన్నది కిరీటి కల. చదవండి: ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్‌కు అమెజాన్ ఒప్పందం ఎంతో తెలుసా? షాకవ్వాల్సిందే.. ఇప్పటికే అతడు యాక్టింగ్, డ్యాన్స్, ఫైటింగ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 'జాకీ' చిత్రం స్ఫూర్తితోనే కిరీటి సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు’ అని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా తెలుగులో లెజెండ్, యుద్ధం శరణం వంటి చిత్రాలను రూపొందించిన నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రానికి నిర్మాత వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా కర్ణాటకకు చెందిన పలువురు రాజకీయ నాయకుల వారసులు సినిమాల్లోకి వచ్చిన సత్తా చాటుతున్నారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్, జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, చెలువరాయ స్వామి తనయుడు సచిన్‌లు ఇప్పటికే హీరోలుగా పరిచమయ్యారు. చదవండి: ‘ఆచార్య’ మూవీ టీంకు షాక్, మెగాస్టార్ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు -
గాలి జనార్ధన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బళ్లారి, అనంతపురం, కడప వెళ్లేందుకు అత్యున్నత న్యాయస్థానం అతనికి అనుమతినిచ్చింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ షరతులు ఎక్కడా ఉల్లంఘించలేదన్న కోర్టు.. స్థానిక జిల్లా ఎస్పీకి ముందస్తు సమాచారం అందించి సదరు ప్రాంతాలకు వెళ్లొచ్చని పేర్కొంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ మూడో వారానికి వాయిదా వేసింది. చదవండి: తనయుడి గిఫ్ట్‌కు తన్మయత్వంతో కన్నీళ్లు రాల్చిన తల్లి -
పోలీసుల ఎదుట హాజరైన గాలి
సాక్షి, బెంగళూరు: మూడు రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన రెడ్డి ఎట్టకేలకు శనివారం బెంగళూరులో తన లాయర్ చంద్రశేఖర రెడ్డితో కలిసి పోలీసుల ఎదుట హాజరయ్యారు. యాంబిడంట్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందనీ, ఈ కేసుతో తనకు అసలు ఏ సంబంధమూ లేదని జనార్దన రెడ్డి చెప్పారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. నేను తప్పు చేశానని నిరూపించేలా పోలీసుల వద్ద ఒక్క పత్రమూ లేదు’ అని అంతకుముందు ఆయన ఓ వీడియో విడుదలచేశారు. ఆదివారం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) జనార్దన రెడ్డికి నోటీసులు పంపడం తెల్సిందే. ‘యాంబిడంట్ కంపెనీ యజమాని ఫరీద్ ప్రతి ఒక్క రాజకీయ నేతతో ఫోటో దిగుతాడు. బెంగళూరులో ఎంతోమంది నాయకులతో అతనికి పరిచయం ఉంది. నేనెందుకు భయపడాలి, పారిపోవాలి?’ అని అన్నారు. యాంబిడంట్ సంస్థ ఆర్థిక పథకాల పేరుతో వందలాది మంది దగ్గర దాదాపు రూ. 600 కోట్లు వసూలు చేసి అనంతరం మోసానికి పాల్పడింది. ఈ కేసు నుంచి బయటపడేసేందుకు జనార్దన∙రెడ్డి రూ. 18 కోట్లు లంచం అడిగారని ఫరీద్ ఆరోపించడం తెలిసిందే -
నాడబ్బు నాకు ఇచ్చేయండి: గాలి జనార్ధన్ రెడ్డి
సాక్షి, బెంగళూరు : ఏపీ ప్రభుత్వం అవకాశమిస్తే వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మణి స్టీల్ ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేస్తానని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి చెప్పారు. అది సాధ్యం కాకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఆ స్టీల్ ప్లాంటును స్వాధీనం చేసుకుని నిర్మాణం పూర్తి చేసుకోవచ్చన్నారు. లేదంటే ఆ ప్లాంట్ నిర్మాణం కోసం తాను వెచ్చించిన రూ. 1,350 కోట్లు తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన బెంగళూరులోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలో స్టీలు ప్లాంటు స్థాపించాలనే డిమాండ్‌తో జరుగుతున్న పోరాటాలను మీడియా ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. 2007, జూన్ 10న జమ్మలమడుగులో బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరిట స్టీలు ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని గాలి జనార్దనరెడ్డి గుర్తు చేశారు. ఈ స్టీలు ప్లాంటు వల్ల ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికిపైగా ఉపాధి లభిస్తుందని, అందుకే దివంగత సీఎం వైఎస్ఆర్ను స్టీలు ప్లాంటు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. అప్పుడు అనుకూలమన్న మెకాన్ అప్పట్లో మెకాన్ సంస్థ తమకు కన్సల్టెంట్‌గా ఉందని జనార్దనరెడ్డి చెప్పారు. ప్లాంటు ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు లేవని మెకాన్ కూడా వెల్లడించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండడం వల్ల కడపలో స్టీలు ప్లాంటుకు అనువైన పరిస్థితులు లేవని ప్రస్తుతం మెకాన్ చెప్పడం సమంజసం కాదన్నారు. సీఎం చంద్రబాబు అనుమతిస్తే బ్రహ్మణి స్టీలు ప్లాంటు నిర్మాణాన్ని ఏ క్షణమైన ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. -
పదవుల పంట
నాకెప్పుడూ ఓడిపోయే పార్టీలో ఉండాలని కోరిక. అందువల్ల చాలా లాభాలున్నాయి. కాంగ్రెస్‌వారు హైదరాబాద్‌కి – చక్కటి ఎయిర్ కండీషన్ బస్సుల్లో తీసుకెళ్తారు. కుమారస్వామిగారు శ్రావణ బెళగొళ, నంది హిల్స్ బందిపూర్ వంటి స్థలాలకు తీసుకెళ్తారు. కొంచెం వయస్సు మళ్లినవారికి స్లీపర్ బెర్త్‌లు కూడా ఇస్తారు. ఇష్టమైన విందులూ, ఫలహారాలూ, మధ్య మధ్య సరదాగా పిక్నిక్లూ ఉంటాయి. నాకు చాలా ఇష్టమైన కర్ణాటక వంటలు– బిసిబెళబాత్, మద్దూర్ వడ, పులియోగరె, పడ్డు, దేవనగిరె బెన్నె దోశె, రాగి బాల్స్, నీర్ దోశె, అక్కి రోటి వంటివి తినిపిస్తారు. మళ్లీ పువ్వులాగా శాసనసభకి తీసుకువస్తారు. నాకు– ముఖ్యంగా దేవెగౌడ, కుమారస్వామి పార్టీలలో చేరాలంటే చాలా ఇష్టం. ప్రచారం గొడవలు ఎక్కువ ఉండవు. ‘కావేరీ నుంచి నీళ్లు తెస్తాను, తిరుపతి లడ్డూలు పంచుతాను, టిప్పుసుల్తాన్ కత్తిని ఫూల్‌బాగ్ మధ్యలో నిలబెడతాను’ వంటి హామీలు ఇవ్వనక్కరలేదు. పెద్ద పెద్ద ఎన్నికల సభలుండవు. కానీ అందరికీ ఆ పార్టీ గెలుస్తుందని, తప్పక పదవిలోకి వస్తుందని ఒక గౌరవం ఉంటుంది. ఎలా? అది చరిత్ర చెప్పిన పాఠం. 1996లో జనతాదళ్‌కి కేవలం 46 సీట్లు వచ్చాయి. కానీ దేవగౌడ ఈ దేశపు ప్రధాని అయి– హాయిగా పార్లమెంటులో అప్పుడప్పుడూ నిద్రకు విశ్రమించేవారు. 2006లో 58 సీట్లు మాత్రమే వచ్చాయి. అయినా బీజేపీతో పొత్తు పెట్టుకుని రొటేషన్మీద కుమారస్వామిగారు 20 నెలలు ముఖ్యమంత్రి అయి, తర్వాత బీజేపీని ‘మీ దిక్కున్నవాడితో చెప్పుకోండి’ అన్నారు. అలా అనగలిగే మగాడు కుమారస్వామి ఒక్కరే. ఇప్పుడు కేవలం– 38 సీట్లతో– 18 శాతం ఓటర్ల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. వారు హడావుడి చెయ్యరు. రాజకీయాల్లోకి పోరు. అవినీతి, లంచాలు వంటి బూతు మాటలు మాట్లాడరు. అయితే అలనాడు రెండు పిల్లుల తగాదా ఒక కోతి తీర్చినట్టు వారు ముఖ్యమంత్రి అవుతారు. నన్ను ‘తినుబండారాలశా ఖ’కు మంత్రిని చేశారనుకోండి. రాష్ట్రమంతా రాగి బాల్స్, నీర్ దోశె, అక్కి రోటి ఉచితంగా పంచుతానని ఇప్పుడే హామీ ఇస్తున్నాను. అయితే కుమారస్వామిలాగా ముఖ్యమంత్రి కావాలి. బీజేపీ మీద కసితో కాంగ్రెస్ ‘బేషరతు’గా జనతాదళ్‌కి మద్దతు ఇచ్చింది. అంటే ఎవరినీ మంత్రిమండలిలోకి తీసుకోవాలన్న షరతు లేదు. చక్కగా ఐదేళ్ల పాలనకు ఇది రాచబాట. ఈ కేసుని విచారించిన న్యాయమూర్తుల్లో కనీసం ఒక్కరికయినా ‘హాస్య ధోరణి’ ఉన్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. జస్టిస్ సిక్రీగారు సరదాగా అన్నారు: ‘నన్ను, ఎమ్మెల్యేలున్న హోటల్ ప్రొప్రయిటర్ అడిగాడు: అయ్యా– నా దగ్గర 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నన్ను సీఎంని చేస్తారా? అని’ అంటూ. ముందు ముందు– పాలిస్తున్న బీజేపీని ఓడించటానికి సంకీర్ణ ప్రభుత్వాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాను. రేపు రాబోయే 2019 ఎన్నికలలో అసలు ఆఫీసుకూడా లేని, కేవలం చొక్కా, ప్యాంటుగల కొత్త పార్టీలు చాలా మొలకెత్తవచ్చు. వాటిలో చేరాలని నా తలంపు. ‘నన్ను ఎవరు ఉజ్జయినికి తీసుకెళ్తారు? రాజస్తాన్ ‘చిమ్ చిమ్ పరోటా’, బజ్రే కే రోటీ, లాషూంకి చెట్నీని ఎవరు తినిపిస్తారు? హరిద్వార్‌లో పవిత్ర గంగా స్నానం చేయించి వేడి వేడి హల్వా, జిలేబీ తినిపిస్తారు? – వంటి కోర్కెలు కోరవచ్చు. అయితే ఇక మీదట కొన్ని సమస్యలు జనతాదళ్‌కి రావచ్చు. తమని సమర్థించిన పార్టీకి 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిమీద ప్రేమతో వారు జనతాదళ్‌లో చేరలేదు. పక్కవాడిని చెప్పు తీసి కొట్టాలంటే తన కొత్త చెప్పు ఎందుకని పొరుగువాడి ‘చెప్పు’ అయితే లాయకీ– అని వారు నమ్మారు. మరి ఇప్పుడు– లోగడ సంప్రదాయం ప్రకారం కుమారస్వామి ఏ రెండేళ్లో పాలన చేసి కాంగ్రెస్‌కి అప్పగిస్తారా? గొప్ప గొప్ప పదవులన్నీ కాంగ్రెస్‌కి ఇస్తారా? ఇందులో మళ్లీ ఆర్థిక మంత్రి ఎవరు? గనుల మంత్రి (మరచిపోవద్దు– గాలి జనార్దన రెడ్డి ఉన్న రాష్ట్రమది. మంత్రి ఎవరున్నా వారిని ‘మచ్చిక’ చేసుకోవడం రెడ్డిగారికి వెన్నతో పెట్టిన విద్య). అందువల్ల కర్ణాటకలో గనుల శాఖకు చెప్పలేని ప్రాధాన్యం ఉంది. ఇవన్నీ ఎన్నికయ్యాక వచ్చే సమస్యలు. అలాగే బేషరతుగా తమని సమర్థించిన కాంగ్రెస్‌కి (78) ఎన్ని మంత్రి పదవులివ్వాలి? మరి మాలాంటి వాళ్లకి కేవలం మద్దూర్ వడ, అవిరిక్కే పాల్యాతో కుమారస్వామి సరిపెట్టేస్తారా?– అన్న విషయం గమనించాల్సి ఉంది. వ్యాసకర్త గొల్లపూడి మారుతీరావు -
బీజేపీకి ఝలక్ : బేరసారాల క్లిప్ లీక్
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణకు గడువు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఉందని బీజేపీ చెబుతుండగా, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ఎత్తులకు పైఎత్తులతో ముందుకు వెళుతున్నాయి. తమ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడానికి బీజేపీ బేరసారాలు మొదలుపెట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు సంధించింది. అందుకు సంబంధించి శుక్రవారం సాయంత్రం ఒక ఆడియో క్లిప్ ను ఆ పార్టీ విడుదల చేసింది. సీఎం యెడ్యూరప్ప తరపున గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉగ్రప్ప మీడియా సమావేశంలో దీనికి సంబంధించి ఒక ఆడియోను విడుదల చేశారు. అయితే, వెంటనే రంగంలోకి దిగిన బీజేపీ అది ఫేక్ ఆడియో క్లిప్ అంటూ ఖండించింది. ‘‘యెడ్యూరప్పకు మద్ధతు ఇస్తే నీ లైఫ్‌సెటిల్ చేస్తా. రూ. 150 కోట్లతోపాటు మంత్రి పదవి దక్కేలా చూస్తా. పాత విషయాలు మరిచిపోండి. మీకు ఏం కావాలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే నేరుగా మీతో మాట్లాడుతారు. శివన్నగౌడ గతంలో నా మాట వినే మంత్రి అయ్యారు. రాజీవ్ గౌడ నా వల్లే అభివృద్ధి చెందారు. ఇవాళ శివన్న గెలిచినా లాభం లేదు. నేరుగా పెద్ద వాళ్లతో మాట్లాడిస్తా. నువ్వు మంత్రివి అవుతావ్... నువ్వు ఇప్పటిదాకా సంపాదించిన ఆస్తికన్నా వందరెట్లు ఎక్కువ సంపాదిస్తావ్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బసన్న గౌడ (రాయచూర్)తో మంతనాలు జరిపినట్టుగా ఆ ఆడియో క్లిప్ లో వినిపిస్తోన్న విషయం ఉగ్రప్ప మీడియాకు వెల్లడించారు. ప్రలోభాలకు గురిచేసినప్పటికీ ‘మీపై గౌరవం ఉంది. కానీ, కాంగ్రెస్‌కు నమ్మక ద్రోహం చేయలేను’ అని బసన్న బదులిచ్చారని చెబుతూ, ఇదే తరహాలో మరికొందరిని కూడా ప్రలోభపెట్టాలని చూశారని ఉగ్రప్ప బీజేపీపై మండిపడ్డారు. మొదట్లో 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 150 కోట్ల రూపాయలు ఇస్తామంటూ బేరసారాలకు దిగుతోందని ఉగ్రప్ప ఆరోపించారు. ఈఆరోపణలకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కూడా ఓ ట్వీట్ చేసింది. బీజేపీ స్పందన.. కాగా, ఈ ఆడియో క్లిప్‌పై బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. అది ఫేక్ క్లిప్ అని, కాంగ్రెస్ నీచపు రాజకీయాలకు తెరలేపిందని ఆయన మీడియాకు తెలియజేశారు. Congress released an Audio clip where BJP leader Janaradhana Reddy is trying to lure Congress MLA from Raichur Rural by offering money and posts. Janaradhana Reddy clearly says he has the backing of BJP President Amit Shah for doing horse trading! pic.twitter.com/oVEC88DgV2 — Karnataka Congress (@INCKarnataka) 18 May 2018 -
కోర్టు తీర్పు వల్లే ఓటు వేయలేకపోయారు
-
కోర్టు ఆంక్షలు.. ఓటు వేయని గాలి
బళ్లారి: బీజేపీ కీలక నేత, వివాదాస్పద మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. అక్రమ మైనింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నా ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. గాలి తన స్వస్థలం బళ్లారికి వెళ్లకూడదంటూ సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా, ఓటు వేసేందుకు గాలి ప్రత్యేకంగా అనుమతి కోరారా, లేదా అన్నది తెలియాల్సిఉంది. నాన్నతో కలిసి ఓటేద్దామనుకున్నా: మరోవైపు గాలి కుటుంబీకులంతా ఓట్లు వేశారు. తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న జనార్ధన్‌రెడ్డి కూతురు బ్రాహ్మణి మీడియాతో మాట్లాడారు. ‘‘ఫస్ట్‌టైమ్ ఓటేస్తున్నాను. నిజానికి మా నాన్నతో కలిసి తొలిసారిగా ఓటు వేయాలని అనుకున్నా. కానీ కుదరలేదు. కోర్టు తీర్పును ఆయన అనుసరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి’’ అని బ్రాహ్మణి అన్నారు. -
గనుల రాజ్యంలో విజేతలెవరు?
గనులకు ప్రసిద్ధి పొందిన బళ్లారిలో హోరాహోరి పోరు జరుగుతోంది. గతంలో సంచలనాలకు కారణమైన గాలి జనార్దన్‌రెడ్డి సోదరులిద్దరూ ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున రంగంలో ఉన్నారు. ఆయన తన ప్రాంతంలోని 23 సీట్లలో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారనే ఆశతో బీజేపీ ఉంది. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం సీట్లలో ఇక్కడివి పదిశాతం ఉండడంతో జనార్దన్ రెడ్డి కీలక వ్యక్తిగా అవతరించారు. అన్నిచోట్లా కనిపించే అన్నదమ్ముల మధ్య ఉండే కీచులాటలు ఏ మాత్రం ఇక్కడ లేవు. ఒకప్పుడు నీళ్లు లేని ప్రాంతంలో ప్రస్తుతం ఎన్నికల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ గనుల రాజ్యంలో విజేతలెవరు అన్నదే తేలవలసిన ప్రశ్న. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గోడల మీద రాతలు, పోస్టర్లుగాని వీధుల్లో బ్యానర్లు, జెండాలుగాని కనిపించడం లేదు. అన్ని చోట్లా దర్శనమిచ్చే హోర్డింగులు, కటౌట్లు సైతం లేవు. దశాబ్దాల నా పాత్రికేయ వృత్తిలో నేను ఈ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. అయితే, 2000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి ఈశాన్య సరిహద్దులో ఆంధ్రప్రదేశ్‌కు అనుకుని ఉన్న బళ్లారి చేరుకోగానే పైన చెప్పినవన్నీ దర్శనమిచ్చాయి సన్నని, అందమైన పక్కా రోడ్డు మొలకల మూరు గ్రామానికి దారితీస్తుంది. అక్కడ పోలీసు చెక్పోస్ట్తోపాటు కేంద్ర పారామిలిటరీ దళాలు రోడ్డు మలుపు వద్ద గస్తీలో ఉన్నాయి. గ్రామంలోకి వెళ్లేవా రిపై కంటే లోపలి నుంచి వచ్చేవారిపైనే ఈ దళాలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. నీటి జాడ లేని ఈ దారిలో కొన్ని వందల మీటర్లు దాటాక ఆకుపచ్చని ఒయాసిస్ కనిపించింది. మిగతా ప్రాంతాల్లో లేని కానరాని హోర్డింగులు, కటౌట్లు అక్కడున్నాయి. తర్వాత బీజేపీ నేత బి.శ్రీరాములు భారీ కటౌట్ కనిపిస్తుంది. సీఎం సిద్ధరామయ్యపై బాదామిలో బీజేపీ అభ్యర్థిగా శ్రీరాములు పోటీచేస్తున్నారు. విజేతలను నిర్ణయించే వారిపైనే కొండంత ఆశ గతంలో సంచలనాలకు కారణమైన గాలి జనా ర్దన్‌రెడ్డి సోదరులిద్దరూ ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున రంగంలో ఉన్నారు. జనార్దన్‌రెడ్డికి దశాబ్దాలుగా సన్ని హితుడు శ్రీరాములు. ఈ ఎన్నికల్లో బళ్లారి చక్రవర్తిగా ముద్రపడిన జనార్దన్ అందరి దృష్టిని ఆకర్షించడమే గాక ఎన్నికల్లో విజేతలను నిర్ణయించే స్థితిలో ఉన్నారు. దేశంలో ఏ ఇతర రాజకీయ నేతపై లేనన్ని కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తన ప్రాంతంలోని 23 సీట్లలో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారనే ఆశతో బీజేపీ ఉంది. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం సీట్లలో ఇక్కడివి పదిశాతం ఉండడంతో ఆయన కీలక వ్యక్తిగా అవతరించారు. ముగ్గురు గాలి సోదరుల్లో జనార్దన్ అందరి కన్నా చిన్నవాడు. ఆయన అన్నలు కరుణాకర్, సోమ శేఖర. కిందటి యడ్యూరప్ప మంత్రివర్గంలో ఇద్దరు రెడ్డి సోదరులు, శ్రీరాములు కీలక శాఖలతో (మౌలిక సదుపాయాలు, టూరిజం, ఆరోగ్యం, సంక్షేమం, రెవెన్యూ) కేబినెట్ మంత్రులుగా పనిచేశారు. గాలి కుటుంబం ఆధిపత్యంలో నడిచిన ‘బళ్లారి రిపబ్లిక్’ ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ సీట్లకు తగ్గట్టుగా ఈ ముగ్గురు బళ్లారి మంత్రులు కేబినెట్లోని పది శాతం శాఖలు నిర్వహించారు. సోమశేఖరరెడ్డి కర్ణాటక పాల సహకార సమాఖ్య చైర్మన్‌గా పనిచేశారు. ముగ్గురు గాలి సోదరులు, శ్రీరాములు తమపై కేసుల విచా రణ సమయంలో జైలు జీవితం గడిపారు. బళ్లారి జిల్లాలోకి ప్రవేశించకూడదనే షరతుపై కోర్టు తనకు బెయిలు మంజూరు చేసింది. అందుకే ఆయన బళ్లారి సరిహద్దులోని మొలకమూరు గ్రామం నుంచి ఎన్ని కల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోకి వెళ్లలేని జనార్దన్! నేటి బళ్లారి పరిస్థితి గమనిస్తే హిందీ సినిమా షోలేలో జైలర్‌గా నటించిన ఆస్రాణీ డైలాగ్ ఒకటి గుర్తు కొస్తుంది. ‘‘హమారే ఆద్మీ చారోం తరఫ్ ఫయ్లే హుయే హై’ (మా మనుషులు ఈ ప్రాంతమంతా విస్తరించి డ్యూటీలో ఉన్నారు) అనే మాటలు అస్రాణీ నోట వినిపిస్తాయి ఈ సినిమాలో. జనార్దన్‌రెడ్డి కూడా ఇవే మాటలు చెబితే పరిస్థితికి అద్దం పడతాయి. ఆయన బళ్లారి వెళ్లలేరు. ఆయన మనుషులు, సోద రులు అందరూ అక్కడినుంచే పోటీ చేస్తున్నారు. అన్నదమ్ముల్లో పెద్దవాడైన సోమశేఖర బళ్లారి లోని సత్నాంపేట ప్రాంతంలో ఇంటింటి ప్రచారం చేస్తూ కనిపించారు. అక్కడి ఓ చిన్న వీధిలో తమకు షెడ్యూల్డ్ కులం(ఎస్సీ)హోదా కావాలని కోరుతున్న జంగమ కులస్తులు గుమిగూడారు. ఆయన వెంటనే అందుకు అంగీకారం తెలిపారు. ఎవరీ జంగమలు (జంగాలు)? వారంతా లింగాయతులే. గురువులుగా పిలిచే పూజారి వర్గం కిందికి వారు వస్తారు. తమ కులంవారికి తమ మతం గురించి బోధించడమే వారి కుల వృత్తి. ఈ లెక్కన వారు పనిచేయకుండా భక్తుల దానధర్మాలపై ఆధారపడి జీవించాలి. ‘భిక్షాటనే’ తమ ఉపాధి మార్గం కాబట్టి తమను ఎస్సీల్లో చేర్చా లనేది వారి వాదన. అంటే, ఉన్నత కులంలోని మరింత ఉన్నత వర్గం తమను షెడ్యూల్డ్ కులంగా గుర్తించాలని కోరుకుంటోందని మనకు అర్థమౌ తోంది. లింగాయతులందరికీ మైనారిటీ మత హోదా ఇస్తానని సిద్దరామయ్య వాగ్దానం చేశారు. ఇలా చూస్తే కర్ణాటకలో నడుస్తున్నవి సంక్లిష్టమైనవి. సోమశేఖరను ఆయనపైన, ఆయన సోదరుల పైన పెట్టిన మైనింగ్ కేసుల గురించి ప్రశ్నించగా, తాము అమాయకులమనీ, తమ ప్రత్యర్థులు, కాంగ్రెస్ కలిసి తమను వేధిస్తున్నారని జవాబిచ్చారు. అంతేగాక, అన్ని మైనింగ్ కార్యకలాపాలు నిలిపివేసి, తాజాగా గనులు వేలం వేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వునే ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాలు కోల్పో యిన పది లక్షల మంది జనం రోడ్డున పడ్డారని ఆయన చెప్పారు. క్రిమినల్ కేసుల గురించి ప్రస్తా విస్తూ, ‘‘కోర్టులనే నిర్ణయించనీయమనండి. న్యాయమే గెలుస్తుంది. బళ్లారిలో అతిగా మైనింగ్ జరిగిందేగాని నేరపూరితంగా గనుల తవ్వకాలు జరగలేదు,’’ అని ఆయన చెప్పుకొచ్చారు. తర్వాత కుటుంబం గురించి అడుగుతూ, ఎవరు బాస్? ఎవరిది తుది నిర్ణయమని ప్రశ్నించగా, జనా ర్దనే అని ఆయన జవాబిచ్చారు. ఆయన అన్నద మ్ముల్లో చిన్నవాడు కదా! అని నేనడగ్గానే, ‘‘లేదు సార్. అతను అందరిలోనూ అత్యంత తెలివైనవాడు,’’ అంటూ చిన్న తమ్ముడిని పెద్దన్న పొగిడారు. అన్ని చోట్లా కనిపించే అన్నదమ్ముల మధ్య ఉండే కీచు లాటలు ఏ మాత్రం ఇక్కడ లేవు. పూర్వపు యడ్యూ రప్ప కేబినెట్లో కూడా రెడ్డి సోదరుల హవా నడిచిన రోజుల్లో జనార్దన్‌రెడ్డే కీలక శాఖలు నిర్వహించారు. మైనింగ్ లెక్కలు వివరించిన జేడీఎస్ నేత! గనుల తవ్వకాలకు సంబంధించిన ఆర్థికాంశాలు, మైనింగ్‌లో అక్రమాల గురించి తెలుసుకోవడానికి జేడీఎస్ అభ్యర్థి హోతూరు మహ్మద్ ఇక్బాల్‌తో గంట సేపు మాట్లాడాం. సౌమ్యుడేగాక ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబ పెద్ద అయిన ఇక్బాల్‌కు మూడు పెద్ద గనులున్నాయి. 2000 సంవత్సరం వరకూ ఇక్కడ మైనింగ్‌లో సమస్యలుగాని భారీ లాభాలు గాని లేవు. అంతకు ముందు టన్ను ఇనుప ఖనిజం తవ్వకానికి రూ.150 ఖర్చయితే, రూ. 250కి అమ్మే వారు. ప్రభుత్వానికి రాయల్టీ కింద రూ.16.50 చెల్లించేవారు. అంటే ఇది తక్కువ లాభాలున్న వ్యాపారం. అదీగాక బళ్లారి ఇనుప ఖనిజం నాణ్యత కూడా బాగా తక్కువ. అమ్మడం కష్టంగా ఉండేది. చైనా నుంచి దీనికి డిమాండ్ అమాంతంగా పెరిగి పోయింది. టన్ను ధర 600 నుంచి 1,000 వరకూ పెరిగి, తర్వాత కొద్ది రోజులకే రూ.6 వేలకు చేర డంతో గనుల యజమానులు సంపన్నులయ్యారు. చట్టవ్యతిరేకంగా తవ్వకాలతోపాటు నల్లధనం పెరిగిపోయింది. అప్పటి నుంచి గనుల తవ్వకాలు జరిపే కంపెనీల యజమానుల జీవనశైలి మారిపో యింది. మాఫియా పాలన మొదలైంది. ఫలితంగా తవ్వకాలపై విధించిన పూర్తి నిషేధం, తాజా వేలం పాటలు సహేతుకమైనవి కావని ఇక్బాల్ చెప్పారు. ఇనుప, మాంగనీస్ ఖనిజాలు ఇక్కడ దొరకడం ప్రజ లకు చివరకు శాపంగా మారింది. మైనింగ్‌పై పూర్తి నిషేధం విధించే వరకూ అందరూ ఎవరి శక్తిని బటì ్ట వారు ఉచితంగా ఖనిజాన్ని తవ్వుకునేవారు. గతంలో మైనింగ్ పర్మిట్లు ఉన్నవారు తమ పరిధి చుట్టుపక్కల కూడా తవ్వకాలు జరిపి అమ్ముకునేవారు. మీకు బల ముంటే మీ పొరుగువారి గనులను కూడా తవ్వుకోవ చ్చనే రీతిలో అక్రమ తవ్వకాలు సాగాయి. యడ్దీపై గాలి సోదరుల తిరుగబాటు! లోకాయుక్త నివేదిక ఆధారంగా యడ్యూరప్ప సర్కారు చర్యలు తీసుకోవడంతో గాలి సోదరులు తిరుగుబాటు చేశారు. ఫలితంగా బీజేపీ సర్కారు సంక్షోభంలో చిక్కుకుంది. బళ్లారిలో లెక్కలకు కూడా అందనంత స్థాయిలో వచ్చి పడిన సొమ్ము నేరాలకు, ఊహకందని విపరీత జీవనశైలికి కారణమైంది. వెను కబడిన పేద ప్రాంతమైన బళ్లారి గనుల యజమాను లకు విలాసవంతమైన కార్లు, ప్రైవేటు విమానాలు, హెలికాప్లర్లు సొంతమయ్యాయి. కాని, ఇప్పుడు అంతటి విలాసాలు, ఆర్భాటాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ లాడ్ గతంలో తనకున్న రెండు హెలికాప్టర్లను ఇప్పుడు అమ్మేశారు. 20 టన్నుల కెపాసీటీ లారీలు 50 టన్నుల ఇనుప ఖనిజం లోడుతో రోడ్లపై పోతుంటే కార్ల డ్రైవింగ్ కష్టం కాబట్టే హెలికాప్లర్లలో తిరిగామని ఆయన వివరిం చారు. బళ్లారిలో ముగ్గురు అభ్యర్థులూ గతంలో గనుల యజమానులే. జేడీఎస్ అభ్యర్థి తన మూడిం టిలో రెండు మైన్లు కోల్పోగా, కాంగ్రెస్ అభ్యర్థి తాను తవ్వకాలు జరిపిన గనులన్నిటినీ పోగొట్టుకున్నారు. ఎన్నికల ఫలితం వల్ల తమకు మళ్లీ మంచి రోజులొ స్తాయని అభ్యర్థులు ఆశిస్తున్నారు. ప్రపంచ మార్కె ట్లో ఖనిజాల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
గాలి జనార్దన్ రెడ్డి వినతిని తోసిపుచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు బళ్లారి జిల్లాలో ప్రవేశానికి అనుమతి కోసం గాలి జనార్దన్ రెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శుక్రవారం గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీం బెంచ్ విచారణ చేపట్టింది. తన సోదరుడు సోమశేఖర్ రెడ్డి తరఫు ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. అది సహేతుక కారణంగా తాము భావించటం లేదంటూ బెంచ్ ఆ వినతిని తిరస్కరించింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆయన కుటుంబసభ్యులు, అనుచరులైన 9 మందికి బీజేపీ టికెట్లిచ్చింది. ఏపీలో అనంతపురం, కర్ణాటకలోని బళ్లారిల్లో ఇనుప ఖనిజం అనధికార మైనింగ్, ఎగుమతుల ఆరోపణలపై 2009లో జనార్దన్‌రెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. 2015లో ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. -
గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: గనుల అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పలు కేసుల్లో తన బెయిలు మంజూరుకు విధించిన షరతులను సడలించాలని కోరుతూ సోమవారం ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. అనంతపురం, బళ్లారి ప్రాంతాలకు రాకూడదని, విదేశాలకు వెళ్లకూడదని ఆయనను ఆదేశిస్తూ గతంలో బెయిల్ సమయంలో కోర్టు షరతులు విధించడం తెలిసిందే. స్వస్థలం వెళ్లేందుకు అనువుగా బెయిల్ షరతులను సడలించాలని తాజా పిటిషన్లో జనార్దన్‌రెడ్డి కోరారు. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని బెంచ్ పిటిషన్‌ను విచారించి షరతుల సడలింపు కుదరదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. ప్రధాన కేసులో చార్జిషీటు దాఖలైన తర్వాత బెయిల్ షరతుల అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. -
న్యాయస్థానంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది
సాక్షి,బళ్లారి: రాబోయే రోజుల్లో బళ్లారిలో తాను ఉండేందుకు న్యాయస్థానం అనుమతి ఇస్తుందనే విశ్వాసం తనకు ఉందని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని శ్రీకనక దుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గనుల కేసుల్లో బళ్లారికి వచ్చి వెళ్లేందుకు కోర్టు అనుమతి తీసుకోవాలనే ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. సత్య మార్గంలో నడిచే తనకు న్యాయస్థానంపై నమ్మకం ఉందన్నారు. బళ్లారి అంటే తనకు ప్రాణమని, బళ్లారిలో ఉంటే ఇక్కడి ప్రజలకు సేవ చేసే భాగ్యం లభిస్తుందన్నారు. తన తల్లిదండ్రులు దసరాను సంప్రదాయబద్ధంగా జరుపుకునే వారని, అదే తరహాలో తాను తన కుటుంబ సభ్యులతో దసరా జరుపుకునేందుకు బళ్లారికి వచ్చానన్నారు. బీజేపీలో తాను సామాన్య కార్యకర్తగా పని చేస్తున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలా? వద్దా? అన్నది బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. ఉన్నంత వరకు బీజేపీ, ప్రజల కోసం పని చేస్తానన్నారు. ఎంపీ బీ.శ్రీరాములు, ఆయన తనయుడు కిరీటిరెడ్డి తదితరులున్నారు. -
హీరోగా మైనింగ్ కింగ్ వారసుడు..?
తెలుగు రాష్ట్రలతో పాటు కర్ణాటకలోనూ మైనింగ్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న గాలి జనార్థన్ రెడ్డి త్వరలో సినీరంగంలోకి అడుగుపెట్టబోతున్నారట. రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఈయన, త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు తన కొడుకు కిరీటి రెడ్డి హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు. ఇటీవల జరిగిన సోదరి వివాహ వేడుకలో తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్న కిరీటి నటనలోనూ శిక్షణ పొందాడు. ప్రస్తుతం కిరీటి హీరోగా తెరకెక్కబోయే సినిమాకు కథ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు గాలి ఫ్యామిలీ. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కూడా భారీ సినిమాతో పరిచయం అయినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అందుకే తన కుమారుడి విషయంలో అలాంటి పొరపాట్లు జరగకుండా గాలి జనార్థన్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నాడన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కన్నడ పరిశ్రమ నుంచి కిరీటి రెడ్డి ఎంట్రీపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. -
ఆయనను సీఎంగా చూడాలి: గాలి జనార్దన్ రెడ్డి
బళ్లారి: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషిచేస్తానని మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్ల చెప్పారు. ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, యడ్యూరప్పను ముఖ్యమంత్రి చేయడం తమ కల అని అన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చేందుకు సిద్ధమని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. కాగా, తన వివాహ రజతోత్సవ వేడుకలను గురువారం బళ్లారిలోని హవంబావిలోని స్వగృహంలో ఆయన జరుపుకున్నారు. ఇంతకుముందు యడ్యూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో జైలుకెళ్లినప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మూడేళ్లు జైలులో ఉన్న తరువాత గతేడాది బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్లీ ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. -
ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం లేదు: మాజీ మంత్రి
బెంగళూరు: బీజేపీ కోసం రాష్ట్రంలో పర్యటించి శ్రమిస్తానని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ముళబాగిలు తాలూకా కురుడుమలై గ్రామంలో వినాయక ఆలయంలో పూజలు నిర్వహించడానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కోలారు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఎన్నికల పట్ల ఆసక్తి లేదని.. అయినా పార్టీ అప్పజెప్పే బాధ్యతను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి తెలిపారు. రాజకీయాల గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టం లేదని మళ్లీ వచ్చినపుడు ఆ అంశాలపై మాట్లాడుతానని చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బీపీ వెంకటమునియప్ప, మాజీ అధ్యక్షుడు ఎట్టికోడ్డి కృష్ణారెడ్డి, తదితర కీలకనేతలు గాలి జనార్థన్ రెడ్డి తో పాటుగా ఉన్నారు. ఆయన గత కొంతకాలం నుంచి రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యహరించడం లేదన్న విషయం తెలిసిందే. -
వందకోట్లు వైట్‌మనీగా మార్చారు!
గాలి కూతురి పెళ్లి కోసం 20% కమీషన్‌పై డబ్బు మార్పు ► కర్ణాటక అధికారి భీమానాయక్ డ్రైవర్ సూసైడ్ నోట్లో వెల్లడి ► లేఖలో ప్రభుత్వాధికారి భీమా నాయక్ అక్రమాస్తుల వివరాలు బెంగళూరు: పారిశ్రామికవేత్త గాలి జనార్దన రెడ్డి.. కూతురి పెళ్లి కోసం రూ.100 కోట్ల నల్లధనాన్ని చెలామణిలోకి తెచ్చారని.. మంగళవారం ఆత్మహత్య చేసుకున్న ఓ ప్రభుత్వాధికారి డ్రైవర్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. బెంగళూరలో ప్రత్యేక భూ సేకరణ అధికారిగా పనిచేస్తున్న భీమా నాయక్.. డ్రైవర్ కేసీ రమేశ్ గౌడ.. మాండ్యలోని ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ గదినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆత్మహత్య లేఖలో గాలి కూతురి పెళ్లికి నల్లధనం ఎలా చెలామణిలోకి వచ్చిందీ, భీమానాయక్ అక్రమాలు, అక్రమాస్తుల వివరాలున్నాయి. ఈ వివరాలన్నీ తనకు తెలియటంతోనే చంపేందుకు ప్రయత్నిస్తున్నారని రమేశ్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. కాగా, ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘అక్టోబర్ 28న భీమానాయక్, మరో వ్యక్తితో కలిసి.. ఓ గెస్ట్ హౌజ్‌లో బీజేపీ ఎంపీ శ్రీరాములు, గాలి జనార్దన రెడ్డిలను కలిశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హగరిబొమ్మనహల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్న ఆ వ్యక్తి.. అందుకోసం రూ.25 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు’ అని లేఖలో రమేశ్ పేర్కొన్నారు. గాలి కూతురి పెళ్లికి రూ.25 కోట్ల వైట్ మనీని ఎలా తెచ్చిందీ నవంబర్ 15న ఓ హోటల్లో తనముందే చెప్పారన్నారు. అవి కాకుండా.. రూ.100 కోట్లను 20 శాతం కమీషన్‌కు మార్చుకున్న తీరును రమేశ్ తన లేఖలో వివరించారు. అలాగే, శ్రీరాములు ఇంటికీ నాయక్ వెళ్లిన సందర్భాలు.. ఆయా సమయాల్లో వాడిన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లనూ రమేశ్ లేఖలో పేర్కొన్నారు.ఇవన్నీ తనకు తెలియటంతో చంపించేస్తామని బెదిరించారన్నారు. భీమ్ నాయక్ అక్రమ సంపాదన, అక్రమాస్తుల వివరాలనూ రమేశ్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. నాయక్, ఆయన వ్యక్తిగత డ్రైవర్ మొహమ్మద్లే తన ఆత్మహత్యకు కారణమన్నారు. తనకు జీతం రాకుండా మూడు నెలలు అడ్డుకున్నారన్నారు. నోట్లరద్దు నేపథ్యంలో అంగరంగ వైభవంగా తన కూతురు వివాహాన్ని చేసిన గాలిపై ఐటీ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఆరోపణలు అవాస్తవమని.. తమ పరువు తీసేందుకు ఆడుతున్న కుట్రలో భాగమని ఎంపీ శ్రీరాములు ఢిల్లీలో తెలిపారు. కాగా.. ఈ కేసులో నిష్పాక్షిక విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. -
గాలి జనార్దనరెడ్డికి ఐటీ నోటీసులు
-
గాలి జనార్దనరెడ్డికి ఐటీ నోటీసులు
రికార్డుల పరిశీలన బెంగళూరు/సాక్షి, బళ్లారి: కోట్లు ఖర్చు పెట్టి కూతురి పెళ్లిని వైభవంగా నిర్వహించిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. అలాగే జనార్దన రెడ్డికి సంబంధించిన కార్యాలయాలపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు. బెంగళూరు, హుబ్బళ్లి నుంచి బళ్లారికి వచ్చిన అధికారులు ముందుగా ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ), అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఏఎంసీ) కార్యాలయాల్లో రికార్డులు పరిశీలించారు. అనంతరం గాలి జనార్దనరెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులిచ్చారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం కొన్నారు? ఎవరి దగ్గర కొన్నారు? అనే ప్రశ్నావళిని జనార్దన రెడ్డికి ఇచ్చారు. ఈ నెల 25 లోపు సమాధానాలు చెప్పాలని ఆదేశించారు. అలాగే పెళ్లిలో అలంకరణ, వంటకాలు, వీడియో ఫొటోగ్రఫీ పనులు చూసుకున్న 10 ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు. వీటిలో 7 బెంగళూరులో ఉండగా, 3 హైదరాబాద్‌కు చెందినవి. దాడుల విషయం తెలుసుకుని మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బళ్లారికి చేరుకున్న జనార్దనరెడ్డి ఇక్కడ ఉండేందుకు కోర్టు గడువు ముగియడంతో పెళ్లి కార్యక్రమాలు ముగించుకుని రాత్రి బెంగళూరుకు వెళ్లారు. -
వైభవంగా గాలి జనార్దనరెడ్డి కుమార్తె వివాహం
20న హైదరాబాద్‌లో రిసెప్షన్ సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, లక్ష్మి అరుణ దంపతుల కుమార్తె బ్రహ్మణి వివాహం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమ్‌దేవ్‌రెడ్డి, రమాదేవిల కుమారుడు రాజీవ్‌రెడ్డితో బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో జరిగిన ఈ వేడుకలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ, పారిశ్రామిక, చలనచిత్ర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు 50 వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. మైదానంలోని దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో తిరుమల శ్రీవారి ఆలయ సెట్‌ను రూపొందించి.. అందులో శ్రీవారి నిలువెత్తు విగ్రహం ముందు బృహత్ వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదికపై రాజీవ్‌రెడ్డి...బ్రహ్మణి మెడలో మాంగల్యధారణ గావించారు. కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బ్రహ్మానందం, శరత్ రాంబాబు, పునీత్ రాజ్‌కుమార్, విశాల్ తదితర తెలుగు, కన్నడ, తమిళ చిత్రరంగాలకు చెందిన నటీనటులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కాపురామచంద్రారెడ్డి, భూమన కరణాకర్‌రెడ్డి తదితరులు నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మణి, రాజీవ్‌రెడ్డిల వివాహ విందు ఈ నెల 20న హైదరాబాద్‌లో జరగనుంది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నల్లధనాన్ని వెలికితీయాలి: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: నల్లధనం ఏ రూపంలో ఉన్నా వెలికితీయాలని, దీనివల్ల దేశ ఉత్పాదకశక్తి పెరుగుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. జేఏసీ నేతలతో కలసి బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం పెద్దనోట్ల రూపంలోనే నల్లధనం ఉందని అనుకోవడం సరికాద న్నారు. బంగారం, భూములు, షేర్లు రూపంలో కూడా చాలా నల్లధనం ఉంద న్నారు. మన జాతీయ ఉత్పత్తిలో 30 శాతం ఉందని అర్థిక నిపుణులు చెబుతున్నారని అన్నారు. నల్లధనాన్ని పూర్తిగా వెలికితీస్తే ఉత్పాదకశక్తి పెరగడానికి దోహదం చేస్తుందన్నారు. గతంలో నోట్ల రద్దు జరిగినా సామాన్య ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడలేదన్నారు.రూ. 500, 1000 నోట్ల రద్దు నిర్ణయానికి ముందుగానే ప్రజలను సిద్ధం చేస్తే బాగుండేదన్నారు. సామాన్య ప్రజలకు అందేవిధంగా కరెన్సీ ఉత్పత్తి, సరఫరాను పెంచాలని కోరారు. పోస్టాఫీసు ల్లోనూ కరెన్సీ సరఫరా ను పెంచా లని కోరారు. 100, 50 నోట్లను విస్తృతంగా విడుదల చేయాలన్నా రు. గ్రామీణ స్థారుులో ఇంకా చాలామందికి బ్యాంకు ఖాతాలు లేవన్నారు. కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన కుమార్తె పెళ్లికి 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని, అవి ఎలా వచ్చాయో తేల్చాలన్నారు. సామాన్య ప్రజలు, పేదలు చిల్లరకోసం బ్యాంకుల దగ్గర నిలబడి ఉంటే బడాబాబుల బ్యాంకు రుణాలను మాఫీ చేయడం దారుణమన్నారు. కేవలం ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వం నడపాలనే ఆలోచన మంచిది కాదన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను అవలంభించాలని సూచించారు. -
వైభవంగా.. గాలివారి పెళ్లి సందడి
-
మోగనున్న కల్యాణ వీణ
బళ్లారి : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి కుమార్తె వివాహం బుధవారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నగరం నడిబొడ్డున 36 ఎకరాల విస్తీర్ణంలోని ప్యాలెస్ మైదానంలో తిరుపతి, హంపి, బళ్లారి తరహాలో సినీ సెట్టింగ్‌లతో అత్యద్భుతంగా పెళ్లి వేదికను తీర్చిదిద్దారు. నాలుగు రోజులుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించేలా నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి మెహందీ కార్యక్రమంలో భాగంగా పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లికి హాజరైన మహిళలందరికీ మెహందీ అలంకరించారు. ఈ సందర్భంగా సంగీత, నృత్య కార్యక్రమాల్లో పలువురు సినీ తారలు పాల్గొని తమ నృత్యాలతో అలరించడంతో పెళ్లికి కొత్త శోభ సంతరించుకుంది. కాగా ఈ రోజు ఉదయం జరుగనున్న వివాహ కార్యక్రమానికి పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. ఆహుతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రంగు రంగుల విద్యుద్దీపాలతో ప్యాలెస్ మైదానం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వివాహ వేడుకకు హాజరైన వారికి వడ్డించేందుకు దేశంలోని వివిధ రకాల వంటకాలను కూడా సిద్ధం చేశారు. ఈ వివాహ వేడుకకు గాలి జనార్దనరెడ్డి స్వస్థలం బళ్లారితో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో ఇప్పటికే బెంగళూరు తరలివెళ్లారు. -
వైభవంగా గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి!
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కూతురి వివాహం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పెళ్లి కోసం ఏకంగా రూ. 500 కోట్ల ఖర్చు చేయనున్నారనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎలా ఖర్చుచేస్తారనే విషయంపైనా కథనాలు వస్తున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మాణీ వివాహం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పాణ్యం విక్రమ్ దేవరెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు రాజీవ్ రెడ్డితో ఈ నెల 16న బెంగళూరులో జరగనున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ పెళ్లికి ఆహ్వానిస్తూ గతంలో పంచిన శుభలేఖలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ పెళ్లి శుభలేఖ బాక్స్‌లో ఎల్ఈడీ స్క్రీన్ ఉండటం, బాక్స్ తెరువగానే.. అందులో గాలి జనార్దన్ రెడ్డి కుటుంబంపై చిత్రీకరించిన పెళ్లిపాట ఉండటం.. అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ వెరైటీ పెళ్లికార్డు ఒక్కోదానికి రూ. ఎనిమిదివేల వరకు ఖర్చు అయినట్టు కథనాలు వచ్చాయి. ఇప్పుడు దేశమంతా నగదు బదిలీ వ్యవహారంలో మునిగిపోయిన సమయంలో ఏకంగా రూ. 500 కోట్లతో గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లి వేడుకను నిర్వహించనున్నట్టు కథనాలు వస్తున్నాయి. శ్రీ కృష్ణదేవరాయలకు చెందిన విజయనగర ప్యాలెస్‌ను పెండ్లిమండపంగా వేస్తారని, తిరుమల తిరుపతి దేవస్థానం పూజరులను ఈ పెళ్లి వేడుక నిర్వహించేందుకు పిలిచారని తెలుస్తోంది. అంతేకాకుండా గాలి జనార్దన్‌రెడ్డి చిన్ననాటి ఇంటిని పునర్నిర్మించి అందులోనే వరుడికి వధువు అప్పగింతల కార్యక్రమం చేపడతారని సమాచారం. అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్, ప్రభుదేవ, టాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో ప్రదర్శన ఇస్తారని కథనాలు వస్తున్నాయి. -
పెళ్లికి వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదు!
అంగరంగ వైభవంగా జరగనున్న గాలి జనార్దనరెడ్డి కుమార్తె పెళ్లికి వెళ్లొద్దని తనకు ఎవరూ చెప్పలేదని బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ఈ పెళ్లికి వెళ్లాలా.. వద్దా అనే విషయంలో చాలామంది నాయకులకు శషభిషలున్నాయి. గాలి జనార్దనరెడ్డితో సత్సంబంధాలున్న బీజేపీ అగ్రనాయకత్వం కూడా దీనిపై ఏమీ చెప్పలేదు. వెడ్డింగ్ కార్డుతోనే అదరగొట్టిన జనార్దనరెడ్డి సోదరులు.. ఇక పెళ్లిని ఇంకెంత వైభవంగా చేస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీ నాయకులు ఎవరూ ఈ పెళ్లికి హాజరు కావొద్దని బీజేపీ అగ్రనాయకత్వం చెప్పిందంటూ వచ్చిన కథనాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన యడ్యూరప్ప తోసిపారేశారు. జనార్దనరెడ్డి ఇప్పుడు, ఎప్పుడూ కూడా బీజేపీ నాయకుడేనని.. అందువల్ల ఆయన కూతురి పెళ్లికి పార్టీ నాయకులు వెళ్లడంలో తప్పేమీ లేదని బళ్లారి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గురులింగన గౌడ అన్నారు. ఇప్పటికే కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రులతో సహా పలువురు అగ్రనేతలకు ఒక్కోటి రూ. 10వేల విలువైన పెళ్లి శుభలేఖలు వెళ్లాయని తెలుస్తోంది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధాని దేవెగౌడలను కూడా పెళ్లిక ఆహ్వానించారు గానీ.. వాళ్లు హాజరు అవుతారో లేదో అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. 660 ఎకరాల విస్తీర్ణం ఉన్న బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో బుధవారం ఈ పెళ్లి జరగనుంది. పెళ్లి వేదికను ముందుగానే మీడియా ఫొటోగ్రాఫర్లు ఎక్కడ అత్యుత్సాహంతో ఫొటోలు తీసి బయటపెడతారోనని ముందు జాగ్రత్తగా దాదాపు 3వేల మంది సెక్యూరిటీ గార్డులు, బౌన్సర్లను వివాహ వేదిక వద్ద నియమించారని తెలుస్తోంది. పెళ్లికి దాదాపు 50 వేల మంది అతిథులు వస్తారని అంచనా. ఒక జాతీయ మీడియాకు చెందిన రిపోర్టర్ తన సెల్‌ఫోన్‌తో వివాహ వేదిక ఫొటో తీసేందుకు ప్రయత్నించగా, బౌన్సర్లు అతడి ఫోన్ లాగేసుకున్నారు. -
’ఆ పెళ్లికి డుమ్మా కొడితేనే మంచిది’
బెంగళూరు: దేశమంతా డబ్బు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నా అంబరాన్నంటే సంబురంతో గాలి జనార్దన్ రెడ్డి జరిపిస్తున్న తన కుమార్తె వివాహానికి కొంతమంది బీజేపీ నేతలు డుమ్మాకొడుతున్నట్లు తెలిసింది. బీజేపీలో మాజీ మంత్రిగా పని చేసిన జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహానికి హాజరుకావాల్సిందిగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులను, రాజకీయ పెద్దలకు ఆహ్వానాలు పంపించారు. అయితే, ఈ వివాహ కార్యక్రమానికి వెళ్లకుండా దూరంగా ఉండాలని బీజేపీ అగ్రనాయకత్వం తమ పార్టీకి చెందిన కొందరు నేతలకు అంతర్గతంగా సూచనలు చేసినట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఈ సూచనలు చేయనప్పటికీ ఆ వివాహానికి వెళ్లకుండా దూరంగా ఉంటేనే మంచిదని చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేనందున గైర్హాజరు అయితే బాగుంటుందని చెప్పారట. కాగా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, బీ శ్రీరాములు ఈ వివాహానికి హాజరవుతున్నట్లు సమాచారం. కొంతమంది కేంద్రమంత్రులు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. -
ఒక్కో వెడ్డింగ్ కార్డు ఖరీదు రూ.8వేలు!
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె బ్రహ్మాణీ వివాహం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పాణ్యం విక్రమ్ దేవరెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు రాజీవ్ రెడ్డితో ఈ నెల 16న బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బళ్లారి హవంబావిలోని జనార్దన్ రెడ్డి నివాసంలో పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి. సోమవారం ఇంటిముందు పెళ్లి పందిరి నిర్మించారు. గాలి జనార్దనరెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీఅరుణ, కుమారుడు కిరీటిరెడ్డి, పెళ్లికూతురు బ్రహ్మణీలతోపాటు గాలి సోమశేఖరరెడ్డి, ఆయన సతీమణి విజయ తదితరులు పూజలో పాల్గొన్నారు. ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత అరుగువేసి అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరిపించారనే నానుడి వింటుంటాం. అంతగా కాకపోయినా తమ రేంజ్‌కు తగ్గట్టుగా తల్లిదండ్రులు తమ బిడ్డల వివాహాలు జరిపిస్తుంటారు. గాలి జనార్దన్ రెడ్డి కూడా తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన కూతురు పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెడ్డింగ్ కార్డుతో పాటు ఖరీదైన వెండి వినాయకుడి విగ్రహం, డ్రై ప్రూట్స్ తదితర సరంజామాను ఓ బాక్స్ లో పొందుపరిచి బంధుమిత్రులకు అందజేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ కార్డు ఒక్కొక్కదానికి సుమారు రూ. ఏడు నుంచి ఎనిమిదివేల వరకూ ఖర్చు అయినట్లు భోగట్టా. వినూత్నంగా తయారు చేయించిన ఈ వెడ్డింగ్ బాక్సులో పెళ్లి పిలుపుతో పాటు ప్రత్యేకంగా ఎల్సీడీ స్క్రీన్ ఏర్పాటుచేశారు. బాక్స్ తెరవగానే గాలి జనార్దన్ రెడ్డి కుటుంబసభ్యులు ఉన్న వివాహ పాట మొదలవుతోంది. నిమిషం నిడివిగల ఆ వీడియోలో 'అతిథిదేవోభవా..' అంటూ జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి, కుమారుడితోపాటు వధూవరులిద్దరూ కనిపిస్తారు. పెళ్లికి తరలిరావాల్సిందిగా ఆహ్వానిస్తున్న గాలి జనార్దన్ కుటుంబం ఆ వీడియోలో కనిపిస్తుంది. -
గాలి జనార్ధనరెడ్డి కుమార్తె పెళ్లికి రండి..!
కంప్లి: ఈనెల16న జరిగే మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహానికి కంప్లి క్షేత్ర ఎమ్మెల్యే టీహెచ్ సురేష్‌బాబు బీజేపీ కార్యకర్తలకు, కౌన్సిలర్లకు, ప్రముఖులకు శుభలేఖలు సోమవారం అందజేశారు. 2న బళ్లారిలో పార్టీలకతీతంగా దుర్గమ్మగుడి నుంచి వేలాది మంది రైతులతో జిల్లాధికారి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లాధికారికి వినతి పత్రం అందించనున్నామన్నారు. ప్రస్తుతం జిందాల్ కర్మాగారానికి ఆల్మట్టితో పాటు తుంగభద్ర జలాశయం నీటిని నిలిపి వేసి కేవలం ఆల్మట్టి డ్యాం నుంచి మాత్రమే నీటిని పొందాలన్నారు. నష్టపోరుున రైతులకు పరిహారం అందేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ ప్రముఖులు బ్రహ్మయ్య, పురుషోత్తం, రఫీక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘బ్రాహ్మణి పెళ్లికి పెద్దగా ఖర్చు చేసే ఉద్దేశం లేదు’
బళ్లారి : మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహ మహోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని బళ్లారి ఎంపీ బి.శ్రీరాములు అన్నారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణి తనకు కూడా కుమార్తెలాంటిదన్నారు. ఆమె పెళ్లికి పెద్దగా ఖర్చు చేయాలనే ఉద్దేశం లేదని తెలిపారు. ఈ పెళ్లికి పార్టీలోని జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నామని, వివాహ ఆహ్వాన పత్రికను మాత్రం అధునాత పరిజ్ఞానంతో తయారు చేశామన్నారు. తమ స్థాయికి తగ్గట్టుగా మధ్య తరగతి తరహాలోనే వివాహం జరుగుతందని శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి పెదనాన్న సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ పెళ్లి ఏర్పాట్లు బళ్లారిలోనూ జరుగుతున్నాయన్నారు. జనార్దన్ రెడ్డి నవంబర్ 1న ఇక్కడికి వస్తారని, 10వ తేదీన పెళ్లికూతురిని చేసే కార్యక్రమం చేస్తామన్నారు. తదుపరి మిగిలిన అన్ని కార్యక్రమాలు బెంగళూరులోనే నిర్వహిస్తామన్నారు. బ్రాహ్మణి వివాహం నవంబర్ 16న రాజీవ్ రెడ్డితో బెంగళూరులో జరగనుంది. (చదవండి ...గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లికి వెరైటీ ఇన్విటేషన్) -
గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లికి వెరైటీ ఇన్విటేషన్
-
మాజీ జడ్జి ప్రభాకర్‌రావు ఆత్మహత్య
హైదరాబాద్: గాలి జనార్దనరెడ్డి బెయిల్ స్కామ్‌లో నిందితుడిగా జైలుశిక్ష అనుభవించిన మాజీ జడ్జి ప్రభాకరరావు సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. తీవ్ర మనస్తాపంతో కుమిలిపోతున్న ప్రభాకరరావు హైదరాబాద్ నగరంలోని వెస్ట్ మారేడ్‌పల్లిలోని స్వగృహంలో మృతిచెందారు. గాలి జనార్దనరెడ్డి బెయిలు కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆయన బాధపడేవారని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
'బళ్లారి వెళ్తా, అనుమతి ఇవ్వండి'
న్యూఢిల్లీ: బళ్లారి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు వారాల్లో అభిప్రాయం చెప్పాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడి ఉన్న ఆయనకు జనవరిలో షరతులతో కూడిన బెయిల్ లభించింది. పాస్‌పోర్టును సీబీఐ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, అనంతపురం, కడప, బళ్లారికి వెళ్లరాదని, కేసులో సాక్షులను ప్రభావితం చేయడం కానీ సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఐదు షరతులు విధించారు. మూడేళ్ల నాలుగు నెలల పాటు జైళ్లో గడిపిన తర్వాత ఆయన విడుదలయ్యారు. -
నకిలీ ఫేస్బుక్ ఐడీపై గాలి జనార్దన్‌రెడ్డి ఫిర్యాదు
సాక్షి, బెంగళూరు: తనకు ఫేస్‌బుక్‌తో పాటు మరే ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనూ అకౌంట్ లేదని మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి స్పష్టం చేశారు. ఎవరో తన పేరు మీద ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి అనుచిత సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై బుధవారం తనఅనుచరుడు వి.శివకుమార్ ద్వారా సీఐడీకి ఫిర్యాదు చేశారు. తన మర్యాదకు భంగం కలిగేలా సమాచారాన్ని పోస్ట్ చేస్తున్న వారిని శిక్షించాలని ఫిర్యాదులో కోరారు. -
'ఆ ఫేస్ బుక్ అకౌంట్ నాది కాదు'
బెంగళూరు: తనకు ఫేస్‌బుక్‌తో పాటు మరే ఇతర సామాజిక అనుసంధానాల వేదిక (సోషియల్ నెట్వర్కింగ్ సైట్స్)ల్లోనూ అకౌంట్ లేదని మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఎవరో తన పేరు మీద ఫేస్బుక్లో అకౌంట్‌ను ఓపెన్ చేసి అసంబద్ధ సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై బుధవారం తన అనుచరుడు వి.శివకుమార్ ద్వారా సీఐడీకి ఫిర్యాదు చేశారు. తన మర్యాదకు భంగం కలిగేలా ఫేస్బుక్లో సమాచారాన్ని పోస్ట్ చేస్తున్న దుండగున్ని గుర్తించి శిక్షించాలని ఆ ఫిర్యాదులో ఆయన కోరారు. -
శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ్ రామ్
తిరుపతి: తిరుమలలో కొలువైన కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం తెల్లవారుజామున పలువురు ప్రముఖులు వేర్వేరుగా దర్శించుకున్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు కళ్యాణ్ రామ్ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి మొక్కుల సమర్పించుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబసభ్యులతో సహా స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు సమయం పడుతుంది. -
కాలినడకన తిరుమల చేరుకున్న గాలి జనార్ధన్
-
ఓంఎంసీ కేసు విచారణ 19కు వాయిదా..
సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దనరెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ రాజగోపాల్ గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరి హాజరును నమోదుచేసుకున్న ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు. అలాగే ఈ కేసు విచారణలో భాగంగా నిందితులపై అభియోగాల నమోదు ప్రక్రియపై అభ్యంతరాలుంటే తెలపాలని నిందితుల తరఫు న్యాయవాదులకు సూచించారు. -
గాలి విడుదలకు ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో బెయిల్ లభించిన గాలి జనార్దన్‌రెడ్డి విడుదలకు సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.10 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లను ఆయన తరఫు న్యాయవాదులు ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. బెయిల్ ఉత్తర్వులను సీబీఐ కోర్టు సిబ్బంది గురువారం సాయంత్రం చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేశారు. వాటిని ఫ్యాక్స్ ద్వారా కర్ణాటక జైలు అధికారులకు పంపినట్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ బి. సైదయ్య తెలిపారు. కర్ణాటక జై ల్లో గాలి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. -
గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ మంజూరుకు అభ్యంతరం లేదని సీబీఐ పేర్కొనడంతో ధర్మాసనం.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఓఎంసీ కేసులో 2011 సెప్టెంబర్ 5న జనార్దన్‌రెడ్డి అరెస్టయ్యారు. అప్పట్నుంచీ జైల్లోనే ఉన్నారు. మంగళవారం కోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం కాగానే... ‘దర్యాప్తు పూర్తయిందా? ఇంకా చార్జిషీట్లు ఏమైనా ఉన్నాయా?’ అని ధర్మాసనం సీబీఐ న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్సింగ్ను ప్రశ్నించింది. ‘అఫిడవిట్ దాఖలు చేశాం. చార్జిషీట్లు పూర్తయ్యాయి. షరతులతో కూడిన బెయిల్ మంజూరుకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని ఆయన తెలిపారు. జనార్దన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ..‘41 నెలలుగా జైలులోనే ఉన్నారు. సీబీఐ చెప్పినట్టు షరతులతో కూడిన బెయిల్‌కు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని పేర్కొన్నారు. దీంతో ఐదు షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు జస్టిస్ దత్తు చెప్పారు. ఒక్కో చార్జిషీటుకు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల పూచీకత్తు చెల్లించాలని, పాస్‌పోర్టును సీబీఐ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, అనంతపురం, కడప, బళ్లారికి వెళ్లరాదని, కేసులో సాక్షులను ప్రభావితం చేయడం కానీ సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఐదు షరతులు విధించారు. ఇప్పటి వరకు 4 కేసుల్లో ఏడు చార్జిషీట్లను ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌రెడ్డికి అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. ప్రస్తుతం ఆయన బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో ఉన్నారు. బెయిల్ పత్రాలు తొలుత హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు పరిచిన అనంతరం పరప్పన జైలుకు తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకు 3,4 రోజుల సమయం పడుతుందని జనార్దన్‌రెడ్డి న్యాయవాది హనుమంతరాయ బెంగళూరులో చెప్పారు. ఆయన జైలు నుంచి బయటకు విడుదలయ్యే రోజున జనం భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. కాగా, బెయిల్ సంగతి తెలియగానే బళ్లారి, బెంగళూరులో గాలి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అరెస్ట్ నుంచి బెయిల్ దాకా.. 2011 సెప్టెంబర్ 5న గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డిలను సీబీఐ అరెస్టు చేసింది. హైదరాబాద్‌కు తరలించి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచింది. సెప్టెంబర్ 13న వీరిని కోర్టు 6 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. మరోసారి కస్టడీకి అప్పగించాలన్న సీబీఐ పిటిషన్‌ను సెప్టెంబర్ 30న కొట్టివేసింది. 2011 డిసెంబర్ 3న సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. 3 సంవత్సరాల 4 నెలలకుపైగా జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలీఖాన్‌లు రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసు తర్వాత కర్ణాటకలో మైనింగ్‌పై సీబీఐ మరో రెండు కేసులు పెట్టింది. తర్వాత బెయిల్ కోసం న్యాయమూర్తిని ప్రలోభ పెట్టారంటూ ఏపీ ఏసీబీ మరో రెండు కేసులు నమోదు చేసింది. వీటన్నింటిలో గాలికి కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. -
సంబరాలు
గాలి జనార్దనరెడ్డికి బెయిల్‌తో సంబరాలు బళ్లారిలో పండగ వాతావరణం పెద్ద ఎత్తున బాణసంచా మోత బళ్లారి : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి మంగళవారం అన్ని కేసులకు సంబంధించి సుప్రీం కోర్టులో బెయిల్ లభించడంతో బళ్లారిలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మూడేళ్ల క్రితం మైనింగ్ కేసులకు సంబంధించి సీబీఐ గాలి జనార్దనరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి విదితమే. మూడేళ్లుగా హైదరాబాద్, బెంగళూరు జైళ్లలో ఉన్న గాలి జనార్దనరెడ్డికి ఎట్టకేలకు అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో బళ్లారిలో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులు, గాలి జనార్దనరెడ్డి అభిమానుల నేతృత్వంలో బళ్లారిలోని ఎస్పీ సర్కిల్, రాయల్ సర్కిల్, తాళూరు రోడ్డు సర్కిల్, ఏపీఎంసీ సర్కిల్, మోతీ సర్కిల్ తదితర అన్ని ప్రధాన కూడళ్లలో బాణసంచా పేల్చి ఆనందోత్సాహాలతో సీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. తమ అభిమాన నేతకు బెయిల్ లభించడంతో బళ్లారిలో పండుగ వాతావరణం నెలకొందని ఒకరికొకరు ఆలింగనం చేసుకుని సంతోష క్షణాలు పంచుకున్నారు. మూడేళ్లుగా గాలి జనార్దనరెడ్డి జైలులో ఉండటంతో అభిమానులతో పాటు బళ్లారిలో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు కుదేలైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జనార్దనరెడ్డికి బెయిల్ లభించడంతో బళ్లారికి తిరిగి కొత్త కళ సంతరించుకునే అవకాశం ఉందని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు మోత్కర్ శ్రీనివాస్‌రెడ్డి, గోవిందరాజులు, బీజేపీ నాయకులు వీరశేఖర్రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు నగరంలో ర్యాలీ చేపట్టి సంబరాల్లో పాలు పంచుకున్నారు. ఇక ప్రజలు గాలి జనార్దనరెడ్డికి బెయిల్ లభించిన సంగతి తెలియడంతో ఎక్కడికక్కడ టీవీలకు అతుక్కుపోయారు. ఇక జనార్దనరెడ్డి ఒకటి రెండు రోజుల్లో విడుదల కానుండటంతో ఆయనను చూసేందుకు బెంగళూరుకు పెద్ద సంఖ్యలో వాహనాలలో తరలి వెళ్లేందుకు అభిమానులు, మద్దతుదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బెయిల్ లభించడం హర్షణీయం : గాలి సోమశేఖర్‌రెడ్డి తన సోదరునికి బెయిల్ లభించడం ఎంతో సంతోషంగా ఉందని కేఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గాలి జనార్దనరెడ్డికి బెయిల్ లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన సాక్షితో మాట్లాడారు. భగవంతుని కృప, బళ్లారి జిల్లా ప్రజల ఆశీస్సుల వల్ల తన సోదరునికి బెయిల్ లభించిందన్నారు. బళ్లారి జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు జనార్దనరెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారన్నారు. బళ్లారి అభివృద్ధికి బాటలు : కార్పొరేటర్ మోత్కర్ శ్రీనివాస్‌రెడ్డి గాలి జనార్దనరెడ్డికి బెయిల్ లభించడంతో నిస్తేజంగా ఉన్న బళ్లారి జిల్లా అభివృద్ధి చెందడం ఖాయమని బీజేపీ నేత, కార్పొరేటర్ మోత్కర్ శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గాలి జనార్దనరెడ్డి అరెస్టయినప్పటి నుంచి జిల్లా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఆయన నేతృత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నారు. గాలి బెయిల్‌తో బళ్లారిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు. -
ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్
-
ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్
హైదరాబాద్ : ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరుకు సీబీఐ అభ్యంతరం తెలపకపోవటంతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఓంఎసీ కేసులో 2011 సెప్టెంబర్ 5న జనార్దన్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఏడు కేసుల్లోనూ గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు కావటంతో త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. -
బెయిల్ డీల్ కేసులో గాలికి బెయిల్
-
బెయిల్ డీల్ కేసులో గాలికి బెయిల్
హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓంఎసీ) అధినేత గాలి జనార్ధన రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరైంది. బెయిల్ డీల్ కేసులో ఆయనకు ఈ బెయిల్ మంజూరైంది. ఓఎంసీ కేసులో బెయిలు కోసం న్యాయమూర్తికి డబ్బు ఇచ్చినట్లు ఆయనపై ఆరోపణ. ఓఎంసి కేసులో ఆయనకు ఇంకా బెయిల్ మంజూరుకాలేదు. ఓఎంసీ కేసుకు సంబంధించి 2012 సెప్టెంబరు 18న గాలి అరెస్ట్ అయ్యారు. ** -
గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసు రేపటికి వాయిదా
ఢిల్లీ:మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసుపై తీర్పును సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. జనార్ధన్ రెడ్డి బెయిల్ కు సంబంధించి సీబీఐ కొన్నిషరతులను సుప్రీంకు అందజేసింది. గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారికి వెళ్లకూడదని ఆ షరతుల్లో పేర్కొంది. దీంతోపాటు కోర్టు విచారణకు సహకరించాలని, పాస్ పోర్టను అప్పగించాలని కూడా సీబీఐ తెలిపింది. సీబీఐ పేర్కొన్న షరతులను ఆఫిడవిట్ రూపంలో ఇవ్వాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
‘గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ షరతులు చెప్పండి’
సాక్షి, న్యూఢిల్లీ: మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడంలో ఎలాంటి షరతులు విధించాలో చెప్పండంటూ సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. మూడు నెలల అనంతరం జనార్దన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎ.కె.సిక్రి, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. తొలుత గాలి జనార్దన్‌రెడ్డి తరపు న్యాయవాదులు దుష్యంత్ దవే, దిల్జిత్ సింగ్ అహ్లూవాలియా పిటిషనర్ 39 నెలల 23 రోజులుగా అండర్ ట్రయల్‌గా జైల్లో మగ్గుతున్నాడని తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో మూడో చార్జిషీట్ కూడా ఫైల్ చేశారని, దర్యాప్తు ఎప్పుడో పూర్తయ్యిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు జోక్యం చేసుకుంటూ ‘ఎలాంటి షరతులు పెట్టాలో సీబీఐని చెప్పనివ్వండి.. డిసెంబర్ 15లోపు సీబీఐ స్పష్టమైన వైఖరితో రావాలి’ అంటూ సీబీఐ తరపు న్యాయవాది మన్విందర్ సింగ్‌ను ఆదేశించారు. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేశారు. -
'గాలి' కేసులో యాదగిరికి సుప్రీం బెయిల్!
న్యూఢిల్లీ: ఓబులాపురం మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కోసం ముడుపులు చెల్లించారనే కేసులో రౌడీషీటర్ యాదగిరికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. యాదగిరి కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఆరు వారాల్లోగా న్యాయమూర్తిని నియమించాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసును ఏడాదిలోగా కేసు విచారణ పూర్తి చేయాలని కోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను ఆరువారాలకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. -
ఓఎంసీ బెయిల్ ముడుపుల కేసు వాయిదా
వచ్చే గురువారానికి వాయిదా వేసిన ‘సుప్రీం’ సాక్షి, న్యూఢిల్లీ: గతంలో ఓఎంసీ ఇనుప గనుల అక్రమ తవ్వకం కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ కోసం కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలతో అరెస్టయి ఆ తర్వాత బెయిల్ పొందిన నిందితులకు ఆ బెయిల్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం విచారించింది. నిందితుల్లో కొందరికి బెయిల్ మంజూరు చేసి తనకు మంజూరు చేయలేదని, తనకు కూడా బెయిల్ ఇప్పించాలని మరో నిందితుడు యాదగిరి రావు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా విచారణకు స్వీకరించింది. 2012 మే నెలలో ఈ ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ట్రయల్ కోర్టు కొందరికి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఏసీబీ హైకోర్టులో సవాలు చేయగా.. బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంటూ మరికొందరు నిందితులకు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నిందితులకు బెయిల్ రద్దు చేయాలని అభ్యర్థించింది. ప్రభుత్వం, యాదగిరి రావు ఫిర్యాదులను విచారణకు స్వీకరించిన జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం, ఒకే కేసులో ఒకే ఆరోపణపై కొందరు నిందితులకు బెయిల్ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవడం ఏంటని, ఈ కేసు విచారణ ఎందుకు నత్తనడకన సాగుతోందని వ్యాఖ్యానించింది. కాగా ట్రయల్ కోర్టుకు ఐదు నెలలుగా న్యాయమూర్తి లేరని ప్రభుత్వం వివరించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును వచ్చే గురువారానికి వాయిదా వేసింది. -
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కొట్టివేత
న్యూఢిల్లీ : ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. కాగా మూడేళ్లుగా దర్యాప్తు పూర్తి చేయకుండా నిందితులను ఎంత కాలం జైల్లో ఉంచుతారని సుప్రీంకోర్టు సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శిక్ష ఖరారు కాకుండానే దర్యాప్తు దశలో ఇలా జైల్లో ఉంచడం న్యాయ సమ్మతం కాదని వ్యాఖ్యానించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం కోర్టు ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి సీబీఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అన్ని కేసులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. -
గాలి బెయిల్ విచారణ జూలై 3కి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆ కంపెనీ యజమాని, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ అభ్యర్థనపై విచారణను సుప్రీం కోర్టు జూలై 3కు వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఆర్.కె.అగ్రవాల్‌తో కూడిన ధర్మాసనం ముందుకు మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా వేసవి సెలవుల అనంతరం జూలై 3న విచారించనున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. -
‘గాలి’ కేసులో దర్యాప్తు పూర్తి
సుప్రీంకోర్టుకు సీల్డ్కవర్లో నివేదిక సమర్పించిన సీబీఐ సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్‌రెడ్డిపై ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు వ్యవహారంలో ఎట్టకేలకు దర్యాప్తు పూర్తిచేసిన సీబీఐ తన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. రెండున్నరేళ్లు అయినా దర్యాప్తు పూర్తిచేయకుండా నిందితులను ఎంతకాలం జైల్లో ఉంచుతారంటూ సుప్రీం కోర్టు జనవరి 27న ఆగ్రహం వ్యక్తంచేసిన నేపథ్యంలో దర్యాప్తును పూర్తిచేసిన సీబీఐ సంబంధిత నివేదికను జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ. బాబ్డేలతో కూడిన సుప్రీం ధర్మాసనానికి సీల్డ్ కవర్లో సమర్పించింది. ఈ కేసులో గాలి జనార్దనరెడ్డి పెట్టుకున్న బెయిలు పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. సీబీఐ న్యాయవాది పరస్ కుహద్ ‘దర్యాప్తు నివేదికను తమకు సమర్పించడమైంది’ అని ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై జస్టిస్ హెచ్.ఎల్. దత్తు స్పందిస్తూ.. ‘ఆ నివేదికను చదవాల్సి ఉంది.. విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేస్తున్నాం..’ అని ప్రకటించారు. అయితే ఏప్రిల్ 14 సెలవు దినమని సీబీఐ తరపు న్యాయవాది చెప్పగా ‘ఏప్రిల్ 15కు వాయిదావేస్తున్నాం..’ అని పేర్కొన్నారు. సీబీఐ నివేదిక ప్రతిని పిటిషనర్‌కు కూడా ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరగా.. న్యాయస్థానం సమ్మతించలేదు. -
గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు:ఇంటికి వెళ్లకూడదని షరతులు
బెంగళూరు: ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్థన్ రెడ్డికి బెంగళూరు కోర్టు తాత్కాలిక బెయిల్ మంజారు చేసింది. ఆరోగ్యం సరిగా లేని కారణంగా బెయిల్ మంజూరు చేయాలని జనార్థన్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారించిన కోర్టు.. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో ఐదు రోజులు ఉండేందుకు గాను బెయిల్ ను మంజూరు చేసింది. కాగా, ఇంటికి వెళ్లడానికి ఎటువంటి అనుమతి లేవని షరతులు విధించింది.