హీరోగా మైనింగ్ కింగ్ వారసుడు..? | Gali Janardhan Reddy son to debut in films | Sakshi
Sakshi News home page

హీరోగా మైనింగ్ కింగ్ వారసుడు..?

Published Mon, Jun 5 2017 10:51 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

హీరోగా మైనింగ్ కింగ్ వారసుడు..?

హీరోగా మైనింగ్ కింగ్ వారసుడు..?

తెలుగు రాష్ట్రలతో పాటు కర్ణాటకలోనూ మైనింగ్ కింగ్గా పేరు తెచ్చుకున్న గాలి జనార్థన్ రెడ్డి త్వరలో సినీరంగంలోకి అడుగుపెట్టబోతున్నారట. రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఈయన, త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు తన కొడుకు కిరీటి రెడ్డి హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు.

ఇటీవల జరిగిన సోదరి వివాహ వేడుకలో తన డ్యాన్స్తో ఆకట్టుకున్న కిరీటి నటనలోనూ శిక్షణ పొందాడు. ప్రస్తుతం కిరీటి హీరోగా తెరకెక్కబోయే సినిమాకు కథ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు గాలి ఫ్యామిలీ. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కూడా భారీ సినిమాతో పరిచయం అయినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అందుకే తన కుమారుడి విషయంలో అలాంటి పొరపాట్లు జరగకుండా గాలి జనార్థన్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నాడన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కన్నడ పరిశ్రమ నుంచి కిరీటి రెడ్డి ఎంట్రీపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement