
'బళ్లారి వెళ్తా, అనుమతి ఇవ్వండి'
న్యూఢిల్లీ: బళ్లారి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు వారాల్లో అభిప్రాయం చెప్పాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.
ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడి ఉన్న ఆయనకు జనవరిలో షరతులతో కూడిన బెయిల్ లభించింది. పాస్‌పోర్టును సీబీఐ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, అనంతపురం, కడప, బళ్లారికి వెళ్లరాదని, కేసులో సాక్షులను ప్రభావితం చేయడం కానీ సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఐదు షరతులు విధించారు. మూడేళ్ల నాలుగు నెలల పాటు జైళ్లో గడిపిన తర్వాత ఆయన విడుదలయ్యారు.