Bail Conditions
-
Pune: బెయిల్ ఇస్తున్నాం.. ఈ షరతులు పాటించాల్సిందే
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనర్ బాలుడు పోర్షే కారుతో బైక్‌ను ఢికొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎరవాడ పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన మైనర్‌పై కేసు నమోదు చేసి జువెనైల్‌లో కోర్టులో ప్రవేశపెట్టారు. 17 ఏళ్ల ఆ బాలుడి తరఫు న్యాయవాది బెయిల్ కోరగా.. పలు షురతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాము విధించే షరతులను తప్పనిసరిగా పాటించాలని కోర్టు ఆదేశించింది.కోర్టు విధించిన షరతులు.. ‘ట్రాఫిక్ పోలీసుతో 15 రోజులు పని చేయాలి. మానసిక పరివర్తనకు సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స చేయించుకోవాలి. ‘రోడ్డు ప్రమాదాలు, వాటి పరిష్కార మార్గాలు’అనే టాపిక్ మీద 300 పదాలలో వ్యాసం రాయాలి. డి- అడిక్షన్ సెంటర్లో పునరాసం కోరాలి. ట్రాఫిక్ రూల్స్ చదవి జువైనల్ జస్టిస్ బోర్డుకు ప్రజంటేషన్ ఇవ్వాలి. రోడ్డు ప్రమాద బాధితులకు భవిష్యత్తులో అండగా ఉండాలి’అని జువైనల్ కోర్టు మైనర్ బాలుడికి షరతులు విధించింది.ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ ఆదివారం ఉదయం కోరేగావ్ పార్క్ వద్ద వేగంగా పోర్షే కారును నడుతూ.. బైక్‌ను ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో అనిస్ దుధియా ,అశ్విని కోస్టా మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
స్కిల్ కేసు.. చంద్రబాబుకు సుప్రీంకోర్టు వార్నింగ్ !
-
స్కిల్ కేసు.. చంద్రబాబుకు సుప్రీంకోర్టు వార్నింగ్ !
ఢిల్లీ,సాక్షి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం(ఏప్రిల్ 16) విచారణ జరిపింది. పిటిషన్ తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. బాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కిల్ కేసు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ సీఐడీ తరపు న్యాయవాది సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. ‘దర్యాప్తుకు భంగం కలిగేలా లోకేష్ వ్యవహరిస్తున్నారు. రెడ్‌బుక్‌లో అధికారుల పేర్లు రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల అంతు చూస్తాను అని లోకేష్ అంటున్నారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ బెదిరింపులకు పాల్పడ్డాడు. రెడ్‌బుక్ చంద్రబాబుకు ఇస్తారా అని లోకేష్‌ను ఆ టీవీ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూలో అడిగారు’ అని సీఐడీ వాదనలు వినిపించింది. పిటిషన్‌పై చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కాగా, గతేడాది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. శిరోముండనం కేసులో విశాఖ కోర్టు కీలక తీర్పు -
బాబు కోర్టు ధిక్కారం
సాక్షి, అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లి అక్కడ తన అరెస్టు, జైలు గురించి ప్రసంగించి కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తన అరెస్టు గురించి మాట్లాడి కోర్టులంటే తనకు లెక్కలేదన్నట్లుగా వ్యవహరించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు అక్టోబర్ 31న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు గురించి ఎక్కడా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మాట్లాడకూడదని హైకోర్టు బెయిల్ ఆర్డర్లో స్పష్టంగా పేర్కొంది. కేసులోని విషయాల గురించి బయట ఎక్కడా చర్చించవద్దని స్పష్టంచేసింది. అలాగే, హైకోర్టు ఆదేశాలను చంద్రబాబు తప్పకుండా పాటించాలని, స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ఎక్కడా మాట్లాడకూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. అయితే, చంద్రబాబు మాత్రం వీటిని బహిరంగంగా ఉల్లంఘించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం అత్తోటలో శుక్రవారం తుపాను బాధితులను పరామర్శించి అక్కడ రాజకీయ ప్రసంగం చేశారు. తుపాను దెబ్బకు అన్ని విధాలుగా నష్టపోయి రైతులు ఆందోళనలో ఉంటే చంద్రబాబు మాత్రం అక్కడకు వెళ్లి తనను అన్యాయంగా అరెస్టు చేశారని, ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారంటూ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు గురించి మాట్లాడారు. ఇలా బెయిల్ షరతులను చంద్రబాబు బేఖాతరు చేసిన నేపథ్యంలో ఆయన బెయిల్‌ను రద్దుచేయాలని కోరవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 45 ఏళ్లుగా టెక్నికల్‌గా, లీగల్‌గా తప్పుచేయలేదు.. తనలాంటి వాళ్లను కూడా జైల్లో పెట్టేయగలుగుతున్నారని, బాధ కలగదా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 45 ఏళ్లుగా తానెక్కడా ఒక్క తప్పు కూడా చేయలేదని, టెక్నికల్‌గా, లీగల్‌గా ఒక్క తప్పూ చేయకుండా ఉన్నానని, అలాంటి తనను జైల్లో పెట్టారని చెప్పారు. ఎలాంటి తప్పు కూడా చేయకుండా ఉన్న పళంగా కేసు బుక్‌చేసి లోపలేశాడని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూడా మనిషినేనని, తనకూ బాధలు ఉంటాయని, తనకూ మనసు ఉంటుందని, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తే ఎలా ఉంటుందంటూ ప్రజల సానుభూతి కోసం ఆయన ప్రయత్నించారు. తన కోసం 52 రోజులుగా అందరూ వీరోచితంగా పోరాడారని, తనను అరెస్టుచేస్తే అందరినీ బెదిరించవచ్చనే ఉద్దేశంతో సీఎం ఇలా చేసినట్లు చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. న్యాయకోవిదుల విస్మయం.. బెయిల్ షరతులను ఉల్లంఘించి తాను అరెస్టయిన కేసు గురించి చంద్రబాబు మాట్లాడడంపై న్యాయకోవిదులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. బెయిల్ పొందినప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పి బయటకు వచ్చాక ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో అందుకు సంబంధించిన విషయాల గురించి కాకుండా తాను జైలుపాలవడం, కేసుల గురించి మాట్లాడడం ఏమిటనే ప్రశ్నలు సాధారణ ప్రజానీకం నుంచి వినిపిస్తున్నాయి. ఇక అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు కూడా రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు గంటల తరబడి ర్యాలీ చేసుకుంటూ వచ్చి ఆయన కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. తనకు అరోగ్యం బాగోలేదని బెయిల్ తీసుకుని భారీఎత్తున ర్యాలీలు చేయడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే, విజయవాడ ఏసీబీ కోర్టు ఈ కేసులోనే ఆయనకు రిమాండ్ విధించినప్పుడు సైతం న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విపరీతంగా కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తిని అసభ్యపదజాలంతో ధూషిస్తూ పోస్టులు పెట్టారు. చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులు ఆయన కుమారుడు లోకేశ్, ఇతర నాయకులు కోర్టులను మేనేజ్ చేశారంటూ న్యాయ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడారు. చివరికి అదే న్యాయ వ్యవస్థ నుంచి చంద్రబాబు బెయిల్ పొంది బయటకొచ్చారు. ఇప్పుడు ఆ కోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తూ స్కిల్ కుంభకోణం గురించి రాజకీయ ఉపన్యాసం చేయడం గమనార్హం. -
సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన చంద్రబాబు
సాక్షి, తెనాలి: సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ఉల్లంఘించారు. స్కిల్ స్కాంపై ఎక్కడా మాట్లాడకూడదని కోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. అయితే, రూల్స్‌ను ఉల్లంఘిస్తూ తెనాలిలో స్కిల్ స్కాంపై చంద్రబాబు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. కేసు కోర్టు విచారణలో ఉన్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘లీగల్‌గా, టెక్నికల్ గా తప్పు చేయకున్నా జైల్లో పెట్టారంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు.. అరెస్ట్ చేసినందుకు సీఐడీ పోలీసులను, రిమాండ్‌కు పంపినందుకు కోర్టును తప్పుబట్టారు. కేసు గురించి ప్రసావించ వద్దంటూ సుప్రీంకోర్టు నిబంధన విధించగా, అయినా సరే, కేసు గురించి చంద్రబాబు బహిరంగంగా మాట్లాడారు. దీనిబట్టి కోర్టులన్నా, చట్టాలన్నా చంద్రబాబుకు గౌరవం లేదని స్పష్టమవుతోంది. ఇది కచ్చితంగా బెయిల్ నిబంధన ఉల్లంఘనేనని, బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదని న్యాయ నిపుణులు అంటున్నారు. కాగా, స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు జనవరి 19కి వాయిదా వేసింది. 17ఏ వ్యవహారంపై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని హరీష్ సాల్వే కోరారు. కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నాం, వాయిదా వేయకుంటే విచారణ తేదీ చెప్పాలని విజ్ఞప్తి చేశారు. 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని హారీష్ సాల్వే ప్రస్తావించారు. నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణను జనవరి మూడో వారంలో చేపడతామన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం.. సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. ఇదీ చదవండి: దింపుడు కళ్లెం ఆశలన్నీ ఆవిరి..! -
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బహిరంగ వ్యాఖ్యలు
-
చంద్రబాబుకు కంటి చికిత్సకోసం కండీషన్లతో బెయిల్
-
చిక్కుల్లో నవనీత్ కౌర్ దంపతులు.. మళ్లీ అరెస్టుకు అవకాశం!
ముంబై: హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో జైలుపాలై.. బెయిల్ మీద విడుదలైన ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు మళ్లీ చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జంటకు బెయిల్ రద్దు చేయాలంటూ ముంబై పోలీసులు సోమవారం స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ప్రత్యేక న్యాయస్థానం. అయితే.. షరతుల్లో ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దన్న కూడా స్పష్టం చేసింది. ఒకవేళ మాట్లాడితే గనుక బెయిల్ దానంతట అదే రద్దు అయిపోతుందని హెచ్చరించింది కూడా. ఈ నేపథ్యంలో.. వాళ్లు మీడియాతో మాట్లాడినందుకుగానూ బెయిల్ రద్దు చేయాలని, అంతేకాదు వాళ్లమీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు తమ అభ్యర్థన పిటిషన్లో ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ముంబై పోలీసుల దరఖాస్తుపై స్పందించాలంటూ నవనీత్ కౌర్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. హనుమాన్ చాలీసా ఛాలెంజ్‌తో సీఎం ఉద్దవ్ థాక్రేకు ఎదురెళ్లిన ఈ ఇండిపెండెంట్ ప్రజా ప్రతినిధుల జంట.. రెచ్చగొట్టే చర్యల మీద అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. అయితే వీళ్ల బెయిల్‌ను సవాల్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. ఈ లోపు.. ఢిల్లీలో ఈ జంట వరుసబెట్టి ప్రెస్ మీట్లు పెడుతోంది. పైగా సీఎం ఉద్దవ్ థాక్రేకు చాలెంజ్‌లు విసిరింది. మీడియాతో మాట్లాడడమే కాకుండా.. మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నందుకుగానూ బెయిల్ రద్దు చేయాలంటూ ఖర్ పోలీస్ స్టేషన్ ఎస్సై.. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘారత్ ద్వారా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ జంట ప్రెస్ మీట్లకు సంబంధించిన వీడియోలను కోర్టు సైతం పరిశీలించినట్లు సమాచారం. దీంతో నవనీత్ కౌర్, ఆమె భర్త గనుక సరైన వివరణ ఇవ్వకుంటే మాత్రం వెంటనే అరెస్ట్ దిశగా కోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: దమ్ముంటే పోటీ చేయ్.. ఉద్దవ్‌కు నవనీత్ సవాల్ -
బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్‌కు ఊరట
Aryan Khan Gets Relief From Weekly Attendance At NCB Mumbai Office: క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ కేసులో బెయిల్‌పై విడుదలైన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ప్రతి శుక్రవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో హాజరు కావాలన్న బెయిల్ షరతు నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం జరిగిన విచారణలో బాంబే హైకోర్టు ఆర్యన్‌కు సంబంధించిన బెయిల్ షరతు నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. దీంతో ఇకపై ప్రతి శుక్రవారం ఆర్యన్.. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఢిల్లీ ఎన్సీబీ కార్యాలయం ఎప్పుడు సమన్లు పంపినా 72 గంటల్లోగా హాజరు కావాలని ఆర్యన్‌కు సూచించింది. అంతేకాకుండా ముంబై వదిలి వెళ్లేటప్పుడు అధికారులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలి అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. -
మరోసారి కోర్టును ఆశ్రయించిన ఆర్యన్ ఖాన్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. బెయిల్ షరతులను సవరించాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముందు హాజరు కావాలన్న షరతును సవరించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లిన ప్రతిసారి మీడియా నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నాడు. డ్రగ్స్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేసినందున తన బెయిల్ షరతును సడలించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్‌ను డిసెంబర్ 13న జస్టిస్ నితిన్ సాంబ్రే విచారించే అవకాశం ఉంది. ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్ ఖాన్‌ను అక్టోబర్ 3న ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతనిపై సెక్షన్ 8(సీ), 20(సీ), 27, 28, 29, 35 నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్‌స్(ఎన్డీపీఎస్) కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 28న బాంబే హైకోర్టుతో ఆర్యన్‌తో పాటు మరొ ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. 14 కఠినమైన బెయిల్ షరతులు విధించింది. (చదవండి: మీర్జాపూర్ వెబ్ సిరీస్ వివాదం.. హైకోర్టు కీలక నిర్ణయం) -
తప్పుడు పత్రాలతో నిందితులకు బెయిల్
పిట్లం మండల కేంద్రంలో జూలై 18న బంగారం దుకాణంలో చోరీ జరిగింది. అంతర్రాష్ట్ర ముఠా పనిగా అనుమానించిన పోలీసులు.. కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠాను అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. అయితే వీరికి బెయిల్ కోసం బోధన్ మండలం ఊట్పల్లికి చెందిన ఎండీ గౌస్, గైని సాయిలు పేర్లతో ష్యూరిటీలు లభించాయి. బెయిల్‌పై బయటికి వచ్చిన నిందితులు.. కనిపించకుండాపోయారు. ఈ కేసులో సమర్పించిన జామీన్లు కూడా నకిలీవని తేలినట్టు సమాచారం. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఇటీవలి కాలంలో నకిలీ జామీను పత్రాల సాయంతో నేరస్తులు బెయిల్ పొందుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. కామారెడ్డి పట్టణంతో పాటు, పిట్లం మండల కేంద్రంలో జరిగిన రెండు దొంగతనాలు, దోపిడీ సంఘటనల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు పట్టుకుని, కటకటాల వెనక్కి పంపించారు. అయితే నేరస్తులు తప్పుడు జామీను పత్రాలను సమర్పించి, బెయిల్‌పై విడుదలై తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో వారిని తిరిగి పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. తప్పుడు జామీనుల దందా.... ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తప్పుడు జామీను పత్రాలను సృష్టించే ముఠాలు చురుకుగా పనిచేస్తోందని పోలీసు యంత్రాంగం అనుమానిస్తోంది. ఇటీవల వెలుగు చూసిన రెండు సంఘటనలపై ఎస్పీ శ్వేత ఆరా తీస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగలకు కూడా జిల్లాలో జామీనులు ఇస్తుండడం విస్మయం కలిగిస్తోంది. దొంగలు పట్టుబడినపుడు బెయిల్ పొందడానికి తమకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ప్రయత్నాలు చేయడం సాధారణమే.. బెయిల్ కోసం కోర్టుకు సమర్పించాల్సిన జామీను పత్రాలను అప్పటికప్పుడు, స్థానికంగా తయారు చేయించడం కష్టమైన పని.. కానీ నకిలీ పత్రాలతో బెయిల్ ఇప్పించే ముఠాలు తయారై నిందితులకు సంబంధించిన వ్యక్తులతో బేరమాడి డబ్బులకు తప్పుడు పత్రాలు సృష్టించి అంటగడుతున్నట్టు ఇటీవల వెలుగు చూసిన సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తులకు సులువుగా జామీనులు దొరుకుతుండడంతో పోలీసులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏడాదిన్నర క్రితం కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా చోరీకి యత్నించింది. మెలకువతో ఉన్న వాచ్‌మన్ ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. దీంతో దొంగలు అతడిపై దాడి చేసి గాయపరిచారు. వాచ్‌మన్ అరుపులకు మేల్కొన్న స్థానికులు అటువైపు వస్తుండడాన్ని గమనించిన దొంగలు పారిపోయారు. ఈ కేసులో పోలీసులు మహారాష్ట్రకు చెందిన ముఠాను పట్టుకుని, రిమాండ్‌కు తరలించారు. అందులో ఒక నిందితుడు కోర్టుకు ష్యూరిటీస్ సమర్పించడంతో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత పత్తా లేకుండాపోయాడు. దీంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతడికి జామీను ఇచ్చిన వారి కోసం పోలీసులు నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం దూపల్లికి వెళ్లారు. అయితే జామీను ఇచ్చిన దానోయిన మైసయ్య, జర్పుల వెంకట్ అనే పేరు గల వ్యక్తులు ఆ గ్రామంలో లేరని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని అటు కోర్టుకు, ఇటు పోలీసు అధికారులకు నివేదించారు. తప్పించుకు తిరుగుతున్న నేరస్తులు దొంగతనాలు, దోపిడీలలో ఆరితేరిన కొందరు పోలీసులకు చిక్కినా.. బెయిల్‌పై విడుదలయ్యాక తప్పించుకు తిరుగుతున్నారు. కోర్టు పేషీలకు హాజరైతే శిక్షలు పడతాయన్న ఉద్దేశ్యంతో నిందితులు తప్పించుకుంటున్నారు. తప్పుడు ష్యూరిటీలు ఇచ్చి దర్జాగా వారు తమ చోరవృత్తిని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. తిరిగి వారు ఎక్కడో ఏదో ఒక సంఘటనలో పట్టుబడితే గానీ కేసుల్లో పురోగతి కనిపించని పరిస్థితి ఉంటోంది. తీగలాగితేనే.... నకిలీ పత్రాలతో జామీనులు ఇస్తున్న ముఠాకు సంబంధించి లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. తమకు తెలిసిన వారికి జామీను ఇవ్వడానికే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ గుర్తు తెలియని వ్యక్తులకు బెయిల్ కోసం ష్యూరిటీస్ ఇస్తున్నారంటే.. దానిపై ఆరా తీయాల్సిందేనని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దొంగతనాలు, దోపిడీలకు సంబంధించిన ముఠాలు అరెస్టయిన సందర్భంలో అందించిన ష్యూరిటీలపై మరింత లోతైన దర్యాప్తు జరిపితే నకిలీ జామీను ముఠా చిక్కే అవకాశం ఉంది. ఆ దిశగా విచారణ జరుపుతున్నామని పోలీసు శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. విచారణ జరుగుతోంది.. వివిధ కేసుల్లో తప్పుడు జామీనుల విషయం ఇటీవలే తెలిసింది. దీనిపై విచారణ చేపట్టాం. వాటిపై కేసులు నమోదు చేయాలని మా సిబ్బందిని ఆదేశించాం. తప్పుడు జామీనులు సృష్టించేవారి గురించి ఆరా తీస్తున్నాం. ష్యూరిటీల విషయంలో కోర్టు విధులు నిర్వహించే మా సిబ్బందికి తగిన సలహాలు ఇచ్చాం. తప్పుడు పత్రాలు తయారు చేసిన వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. –ఎన్.శ్వేత, ఎస్పీ, కామారెడ్డి -
ట్రిపుల్ తలాక్: బెయిల్ నిబంధనలకు క్యాబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యలకు విడాకులు ఇచ్చిన కేసులో దోషులైన పురుషులకు మేజిస్ర్టేట్ బెయిల్ మంజూరు చేయవచ్చనే నిబంధనను బిల్లులో చేర్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇవ్వడం చట్టవిరుద్ధమైన నేరంగా పరిగణిస్తూ భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి బెయిల్ నిబంధన విపక్ష పార్టీల ప్రధాన డిమాండ్లలో ఒకటి కావడం గమనార్హం. తాజా సవరణ ప్రకారం మేజిస్ట్రేట్‌కు బెయిల్ మంజూరు చేసే అధికారాలుంటాయి. ఈ చట్టం ద్వారా బాధితురాలు తనకు, మైనర్ పిల్లలకు పరిహారం కోరుతూ మేజిస్ర్టేట్‌ను ఆశ్రయించవచ్చు. మేజిస్ట్రేట్ నిర్ణయానుసారం మైనర్ పిల్లలను తన ఆధీనంలోకి తీసుకునే వెసులుబాటు ఉంది. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభ ఆమోదంకోసం సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. పెద్దల సభలో బిల్లు ఆమోదానికి సంబంధించి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు మహిళా రిజర్వేషన్ల బిల్లును బీజేపీ పార్లమెంట్లో ప్రవేశపెడితే మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మహిళా సాధికారత అంటూ మాటలు చెబుతున్న ప్రధాని మహిళా బిల్లుపై ఎందుకు వెనుకాడుతున్నారని రాహుల్ నిలదీశారు. -
'బళ్లారి వెళ్తా, అనుమతి ఇవ్వండి'
న్యూఢిల్లీ: బళ్లారి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు వారాల్లో అభిప్రాయం చెప్పాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడి ఉన్న ఆయనకు జనవరిలో షరతులతో కూడిన బెయిల్ లభించింది. పాస్‌పోర్టును సీబీఐ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, అనంతపురం, కడప, బళ్లారికి వెళ్లరాదని, కేసులో సాక్షులను ప్రభావితం చేయడం కానీ సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఐదు షరతులు విధించారు. మూడేళ్ల నాలుగు నెలల పాటు జైళ్లో గడిపిన తర్వాత ఆయన విడుదలయ్యారు. -
బెయిల్ షరతులు సడలించాలి: సండ్ర
-
జగన్ ఇతర రాష్ట్రాల పర్యటనకు నో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో భాగం గా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థనను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఆయన పిటిషన్‌ను న్యాయమూర్తి ఎంవీ రమేష్ సోమవారం కొట్టివేశారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో తిరిగేందుకు, ఎంపీగా విధులు నిర్వహించేందుకు, జాతీయపార్టీల నేతలను కలవడానికి ఢిల్లీకి వెళ్లేందుకు ఇప్పటికే అనుమతించాం. ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు జగన్ పేర్కొన్న కారణం సాధారణమైనది. కేంద్రం ఎటువంటి ఎన్నికల నోటిఫికేషన్‌నూ జారీచేయలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కూడా కాదు. ఈ నేపథ్యంలో బెయిల్ షరతులను పూర్తిగా సడలించలేం. ఇది ప్రీమెచ్యూర్ పిటిషన్’’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఏ రాష్ట్రానికి వెళ్లేదీ స్పష్టం చేస్తూ వేరుగా పిటిషన్ దాఖలు చేస్తే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కోరేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని బుధవారం కోల్‌కతాలో కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని, ఈ మేరకు అనుమతించాలని కోరుతూ వైఎస్ జగన్ సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి... సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అప్పటికప్పుడు హైదరాబాద్ విడిచి వెళ్లాల్సి ఉంటుం ద ని, రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వాలన్న షరతును సడలించాలన్న జగన్ అభ్యర్థనను కోర్టు అనుమతించింది. నగరం విడిచే రోజునే కోర్టుకు సమాచారం ఇవ్వాలని న్యాయమూర్తి ఎంవీ రమేష్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లేపాక్షి చార్జిషీట్లో కోర్టుకు జగన్ హాజరు లేపాక్షి నాలెడ్జి హబ్‌పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, ఇందూ సంస్థల అధినేత శ్యాంప్రసాద్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, బి.శ్యాంబాబు, ఎం.శామ్యూల్, మురళీధర్‌రెడ్డి, లేపాక్షి నాలెడ్జి హబ్ ఎండీ శ్రీనివాస్ బాలాజీ, బెంగళూరుకు చెందిన బి.ప్రభాకర్‌రెడ్డి, కుమారబాబు కూడా కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు నిర్దేశించిన మేరకు వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించారు. అలాగే లేపాక్షినాలెడ్జి హబ్, ఇందూ ప్రాజెక్టుల తరఫున శ్యాంప్రసాద్‌రెడ్డి పూచీ కత్తు బాండ్లను సమర్పించారు. పూచీకత్తు బాండ్లను ఆమోదించిన రెండో అదనపు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంవీ రమేష్... కేసు విచారణకు క్రమం తప్పకుండా నిందితులు హాజరుకావాలని స్పష్టం చేస్తూ విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు. కాగా, రాష్ట్రవిభజనకు సంబంధించి జీవోఎంతో భేటీ కారణంగా మంత్రిగీతారెడ్డి, తనపై పీసీయాక్టు అభియోగాలకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున హాజరు కాలేకపోతున్నానంటూ మాజీ మంత్రి ధర్మాన హాజరు మినహాయింపు కోరారు. ఈ మేరకు వారి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి అనుమతించారు. తదుపరి విచారణ రోజున పూచీకత్తు బాండ్లను సమర్పించాలని షరతు విధించారు. -
బెయిల్ షరతులు సడలించండి: నిమ్మగడ్డ
సాక్షి, హైదరాబాద్: వ్యాపార అవసరాల కోసం నెల రోజులపాటు హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటషన్ దాఖలు చేశారు. వ్యాపార కార్యకలాపాల కోసం ఇతర ప్రాం తాలకు వెళ్లాల్సి ఉన్నందున హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న షరతును సడలించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 7కు వాయిదా వేసింది. విజయరాఘవకు బెయిల్ షరతుల సడలింపు: ఎమ్మార్ కేసులో నిందితునిగా ఉన్న ఎమ్మార్ ఎంజీఎఫ్ ఫైనాన్స్ విభాగం ఉన్నతాధికారి విజయరాఘవ బెయిల్ షరతులను సీబీఐ కోర్టు శుక్రవారం సడలించింది. శనివారం నుంచి 2014 ఏప్రిల్ 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలో పర్యటించేందుకు కోర్టు అనుమతించింది. -
బెయిల్ షరతులు సడలించండి: వైఎస్ జగన్మోహన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా బలమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాష్ట్ర ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర పర్యటనకు, సమైక్య రాష్ట్రం కోసం కృషిలో భాగంగా ఢిల్లీ వెళ్లేందుకు అనుమతిస్తూ బెయిల్ షరతులు సడలించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సీబీఐ రెండో అదనపు కోర్టు న్యాయమూర్తి ఎంవీ రమేష్ శుక్రవారం విచారించారు. జగన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు. గతంలో జగన్‌కు తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధిని సందర్శించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిం దని, అదే సమయంలో గుంటూరులో రైతు సదస్సులో పాల్గొనేందుకు మాత్రం చార్జిషీట్లు పరిశీలన దశలో ఉన్న దృష్ట్యా అనుమతి ఇవ్వలేదని ప్రస్తావించారు. ప్రస్తుతం అన్ని చార్జిషీట్ల పరిశీలన పూర్తయి విచారణకు స్వీకరించిన నేపథ్యంలో బెయిల్ షరతుల సడలింపునకు అభ్యంతరమేమీ ఉండబోదన్నారు. జగన్ కుటుంబం సుదీర్ఘ కాలంగా ప్రజలతో మమేకమై ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా, ఎంపీగా జెడ్ కేటగిరీ భద్రత మధ్య ఉండే జగన్మోహన్రెడ్డి... కోర్టు షరతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించబోరని నివేదించారు. రాజకీయ కక్షలతో వచ్చిన ఈ కేసు తప్ప జగన్‌పై ఇప్పటివరకు ఎటువంటి మచ్చా లేదన్నారు. అయితే తుది విచారణ (ట్రయల్)ను దృష్టిలో ఉంచుకొనే జగన్ హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు షరతులు విధించిందని సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్ర వాదనలు వినిపించారు. బెయిల్ షరతులు సడలిస్తే తుది విచారణ జాప్యమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే ఈ వాదనను సుశీల్‌కుమార్ తోసిపుచ్చారు. సీసీ నంబర్ 9లో సాయిరెడ్డి మాత్రమే డిశ్చార్జ్ పిటిషన్ వేశారన్నారు. దీనిపై తాము వాదనలు వినిపించిన తర్వాత సాయిరెడ్డిని పబ్లిక్ సర్వెంట్‌గా పేర్కొంటూ సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసిందన్నారు. ఇప్పటివరకు తమకు ఐదు చార్జిషీట్లు మాత్రమే అందాయని, ఇంకా ఐదు అం దాల్సి ఉందని నివేదించారు. అన్నీ అందిన తర్వాత వాటిని పరిశీలించి డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ అధికారులతో జగన్ కుమ్మక్కయ్యారని సీబీఐ చార్జిషీట్లలో ఆరోపించిందని, అయితే నిందితులుగా ఉన్న అధికారుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయమూర్తి... జగన్ పిటిషన్‌పై తన నిర్ణయాన్ని ఈనెల 30కి వాయిదా వేశారు. -
జగన్ పిటిషన్‌పై విచారణ 23కు వాయిదా
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రావాల్సి ఉన్నా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు సెలవులో ఉండడంతో.. విచారణ వాయిదాపడింది. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు వీలుగా మార్చి 31 వరకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఆడిటర్ విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ కూడా 23కు వాయిదా పడింది.