NCB Mumbai Office: Aryan Khan Gets Relief From Weekly Attendance - Sakshi
Sakshi News home page

Aryan Khan: బెయిల్‌ షరతు నుంచి ఆర్యన్‌కు ఉపశమనం

Published Wed, Dec 15 2021 4:24 PM | Last Updated on Wed, Dec 15 2021 4:57 PM

Aryan Khan Gets Relief From Weekly Attendance At NCB Mumbai Office - Sakshi

Aryan Khan Gets Relief From Weekly Attendance At NCB Mumbai Office: క్రూయిజ్‌ షిప్‌లో డ్రగ్స్‌ కేసులో బెయిల్‌పై విడుదలైన షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ప్రతి శుక్రవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో హాజరు కావాలన్న బెయిల్‌ షరతు నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం జరిగిన విచారణలో బాంబే హైకోర్టు ఆర్యన్‌కు సంబంధించిన బెయిల్‌ షరతు నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది.

దీంతో ఇకపై ప్రతి శుక్రవారం ఆర్యన్‌.. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఢిల్లీ ఎన్సీబీ కార్యాలయం ఎప్పుడు సమన్లు పంపినా 72 గంటల్లోగా హాజరు కావాలని ఆర్యన్‌కు సూచించింది. అంతేకాకుండా ముంబై వదిలి వెళ్లేటప్పుడు అధికారులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలి అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement