bail conditions relaxed
-
బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్‌కు ఊరట
Aryan Khan Gets Relief From Weekly Attendance At NCB Mumbai Office: క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ కేసులో బెయిల్‌పై విడుదలైన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ప్రతి శుక్రవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో హాజరు కావాలన్న బెయిల్ షరతు నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం జరిగిన విచారణలో బాంబే హైకోర్టు ఆర్యన్‌కు సంబంధించిన బెయిల్ షరతు నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. దీంతో ఇకపై ప్రతి శుక్రవారం ఆర్యన్.. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఢిల్లీ ఎన్సీబీ కార్యాలయం ఎప్పుడు సమన్లు పంపినా 72 గంటల్లోగా హాజరు కావాలని ఆర్యన్‌కు సూచించింది. అంతేకాకుండా ముంబై వదిలి వెళ్లేటప్పుడు అధికారులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలి అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. -
వైఎస్ జగన్ బెయిల్ షరతులు సడలించిన కోర్టు
-
జగన్ బెయిల్ షరతులు సడలించిన కోర్టు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి బెయిలు షరతులను నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు సడలించింది. రాష్ట్రమంతటా పర్యటించేందుకు కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా ఆయన ఢిల్లీ వెళ్లేందుకు కూడా కోర్టు అవకాశం కల్పించింది. అయితే ఎక్కడికి వెళ్లేది రెండు రోజులు ముందు కోర్టుకు, సీబీఐకి తెలపాలని, అలాగే ఫోన్లో అందుబాటులో ఉండాలని షరతు విధించింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్ష్యుడుగా తనపై ఉందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు విన్నవించారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా ప్రజల మనోభావాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎంపీగా ఉన్నందును ఢిల్లీ వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. విన్నపాన్ని పరిశీలించిన కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ రాష్ట్రమంతటా పర్యటించి వరద బాధితులను పరామర్శించే అవకాశం ఉంది.