శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.పంచమి ప.12.33 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: మఖ తె 5.52 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి పుబ్బ, వర్జ్యం: సా.5.08నుండి 6.50 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.40 నుండి 9.24 వరకు, తదుపరి ప.12.19 నుండి 1.03 వరకు,అమృత ఘడియలు: రా.3.18 నుండి 5.01 వరకు
సూర్యోదయం : 6.28
సూర్యాస్తమయం: 5.26
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం...ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. మానసిక అశాంతి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.
వృషభం...కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
మిథునం....సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
కర్కాటకం...వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా సాగవు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
సింహం....కష్టానికి ఫలితం ఉంటుంది. నూతన విద్యాయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. రాబడి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య....మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
తుల...పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభాలు. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం..కొత్త విషయాలు తెలుస్తాయి. పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు...ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మకరం.....రుణయత్నాలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.
కుంభం...పరిస్థితులు అనుకూలిస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వివాహాది యత్నాలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
మీనం...పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆప్తులు సహకరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment