వన్డే క్రికెట్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. గత నెలలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న పాకిస్తాన్.. ఇప్పుడు సౌతాఫ్రికా గడ్డపై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. గురువారం కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై 81 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది.
తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో రిజ్వాన్ సేన సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఓ వరల్డ్ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. 21వ శతాబ్దంలో సౌతాఫ్రికా గడ్డపై వరుసగా మూడు వన్డేల సిరీస్‌ను గెలుచుకున్న తొలి జట్టుగా పాక్ చరిత్ర సృష్టించింది.
దక్షిణాఫ్రికాలో పాక్‌కు ఇది వరుసగా మూడో వన్డే సిరీస్ విజయం. ఇంతకుముందు 2013, 2021లో పాక్ వన్డే సిరీస్‌లను పాక్ సొంతం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన మెన్ ఇన్ గ్రీన్.. మరో వన్డే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.
ఓవరాల్‌గా 7 సార్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన పాక్ జట్టు.. మూడు సార్లు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. పాక్ తర్వాత ఆస్ట్రేలియా 10 పర్యటనల్లో మూడు సార్లు సఫారీ గడ్డపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. కానీ ఆసీస్ మాత్రం వరుసగా సిరీస్ విజయాలు సాధించలేకపోయింది. ఇకు ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే డిసెంబర్ 22న జోహాన్స్‌బర్గ్ వేదికగా జరగనుంది.
చదవండి: జాకెర్ అలీ మెరుపు ఇన్నింగ్స్.. వెస్టిండీస్ క్లీన్‌స్వీప్
Comments
Please login to add a commentAdd a comment