ODI cricket
-
వన్డేల్లో సరికొత్త చరిత్ర.. 40 ఏళ్ల కిందటి భారత రికార్డును బద్దలు కొట్టిన యూఎస్ఏ
వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఓ మ్యాచ్ మొత్తంలో (రెండు ఇన్నింగ్స్‌ల్లో) ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా బౌలింగ్ చేయలేదు. అన్ని ఓవర్లు స్పిన్నర్లే బౌలింగ్ చేశారు. యూఎస్ఏ, ఒమన్ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన ఒమన్.. యూఎస్ఏ బ్యాటింగ్ చేసిన 35.3 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. అనంతరం యూఎస్ఏ సైతం ఒమన్ బ్యాటింగ్ చేసిన 25.3 ఓవర్లను స్పిన్నర్లతోనే వేయించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 61 ఓవర్లు జరగ్గా, అన్నింటినీ స్పిన్నర్లే వేశారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.40 ఏళ్ల కిందటి భారత రికార్డును బద్దలు కొట్టిన యూఎస్ఏఈ మ్యాచ్‌లో మరో రికార్డు వరల్డ్ రికార్డు కూడా నమోదైంది. వన్డేల్లో అతి తక్కువ స్కోర్‌ను (122) డిఫెండ్ చేసుకున్న జట్టుగా యూఎస్ఏ సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. 1985లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. 40 ఏళ్ల తర్వాత యూఎస్ఏ.. భారత్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఒమన్‌పై యూఎస్ఏ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 35.3 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో మిలింద్ కుమార్ (47 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆండ్రియస్ గౌస్ (14), హర్మీత్ సింగ్ (10), ఆరోన్ జోన్స్ (16), సంజయ్ కృష్ణమూర్తి (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమన్ బౌలర్లు షకీల్ అహ్మద్ 3, ఆమిర్ కలీమ్, సమయ్ శ్రీవత్సవ్ తలో 2, జే ఒడెడ్రా, సిద్దార్థ్ బుక్కపట్నం చెరో వికెట్ తీసి యూఎస్ఏ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఒమన్ తరఫున బౌలింగ్ చేసినవారంతా స్పిన్నర్లే.అనంతరం 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. యూఎస్ఏ స్పిన్నర్ల దెబ్బకు 25.3 ఓవర్లలో 65 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ఏ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ నోష్తుశ్ కెంజిగే ఐదు వికెట్లు తీసి ఒమన్ పతనాన్ని శాశించాడు. మిలింద్ కుమార్, యాసిర్ మొహమ్మద్ తలో రెండు, హర్మీత్ సింగ్ ఓ వికెట్ పడగొట్టి ఒమన్ పతనానికి తమవంతు సహకారాన్ని అందించారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం హమ్మద్ మీర్జా (29) ఒక్కడే రెండంకెల స్కోర్ చేయగా.. నలుగురు డకౌట్ అయ్యారు. ఒమన్ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేసిన బౌలర్లు కూడా స్పిన్నర్లే. -
జయసూర్య జమానాలో పూర్వ వైభవం దిశగా శ్రీలంక
1996 వన్డే వరల్డ్ కప్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయిన శ్రీలంక.. ఆతర్వాత రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్లో అద్భుత విజయాలు సాధించింది. 1999 వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజ్‌లో పరిమితమైన లంకేయులు.. 2003లో సెమీస్‌కు.. 2007, 2011 ప్రపంచకప్‌ల్లో ఫైనల్స్‌కు చేరారు. 2015 వరల్డ్‌కప్ వరకు వన్డేల్లో లంక ప్రయాణం సాఫీగా సాగింది.అయితే గత దశాబ్దకాలంలో ఆ జట్టు శోభ మసకబారింది. సంగక్కర, జయవర్దనే లాంటి స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్తో శ్రీలంక బలహీన జట్టుగా మారిపోయింది. భారత్‌లో జరిగిన 2023 వరల్డ్‌కప్‌కు క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధించింది. ఘన కీర్తి కలిగిన శ్రీలంక క్వాలిఫయర్స్ ద్వారా ప్రపంచకప్‌లో పోటీపడటం.. అక్కడ కూడా దారుణ పరాజయాలు మూటగట్టుకోవడంతో ఈ జట్టు పనైపోయిందని అంతా అనుకున్నారు.అయితే దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య రాకతో (హెడ్ కోచ్‌గా) శ్రీలంక ప్రదర్శనల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. టెస్ట్‌లు, టీ20ల విషయాన్ని పక్కన పెడితే.. ద్వీప జట్టు వన్డేల్లో అమోఘంగా రాణిస్తుంది. జయసూర్య జమానాలో శ్రీలంక.. భారత్, న్యూజిలాండ్ లాంటి పటిష్ట జట్లను మట్టికరిపించింది. తాజాగా శ్రీలంక.. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించింది.రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. గతేడాది ఈ జట్టు భారత్‌ను సైతం 2-0 తేడాతో ఓడించింది. ప్రస్తుతం లంక జట్టులో ఉన్న ఆటగాళ్లు పాతవారే అయినప్పటికీ జయసూర్య ఆధ్వర్యంలో వారు రాటుదేలుతున్నారు. నిస్సంక, కుసాల్ మెండిస్, కమిందు మెండిస్, చరిత్ అసలంక బ్యాటింగ్‌లో అద్భుతాలు చేస్తున్నారు. లంక జట్టు బౌలింగ్ గతంలో పోలిస్తే మరింత బలపడింది. నాణ్యమైన స్పిన్నర్లు తయారవుతున్నారు. మొదటి నుంచే ఆ జట్టు పేస్ విభాగం బలంగా ఉంది.జయసూర్య రాక ముందు చిన్న జట్ల చేతుల్లో సైతం ఘోర పరాజయాలను ఎదుర్కొన్న శ్రీలంక.. త్వరలో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. ఈ మెగా టోర్నీలో శ్రీలంక 2002లో భారత్‌తో కలిసి సంయుక్తంగా ఛాంపియన్‌గా నిలిచింది. త్వరలో జరుగబోయే మెగా టోర్నీకి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లు అర్హత సాధించినా, శ్రీలంక మాత్రం క్వాలిఫై కాలేకపోయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంకతో పాటు ఘన చరిత్ర కలిగిన వెస్టిండీస్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది.జయసూర్య హెడ్ కోచ్‌గా ఉండగా శ్రీలంక సాధించిన విజయాలువన్డే సిరీస్‌లో భారత్‌పై 2-0 తేడాతో విజయంఇంగ్లండ్లో టెస్ట్ విజయంన్యూజిలాండ్పై టెస్ట్ సిరీస్‌లో విజయంవెస్టిండీస్పై టీ20 సిరీస్ విజయంవెస్టిండీస్పై వన్డే సిరీస్ 2-1 తేడాతో విజయంన్యూజిలాండ్తో టీ20 సిరీస్ డ్రాన్యూజిలాండ్పై వన్డే సిరీస్ 2-0 తేడాతో విజయంఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ 2-0 తేడాతో విజయం -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి
పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ (Babar Azam) ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హాషిమ్ ఆమ్లాతో (Hashim Amla) కలిసి వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా బాబర్ రికార్డుల్లోకెక్కాడు. వన్డేల్లో 6000 పరుగులు పూర్తి చేసేందుకు ఆమ్లా, బాబర్‌కు తలో 123 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి.The Moment Babar Azam created History in ODIs ⚡- Joint fastest to complete 6000 runs....!!!!! pic.twitter.com/U29MXMJ8xW— Johns. (@CricCrazyJohns) February 14, 2025కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ట్రై సిరీస్ (Pakistan Tri Series) ఫైనల్లో బాబర్ ఈ ఘనత సాధించాడు. ఆమ్లా, బాబర్ తర్వాత టీమిండియా స్టార్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (Viart Kohli) వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని తాకేందుకు విరాట్‌కు 136 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్లలో బాబర్, ఆమ్లా, విరాట్ తర్వాతి స్థానాల్లో కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. కేన్ మామ, వార్నర్ భాయ్ తలో 139 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ట్రై సిరీస్‌లోనే (సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో) కేన్ విలియమ్సన్ 6000 పరుగుల క్లబ్లో చేరాడు.ట్రై సిరీస్ ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. పాక్ 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. గత కొంతకాలంగా ఫామ్‌లో లేని బాబర్ ఆజమ్ (29) ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. పాక్ ఇన్నింగ్స్‌లో ఫకర్ జమాన్ (10), సౌద్ షకీల్ (8) కూడా తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (0), సల్మాన్ అఘా (0) క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మైఖేల్ బ్రేస్‌వెల్, నాథన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభ కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్ స్వదేశంలో ముక్కోణపు సిరీస్‌కు ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో పాక్ సహా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నీలో ఫైనల్ ముందు మూడు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మూడో మ్యాచ్‌లో పాక్ 353 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరింది.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయన్న విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. భారత్‌ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. -
శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు..
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సత్తాచాటాడు. ఆరు నెలల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన అయ్యర్.. తన మెరుపు హాఫ్ సెంచరీతో అందరిని ఆకట్టుకున్నాడు. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే యశస్వి జైశ్వాల్(15), రోహిత్ శర్మ(2) వికెట్లను కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శుబ్‌మన్ గిల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అయ్యర్ 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 36 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు.అయ్యర్ అరుదైన ఫీట్..కాగా ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే క్రికెట్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి 50 కంటే ఎక్కువ సగటు, 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో వెయ్యికి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా అయ్యర్ రికార్డులకెక్కాడు.ఇప్పటివరకు వరల్డ్ క్రికెట్లో నాలుగో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. కానీ వేరే పొజిషేన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మాత్రం ఈ రికార్డును పలువురు సాధించారు. దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ క్వింటన్ డికాక్ ఓపెనర్‌గా, శుబ్‌మన్ గిల్(రెండో స్ధానం), ఏబీ డివిలియర్స్(ఐదో స్ధానం) ఈ ఘనతను సాధించారు.ఇంగ్లండ్ చిత్తు..ఇక ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను భారత్ చిత్తు చేసింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(87), శ్రేయస్ అయ్యర్(59), అక్షర్ పటేల్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహుమూద్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్ బెతెల్ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్ సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డకెట్(32) దాటిగా ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న జరగనుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్‌గా -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
వన్డే క్రికెట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. గత నెలలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న పాకిస్తాన్.. ఇప్పుడు సౌతాఫ్రికా గడ్డపై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. గురువారం కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై 81 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది.తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో రిజ్వాన్ సేన సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఓ వరల్డ్ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. 21వ శతాబ్దంలో సౌతాఫ్రికా గడ్డపై వరుసగా మూడు వన్డేల సిరీస్‌ను గెలుచుకున్న తొలి జట్టుగా పాక్ చరిత్ర సృష్టించింది.దక్షిణాఫ్రికాలో పాక్‌కు ఇది వరుసగా మూడో వన్డే సిరీస్ విజయం. ఇంతకుముందు 2013, 2021లో పాక్ వన్డే సిరీస్‌లను పాక్ సొంతం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన మెన్ ఇన్ గ్రీన్.. మరో వన్డే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.ఓవరాల్‌గా 7 సార్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన పాక్ జట్టు.. మూడు సార్లు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. పాక్ తర్వాత ఆస్ట్రేలియా 10 పర్యటనల్లో మూడు సార్లు సఫారీ గడ్డపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. కానీ ఆసీస్ మాత్రం వరుసగా సిరీస్ విజయాలు సాధించలేకపోయింది. ఇకు ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే డిసెంబర్ 22న జోహాన్స్‌బర్గ్ వేదికగా జరగనుంది.చదవండి: జాకెర్ అలీ మెరుపు ఇన్నింగ్స్.. వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు విడ్కోలు పలకనున్నట్లు నబీ వెల్లడించాడు.ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ ధ్రువీ కరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటానని నబీ తనకు తనకు తెలియజేసినట్లు నసీబ్ ఖాన్ వెల్లడించాడు. అతడిని నిర్ణయాన్ని బోర్డు కూడా గౌరవించినట్లు నసీబ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.కాగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన నబీ టీ20ల్లో మాత్రం అఫ్గాన్‌కు తన సేవలను కొనసాగించనున్నాడు. కాగా ఈ అఫ్గాన్ మాజీ కెప్టెన్ ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు సైతం విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2026 వరకు నబీ పొట్టి ఫార్మాట్లో కొనసాగే అవకాశముంది.ఒకే ఒక్కడు.. అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు సుదీర్ఘ కాలం సేవలందించిన క్రికెటర్లలో మహ్మద్ నబీ అగ్రస్ధానంలో ఉంటాడు. 2009లో అఫ్గాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నబీ తన కెరీర్లో 165 వన్డేలు ఆడాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్తాన్‌లపై అఫ్గాన్ చారిత్రత్మక విజయాలు సాధించడంలో నబీది కీలక పాత్ర.ఇప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలకాలని నబీ నిర్ణయించుకున్నాడు. 165 వన్డేల్లో 3,549 పరుగులతో పాటు 171 వికెట్లు నబీ సాధించాడు.చదవండి: WI vs ENG: కెప్టెన్‌తో గొడవ.. జోషఫ్‌కు బిగ్ షాకిచ్చిన విండీస్ క్రికెట్ -
వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు..!
వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల వివరాలను స్పోర్ట్స్ టుడే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో మ్యాక్స్‌వెల్ ఆఫ్ఘనిస్తాన్పై చేసిన అజేయ డబుల్ సెంచరీకి (201) టాప్ ప్లేస్ లభించింది. 1983 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్‌కు రెండో స్థానం దక్కింది. 1998లో షార్జాలో ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ ఆడిన 143 పరుగుల ఇన్నింగ్స్ మూడో స్థానం.. 1984లో ఇంగ్లండ్‌పై వివ్ రిచర్డ్స్ ఆడిన 189 పరుగుల ఇన్నింగ్స్‌కు నాలుగో స్థానం.. 2003 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్‌పై రికీ పాంటింగ్ ఆడిన 140 పరుగుల ఇన్నింగ్స్‌కు ఐదో స్థానం.. 1997లో భారత్‌పై సయీద్ అన్వర్ ఆడిన 194 పరుగుల ఇన్నింగ్స్‌కు ఆరో స్థానం.. 2023 వరల్డ్‌కప్‌లో భారత్‌పై ట్రవిస్ హెడ్ ఆడిన 137 పరుగుల ఇన్నింగ్స్‌కు ఏడో స్థానం.. 2012లో శ్రీలంకపై విరాట్ కోహ్లి ఆడిన 133 పరుగుల ఇన్నింగ్స్‌కు ఎనిమిదో స్థానం.. 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై గౌతమ్ గంభీర్ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్‌కు తొమ్మిదో స్థానం.. 2014లో శ్రీలంకపై రోహిత్ ఆడిన 264 పరుగుల ఇన్నింగ్స్‌కు పదో స్థానం దక్కాయి. -
6 వికెట్లతో భారత్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ జెఫ్రీ వాండర్సే?
కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టుకు శ్రీలంక ఊహించని షాకిచ్చింది. తొలి వన్డేను టైగా ముగించిన శ్రీలంక.. రెండో వన్డేలో మాత్రం 32 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలి వన్డేలో ఏ విధంగా అయితే స్పిన్ వలలో చిక్కుకుని భారత్ విల్లవిల్లాడందో. సేమ్ టూ సేమ్ రెండో వన్డేలో కూడా అంతే. 241 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. రోహిత్ శర్మ మెరుపులతో 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది.దీంతో లక్ష్యాన్ని టీమిండియా సునాయసంగా చేధిస్తుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే తలకిందులు చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. 13 ఓవర్లో రోహిత్ శర్మను ఔట్ చేసి వికెట్ల వేట మొదలు పెట్టిన వాండర్సే.. ఆ తర్వాత విరాట్ కోహ్లి, శివమ్ దూబేలను వరుస క్రమంలో పెవిలియన్‌కు పంపాడు.జెఫ్రీ ఓంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఓవరాల్‌గా 6 వికెట్ల పడగొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన వాండర్సే.. తన 10 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. ఈ నేపథ్యంలో ఎవరీ వాండర్సే అని నెటిజన్లు తెగ వేతికేస్తున్నారు.ఎవరీ వాండర్సే...?భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు తొలుత ప్రకటించిన శ్రీలంక జట్టులో వాండర్సేకు చోటు దక్కలేదు. అయితే రెండో వన్డేకు ముందు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం బారిన పడడంతో అనుహ్యంగా వాండర్సే లంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తనకు వచ్చిన అవకాశాన్ని వాండర్సే అందిపుచ్చుకున్నాడు. కాగా 34 ఏళ్ల వాండర్సే 2015లో న్యూజిలాండ్‌పై శ్రీలంక తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో వాండర్సే కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు.ఆ తర్వాత అతడి వన్డేల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. తన 9 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు అతడు ఆడింది కేవలం 22 వన్డేలు మాత్రమే. అయితే లిస్ట్-ఎ క్రికెట్లో మాత్రం వాండర్సేకు అపారమైన అనుభవం ఉంది. 102 మ్యాచ్‌ల లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 3560 పరుగులతో పాటు 150 వికెట్లు పడగొట్టాడు.దేశీవాళీ క్రికెట్లో మూర్స్ ఎసీ, సీదువ రద్దోలువ సీసీ క్లబ్స్‌కు వాండర్సే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక వాండర్సే ఇప్పటివరకు ఓవరాల్‌గా 37 మ్యాచ్‌ల్లో శ్రీలంక తరపున ఆడాడు. అందులో 22 వన్డేలు, 14 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఉన్నాయి.అదే విధంగా వాండర్సే తన కెరీర్లో ఓ వివాదంలో కూడా చిక్కుకున్నాడు. 2018 వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక క్రికెట్ నిబంధనలను ఉల్లఘించినందుకు వాండర్సే ఏడాది పాటు నిషేదం ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా వార్షిక కాంట్రాక్ట్ ఫీజులో 20% జరిమానా కూడా శ్రీలంక క్రికెట్ విధించింది. -
‘సీనియర్లు కొనసాగుతారు’
బ్రిడ్జ్‌టౌన్: అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించినా... ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. టి20 ఫార్మాట్‌కు సంబంధించి భారత జట్టులో మార్పు మొదలైందన్న ఆయన... పాండ్యాను కెపె్టన్‌గా నియమించే విషయం సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. 2025లో చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్నాయి. ‘ముగ్గురు కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత టి20 జట్టులో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం సీనియర్లతో కూడిన మన జట్టు ప్రదర్శన చూస్తే మా తర్వాతి లక్ష్యం చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా గెలవడమే. దాదాపు ఇదే జట్టు అక్కడా ఆడుతుంది. సీనియర్లంతా అందుబాటులో ఉంటారు. భారత జట్టు అన్ని ఐసీసీ టైటిల్స్ గెలవాలనే నేనూ కోరుకుంటా. మన దగ్గర ప్రతిభావంతులైన రిజర్వ్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అవసరమైతే ఒకేసారి మనం 3 జట్లను బరిలోకి దించగలం’ అని జై షా అభిప్రాయపడ్డారు. తాజా వరల్డ్ కప్‌లో కీలక ప్రదర్శన చేసిన పాండ్యాపై షా ప్రశంసలు కురిపించారు. ‘పాండ్యా ఫామ్ గురించి గతంలో ఎన్నో రకాల సందేహాలు వ్యక్తం చేశారు. కానీ సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచి ఎంపిక చేస్తే దానిని పాండ్యా నిలబెట్టుకున్నాడు. అయితే టి20 టీమ్‌కు పూర్తి స్థాయి కెపె్టన్‌గా నియమించే అధికా రం సెలక్టర్ల చేతుల్లోనే ఉంది’ అని షా చెప్పారు. టీమిండియా మరింత ఆలస్యంగా...బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత టి20 జట్టు స్వదేశానికి రావడం మరింత ఆలస్యం కానుంది. బార్బడోస్ దేశాన్ని తాకిన పెను తుఫాన్‌తో ఆటగాళ్లు ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదు. తీవ్రత ఎక్కువగా ఉండే కేటగిరీ 4 హరికేన్ వల్ల రెండు రోజులుగా దేశం మొత్తం లాక్డౌన్లో ఉంది. ముఖ్యంగా స్థానిక ఎయిర్‌పోర్ట్‌ను పూర్తిగా మూసేశారు. దాంతో భారత జట్టు ప్రత్యేక విమానం ద్వారా అక్కడి నుంచి బయల్దేరే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. విద్యుత్, నీటి సరఫరా కూడా అస్తవ్యస్తంగా మారింది. ఎలాగైనా ఇక్కడి నుంచి ఆటగాళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ చార్టర్డ్ ఫ్లయిట్ కంపెనీలతో మాట్లాడే ప్రయత్నం చేశామని... అయితే ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు సాధ్యం కావడం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండటం మినహా మరో మార్గం లేదన్ని జై షా... భారత్‌కు చేరుకున్న తర్వాతే ఆటగాళ్ల సన్మానం తదితర విషయాల గురించి ఆలోచిస్తామని అన్నారు. -
బెస్ట్ వన్ డే టీంను ప్రకటించిన ఐసీసీ
-
ODI: ప్రణవి అద్భుత ఇన్నింగ్స్.. బెంగాల్‌పై హైదరాబాద్ గెలుపు
BCCI Women's Senior One Day Trophy 2024- న్యూఢిల్లీ: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు విజయంతో బోణీ చేసింది. బెంగాల్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ 24 పరుగుల తేడాతో గెలిచింది. ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 225 పరుగులు సాధించింది. ప్రణవి చంద్ర (88 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. రాణించిన త్రిష అదే విధంగా గొంగడి త్రిష 31 పరుగులతో రాణించింది. ఎం.మమత 21, వీఎమ్ కావ్య 29 పరుగులు సాధించారు. వీరి బాధ్యతాయుత ఇన్నింగ్స్ కారణంగా హైదరాబాద్ జట్టు 225 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 201 పరుగులకు బెంగాల్ ఆలౌట్ ఇక బెంగాల్ బౌలర్లలో ధరా గుజ్జార్ ఐదు వికెట్లు(5/27) దక్కించుకోగా.. సస్తి మొండల్ రెండు (2/25) వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో.. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ 49.3 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ధరా గుజ్జర్ 21, సస్తి మొండల్ 23 పరుగులు చేయగా.. కశిష్ అగర్వాల్ 62 పరుగులతో బెంగాల్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో గౌహర్ సుల్తానా, బి. శ్రావణి చెరో రెండు వికెట్లు తీసి చెప్పుకోగదగ్గ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కాగా తొలి మ్యాచ్‌లోనే బెంగాల్ వంటి పటిష్ట జట్టుపై గెలుపొందడం హైదరాబాద్ మహిళా జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. చదవండి: ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్ -
Australian cricketer: వన్డేలకు వార్నర్ గుడ్‌బై
ఆ్రస్టేలియా డాషింగ్ ఓపెనర్ వార్నర్ వన్డే ఫార్మాట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్యాటింగ్‌లో మెరుపులు, నోటితో తూటాలు పేల్చే అతను పలు వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచాడు. అతని ఖాతాలో సెంచరీలున్నట్లే కెరీర్లో సస్పెన్షన్లు, బాల్ టాంపరింగ్ మరకలూ ఉన్నాయి. ఇప్పుడా ఆట, దూకుడు ఇక మీదట టి20లకే పరిమితం కానున్నాయి. సిడ్నీ: డేవిడ్ వార్నర్ అంటే విజయవంతమైన ఓపెనరే కాదు... వివాదాస్పద క్రికెటర్ కూడా! బ్యాట్‌తో బాదడం ఎంత బాగా తెలుసో... ‘సై అంటే సై’ అని నోటికి పని చెప్పడం కూడా తెలిసినోడు. విధ్వంసకర బ్యాటర్‌గా ఎలా గుర్తుండిపోతాడో అంతే స్థాయిలో తెంపరితనం ఉన్న వ్యక్తిగానూ ముద్ర వేసుకున్నాడు. ఇక మన తెలుగు ప్రేక్షకులకైతే సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఇప్పుడు లేడు)తో బాగా కనెక్టయ్యాడు. తెలుగు హీరోల మేనరిజాన్ని, పాటలకు నప్పే స్టెప్పులతో సోషల్ మీడియాలో వినోదం పంచిన ఈ ఆస్ట్రేలియన్ తాజాగా వన్డే క్రికెట్‌కు సైతం వీడ్కోలు పలికేశాడు. పాకిస్తాన్‌తో స్వదేశంలో ఆఖరి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న వేళ వన్డేలపై నిర్ణయాన్ని ప్రకటించాడు. సిడ్నీలో 3 నుంచి జరిగే మూడో టెస్టు అనంతరం అతను కేవలం అంతర్జాతీయ క్రికెట్లో టి20 ఫార్మాట్లోనే కొనసాగుతాడు. సోమవారం మీడియా సమావేశంలో 37 ఏళ్ల వార్నర్ మాట్లాడుతూ ‘భారత్‌లో జరిగిన ప్రపంచకప్ సమయంలోనే రిటైర్మెంట్ గురించి చెప్పాను. విశ్వవిజేత జట్టు సభ్యుడిగా ఎంతో సంతృప్తికరమైన వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నాను. దీనివల్ల నేను ఫ్రాంచైజీ టి20 లీగ్‌ను మరింత శ్రద్దపెట్టి ఆడేందుకు వీలవుతుంది. ఈ ఫార్మాట్లో అంతర్జాతీయ కెరీర్‌నూ కొనసాగిస్తాను. అయితే 2025లో చాంపియన్స్ ట్రోఫీ నాటికి ఫామ్‌లో ఉంటే, జట్టుకు అవసరమనిపిస్తే అందుబాటులో ఉంటాను’ అని అన్నాడు. సఫారీతో అరంగేట్రం దక్షిణాఫ్రికాతో 2009 జనవరిలో జరిగిన టి20 మ్యాచ్‌తో 22 ఏళ్ల వార్నర్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే నెల అదే ప్రత్యర్థితోనే తొలి వన్డే కూడా ఆడాడు. 15 ఏళ్ల కెరీర్లో 99 టి20 మ్యాచ్‌ల్లో 2894 పరుగులు చేశాడు. ఒక సెంచరీతోపాటు 24 ఫిఫ్టీలు అతని ఖాతాలో ఉన్నాయి. 161 వన్డేలాడిన వార్నర్ 45.30 సగటుతో 6932 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 33 అర్ధసెంచరీలున్నాయి. 111 టెస్టుల్లో 44.58 సగటుతో 8695 పరుగులు చేశాడు. 26 శతకాలు, 36 అర్ధశతకాలు బాదాడు. ఇవీ విజయాలు ► మరకలు పక్కనబెట్టి కేవలం క్రికెట్‌నే పరిగణిస్తే మాత్రం వార్నర్ పరిపూర్ణ సాఫల్య క్రికెటర్ అని చెప్పొచ్చు. ఆ్రస్టేలియా సాధించిన 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లలో అతను కీలకపాత్ర పోషించాడు. 2021 టి20 వరల్డ్‌కప్ విజయంలో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. 2023 ఐసీసీ టెస్టు చాంపియన్íÙప్ విజేత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. ఇవీ వివాదాలు ► 2013 చాంపియన్స్ ట్రోఫీ సమయంలో జో రూట్ తో వాగ్వాదానికి దిగడంతో క్రికెట్ ఆ్రస్టేలియా అతనిపై రెండు టెస్టుల నిషేధం విధించింది. దీంతో అతను ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్ని ఆడలేకపోయాడు. ► కేప్‌టౌన్ టెస్టులో బాల్ టాంపరింగ్ ఉదంతం వార్నర్ కెరీర్‌కే మాయని మచ్చ. దీంతో అతనితో పాటు, స్మిత్ (అప్పటి కెపె్టన్) ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు. ఇవి చాలవన్నట్లు అదుపులేని నోటి దురుసుతనంతో జీవితకాలం సారథ్యం చేపట్టకుండా శిక్షకు గురయ్యాడు. -
వన్డే క్రికెట్లో వార్నర్ సాధించిన ఘనతలు ఇవే..!
టెస్ట్‌లతో పాటు వన్డే క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా సంచలన ప్రకటన చేసిన డేవిడ్ వార్నర్ 50 ఓవర్ల ఫార్మాట్‌పై తనదైన ముద్ర వేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 37 ఏళ్ల వార్నర్ తన వన్డే కెరీర్లో మొత్తం 161 మ్యాచ్‌లు ఆడి 22 సెంచరీలు, 33 అర్దసెంచరీల సాయంతో 45.30 సగటున 6932 పరుగులు చేశాడు. వన్డేల్లో వార్నర్ అత్యధిక స్కోర్ 179గా ఉంది. వార్నర్ తన వన్డే కెరీర్లో దాదాపు 100 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు సాధించాడు. వన్డేల్లో వార్నర్ సాధించిన ఘనతలు.. 🏆2015 వరల్డ్ కప్ విజేత 🏆2023 వరల్డ్ కప్ విజేత వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్‌గా రెండో అత్యధిక పరుగులు వన్డేల్లో ఆస్ట్రేలియా తరపున రెండవ అత్యధిక సెంచరీలు వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు వన్డే ప్రపంచ కప్‌లలో ఆస్ట్రేలియా తరఫున రెండవ అత్యధిక పరుగులు 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరఫున సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్ 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తరఫున లీడింగ్ రన్ స్కోరర్ 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తరఫున లీడింగ్ రన్ స్కోరర్ వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున ఆరో అత్యధిక రన్ స్కోరర్ కాగా, టెస్ట్‌లతో పాటు వన్డే క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా స్పష్టం చేసిన డేవిడ్ వార్నర్.. అవసరమైతే ఈ ఫార్మాట్లో రీఎంట్రీ ఇస్తానని ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చాడు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుండగా.. అప్పటికి తాను ఫామ్‌లో ఉండి, జట్టు తన సేవలు అవసరమనుకుంటే తిరిగి బరిలోకి దిగుతానని తెలిపాడు. వార్నర్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌తో మూడో టెస్ట్ సుదీర్ఘ ఫార్మాట్లో తనకు చివరి టెస్ట్ అని వార్నర్ స్పష్టం చేశాడు. టెస్ట్‌లతో పాటు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఫ్రాంచైజీ అయిన దుబాయ్ క్యాపిటల్స్ వార్నర్‌ను తమ జట్టు కెప్టెన్‌గా ప్రకటించింది. దుబాయ్ క్యాపిటల్స్ విండీస్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ స్థానంలో వార్నర్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పింది. వార్నర్ ఐపీఎల్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ సభ్యుడిగా ఉన్నాడు. గత సీజన్లో అతను పంత్ గైర్హాజరీలో డీసీ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. దుబాయ్ క్యాపిటల్స్.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనుబంధ ప్రాంచైజీ అన్న విషయం తెలిసిందే. -
ఇకపై క్రికెట్లో కొత్త రూల్.. అతిక్రమిస్తే తప్పదు భారీ మూల్యం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ ఏడాది డిసెంబర్ నుంచి పురుషుల వన్డే, టీ20 క్రికెట్లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. "స్టాప్ క్లాక్" పేరుతో ఉండే ఈ నిబంధనను వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ వెల్లడించింది. స్టాప్ క్లాక్ నిబంధన ఏంటంటే.. ఐసీసీ కొత్తగా ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకెన్ల నిర్దిష్ట సమయాన్ని గ్యాప్ టైమ్‌గా ఫిక్స్ చేసింది. బౌలింగ్ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్ వేసేందుకు బౌలర్‌ను దించాలి. రెండుసార్లు నిర్దిష్ట వ్యవధి దాటితే మన్నిస్తారు. మూడోసారి ఆలస్యమైతే మాత్రం బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు. ఈ పరుగులు బ్యాటింగ్ టీమ్ స్కోర్‌కు యాడ్ అవుతాయి. ఫీల్డ్ అంపైర్లు స్టాప్ క్లాక్‌తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. అహ్మదాబాద్‌లో నిన్న (నవంబర్ 21) జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధన అమలుపై నిర్ణయం తీసుకున్నారు. -
వన్డేల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్.. టాప్‌లో మ్యాక్స్‌వెల్, ఆతర్వాత భారత ఆటగాడు
వన్డేల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల వివరాలను ప్రముఖ ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఫాక్స్ క్రికెట్ ఇవాళ (నవంబర్ 9) ప్రకటించింది. వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్పై గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫాక్స్ క్రికెట్ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా టాప్-10లో ఇద్దరు భారత ఆటగాళ్ల ఇన్నింగ్స్‌లకు చోటు దక్కడం విశేషం. Fox Cricket picked their greatest Top 10 knocks in ODI history. pic.twitter.com/1s5qhyzlKe — Johns. (@CricCrazyJohns) November 8, 2023 ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్పై మ్యాక్సీ ఆడిన ఇన్నింగ్స్‌కు (201 నాటౌట్) టాప్ ప్లేస్ దక్కగా.. 2014లో శ్రీలంకపై రోహిత్ శర్మ సాధించిన 264 పరుగుల ఇన్నింగ్స్‌కు రెండో స్థానం లభించింది. 1984లో ఇంగ్లండ్‌పై విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ 189 పరుగుల ఇన్నింగ్స్, 1983 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 నాటౌట్ ఇన్నింగ్స్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆతర్వాతి స్థానాల్లో 2006లో ఆసీస్‌పై సౌతాఫ్రికా ఆటగాడు హర్షల్ గిబ్స్ 175 పరుగుల ఇన్నింగ్స్, 2007లో శ్రీలంకపై గిల్‌క్రిస్ట్ 149 పరుగుల ఇన్నింగ్స్‌లు నిలిచాయి. ఏడో స్థానంలో ఏబీ డివిలియర్స్ (2015లో వెస్టిండీస్‌పై 149 పరగులు), ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలు మార్టిన్ గప్తిల్ (2015లో వెస్టిండీస్‌పై 237 నాటౌట్), సనత్ జయసూర్య (2000లో భారత్‌పై 189 పరుగులు), సయ్యద్ అన్వర్ (1997లో భారత్‌పై 194 పరుగులు) ఇన్నింగ్స్‌లకు దక్కాయి. -
విరాట్ కోహ్లి= సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ రికార్డును అందుకోవాలంటే మళ్లీ సచినే దిగి రావాలి... మాస్టర్ బ్యాటర్ ఘనతల గురించి ఒకప్పుడు వినిపించిన వ్యాఖ్యల్లో ఇదొకటి. సచిన్ రికార్డుల స్థాయి, అతను అందుకున్న అసాధారణ మైలురాళ్లను చేరుకోవడం దాదాపు అసాధ్యమనే భావన ఇందులో కనిపించింది... కానీ వాటిలో ఒక అరుదైన రికార్డును విరాట్ కోహ్లి ఇప్పుడు అందుకున్నాడు... తనకే సాధ్యమైన అద్భుత ఆటతో వన్డే క్రికెట్‌కు ముఖచిత్రంగా మారిన కోహ్లి 49వ సెంచరీని సాధించడం అనూహ్యమేమీ కాదు... ప్రపంచకప్‌కు ముందు 47 వద్ద నిలిచిన అతను మెగా టోర్నీలో కనీసం రెండు సెంచరీలు సాధించగలడని అందరూ నమ్మారు... బంగ్లాదేశ్‌పై సెంచరీ తర్వాత మరో రెండుసార్లు చేరువగా వచ్చీ శతకానికి దూరమైన అతను ఈసారి విజయవంతంగా ఫినిషింగ్ లైన్‌ను దాటాడు. విరాట్ కోహ్లి నుదుటి రాతను దేవుడు రాయడు... అతనే స్వయంగా తన రాత రాసుకుంటాడు... కోహ్లి శతకం అందుకున్న క్షణాన కామెంటేటర్ అన్న ఈ మాట అక్షరసత్యం. ప్రపంచకప్ మ్యాచ్‌లో తన 35వ పుట్టిన రోజున సచిన్ సెంచరీల సరసన నిలవడంవంటి అద్భుత స్క్రిప్ట్ నిజంగా కోహ్లికే సాధ్యమైంది. ప్రపంచకప్ గెలిచిన క్షణంలో సచిన్‌ను భుజాల మీదకు ఎత్తుకున్న కోహ్లి... పుష్కరం తర్వాత భుజం భుజం కలుపుతూ అతని సరసన సమానంగా నిలిచాడు. సాక్షి క్రీడా విభాగం : వన్డే క్రికెట్‌ను విరాట్ కోహ్లి చదువుకున్నంత గొప్పగా మరెవరి వల్లా సాధ్యం కాలేదేమో! ఇన్నింగ్స్‌ను ఎలా ప్రారంభించాలి, మధ్య ఓవర్లలో ఎలాంటి ఆట ఆడాలి, చివర్లో ఎంతగా దూకుడు జోడించాలి... సరిగ్గా తాసులో కొలిచి లెక్కించినట్లుగా అతను ఈ ఫార్మాట్లో తన ఆటను ప్రదర్శించాడు. రుచికరమైన వంటకం కోసం వేర్వేరు దినుసులను సరిగ్గా ఎలా కలపాలో బాగా తెలిసిన షెఫ్ తరహాలో వన్డేల్లో విజయం కోసం ఎలాంటి మేళవింపు ఉండాలో అతను ఆడి చూపించాడు. ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా...లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా తన వ్యూహంపై ఉండే స్పష్టత కోహ్లిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. సాధారణంగా తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే ఒత్తిడి ఎక్కువగా ఉండే లక్ష్య ఛేదనలో గొప్ప గొప్ప ఆటగాళ్ల రికార్డులు కూడా పేలవంగా ఉంటాయి. కానీ కోహ్లికి మాత్రం పరుగుల వేటలోనే అసలు మజా. ఎంత లక్ష్యాన్నైనా అందుకోవడంలో తనను మించిన మొనగాడు లేడన్నట్లుగా అతని బ్యాటింగ్ సాగింది. తొలి ఇన్నింగ్స్‌లతో (51.15 సగటు, 22 సెంచరీలు) పోలిస్తే ఛేదనలో కోహ్లి రికార్డు (65.49 సగటు, 27 సెంచరీలు) ఘనంగా ఉందంటే అతని ఆట ఎలాంటిదో అర్థమవుతుంది. ఈ 27లో 23 సార్లు భారత్ విజయం సాధించడం విశేషం. తన బ్యాటింగ్‌పై అపరిమిత నమ్మకం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఓటమిని అంగీకరించని తత్వం కోహ్లిని ‘ది బెస్ట్’గా తీర్చిదిద్దగా... అసాధారణ ఫిట్నెస్, విశ్రాంతి లేకుండా సుదీర్ఘ సమయం పాటు సాగే కఠోర సాధన అతడి ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కోల్‌కతాలో శతకంతో మొదలై... ఆగస్టు 18, 2008... కోహ్లి తొలి వన్డే మ్యాచ్ ఆడిన రోజు. కొద్ది రోజుల క్రితమే భారత్‌కు అండర్–19 ప్రపంచకప్ అందించిన కెపె్టన్‌గా కోహ్లికి గుర్తింపు ఉండగా... సచిన్, సెహ్వాగ్‌లు విశ్రాంతి తీసుకోవడంతో శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అతనికి తొలి అవకాశం దక్కింది. ఐదింటిలో ఒక మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసినా సీనియర్ల రాకతో తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత దేశవాళీలో, ఆ్రస్టేలియా గడ్డపై ఎమర్జింగ్ టోర్నీలో భారీ స్కోర్లతో చెలరేగిన తనను మళ్లీ ఎంపిక చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు. దాంతో ఏడాది తర్వాత మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసే అవకాశం దక్కింది. మూడు అర్ధసెంచరీల తర్వాత తన 14వ వన్డేలో శ్రీలంకపై 114 బంతుల్లో చేసిన 107 పరుగుల ఇన్నింగ్స్‌తో అతని ఖాతాలో తొలి సెంచరీ చేరింది. ఈ సెంచరీ కోల్‌కతాలోనే ఈడెన్ గార్డెన్స్‌లో నమోదు చేయడం విశేషం. ఈ మ్యాచ్ తర్వాత మరో మూడు వన్డేలకే మళ్లీ సెంచరీ నమోదు చేసిన కోహ్లికి ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వన్డే టీమ్‌లో అతను పూర్తి స్థాయిలో రెగ్యులర్ మెంబర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సెహ్వాగ్‌తో పాటు కోహ్లి కూడా సెంచరీ సాధించాడు. అయితే ఫైనల్లో అతని ఇన్నింగ్స్ (35 పరుగులు) కూడా ఎంతో విలువైంది. 31 పరుగులకే సెహ్వాగ్, సచిన్ అవుటైన తర్వాత గంభీర్‌తో మూడో వికెట్‌కు జోడించిన కీలకమైన 83 పరుగులు చివరకు విజయానికి బాట వేశాయి. ఒకదాన్ని మించి మరొకటి... విరాట్ కెరీర్లో అప్పటికే ఎనిమిది సెంచరీలు వచ్చి చేరాయి. జట్టులో స్థానానికి ఢోకా లేకపోగా, జాగ్రత్తగా ఆడుతూ ఒక్కో పరుగు జత చేస్తూ ఇన్నింగ్స్ నిరి్మంచే ‘క్లాసిక్’ ఆటగాడిగా కోహ్లికి అప్పటికి గుర్తింపు వచ్చింది. కానీ అతనిలోని అసలైన దూకుడుకు హోబర్ట్ మైదానం వేదికైంది. శ్రీలంకతో మ్యాచ్‌లో 40 ఓవర్లలో 321 పరుగులు ఛేదిస్తేనే టోర్నీలో నిలిచే అవకాశం ఉన్న సమయంలో కోహ్లి నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. 86 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 133 పరుగులు చేయడంతో 37వ ఓవర్లోనే భారత్ లక్ష్యాన్ని చేరింది. పరిస్థితిని బట్టి కోహ్లి తన ఆటను ఎలా మార్చుకోగలడో ఈ ఇన్నింగ్స్ చూపించగా, తర్వాతి రోజుల్లో ఇలాంటివి ఎన్నో వచ్చాయి. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై చేసిన అత్యధిక స్కోరు 183, కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై 160 నాటౌట్, నేపియర్‌లో కివీస్‌పై 123, పుణేలో ఇంగ్లండ్‌పై 123, మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై 117... ఏది గొప్పదంటే ఏమి చెప్పాలి? జైపూర్‌లో ఆ్రస్టేలియాపై 52 బంతుల్లోనే చేసిన శతకం ఇప్పటికీ భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీగా నమోదై ఉంది. అతని ఒక్కో వన్డే ఇన్నింగ్స్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ శతకాలు అభిమానులకు పంచిన ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పాలా! -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్.. ఏబీ డివిలియర్స్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు
21 ఏళ్ల ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఆస్ట్రేలియా దేశవాలీ వన్డే టోర్నీ మార్ష్ కప్ 2023-24లో భాగంగా టస్మానియాతో ఇవాళ (అక్టోబర్ 8) జరుగుతున్న మ్యాచ్‌లో ఫ్రేజర్ (సౌత్ ఆస్ట్రేలియా) కేవలం 29 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న ఫ్రేజర్ 10 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి ఔటయ్యాడు. 21-year-old Jake Fraser-McGurk set a world record by scoring a 29-ball century in Australia's Marsh Cup, breaking Ab de Villiers' record of a 31-ball List A hundred! 🤯👏 pic.twitter.com/z53anVA89r — CricTracker (@Cricketracker) October 8, 2023 ఈ సెంచరీ ద్వారా ఫ్రేజర్ లిస్ట్-ఏ క్రికెట్లో సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలుకొట్టాడు. 2014-15లో జొహనెస్‌బర్గ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ 31 బంతుల్లోనే శతక్కొట్టగా.. ఇవాల్టి మ్యాచ్‌లో ఫ్రేజర్ దాదాపు 10 సంవత్సరాలుగా చలామణిలో ఉండిన ఆ రికార్డును బద్దలు కొట్టాడు. టస్మానియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫ్రేజర్ సృష్టించిన విధ్వంసం ఏ రేంజ్లో ఉండిందంటే.. 436 పరుగులు అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న అతని జట్టు (సౌత్ ఆస్ట్రేలియా) కేవలం 11.4 ఓవర్లలోనే 172 పరుగులు చేసింది. కేవలం 11.4 ఓవర్లలోనే ఫ్రేజర్ సెంచరీని పూర్తి చేసుకుని ఔటయ్యాడు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తున్న సౌత్ ఆస్ట్రేలియా సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తుంది. 35 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలంటే 90 బంతుల్లో 122 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. నాథన్ మెక్‌స్వీనీ (47), జేక్ లీమన్ (25) క్రీజ్‌లో ఉన్నారు. సౌత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఫ్రేజర్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. హెన్రీ బ్రంట్ (51), డేనియల్ డ్రూ (52) అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. టస్మానియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జోర్డన్ సిల్క్ (85 బంతుల్లో 116; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు శతకంతో విరుచుకుపడగా.. ఓపెనర్ కాలెబ్ జువెల్ (52 బంతుల్లో 90; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో మెరిశాడు. రైట్ (51) అర్ధసెంచరీతో రాణించగా... చార్లీ వాకిమ్ (48), వెబ్‌స్టర్ (42), వెథరాల్డ్ (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో టస్మానియా నిర్ధేశించిన 436 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆస్ట్రేలియా ఛేదిస్తే.. దేశవాలీ క్రికెట్ అతి భారీ లక్ష్య ఛేదనగా.. లిస్ట్-ఏ క్రికెట్లో రెండో సక్సెస్ఫుల్ రన్ చేజ్‌గా రికార్డుల్లోకెక్కుతుంది. లిస్ట్-ఏ క్రికెట్లో సక్సెస్ఫుల్ రన్‌ఛేజ్ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డే క్రికెట్లో తొలి జట్టుగా ప్రపంచ రికార్డు
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు రికార్డు స్థాయిలో 18 సిక్సర్లు బాదడంతో భారత్ వన్డే క్రికెట్లో 3000 సిక్సర్ల మార్కును (3007) తాకిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ వన్డేల్లో ఏ జట్టు ఇప్పటివరకు 3000 సిక్సర్లు కొట్టలేదు. భారత్ తర్వాత వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా విండీస్ (2953) ఉంది. ఈ జాబితాలో పాక్ (2566), ఆస్ట్రేలియా (2476), న్యూజిలాండ్ (2387), ఇంగ్లండ్ (2032), సౌతాఫ్రికా (1947), శ్రీలంక (1779), జింబాబ్వే (1303), బంగ్లాదేశ్ (959) వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వన్డేల్లో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కొట్టిన 18 సిక్సర్లు వన్డేల్లో భారత్ రెండో అత్యధిక సిక్సర్ల రికార్డుగా నమోదైంది. 2013లో బెంగళూరులో ఆసీస్‌పై బాదిన 19 సిక్సర్లు వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో భారత అత్యధిక సిక్సర్ల రికార్డుగా నమోదై ఉంది. కాగా, ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ నిర్ధేశించిన 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 56/2 వద్ద ఉండగా వర్షం మొదలై ఆటకు అంతరాయం కలిగింది. లబూషేన్ (17), వార్నర్ (26) క్రీజ్‌లో ఉన్నారు. -
భారత్ చేతిలో పాక్ చిత్తు
వహ్వా... ఇది కదా ఆటంటే... దీని కోసమే కదా మన అభిమానులంతా ఆశలు పెట్టుకుంది... నేనున్నానంటూ వాన మళ్లీ మళ్లీ వచ్చేస్తున్నా ఇలాంటి ఒక్క మ్యాచ్ కోసమే కదా అందరం ఎదురు చూసింది... ఇందుకే కదా నిర్వాహకులు ఈ ఒక్క పోరు కోసం నిబంధనలు మార్చేసింది... రిజర్వ్ డే అంటూ పెట్టుకున్నందుకు తగిన న్యాయం చేస్తున్నట్లుగా భారత బ్యాటర్లు చెలరేగి వినోదం పంచారు. తొలి పోరులో విఫలమై పాక్ బౌలింగ్‌ను ఆడలేరంటూ వచ్చిన విమర్శలను చిత్తు చేస్తూ చెలరేగారు. పేలవ బౌలింగ్ తర్వాత కొండంత లక్ష్యానికి చేరువగా కూడా రాలేక పాక్ కుప్పకూలింది. ఒక్కసారి లయ అందుకుంటే తాను ఎంత బాగా ఆడగలనో కోహ్లి చూపించాడు... గతంలోలాగా ఒక్క ఇన్నింగ్స్‌లో ఎన్నో రికార్డులు అందుకుంటూ ముందుకు సాగిపోతూ సచిన్ సెంచరీలకు సరిగ్గా రెండడుగుల దూరంలో నిలిచాడు... మరోవైపు ఫామ్, ఫిట్నెస్ చూపించుకోవాల్సిన స్థితిలో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సెంచరీతో చెలరేగాడు. వీరి భాగస్వామ్యాన్ని విడదీయలేక పాక్ బౌలర్లు చేతులెత్తేశారు. గత మ్యాచ్‌లో టాప్–4ను తొందరగా పడగొట్టి ఆధిక్యం చూపించిన పాక్ పని పట్టేందుకు ఇప్పుడు టాప్–4 మాత్రమే సరిపోయారు. కొలంబో: వన్డే క్రికెట్లో పాకిస్తాన్‌పై భారత్ తమ ఆధిక్యాన్ని మరింత స్పష్టంగా ప్రదర్శించింది. ఆసియా కప్‌లో ఆసక్తిని రేపిన ‘సూపర్–4’ పోరులో టీమిండియాదే పైచేయి అయింది. సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల భారీ తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించింది. ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 147/2తో సోమ వారం ఆట కొనసాగించిన భారత్ 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (94 బంతుల్లో 122 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (106 బంతుల్లో 111 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకాలతో చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్‌కు అభేద్యంగా 233 పరుగులు జోడించారు. ఈ జోడీ 32.1 ఓవర్లలోనే 7.25 రన్‌రేట్‌తో ఈ పరుగులు రాబట్టడం విశేషం. సోమవారం 25.5 ఓవర్ల పాటు బౌలింగ్ చేసినా పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. అనంతరం పాక్ 32 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఫఖర్ జమాన్ (27)దే అత్యధిక స్కోరు. గాయాల కారణంగా రవూఫ్, నసీమ్ షా బ్యాటింగ్‌కు దిగకపోవడంతో 8 వికెట్లకే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. కుల్దీప్కు 5 వికెట్లు దక్కాయి. డబుల్ ధమాకా... రిజర్వ్ డే రోజున కూడా భారత జట్టు తొలి రోజు తరహాలోనే తమ జోరు కొనసాగించింది. పాకిస్తాన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కోహ్లి, రాహుల్ చక్కటి షాట్లతో చెలరేగారు. షాహిన్ సహా ఇతర బౌలర్ల పేలవ ప్రదర్శనకు తోడు గాయం కారణంగా రవూఫ్ సోమవారం అసలు బౌలింగ్‌కే దిగకపోవడం కూడా పాక్‌ను దెబ్బ తీసింది. ముందుగా 60 బంతుల్లో రాహుల్, ఆ తర్వాత 55 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. 40 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 251 పరుగులకు చేరింది. తర్వాతి పది ఓవర్లలో భారత జోడీ మరింతగా దూసుకుపోయింది. తర్వాతి 5 ఓవర్లలో జట్టు 49 పరుగులు రాబట్టి 300 పరుగుల మార్క్ అందుకుంది. నాలుగు బంతుల వ్యవధిలో రాహుల్ (100 బంతుల్లో), కోహ్లి (84 బంతుల్లో) ఖాతాలో శతకాలు చేరాయి. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 56 పరుగులు రాబట్టడం విశేషం. ఫహీమ్ వేసిన చివరి ఓవర్లో ఆఖరి మూడు బంతులను వరుసగా 4, 4, 6గా మలచి కోహ్లి ఘనంగా ఇన్నింగ్స్ ముగించాడు. 📸📷: How about that for a win for #TeamIndia! 🙌 🙌#AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/EgXF17y4z1 — BCCI (@BCCI) September 11, 2023 టపటపా... ఛేదనలో మొదటి నుంచే తడబడిన పాకిస్తాన్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇమామ్ (9)ను అవుట్ చేసి బుమ్రా తొలి వికెట్ అందించగా, పాండ్యా బౌలింగ్‌లో బాబర్ (10) బౌల్డయ్యాడు. వాన విరామం తర్వాత తొలి ఓవర్లోనే రిజ్వాన్ (2)ను శార్దుల్ అవుట్ చేయడంతో పాక్ పరిస్థితి మరింత దిగజారింది. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో ఫఖర్, సల్మాన్ (23) వెనుదిరిగారు. అతి కష్టమ్మీద 24.5 ఓవర్లలో 100 పరుగులకే చేరిన జట్టు ఆ తర్వాత వేగంగా ఓటమి దిశగా పయనించింది. ఆగని వాన... రిజర్వ్ డే రోజున కూడా వర్షం మ్యాచ్‌ను వెంటాడింది. వాన తెరిపినివ్వకపోవడంతో ఆట ఆరంభానికే చాలా సమయం పట్టింది. చివరకు 1 గంట 40 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్ మొదలైంది. ఆ తర్వాత పాక్ ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు ముగిశాక వర్షం రాకతో ఆట నిలిచిపోయింది. ఈ సమయంలో మరో 1 గంట 12 నిమిషాల విరామం వచ్చింది. 47: వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. అగ్రస్థానంలో ఉన్న సచిన్ (49) శతకాలను అందుకునేందుకు మరో 2 సెంచరీలు దూరంలో మాత్రమే ఉన్నాడు. 5: వన్డేల్లో కోహ్లి 13 వేల పరుగులు పూర్తి చేసుకొని ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్‌కంటే 54 ఇన్నింగ్స్‌లు తక్కువగా ఆడి కోహ్లి ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. ప్రేమదాస స్టేడియంలో అతనికి వరుసగా నాలుగు వన్డేల్లో నాలుగో సెంచరీ కావడం మరో విశేషం. 1: పాకిస్తాన్‌పై భారత్ తమ అత్యధిక స్కోరు (356)ను సమం చేసింది. 2005లోనూ వైజాగ్‌లో పాక్‌పై భారత్ 356 పరుగులు చేసింది. 5: వన్డేల్లో పాకిస్తాన్‌పై ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఐదో భారతీయ బౌలర్ కుల్దీప్ యాదవ్. గతంలో అర్షద్ అయూబ్ (5/21; 1988లో), సౌరవ్ గంగూలీ (5/16; 1997లో), వెంకటేశ్ ప్రసాద్ (5/27; 1999లో), సచిన్ టెండూల్కర్ (5/50; 2005లో) ఈ ఘనత సాధించారు. For his outstanding unbeaten TON, Virat Kohli bagged the Player of the Match award as #TeamIndia beat Pakistan by 228 runs in Super 4s 👏 👏 Scorecard ▶️ https://t.co/kg7Sh2t5pM#AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/Zq0WVZK3XG — BCCI (@BCCI) September 11, 2023 స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఫహీమ్ (బి) షాదాబ్ 56; గిల్ (సి) సల్మాన్ (బి) షాహిన్ 58; కోహ్లి (నాటౌట్) 122; రాహుల్ (నాటౌట్) 111; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 2 వికెట్లకు) 356. వికెట్ల పతనం: 1–121, 2–123. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–0–79–1, నసీమ్ షా 9.2–1–53–0, ఫహీమ్ 10–0–74–0, రవూఫ్ 5–0–27–0, షాదాబ్ 10–1–71–1, ఇఫ్తికార్ 5.4–0–52–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫఖర్ (బి) కుల్దీప్ 27; ఇమామ్ (సి) గిల్ (బి) బుమ్రా 9; బాబర్ (బి) పాండ్యా 10; రిజ్వాన్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 2; సల్మాన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 23; ఇఫ్తికార్ (సి అండ్ బి) కుల్దీప్ 23; షాదాబ్ (సి) శార్దుల్ (బి) కుల్దీప్ 6; ఫహీమ్ (బి) కుల్దీప్ 4; షాహిన్ (నాటౌట్) 7; నసీమ్ (ఆబ్సెంట్ హర్ట్), రవుఫ్ (ఆబ్సెంట్ హర్ట్), ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (32 ఓవర్లలో ఆలౌట్) 128. వికెట్ల పతనం: 1–17, 2–43, 3–47, 4–77, 5–96, 6–110, 7–119, 8–128. బౌలింగ్: బుమ్రా 5–1–18–1, సిరాజ్ 5–0–23–0, పాండ్యా 5–0–17–1, శార్దుల్ 4–0–16–1, కుల్దీప్ 8–0–25–5, జడేజా 5–0–26–0. -
Ind vs Pak: కోహ్లి అద్భుత శతకం.. 77వ సెంచరీతో రికార్డు
Asia Cup 2023- India vs Pakistan: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా వన్డేల్లో కోహ్లికిది 47వ శతకం కాగా.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 77వది. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో తద్వారా సమకాలీన క్రికెటర్లెవ్వరికీ సాధ్యం కాని రీతిలో సెంచరీల రికార్డులో మరో ముందడుగు వేశాడు. కాగా టీమిండియా దిగ్గజం అంతర్జాతీయ స్థాయిలో 100 శతకాలతో ముందు వరుసలో ఉండగా.. కోహ్లి అతడిని అనుసరిస్తున్నాడు. కోహ్లి సమకాలీన బ్యాటర్లలో జో రూట్(ఇంగ్లండ్), డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా) 46.. రోహిత్ శర్మ 44 శతకాలతో ఉన్నారు. అరుదైన మైలురాయిని చేరుకున్న కోహ్లి ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి వన్డేల్లో 13000 పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం. దీంతో కింగ్ కోహ్లి ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.ఆసియా కప్-2023 సూపర్-4 దశలో భాగంగా టీమిండియా పాకిస్తాన్‌తో తలపడుతోంది. ధనాధన్ సెంచరీలు వర్షం కారణంగా ఆదివారం నాటి ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించారు. అయితే, సోమవారం కూడా వరణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. ఈ క్రమంలో 24.1 ఓవర్ల వద్ద 147-2 వద్ద ఆట మొదలుపెట్టిన టీమిండియా స్కోరు బోర్డును విరాట్ కోహ్లి- కేఎల్ రాహుల్ పరుగులుపెట్టించారు. ఇద్దరూ అజేయ శతకాలతో చెలరేగి 200కు పైగా భాగస్వామ్యం నమోదు చేశారు. రాహుల్ 106 బంతుల్లో 111 పరుగులు, కోహ్లి 94 బంతుల్లో 122 పరుగులు సాధించడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా కేవలం రెండు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు చేసింది. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌కు భారీ షాక్! హ్యారిస్ రవూఫ్ దూరం.. కారణమిదే 13000 ODI runs and counting for 👑 Kohli He also brings up his 47th ODI CENTURY 👏👏#TeamIndia pic.twitter.com/ePKxTWUTzn — BCCI (@BCCI) September 11, 2023 💯 NUMBER 4️⃣7️⃣ King @imVkohli, take a bow! 🙌😍 Legendary knock by the modern day great. #Pakistan truly gets the best out of the King! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvPAK #Cricket pic.twitter.com/7BfKckU1AO — Star Sports (@StarSportsIndia) September 11, 2023 -
Rohit Vs Kohli: సచిన్ అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్, కోహ్లి.. ఈసారి
Asia Cup 2023- Rohit Sharma- Virat Kohli: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా సమరానికి బుధవారం(ఆగష్టు 30) తెరలేవనుంది. పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా పసికూన నేపాల్‌తో ఆతిథ్య జట్టు తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఇక దాయాదులు భారత్- పాక్ మ్యాచ్‌కు సెప్టెంబరు 2న ముహూర్తం ఖరారైంది. క్లీన్‌స్వీప్ విజయంతో పాకిస్తాన్ ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. శ్రీలంకలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి బాబర్ ఆజం బృందం జోష్‌లో ఉండగా.. జాతీయ క్రికెట్ అకాడమీలో ట్రెయినింగ్ క్యాంపులో భారత ఆటగాళ్లు నెట్స్‌లో కావాల్సినంత ప్రాక్టీస్ చేస్తున్నారు. సచిన్ రికార్డుపై కన్నేసిన రోహిత్, కోహ్లి ఇక గత కొంతకాలంగా వన్డేల్లో పూర్తిస్థాయిలో ఆడకలేకపోయిన టీమిండియా స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి మెగా ఈవెంట్‌తో రంగంలోకి దిగనున్నారు. వన్డే కప్ టోర్నీలో మెరుపులు మెరిపించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2023 నేపథ్యంలో రోహిత్, విరాట్ అరుదైన రికార్డు ముంగిట నిలిచారు. ఆసియా టోర్నీ వన్డే ఫార్మాట్లో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ 971 పరుగులతో భారత్ నుంచి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా ముందు వరుసలో ఉన్నాడు. ఓవరాల్‌గా మూడో స్థానంలో సచిన్ నిలిచాడు. ఇక ఈ జాబితాలో రోహిత్ శర్మ 745 పరుగులతో ఐదో స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి 613 పరుగులతో పన్నెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈసారి గనుక ఈ ఇద్దరు బ్యాట్ ఝులిపిస్తే సచిన్ రికార్డు బ్రేక్ చేయడం ఖాయం. ‘విరాహిత్’లో సచిన్ రికార్డు బద్దలు కొట్టేది ఎవరు? ఈ అరుదైన ఘనతకు రోహిత్ 227 పరుగుల దూరంలో ఉండగా.. కోహ్లి సచిన్‌ను అధిగమించాలంటే 359 పరుగులు చేయాల్సి ఉంది. అన్నీ సజావుగా సాగి మునుపటి ఫామ్‌ను కొనసాగిస్తే.. ‘విరాహిత్’ ద్వయంలో ఎవరో ఒకరు ఈసారి సచిన్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. కాగా ఈ మెగా ఈవెంట్లో గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్, నేపాల్.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ టైటిల్ పోరులో తలపడనున్నాయి. అన్నట్లు ఈ ఈవెంట్లో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడనుంది. చదవండి: Ind Vs Pak: ఊహించని ట్విస్టు.. ఓపెనర్లుగా గిల్, ఇషాన్! పిచ్చి ప్రయోగం! -
వన్డేల్లో ఏకైక బ్యాటర్‌గా రోహిత్ రికార్డు.. మరి ఆసియా కప్‌లో? ఈ గణాంకాలు చూస్తే
Rohit Sharma’s record in the Asia Cup ODI Format: ఆసియా టీ20 కప్ సందర్భంగా గతేడాది తొలిసారిగా మెగా టోర్నీలో కెప్టెన్‌గా పాల్గొన్నాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. అయితే, అనుకున్న స్థాయిలో జట్టు రాణించకపోవడంతో హిట్‌మ్యాన్‌కు నిరాశ తప్పలేదు. తనకు అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్లో ఆటగాడిగానూ, కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. కెప్టెన్‌గా విఫలం టీ20 ఫార్మాట్లో నిర్వహించిన టోర్నీలో మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 132 పరుగులు చేయగలిగాడు. అత్యధిక స్కోరు 72. సూపర్ ఫోర్ దశలో శ్రీలంక మీద హిట్‌మ్యాన్ ఈ మేరకు అర్ధ శతకం(41 బంతుల్లో 72 పరుగులు)తో రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నాటి మ్యాచ్‌లో శ్రీలంక 174 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో టీమిండియాకు నిరాశే మిగిలింది. ఇక ఈసారి ఆసియా కప్‌ను 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా హైబ్రిడ్ విధానంలో టోర్నీ జరుగనుంది. ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 17 వరకు సాగనున్న ఈ వన్డే ఈవెంట్లో టీమిండియా శ్రీలంకలోనే తమ అన్ని మ్యాచ్‌లు ఆడనుంది. మరి.. ఆసియా వన్డే కప్‌లో రోహిత్ శర్మ రికార్డులు ఎలా ఉన్నాయంటే?! డబుల్ సెంచరీల వీరుడు 36 ఏళ్ల ఈ ముంబై బ్యాటర్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున మొత్తంగా 244 వన్డేలు ఆడాడు. స్ట్రైక్‌రేటు 89.97తో సగటున 48.69 రన్స్‌తో 9837 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 48 అర్ధ శతకాలు ఉన్నాయి. అంతేకాదు 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్‌గానూ రోహిత్ కొనసాగుతున్నాడు. 2014, నవంబరులో హిట్‌మ్యాన్ శ్రీలంకతో మ్యాచ్‌లో 173 బంతుల్లో 264 పరుగులు సాధించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రోహిత్ విశ్వరూపం ప్రదర్శించి అభిమానులను తన ఇన్నింగ్స్‌తో కన్నుల విందు చేశాడు. ఏకైక బ్యాటర్‌గా అరుదైన రికార్డు అంతేకాదు.. అంతర్జాతీయ వన్డేల్లో మూడుసార్లు 200 పరుగుల మార్కు దాటిన ఏకైక బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 2013లో బెంగళూరు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మీద 209, 2017లో మొహాలీలో శ్రీలంక మీద 208(నాటౌట్) డబుల్ సెంచరీలతో అదరగొట్టాడు. మరి ఆసియా కప్ సంగతి? ఇలా వన్డేల్లో అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న రోహిత్ శర్మ.. ఆసియా వన్డే కప్‌లో గతంలో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ ఫార్మాట్లో 22 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ మొత్తంగా 745 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. ఆరు ఫిఫ్టీలు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అదే అత్యధిక స్కోరు ఆసియా వన్డే కప్ టోర్నీలో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 111 నాటౌట్. 2018 ఎడిషన్ సందర్భంగా యూఏఈలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దాయాది జట్టుపై అద్భుత ఇన్నింగ్స్ ఆడి 9 వికెట్లు తేడాతో చిరకాల ప్రత్యర్థిని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. నాటి మ్యాచ్‌లో రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ శిఖర్ ధావన్(114) కూడా శతకంతో చెలరేగడం విశేషం. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో రోహిత్ సాధించిన హాఫ్ సెంచరీల లిస్టు చూసేద్దామా? రోహిత్ ఆసియా వన్డే కప్ హాఫ్ సెంచరీలు ►2018లో ఢాకా మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మీద 104 బంతుల్లో 83 పరుగులు నాటౌట్. ►2010లో డంబుల్లా మ్యాచ్‌లో శ్రీలంక మీద 73 బంతుల్లో 69 పరుగులు ►2012లో మిర్పూర్లో పాకిస్తాన్ మీద 83 బంతుల్లో 68 పరుగులు ►2008లో కరాచిలో పాకిస్తాన్ మీద 58 పరుగులు ►2014లో మిర్పూర్లో పాకిస్తాన్ మీద 56 పరుగులు ►2018లో దుబాయ్‌లో పాకిస్తాన్ మీద 52 పరుగులు. ఆసియా టీ20లలో హిట్‌మ్యాన్ రికార్డు ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి 271 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. 2016లో మిర్పూర్లో బంగ్లాదేశ్ మీద 55 బంతుల్లో 83 పరుగులు హిట్‌మ్యాన్ అత్యధిక స్కోరు. గతేడాది శ్రీలంక మీద 72 పరుగులతో తన ఆసియా కప్ టీ20 కెరీర్లో రెండో అత్యధిక స్కోరు సాధించాడు రోహిత్ శర్మ. చదవండి: కోహ్లి కాదు! వరల్డ్‌కప్ అంటే అతడికి ఊపొస్తుంది.. టాప్ స్కోరర్ తనే: సెహ్వాగ్ -
ODI WC 2023: బెన్ స్టోక్స్ వచ్చేశాడు.. ఇంగ్లండ్‌ను ఆపడం కష్టమే..!
వన్డే ప్రపంచకప్-2023కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్‌కు ఇంగ్లండ్‌కు శుభవార్త అందింది. ఆ జట్టు టెస్టు కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్ (వన్డే) నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇంగ్లండ్ మేన్‌జ్‌మెంట్ విజ్ఞప్తి మేరకు స్టోక్స్ మళ్లీ వన్డేల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇవాళ (ఆగస్ట్ 16) అధికారికంగా ప్రకటించింది. వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్ సెలెక్టర్లు స్టోక్స్‌కు వన్డే జట్టులో స్థానం కల్పించారు. త్వరలో జరుగనున్న న్యూజిలాండ్ సిరీస్ కోసం స్టోక్స్‌ను వన్డే జట్టుకు ఎంపిక చేశారు. ఇంగ్లండ్ సెలెక్టర్లు న్యూజిలాండ్ సిరీస్ కోసం టీ20, వన్డే జట్లను ఇవాళే ప్రకటించారు. 4 టీ20లు, 4 వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటించే న్యూజిలాండ్ జట్టు తొలుత టీ20 సిరీస్ (ఆగస్ట్ 30 నుంచి సప్టెంబర్ 5 వరకు), ఆతర్వాత వన్డే సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో తొలి టీ20 ఆగస్ట్ 30న, రెండోది సెప్టెంబర్ 1న, మూడోది సెప్టెంబర్ 3న, నాలుగో టీ20 సెప్టెంబర్ 5న జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 8న తొలి వన్డే, సెప్టెంబర్ 10న రెండో వన్డే, సెప్టెంబర్ 13న మూడో వన్డే, సెప్టెంబర్ 15న నాలుగో వన్డే జరుగనున్నాయి. న్యూజిలాండ్ పర్యటన కోసం ఇంగ్లండ్ టీ20 జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, జాన్ టర్నర్, ల్యూక్ వుడ్ న్యూజిలాండ్ పర్యటన కోసం ఇంగ్లండ్ వన్డే జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ -
టీమిండియాకు షాక్.. రెండో వన్డేలో విండీస్ విజయం
రెండో వన్డేలో టీమిండియాకు కరిబీయన్ జట్టు షాకిచ్చింది. సొంతగడ్డపై సత్తా చాటుతూ భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 36.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్యఛేదనకు బరిలోకి వెస్టీండీస్ తరఫున ఓపెనర్ కైల్ మేయర్స్ 36 పరుగులతో రాణించాడు. విండీస్ కెప్టెన్ షై హోప్(63 నాటౌట్) అర్ధసెంచరీతో సత్తా చాటాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కీసీ కార్టీ(48) పరుగులతో కెప్టెన్‌కు అండగా నిలిచాడు. కాగా.. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లతో రాణించగా.. కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది. విండీస్ తాజా విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకుముందు బ్యాటింగ్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. విండీస్ బౌలర్ల ధాటికి 40.5 ఓవర్లలోనే 181 పరుగులకు చాప చుట్టేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55), శుభ్‌మన్ గిల్ ( 49 బంతుల్లో 34) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. -
'వరల్డ్‌కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను తగ్గించండి'
ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కు పలు ఆసక్తికర ప్రతిపాదనలు చేసింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రెండో టెస్టుకు ముందు వరల్డ్ క్రికెట్ కమిటీ రెండు రోజులు సమావేశమైంది. ఈ సమావేశంలో టెస్టు క్రికెట్ సహా మహిళల క్రికెట్ అభివృద్ధిని ప్రోత్సహించడంపై చర్చించింది. దీంతో పాటు ద్వైపాక్షిక వన్డే సిరీస్ మ్యాచ్‌లను గణనీయంగా తగ్గించాలంటూ ఐసీసీకి ప్రతిపాదన పంపింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ గాటింగ్ ఆధ్వర్యంలో లార్డ్స్‌లో రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలోకమిటీ మెంబర్లు సౌరవ్ గంగూలీ, ఝులన్ గోస్వామి, జస్టిన్ లాంగర్, ఇయాన్ మోర్గాన్, కుమార సంగక్కర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్(FTP)పై ఐసీసీకి పలు సిఫార్సులు చేసింది. 2027 తర్వాత పురుషుల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP)లో ఆతిథ్య, టూర్లకు వచ్చే పూర్తి సభ్య దేశాలన్నింటికీ మ్యాచ్‌ల సమాన షెడ్యూల్‌ని నిర్ధారించాలని ఐసీసీని కోరింది. భారత్‌లో జరగనున్న ప్రపంచకప్ పూర్తయిన తర్వాత వన్డే మ్యాచ్‌లను గణనీయంగా తగ్గించాలని సూచించింది. ప్రతి ప్రపంచకప్‌కు ముందు ఒక సంవత్సరం వ్యవధి మినహా ద్వైపాక్షిక మ్యాచ్‌లను పరిమితం చేయడం ద్వారా వన్డే క్రికెట్ నాణ్యతను పెంచడం దీని లక్ష్యం. "ఈ కారణంగా ప్రపంచ క్రికెట్ క్యాలెండర్లో మనకు కావాల్సిన స్పేస్ దొరుకుతుంది. " అని WCC తెలిపింది. ఇటీవలే ప్రపంచ క్రికెట్ పాలక మండలి(WCC) రాబోయే సంవత్సరాల్లో జరిగే అన్ని గ్లోబల్ ఈవెంట్ల కోసం వారి మీడియా హక్కులను రికార్డ్ స్థాయిలో విక్రయించింది. The MCC World Cricket committee has proposed strategic funds for Test cricket and the women’s game to drive transformative change for the global game. More information ⤵️#CricketTwitter — Marylebone Cricket Club (@MCCOfficial) July 11, 2023 చదవండి: జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్‌కు గ్రీన్ సిగ్నల్ Duleep Trophy 2023: ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా -
ఇండియా కాదు.. వరల్డ్ కప్ గెలిచేది ఆ జట్టే!
-
ఇండియా - పాక్ మెగా ఫైట్‌కి స్పాట్ ఫిక్స్
-
వన్డే క్రికెట్లో పాకిస్తాన్ చరిత్ర.. అయినా టీమిండియా వెనకాలే
గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయాన్ని అందుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించింది. కివీస్‌పై విజయం పాక్‌కు వన్డేల్లో 500వది కావడం విశేషం. వన్డే క్రికెట్లో 500 విజయాలు నమోదు చేసిన మూడో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, భారత్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటివరకు 978 మ్యాచ్‌లు ఆడి 594 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా ఇప్పటివరకు మొత్తం 1029 మ్యాచ్‌లు ఆడి 539 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుంది. తాజాగా కివీస్‌పై విజయంతో పాక్ 949వ మ్యాచ్‌లో 500వ విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వెస్టిండీస్ 411, దక్షిణాఫ్రికా 399, శ్రీలంక 399, ఇంగ్లండ్ 392, న్యూజిలాండ్ 368, బంగ్లాదేశ్ 149, జింబాబ్వే 147 విజయాలతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.ఇక 1973లో మొదటి వన్డే మ్యాచ్ ఆడిన పాకిస్తాన్.. 1974 ఆగస్టులో నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలి వన్డే విజయాన్ని అందుకుంది. 1992లో వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన పాకిస్తాన్.. ఆ తర్వాత 1999లో ఫైనల్ మెట్టుపై బోల్తా పడింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రావల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. 289 లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్(117) సెంచరీతో చెలరేగగా.. ఇమామ్ ఉల్ హాక్(60) పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(86), డార్లీ మిచెల్(113) పరుగులలో రాణించారు. చదవండి: సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్.. న్యూజిలాండ్‌పై పాక్ ఘన విజయం -
వన్డే క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు
ICC Qualifier Play Off USA VS Jersey: వన్డే క్రికెట్లో ఏడో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదయ్యాయి. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్ ప్లే ఆఫ్స్‌లో భాగంగా జెర్సీతో జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ బౌలర్ అలీ ఖాన్ 9.4 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇవి ఏడో అత్యుత్తమ గణాంకాలుగా రికార్డయ్యాయి. Fresh from collecting the seventh best ODI figures of all time, this dynamic fast bowler now looms as the key player for USA as they try and book a place at this year's @cricketworldcup 💪https://t.co/pK9kLjJ5L4 — ICC (@ICC) April 5, 2023 ఈ జాబితాలో శ్రీలంక పేస్ దిగ్గజం చమింద వాస్ (8/19) అగ్రస్థానంలో ఉండగా.. షాహిద్ అఫ్రిది (7/12), గ్లెన్ మెక్‌గ్రాత్ (7/15), రషీద్ ఖాన్ (7/18), ఆండీ బిచెల్ (7/20), ముత్తయ్య మురళీథరన్ (7/30) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత అలీ ఖాన్ (7/32) ఏడో స్థానాన్ని ఆక్రమించాడు. దిగ్గజ బౌలర్ల సరసన చేరే క్రమంలో అలీ ఖాన్.. టిమ్ సౌథీ (7/33), ట్రెంట్ బౌల్డ్ (7/34), వకార్ యూనిస్ (7/36) లాంటి స్టార్ పేసర్లను అధిగమించాడు. కుడి చేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన 32 ఏళ్ల అలీ ఖాన్.. పాక్‌లో పుట్టి, యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇక జెర్సీతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో అత్యంత కీలమైన ఈ మ్యాచ్‌లో అలీ ఖాన్ విజృంభించడంతో యూఎస్ఏ 25 పరుగుల తేడాతో విజయం సాధించి, వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేస్‌లో ముందంజలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. నిర్ణీత ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ టేలర్ (79) అర్ధసెంచరీతో రాణించగా.. గజానంద్ సింగ్ (41) ఓ మోస్తరుగా రాణించాడు. జెర్సీ బౌలర్లలో బెంజమిన్ వార్డ్ 4, ఎలియట్ మైల్స్, జూలియస్ సుమేరౌర్ తలో 2, చార్లెస్ పెర్చార్డ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన యూఎస్ఏ.. అలీ ఖాన్ (7/32) వీరలెవెల్లో విజృంభించడంతో జెర్సీ 47.4 ఓవర్లలో 206 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది. అలీ ఖాన్‌తో పాటు జస్దీప్ సింగ్ (1/43), నిసర్గ్ పటేల్ (2/42) బంతితో రాణించగా.. జెర్సీ ఇన్నింగ్స్‌లో అసా ట్రైబ్ (75) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఎస్ఏ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేసులో అగ్రస్థానంలో నిలువగా.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న నమీబియా, యూఏఈ జట్లు కూడా వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌కు దాదాపుగా అర్హత సాధించాయి. కెనడా, జెర్సీ, పపువా న్యూ గినియా జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్ రేసు నుంచి టెక్నికల్‌గా నిష్క్రమించాయి. ఈ పోటీల్లో ఇవాళ (ఏప్రిల్ 5) మరో రెండు మ్యాచ్‌లు జరుగుతున్నప్పటికీ, క్వాలిఫయర్ బెర్తులు ఖరారు కావడంతో అవి నామమాత్రంగానే జరుగనున్నాయి. -
'ఓపెనర్‌గా నాకంటే శుబ్‌మన్ గిల్ బెటర్'
టీమిండియా ఓపెనర్‌గా శిఖర్ ధావన్ ఒక దశాబ్దం పాటు వెలుగొందాడు. వయసు పెరగడంతో పాటు ఫామ్ కోల్పోవడంతో క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనప్పటికి ఇప్పుడున్న పోటీలో ధావన్ మళ్లీ జట్టులో రావడం అసాధ్యమే. అయితే ధావన్ జట్టుకు దూరమైన తర్వాత ఓపెనింగ్ విషయంలో టీమిండియా సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ శుబ్‌మన్ గిల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్ కొరత కనిపిస్తుంది.. రోహిత్‌కు సరైన జోడి లేదు.. ఒకవేళ ఆ స్థానంలో శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్లో ఒకరికి చోటు ఇవ్వాల్సి వస్తే ఎవరు బెస్ట్ అనుకుంటున్నారని ధావన్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై స్పందించిన ధావన్.. తన పేరు చెప్పకుండా ఆ స్థానానికి శుభ్‌మన్ గిల్ బెటర్ అని చెప్పాడు. తాను సెలెక్టర్ ప్లేస్‌లో ఉంటే శుభ్‌మన్‌గిల్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేస్తానన్నాడు. టెస్ట్‌లతో పాటు టి20ల్లో గిల్ చక్కగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. కానీ అతడికి సరైన అవకాశాలు రావడం లేదని తెలిపాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తగినన్ని అవకాశాలు లభిస్తే ఆటగాడిగా శుభ్‌మన్ మరింత రాటుదేలుతాడని శిఖర్ ధావన్ అన్నాడు. ఓపెనర్‌గా తనకంటే శుభ్‌మన్ బెస్ట్‌గా భావిస్తోన్నట్లు పేర్కొన్నాడు. జట్టుకు దూరమయ్యాననే బాధ తనలో లేదని పేర్కొన్నాడు. కాగా గిల్‌పై ధావన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ధావన్ టీమిండియా తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టి20 మ్యాచ్‌లు ఆడాడు. Ek hi to Dil hai kitni baar jeetoge Shikhar Dhawan 😭❤️ pic.twitter.com/VfZ4P3FPZi — Professor ngl राजा बाबू 🥳🌈 (@GaurangBhardwa1) March 26, 2023 చదవండి: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి ఆర్సీబీ గుండె బద్దలయ్యే వార్త.. గాయాల కారణంగా ఇద్దరు స్టార్లు ఔట్..! -
సూర్యకుమార్ వన్డేలకు పనికిరాడా?
సూర్యకుమార్ యాదవ్.. టి20ల్లో ఐసీసీ నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. టి20 క్రికెట్లో అతన్ని ఆపే శక్తి ఏ బౌలర్‌కు లేదన్న తరహాలో రెచ్చిపోతుంటాడు. 2021 మార్చిలో టి20 ఆరంగ్రేటం తర్వాత ఒకటికి మూడు సెంచరీలు బాదిన సూర్యకుమార్ యాదవ్.. రెండేళ్లలో 13 హాఫ్ సెంచరీలు చేసి 46.52 సగటుతో 1675 పరుగులు చేశాడు. ఇది పొట్టి క్రికెట్లో అతని గణాంకాలు. కానీ వన్డే ఫార్మాట్‌కు వచ్చేసరికి మాత్రం సూర్యకుమార్ తేలిపోతున్నాడు. దూకుడుకు మారుపేరైన సూర్య వన్డేల్లో మాత్రం ఇమడలేకపోతున్నాడు. టి20ల్లో అరంగేట్రం చేసిన మూడు నెలల్లోనే అంటే 2021 జూలైలో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 21 వన్డే మ్యాచ్‌ల్లో 19 ఇన్నింగ్స్‌లు ఆడి 27.06 సగటుతో 433 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేల్లో అతని ఖాతాలో ఇప్పటివరకు కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో సూర్యకుమార్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. గత పది మ్యాచ్‌ల్లో సూర్య చేసిన స్కోర్లు వరుసగా 13, 9,8, 4, 34, 6, 4, 31, 14 , 0 పరుగులు చేశాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా ఫిఫ్టీ మార్క్ అందుకోలేకపోయిన సూర్య ఆరుసార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. వాస్తవానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి కానీ అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కానీ సూర్యకుమార్ యాదవ్‌కి చోటు లేదు. వన్డేల్లో నిలకడగా రాణిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో సూర్యకు చాన్స్ ఇచ్చారు. అయితే సూర్య మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్లో తన ప్లాఫ్ షో కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇషాన్ కిషన్ పరిస్థితి అంతంతే.. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీ బాది లైమ్‌లైట్‌లోకి వచ్చాడు యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. అయితే ఆ తర్వాత అదే దూకుడును కొనసాగించలేకపోతున్నాడు. దీనికి తోడు గిల్ రాణిస్తుండడంతో ఇషాన్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. తాజాగా రోహిత్ శర్మ తొలి వన్డేకు దూరంగా ఉండడంతో ఇషాన్‌కు మరోసారి అవకాశమొచ్చింది. అయితే వచ్చిన చాన్స్‌ను ఇషాన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ కూడా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కి ఆడతారు. అంతేకాదు ఈ ఇద్దరూ ఒకే మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశారు. టీ20ల్లో ఎలా ఉన్నా వన్డే ఫార్మాట్లోనూ ఒకేలా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. చదవండి: IND Vs AUS 1st ODI: దూకుడు చూసి మూడొందలు అనుకున్నాం.. అబ్బే! IND Vs AUS: కోహ్లి వికెట్‌తో మిచెల్ స్టార్క్ అరుదైన ఫీట్ -
చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు
ICC WC League Two UAE VS NEP: యూఏఈ క్రికెటర్ ఆసిఫ్ అలీ ఖాన్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అసోసియేట్ దేశ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ టు 2019-23లో భాగంగా ఇవాళ (మార్చి 16) నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 41 బంతుల్లోనే శతక్కొట్టిన ఆసిఫ్.. ఆసోసియేట్ దేశాల క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 7వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగి 11 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన ఆసిఫ్ మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 101 పరుగులతో (240.48 స్ట్రయిక్‌రేట్) అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా చూసినా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలో ఆసిఫ్ ఖాన్ నాలుగో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇతని తర్వాత వేగవంతమైన సెంచరీ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు కోరె ఆండర్సన్ పేరిట ఉంది. ఆండర్సన్ 36 బంతుల్లో శతకం బాదాడు. ఆతర్వాత పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది (37 బంతుల్లో ), ఆసిఫ్ ఖాన్, మార్క్ బౌచర్ (44 బంతుల్లో), బ్రియాన్ లారా (45), జోస్ బట్లర్ (46), విరాట్ కోహ్లి (52) 3 నుంచి 8 స్థానాల్లో ఉన్నారు. పాక్‌లో పుట్టి యూఏఈ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న 33 ఏళ్ల ఆసిఫ్.. తన కెరీర్లో 16 వన్డేలు ఆడి సెంచరీ, 3 అర్ధసెంచరీల సాయంతో 439 పరుగులు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఆసిఫ్ ఖాన్ (101 నాటౌట్) శతక్కొట్టుడు, అర్వింద్ (94), ముహమ్మద్ వసీం (63) బాధ్యతాయుత హాఫ్ సెంచరీల సాయంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లు దీపేంద్ర సింగ్ (8-2-19-2) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. రాజ్‌బన్సీ (10-0-27-1), సోమ్‌పాల్ కమీ (9-1-74-1), సందీప్ లామిచ్చెన్ (10-0-80-1) వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్ 29 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 172 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కుశాల్ భుర్టెల్ (50) హాఫ్ సెంచరీతో రాణించగా.. భీమ్ షార్కీ (62 నాటౌట్), ఆరిఫ్ షేక్ (30 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. నేపాల్ ఈ మ్యాచ్ గెలవాలంటే 21 ఓవర్లలో 139 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. -
'భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్ నాకు ఆఖరిది'
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ రిటైర్మెంట్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లోనూ ఓటమి పాలైన ఇంగ్లండ్ వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఓటమి ఇంగ్లండ్ అభిమానులను బాధిస్తే.. బంగ్లా అభిమానులను మాత్రం ఫుల్ ఖుషీ చేసింది. కారణం.. టి20 క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్స్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించడమే. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్ అనంతరం మొయిన్ అలీ తన రిటైర్మెంట్పై చిన్న హింట్ ఇచ్చాడు. ఇప్పటికే టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన మొయిన్ అలీ పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పనున్నట్లు వివరించాడు. వివరాలు అతని మాటల్లోనే.. ''నేను రిటైర్ కానని చెప్పను.. అలాగని రిటైర్ అవ్వకుండా ఉండను. మరో ఏడు, ఎనిమిది నెలల్లో 35వ పడిలో అడుగుపెట్టబోతున్నా. రిటైర్మెంట్ వయసు వచ్చేసిందనిపిస్తుంది. ఇక ఎలాంటి గోల్స్ పెట్టుకోదలచుకోలేదు. అయితే ఈ ఏడాది ఇండియాలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాలనుకుంటున్నా. ఆ వరల్డ్‌కప్ గెలవాలని కోరుకుంటున్నా. బహుశా అదే నా చివరి వన్డే కావొచ్చు.'' అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ కేవలం వన్డేలకు మాత్రమే గుడ్‌బై చెప్పనున్నాడు. టి20ల్లో మాత్రం కొంతకాలం కొనసాగనున్నాడు. ఇక మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన మొయిన్ అలీ ఇంగ్లండ్ తరపున 64 టెస్టుల్లో 2914 పరుగులతో పాటు 195 వికెట్లు, 123 వన్డేల్లో 2051 పరుగులతో పాటు 95 వికెట్లు, 71 టి20ల్లో 1044 పరుగులతో పాటు 40 వికెట్లు పడగొట్టాడు. చదవండి: WTC Final: ఏ లెక్కన ఆసీస్‌ను ఓడించదో చెప్పండి? ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లా -
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్
ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ షాన్ మార్ష్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్, అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై అతడు కేవలం టీ20 క్రికెట్లో మాత్రమే కొనసాగనున్నాడు. 39 ఏళ్ల మార్ష్ 2001లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు. 2022లో ప్రతిష్టాత్మక షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీని సారథిగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు మార్ష్ అందించాడు. లిస్ట్-ఎ కెరీర్లో 177 మ్యాచ్‌లు ఆడిన మార్ష్.. 44.45 సగటుతో 7158 పరుగులు చేశాడు. 26 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ఎన్నో అద్భుత విజయాలను షాన్ అందించాడు. ఇక మార్ష్ అంతర్జాతీయ కెరీర్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తరపున 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. కాగా 2019లోనే టెస్టు క్రికెట్‌కు మార్ష్ గుడ్‌బై చెప్పాడు. టెస్టుల్లో అతడు 32.32 సగటుతో 2265 పరుగులు సాధించాడు. అతడి టెస్టు కెరీర్లో 6 సెంచరీలు, 10 అర్ధ శతకాలు ఉన్నాయి. అదే విధంగా వన్డేల్లో 2773 పరుగులు, టీ20ల్లో కేవలం 255 పరుగులు మాత్రమే మార్ష్ చేశాడు. కాగా షాన్ మార్ష్ సోదరుడు మిచెల్ మార్ష్ ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు -
చేయాల్సిందంతా చేశాను.. నాకంటే బెటర్ ఆప్షన్ దొరికినప్పుడు.. శిఖర్ ధవన్ వైరాగ్యం
Shikar Dhawan: టీమిండియాలో చోటు దక్కకపోవడంపై వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ తొలిసారి స్పందించాడు. వన్డే జట్టులో స్థానం కోల్పోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధవన్ మాట్లాడుతూ.. టీమిండియా తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు చేయాల్సిందంతా చేశాను.. నా అత్యుత్తమ ప్రదర్శన కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన వారికి టీమిండియాలో చోటు దొరికితే నాకెలాంటి ఇబ్బంది లేదు.. కెరీర్లో ఎత్తుపల్లాలు సహజం.. టీమిండియా చోటు దక్కనందుకు నాకెంత మాత్రం బాధ లేదు, యువ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడుతున్నారని అన్నాడు. గబ్బర్ చేసిన ఈ వ్యాఖ్యల్లో వైరాగ్యం స్పష్టమవుతున్నప్పటికీ.. భవిష్యత్తులో టీమిండియాలో చోటుపై అతను ధీమా వ్యక్తం చేయడం కొసమెరుపు. టీమిండియాలో చోటుపై ధవన్ నిజాయితీగా చేసిన ఈ వ్యాఖ్యల పట్ల క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో స్థానంపై ఇంత నిజాయితీగా మాట్లాడే క్రికెటర్‌ను చూడలేమని సోషల్‌మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. కాగా, ఫామ్ లేమి, వయసు మీద పడటం, పూర్ స్ట్రయిక్ రేట్ వంటి ప్రధాన అంశాల కారణంగా ధవన్ గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. మధ్యమధ్యలో భారత-బి జట్టుకు సారధ్యం వహించిన గబ్బర్.. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 2018 నుంచి టెస్ట్‌లకు, 2021 నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న గబ్బర్.. గతేడాది స్వదేశంలో వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో జరిగిన వన్డే సిరీస్‌ల్లో టీమిండియాకు సారధ్యం వహించాడు. ఆ మూడు సిరీస్‌ల్లో గబ్బర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మధ్యలో ఇషాన్ కిషన్ (బంగ్లాదేశ్), శుభ్‌మన్ గిల్ (న్యూజిలాండ్)లు వన్డేల్లో డబుల్ సెంచరీలతో విరుచుకుపడటంతో ధవన్‌కు దారులు మూసుకుపోయాయి. ఏదో అడపాదడపా ప్రదర్శనలతో కనీసం వన్డే జట్టులోనైనా కొనసాగుదామనుకున్న ధవన్ ఆశలపై యువ క్రికెటర్లు నీళ్లుచల్లారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సమీప భవిష్యత్తులో ధవన్‌కు టీమిండియా నుంచి పిలుపు వచ్చే ఛాయలు కనబడటం లేదు. టీమిండియా ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ స్థానం పక్కా కాగా.. గిల్ ఫార్మాట్లకతీతంగా అత్యుత్తమ ప్రద్శనలతో సత్తా చాటుతూ జట్టులో పాతుకుపోయాడు. దీంతో ధవన్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ధవన్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. -
మాట మార్చిన పాక్ క్రికెటర్.. అయినా కోహ్లితో నాకు పోలికేంటి?!
Khurram Manzoor On Virat Kohli: టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి గురించి చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఖుర్రమ్ మంజూర్ మాట మార్చాడు. కోహ్లితో పోల్చుకుని అతడిని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, కేవలం తన విజయాల గురించి చెప్పుకోవడానికి మాత్రమే అలా మాట్లాడానని పేర్కొన్నాడు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం తన మాటలను వక్రీకరించాయన్నాడు. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కాగా 50 ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలో తానే నంబర్ 1 అని, కోహ్లి స్థానం తన తర్వాతే అంటూ ఖుర్రమ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా వన్డేల్లో తన సగటు 53 అని.. ప్రతి ఆరు ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ బాదానంటూ చెప్పుకొచ్చాడు. ఈ కోహ్లి పేరును ప్రస్తావిస్తూ ఖుర్రమ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అతడిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఖుర్రమ్ మంజూర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘కొన్ని మీడియా సంస్థలు, నా ఇంటర్వ్యూలో తీసుకున్న వాళ్లు నా మాటలను వక్రీకరించారు. విరాట్ కోహ్లి తరానికొక్క గొప్ప ప్లేయర్. ఓ ఆటగాడిగా తనని నేను ఆరాధిస్తాను. తనతో పోలికేంటి? లిస్ట్ ఏ క్రికెట్లో సెంచరీల నిష్పత్తి గురించి మాట్లాడుతూ.. కోహ్లి కంటే నా గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి.. తను రెండో స్థానంలో ఉన్నాడని మాత్రమే చెప్పాను. తనతో నాకసలు పోలికే లేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. గణాంకాలతో సంబంధం లేదు.. తను ఎప్పటికీ గొప్ప క్రికెటరే’’ అని ఖుర్రమ్ మంజూర్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన గణాంకాలకు సంబంధించిన ఫొటోను జత చేశాడు. ఇకనైనా మీడియా సంస్థలు విచక్షణతో వ్యవహరించాలని చురకలు అంటించాడు. కాగా పాక్ తరఫున ఖుర్రమ్ 16 టెస్టులు, ఏడు వన్డేలు, మూడు టీ20లు ఆడాడు. చదవండి: Hardik Pandya: మా ఓటమికి ప్రధాన కారణం అదే! అలాంటి ఆటగాడు జట్టులో ఉంటే మాత్రం.. Rahul Tripathi: 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది' 1/3 Its funny how some media outlets and individuals have taken my interview out of context and twisted my words. Virat Kohli is a generational player and I have always admired him as the best. pic.twitter.com/d1UzhA7egI — Khurram Manzoor Khan (@_khurrammanzoor) January 26, 2023 -
సెంచరీలు వద్దు.. డబుల్ సెంచరీలే ముద్దు
ఒకప్పుడు డబుల్ సెంచరీలు కొట్టాలంటే అది టెస్టుల్లో మాత్రమే సాధ్యమయ్యేది. ఐదు రోజుల పాటు జరిగే మ్యాచ్‌లు కాబట్టి బ్యాటింగ్‌కు ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి బ్యాటర్లు డబుల్ సెంచరీలతో చెలరేగడం సహజం. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో అది సాధ్యం కాకపోయేది. ఒక్కరోజులో ముగిసిపోయే వన్డే మ్యాచ్‌లో సెంచరీలను చాలా గొప్పగా చూసేవారు. అయితే సనత్ జయసూర్య, షాహిద్ అఫ్రిది, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి హిట్టర్లు వచ్చాకా వన్డే ఆటతీరు పూర్తిగా మారిపోయింది. వన్డే క్రికెట్లో దూకుడు అనే పదానికి నిర్వచనం చెప్పారు ఈ క్రికెటర్లు -సాక్షి, వెబ్‌డెస్క్ గొప్ప కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ధోని.. 2004లో శ్రీలంకపై ఆడిన 183 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ కావొచ్చు.. 2000లో న్యూజిలాండ్‌పై భాగ్యనగరంలో(హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో) సచిన్ ఆడిన 186 పరుగుల ఇన్నింగ్స్ కావొచ్చు.. గంగూలీ 183 పరుగులు కావొచ్చు.. ఇలా అప్పట్లో 180, 190 పరుగుల ఇన్నింగ్స్‌ను గొప్పగా భావించేవారు. డబుల్ సెంచరీలు చేయనప్పటికి వాటికి సమాన ప్రాధాన్యత దక్కింది. అయితే 13 ఏళ్ల క్రితం(2009లో సౌతాఫ్రికాపై వన్డే మ్యాచ్‌లో) క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. అప్పటికే లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్న మాస్టర్ ఈ ఫీట్ అందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పేరు మార్మోగిపోయింది. అలా వన్డేల్లో డబుల్ సెంచరీ అనే పదానికి సచిన్ పురుడు పోస్తే.. ఆ తర్వాత టీమిండియా మాజీ విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తానేం తక్కువ తిన్నానా అన్నట్లు 2011లో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు చెలరేగిన సెహ్వాగ్ 41 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 219 పరుగులు సాధించాడు. వన్డే క్రికెట్లో ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ లెక్కన చూసుకుంటే వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీలకు పునాది వేసింది టీమిండియా ఓపెనర్లే అని చెప్పొచ్చు. ఆ తర్వాత టి20 క్రికెట్, ఐపీఎల్ లాంటి లీగ్ క్రికెట్లు ఎక్కువ కావడంతో ఆటగాళ్ల బ్యాటింగ్‌లో వేగం పెరిగింది. అలా వన్డేల్లోనూ బ్యాటర్లు టి20 తరహా స్టైల్లో బ్యాటింగ్ చేయడంతో ఆ తర్వాత చాలా డబుల్ సెంచరీలు వచ్చాయి. అందులో ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలతో ఎవరికి సాధ్యం కాని రికార్డు అందుకున్నాడు. అటుపై గేల్, మార్టిన్ గప్టిల్, ఫఖర్ జమాన్‌లు ఉన్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. వన్డే క్రికెట్లో ఇప్పటివరకు 10 డబుల్ సెంచరీలు నమోదైతే అందులో టీమిండియా నుంచే ఏడు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. ఇందులో రోహిత్ శర్మవి మూడు కాగా.. సచిన్,సెహ్వాగ్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు ఒక్కో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. పైన చెప్పుకున్న ఏడుగురు ఆటగాళ్లు అందరూ ఓపెనర్లుగా వచ్చి డబుల్ సెంచరీలు బాదారు. అయితే మిడిలార్డర్లో వచ్చి డబుల్ సెంచరీ కొట్టడం అసాధ్యమైనప్పటికి మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్య లాంటి ఆటగాళ్లకు ఈ డబుల్ ఫీట్ చేసే చాన్స్ ఉంది. ఇది జరిగితే మాత్రం విశేషమే అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మారుతున్న కాలంలో ఆటకు వేగం తోడయ్యింది. టి20లకు బాగా అలవాటు పడి వన్డే క్రికెట్లో తుఫాన్ ఇన్నింగ్స్‌లతో బ్యాటర్లు అలరించడం మొదలెట్టారు. ఇప్పటికైతే వన్డేల్లో డబుల్ సెంచరీలు కొట్టడం గ్రేట్‌గా పరిగణిస్తున్నారు. ఆధునిక క్రికెట్లో టి20 క్రికెట్ ఎక్కువగా ఆడుతున్న ఈతరం క్రికెటర్లు దూకుడైన ఆటతీరు కనబరుస్తున్నారు. కొన్నిసార్లు ఇది చేటు చేసినా మంచి పరిణామమే. మరి రాబోయే కాలంలో డబుల్ సెంచరీలను మించి త్రిబుల్ సెంచరీలు కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. చదవండి: డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్ హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన గిల్.. టీమిండియా భారీ స్కోర్ అసలు హార్దిక్ పాండ్యాది ఔటేనా! -
వన్డేల్లో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డు
-
Ind Vs Pak: మరోసారి దాయాదుల పోరు.. ఒకే గ్రూపులో భారత్- పాక్
Asian Cricket Council- cricket calendars- India Vs Pakistan: ఆసియా క్రికెట్ టోర్నీకి సంబంధించి 2023-24 క్యాలెండర్ గురువారం విడుదలైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా పురుషుల ఆసియా కప్ ఈవెంట్ ఈ సెప్టెంబరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా మెగా టోర్నీలో దాయాదులు భారత్- పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఇక శ్రీలంక కూడా ఇదే గ్రూపులో ఉండగా.. క్వాలిఫైయర్స్‌లో గెలిచిన జట్టు బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లతో చేరనుంది. ఈ మేరకు 2023- 24 క్రికెట్ క్యాలెండర్స్ పేరిట జై షా ట్వీట్ చేశారు. అది మాత్రం చెప్పలేదు! కాగా ఆసియా వన్డే కప్-2023 ఎప్పుడన్న విషయం చెప్పిన జై షా.. వేదిక గురించి మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. నిజానికి పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదంటూ జై షా గతంలో వ్యాఖ్యానించారు. దీంతో బీసీసీఐ- పీసీబీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ- పీసీబీ చైర్మన్ నజీమ్ సేతీ ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని స్పష్టం చేయడం విశేషం. పురుషుల ఛాలెంజర్స్ కప్‌తో ఆరంభం ఇక కొత్త క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది ఆసియా టోర్నీ పురుషుల ఛాలెంజర్స్ కప్(వన్డే)తో ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో 10 జట్లు పాల్గొంటాయి. వీటిలో బహ్రెయిన్, సౌదీ అరేబియా, భూటాన్, చైనా, మయన్మార్, మాల్దీవులు, థాయిలాండ్, ఇరాన్ ఉండగా.. మరో రెండు జట్ల పేర్లు వెల్లడి కావాల్సి ఉంది. ఐదు జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉంటాయి. మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చిలో మెన్స అండర్-16 రీజినల్ టోర్నమెంట్ జరుగనుంది. ఇందులో 8 జట్లు పాల్గొంటాయి. ఇదిలా ఉంటే.. చాలెంజర్స్ కప్ విన్నర్, రన్నరప్ ఏప్రిల్‌లో జరిగే మెన్స్ ప్రీమియర్ కప్(వన్డే ఫార్మాట్)కు అర్హత సాధిస్తాయి. మొత్తంగా 24 మ్యాచ్‌లు ఆడతాయి. ఇక జూన్‌లో వుమెన్స్ టీ20 ఎమెర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ జరుగనుంది. ఇందులో రెండు గ్రూపుల్లో నాలుగేసి జట్ల చొప్పున ఎనిమిది జట్లు ఉంటాయి. ఒక గ్రూపులో ఇండియా- ఎ, పాకిస్తాన్- ఎ, థాయ్‌లాండ్, హాంకాంగ్ ఉంటాయి. మరో గ్రూపులో బంగ్లాదేశ్- ఎ, శ్రీలంక- ఎ, యూఈఏ, మలేషియా టీమ్‌లు ఉంటాయి. దీని తర్వాత మెన్స్ ఎమెర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ జరుగుతుంది. మేజర్ టోర్నీ ఇక వీటన్నిటిలో మేజర్ టోర్నీ అయిన పురుషుల ఆసియా వన్డే 2023 కప్ సెప్టెంబరులో జరుగుతుంది. మొత్తం ఆరు జట్లు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఒక గ్రూపులో.. మరో గ్రూపులో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, క్వాలిఫైయర్ జట్టు ఉంటుంది. మొత్తంగా 13 మ్యాచ్‌లు జరుగుతాయి. PC: Jay Shah Twitter/ ACC PC: Jay Shah Twitter/ ACC Presenting the @ACCMedia1 pathway structure & cricket calendars for 2023 & 2024! This signals our unparalleled efforts & passion to take this game to new heights. With cricketers across countries gearing up for spectacular performances, it promises to be a good time for cricket! pic.twitter.com/atzBO4XjIn — Jay Shah (@JayShah) January 5, 2023 -
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ఒకే ఓవర్లో 7 సిక్స్‌లు!
Vijay Hazare Trophy 2022 - Maharashtra vs Uttar Pradesh, 2nd quarter final: టీమిండియా యువ ఆటగాడు రుత్‌రాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రకు సారథ్యం వహిస్తున్న రుత్‌రాజ్ ఏకంగా ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదాడు. ఈ టోర్నీ క్వార్టర్స్ ఫైనల్స్‌లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఈ అరుదైన ఘనత సాధించాడు. శివసింగ్ మైండ్ బ్లాక్ మహారాష్ట్ర ఇన్నింగ్స్ 49 ఓవర్ వేసిన శివ సింగ్ బౌలింగ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. వరుసగా నాలుగు బంతులను రుతురాజ్ సిక్సర్లు బాదగా.. ఐదో బంతిని బౌలర్ నోబాల్‌గా వేసాడు. ఆ బంతిని కూడా సిక్స్ బాదిన రుతురాజ్ తర్వాతి రెండు బంతులను కూడా స్టాండ్స్‌కు తరిలించాడు. ప్రపంచ రికార్డు ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదడం లిస్ట్- ఏ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్‌లో 159 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 16 సిక్సులు, 10 ఫోర్లతో 220 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రుత్‌రాజ్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 330 పరుగులు చేసింది. 6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣ Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥 Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES — BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022 చదవండి: Indian Captain: హార్దిక్‌తో పాటు టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ యువ ప్లేయర్ కూడా! జట్టులో చోటుకే దిక్కులేదు! -
రోహిత్ పై వేటు తప్పదా ..?
-
చరిత్ర సృష్టించిన కర్ణాటక క్రికెటర్.. వన్డేల్లో క్వాడ్రాపుల్ సెంచరీ, రోహిత్ రికార్డు బద్ధలు
50 ఓవర్ల ఫార్మాట్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కర్ణాటకలోని షిమోగలో జరిగిన అంతర్ జిల్లా అండర్-16 టోర్నీ ఓ అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. టోర్నీలో భాగంగా భద్రావతి-సాగర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ యువ ఆటగాడు ఏకంగా క్వాడ్రాపుల్ సెంచరీ (నాలుగు వందల పరుగులు) బాదాడు. సాగర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తన్మయ్ మంజునాథ్ 165 బంతుల్లో.. 48 ఫోర్లు, 24 సిక్సర్ల సాయంతో 407 పరుగులు చేశాడు. New #worldrecord set by 16 year old boy Tanmay Manjunath frm Sagar, Shivamogga. He scored 407 runs in 165 balls against Bhadravathi NTCC at #KSCA under 16, 50 overs inter district tournament. He had hit 48 boundaries & 24 Sixes. He was representing Sagar #Cricket club. 1/2 pic.twitter.com/BK12x3xXo1 — Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) November 12, 2022 ఫలితంగా సాగర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 583 పరుగులు చేసింది. అనంతరం అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భద్రావతి టీమ్ కేవలం 73 పరుగులకే కుప్పకూలి అత్యంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో క్వాడ్రాపుల్ సెంచరీతో చెలరేగిన తన్మయ్.. యాభై ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్ధలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఏకంగా మూడు డబుల్ హండ్రెడ్స్ తన ఖాతాలో వేసుకున్న హిట్‌మ్యాన్.. శ్రీలంకపై 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 264 పరుగులు చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్‌గా కొనసాగుతుంది. లిస్ట్-ఏ క్రికెట్ కూడా కలుపుకుంటే సర్రే-గ్లామోర్గన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏడీ బ్రౌన్ 268 పరుగులు సాధించాడు. చదవండి: 'త్వరలో టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు' -
Vijay Hazare Trophy: తమిళనాడు చేతిలో ఆంధ్ర ఓటమి
ఆలూర్ (కర్ణాటక): విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో తమిళనాడు తొమ్మిది వికెట్ల తేడాతో ఆంధ్ర జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అభిషేక్ రెడ్డి (85; 9 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ శ్రీకర్ భరత్ (51; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. తమిళనాడు బౌలర్లలో సిలాంబరాసన్ మూడు వికెట్లు తీయగా... సందీప్ వారియర్, సాయికిశోర్, సంజయ్ యాదవ్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం తమిళనాడు ధాటిగా ఆడి 32.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి 206 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ జగదీశన్ (114 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్ (73; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి జగదీశన్ తొలి వికెట్‌కు 177 పరుగులు జత చేశాడు. -
Vijay Hazare Trophy: సమర్థ్ 200
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. ఇక్కడి జామియా మిలియా యూనివర్సిటీ మైదానంలో మణిపూర్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు పరుగుల వరద పారించింది. ఏకంగా 282 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ సమర్థ్ వ్యాస్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 131 బంతులు ఆడిన సమర్థ్ 20 ఫోర్లు, 9 సిక్స్‌లతో సరిగ్గా 200 పరుగులు సాధించి అవుటయ్యాడు. మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 36.3 ఓవర్లలో 282 పరుగులు జోడించడం విశేషం. సమర్థ్, హార్విక్ మెరుపు ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు సాధించింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపూర్‌ను సౌరాష్ట్ర ఎడంచేతి వాటం స్పిన్నర్ ధర్మేంద్రసింగ్ జడేజా తిప్పేశాడు. 32 ఏళ్ల ధర్మేంద్రసింగ్ 10 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దాంతో మణిపూర్ 41.4 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. -
టీమిండియా ఎంపికపై వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవలి కాలంలో టీమిండియా రిజర్వ్ బెంచ్ ఎంత పటిష్టంగా తయారైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత రెగ్యులర్ జట్టు ఓ పక్క అద్భుత విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంటే.. మరో పక్క శిఖర్ ధవన్ సారధ్యంలోని ఇండియా-బి టీమ్ సైతం అదే స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో పరాజయం మినహాయించి భారత జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తుందనే చెప్పాలి. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్రతి టీమిండియా ఆటగాడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సెలక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. అక్కడికీ రొటేషన్ పేరుతో సీనియర్లకు అప్పుడప్పుడూ విశ్రాంతినిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ జట్టు ఎంపిక సెలెక్టర్లకు కత్తిమీద సాము లాగే మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు టీమిండియా ఎంపికపై ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియాను సెలెక్ట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుందని జోస్యం చెప్పాడు. ప్రతి ఆటగాడు అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడం అద్భుతమని కొనియాడాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో సంజూ శాంసన్ కనబర్చిన పోరాటపటిమ అద్భుతమని ఆకాశానికెత్తాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్, శ్రేయస్ అయ్యర్ చూపించిన పరిణితి అభినందనీయమని పేర్కొన్నాడు. ఇలా ఆటగాళ్లు పోటీపడి రాణిస్తే జట్టు ఎంపిక చాలా కష్టమవుతుందని అభిప్రాయపడ్డాడు. -
'ధోని వల్లే కెరీర్ నాశనమైంది'.. ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై
స్వింగ్ బౌలర్‌గా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్ అనతి కాలంలోనే స్టార్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనే పఠాన్ ఎక్కువగా వెలుగులోకి వచ్చాడు. టి20 వరల్డ్‌కప్ 2007 ఫైనల్లో పాకిస్తాన్‌పై మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఇర్ఫాన్ పఠాన్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే బౌలర్‌గా జట్టులోకి వచ్చిన పఠాన్‌ను బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా మార్చాలని టీమిండియా ప్రయోగాలు చేసింది. ఆరంభంలో ఇది సూపర్ సక్సెస్ అయింది. వన్‌డౌన్‌లో, మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన పఠాన్ సెంచరీతో పాటు అర్థ సెంచరీల మోత మోగించాడు. కపిల్ దేవ్ లాంటి మరో నాణ్యమైన ఆల్‌రౌండర్ మనకు దొరికాడని అనుకునేలోపే పఠాన్ కెరీర్ క్రమంగా మసకబారుతూ వచ్చింది. ఇక ధోని టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాకా ఇర్ఫాన్ పఠాన్‌కు జట్టులో అవకాశాలు తగ్గిపోయాయి. వాస్తవానికి ఇక్కడ ధోని చేసిందేం లేదు. ఇర్ఫాన్ పఠాన్ ఫామ్ కోల్పోవడం వల్ల జట్టుకు దూరమవుతూ వచ్చాడు. ధోని కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత యువ జట్టును తయారు కావాలని భావించాడు. ఈ నేపథ్యంలోనే వీరేంద్ర సెహ్వాగ్, అజిత్ అగార్కర్, హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్లు మెల్లిమెల్లిగా జట్టుకు దూరమయ్యారు. వీరి బాటలోనే ఇర్ఫాన్ పఠాన్ కూడా వెళ్లాల్సి వచ్చింది.ఇక పఠాన్ తాను ఆడిన ఆఖరి వన్డేలో 5 వికెట్లు తీసినప్పటికి 2012 తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. 27 ఏళ్ల వయసులో చివరిగా భారత జట్టుకి ఆడిన ఇర్ఫాన్ పఠాన్, దాదాపు 8 ఏళ్లు ఎదురుచూసి 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్లో అదరగొడుతున్న ఇర్ఫాన్ పఠాన్ గురించి ఓ క్రికెట్ ఫ్యాన్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ నాశనమవ్వడానికి ధోని కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ''ఈ లీగుల్లో ఇర్ఫాన్ పఠాన్ చూసిన ప్రతీసారీ నాకు ఎంఎస్ (ధోనీ), ఆయన మేనేజ్మెంట్పై మరింత ద్వేషం పెరుగుతుంది. ఇలాంటి ప్లేయర్ తన 29 ఏళ్ల వయసులో చివరి వైట్ బాల్ ఆడాడంటే నమ్మశక్యంగా లేదు. నెం.7 ప్లేస్‌లో పఠాన్ పర్ఫెక్ట్ ప్లేయర్. ఏ టీమ్ అయినా ఇలాంటి ప్లేయర్ కావాలని కోరుకుంటుంది. కానీ ఇండియా మాత్రం జడ్డూని ఆడించింది. చివరికి బిన్నీ కూడా'' అంటూ ట్వీట్ చేశాడు. అయితే అభిమాని ట్వీట్‌పై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ చాలా హుందాగా స్పందించాడు. ‘దయచేసి ఎవ్వరిని నిందించొద్దు.. కానీ నీ ప్రేమకు థ్యాంక్యూ’ అంటూ కామెంట్ చేశాడు. కాగా అభిమానికి పఠాన్ హుందాతనంతో సమాధానం ఇవ్వడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా టీమిండియా తరుపున 29 టెస్టులు ఆడిన ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ తర్వాత టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్‌పై టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన ఇర్ఫాన్ పఠాన్.. తన కెరీర్లో 100 టెస్టు వికెట్ల ఘనతను సాధించాడు. టీమిండియా తరపున 120 వన్డేలు ఆడిన ఇర్ఫాన్ పఠాన్ 173 వికెట్లు తీయడమే కాకుండా 1544 పరుగులు చేశాడు. 24 టీ20 మ్యాచుల్లో 28 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 300 అంతర్జాతీయ వికెట్లు తీసిన ఇర్ఫాన్ పఠాన్.. బ్యాటుతోను అదరగొట్టాడు. తన ఖాతాలో 12 హాఫ్ సెంచరీలు, టెస్టుల్లో ఒక సెంచరీ ఉంది. ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడుతున్న ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తుతం బిల్వారా కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. Don’t blame any one. Thank you for love ❤️ — Irfan Pathan (@IrfanPathan) September 27, 2022 చదవండి: 'చీటింగ్ చేసేవాడితో ఆడలేను.. అందుకే తప్పుకున్నా' స్టార్ క్రికెటర్ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు -
కోహ్లి, ధావన్‌ల తర్వాత స్మృతి మందానకే సాధ్యమైంది..
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు అందుకుంది. వన్డేల్లో వేగంగా 3,000 పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లలో ఆమె మూడో బ్యాటర్‌గా నిలిచింది. ఈ జాబితాలో శిఖర్ ధావన్ ముందు వరుసలో ఉన్నాడు. అతను 72 ఇన్నింగ్స్‌ల్లో, కోహ్లి 75 ఇన్నింగ్స్‌ల్లో 3,000 క్లబ్లో చేరాడు. ఇతనికి ఒక్క ఇన్నింగ్స్ తేడాతో మందాన 76వ ఇన్నింగ్స్‌లో రికార్డు చేరుకుంది. గత నెలలో ఐసీసీ ప్రకటించిన ఐదుగురు ‘క్రికెట్ సూపర్‌స్టార్స్’లో మందాన ఉంది. మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్‌ల తర్వాత భారత మహిళల్లో 3,000 పరుగుల మైలురాయిని దాటిన మూడో క్రికెటర్ మందాన. ప్రత్యేకించి మహిళల్లో 22 మంది క్రికెటర్లు ఈ ఘనత సాధించగా... వేగంగా చేరుకున్న జాబితాలోనూ ఆమెది మూడో స్థానం కావడం మరో విశేషం. బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా; 62 ఇన్నింగ్స్‌లు), మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా; 64 ఇన్నింగ్స్‌లు) భారత బ్యాటర్ కంటే చకచకా 3000 పరుగుల్ని పూర్తి చేశారు. చదవండి: 23 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర -
ఫించ్ వన్డే రిటైర్మెంట్.. కోహ్లి ఎమోషనల్
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న సంగతి తెలిసిందే. ఆదివారం న్యూజిలాండ్‌తో ఫించ్ తన చివరి మ్యాచ్(146వ మ్యాచ్) ఆడనున్నాడు. టీ20లపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫించ్ మీడియాకు తెలిపాడు. కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెప్పనున్న ఫించ్‌పై టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా కోహ్లి ఫించ్‌తో ఉన్న అనుబంధాన్ని ఎమోషనల్‌గా పేర్కొన్నాడు. ''వెల్డన్ ఫించీ.. నీకు ప్రత్యర్థిగా ఇన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడడం ఎప్పటికి మరిచిపోనూ. అలాగే ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఇద్దరం ఒకే జట్టుకు ఆడడం మంచి అనుభూతి కలిగించింది. ఆల్ ది బెస్ట్ ఫర్ టి20 క్రికెట్.. నీ తర్వాతి లైఫ్‌ను సాఫీగా సాగించు'' అంటూ కోహ్లి పేర్కొన్నాడు. కాగా గత కొంత కాలంగా వన్డేల్లో ఫించ్ దారుణంగా విఫలమవుతున్నాడు. అతడు తన ఏడు వన్డే ఇన్నింగ్స్‌లలో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి. ఇక ఫించ్ 2013 శ్రీలంకపై ఆసీస్ తరపున వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున 145 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన ఫించ్.. 5041 పరుగులు సాధించాడు. 54 వన్డేల్లో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా ఫించ్ వ్యవహారించాడు. అతడి వన్డే కెరీర్లో ఇప్పటి వరకు 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2015 వన్డే వరల్డ్‌కప్ ఆస్ట్రేలియా నెగ్గడంలో ఫించ్‌ది కీలకపాత్ర. ఆ వరల్డ్‌కప్‌లో ఫించ్ 8 మ్యాచ్‌ల్లో 280 పరుగులు సాధించాడు. ఇక 2021 టి20 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు ఫించ్ నాయకత్వం వహించాడు. బ్యాటర్‌గా విఫలమైనప్పటికి కెప్టెన్‌గా మాత్రం ఫించ్ సూపర్ సక్సెస్ అయ్యాడు. కాగా వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌లో ఫించ్ సారధ్యంలోనే ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. చదవండి: ఆస్ట్రేలియా కెప్టెన్ సంచలన నిర్ణయం.. వన్డేలకు గుడ్‌బై -
'పిచ్చోడి మాటలకు విలువుంటుందా?.. ఇదీ అంతే'
ఈ మధ్యన వన్డే క్రికెట్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయంటూ తెగ వార్తలు వస్తున్నాయి. టి20 క్రికెట్ శకం మొదలయ్యాకా.. 50 ఓవర్ల ఆటపై మోజు తగ్గిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇలాగే ఉంటే వన్డేలు కనుమరుగవుతాయని.. భవిష్యత్తులో టెస్టులు, టి20లు మాత్రమే మిగులుతాయని.. వన్డే మ్యాచ్‌లు కేవలం ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీలకు మాత్రమే పరిమితమవుతాయని ఒక వర్గం కామెంట్స్ చేసింది. అయితే మరొక వర్గం మాత్రం వన్డే క్రికెట్‌కు మద్దతుగా నిలబడింది. వన్డే క్రికెట్‌కు వచ్చిన ముప్పు ఏం లేదని.. నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని కుండబద్దలు కొట్టారు. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు మద్దతుగా నిలబడ్డాడు. వన్డే క్రికెట్ భవితవ్యంపై ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారని.. ఇదంతా నాకు నాన్సెన్స్గా అనిపిస్తుందని.. పిచ్చి మాటల వల్ల వన్డేలకు ఒరిగే నష్టం ఏం లేదని పేర్కొన్నాడు. ''వన్డే క్రికెట్‌కు నేను కట్టుబడి ఉన్నా. నిజానికి వన్డే క్రికెట్ ఎన్నటికి కనుమరుగు కాదు.. అప్డేట్ అవుతూనే వస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది పిచ్చోళ్లు టెస్టు క్రికెట్ గురించే ఇలాంటివే మాట్లాడారు. టెస్టు క్రికెట్ కనుమరుగు అవుతుందని పేర్కొన్నారు. కానీ అలా జరగలేదు సరికదా.. టెస్టు క్రికెట్‌పై అభిమానం ఎక్కువైంది. ఏ ఫార్మాట్ అయినా సరే.. దేనికి ఉండాల్సిన విలువ దానికే ఉంటుంది. వన్డేలు.. టి20లు.. టెస్టులు అంతమవుతాయనేది మన భ్రమ.. నేను ఎప్పటికి అలా చెప్పను. పిచ్చోడు చెప్పే మాటలకు విలువుంటుందా.. ఉండదు కదా.. ఇదీ అంతే.. వాస్తవానికి నాకు క్రికెట్ పై ఆసక్తి రావడానికి గల కారణం వన్డే క్రికెట్. చిన్నప్పటి నుంచి దానినే చూస్తూ పెరిగా. ఇండియాకు ఆడాలని అప్పుడే అనుకున్నా.. ఈరోజు కెప్టెన్ స్థాయిలో జట్టును నడిపిస్తున్నా. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరి అభిప్రాయాలు వారివే'' అంటూ పేర్కొన్నాడు. ఇక రోహిత్ నేతృత్వంలోని టీమిండియా ఆసియాకప్ 2022లో ఆడనుంది. ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: Rohit Sharma: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్‌మ్యాన్ 'రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే' -
ఈ 3 విషయాల్లో రోహిత్ తోపు.. కోహ్లి హిట్‌మ్యాన్ రికార్డు బ్రేక్ చేయలేకపోవచ్చు!
టీమిండియాతో పాటు ప్రపంచ క్రికెట్లోనూ తమదైన ముద్ర వేసిన.. ముద్ర వేస్తున్న ఆటగాళ్లలో ముందు వరుసలో ఉంటారు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. ప్రస్తుత సారథి రోహిత్ శర్మ. అయితే, ఇద్దరూ ఎవరికి వారే ప్రత్యేకం. ఒకరి సారథ్యంలో ఒకరు ఆడటానికి ఏమాత్రం ఇబ్బంది పడని ఈ ఇరువురు బ్యాటర్లు.. కష్టకాలంలో పరస్పరం ఒకరికొకరు అండగా ఉంటూ ముందుకు సాగుతున్న తీరు ఆదర్శనీయం. ఎవరికి వారే సాటి! కానీ.. ఇక రికార్డులు సాధించడంలోనూ ఎవరికి వారే సాటి. అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు ‘కింగ్’ కోహ్లి. వన్డేల్లో 43, టెస్టుల్లో 27 శతకాలు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ విషయంలో మాత్రం కోహ్లి దరిదాపుల్లోకి రాలేకపోయాడు హిట్‌మ్యాన్. ఓపెనర్‌గా బరిలోకి దిగే రోహిత్ శర్మ ఇప్పటి వరకు టీమిండియా తరఫున టెస్టుల్లో 8, వన్డేల్లో 29 సెంచరీలు బాదాడు. అయితే, టీ20 ఫార్మాట్లో మాత్రం కోహ్లి కంటే మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు రోహిత్ శర్మ. ఇంటర్నేషనల్ క్రికెట్లో పొట్టి ఫార్మాట్లో విరాట్ ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. రోహిత్ మాత్రం టీ20ల్లో 4 శతకాలు నమోదు చేశాడు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వస్తే తప్ప రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డులు బద్దలు కొట్టడం అసాధ్యం. అవేంటో పరిశీలిద్దామా!? హిట్‌మ్యాన్‌కే సాధ్యమైంది... వన్డే ఫార్మాట్లో అంతర్జాతీయ స్థాయిలో రోహిత్ ఇప్పటి వరకు మూడు ద్విశతకాలు సాధించాడు. తొలుత ఆస్ట్రేలియాపై 2013లో 158 బంతుల్లో 16 సిక్సర్లు, 12 ఫోర్ల సాయంతో 209 పరుగులు చేశాడు. ఆ మరుసటి ఏడాది శ్రీలంకపై రెండో డబుల్ సెంచరీ(173 బంతుల్లో 264 పరుగులు) సాధించాడు. అనంతరం 2017లో మళ్లీ అదే జట్టుపై 208 పరుగులు సాధించాడు. అయితే వీటన్నింటిలో శ్రీలంకపై రోహిత్ మొదట సాధించిన ద్విశతకం ఎంతో ప్రత్యేకమైనది. ఈ మ్యాచ్‌లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో హిట్‌మ్యాన్ 264 పరుగులు చేశాడు. ఇందులో 186 పరుగులు బౌండరీల సాయంతో పొందినవే. ఇక కోహ్లి విషయానికొస్తే వన్డేల్లో అతడి అత్యధిక స్కోరు 183. ఆసియా కప్-2012లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద సాధించాడు. అయితే, తన కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు ఉన్నా వన్డేల్లో ఇంతవరకు 200 మార్కు మాత్రం అందుకోలేకపోయాడు కోహ్లి. ఐపీఎల్లో కష్టమే! ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముంబై ఇండియన్స్‌ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత హిట్‌మ్యాన్‌కు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన సారథిగా తన పేరును పదిలం చేసుకున్నాడు రోహిత్. అయితే, బ్యాటర్‌గా ఐపీఎల్లో పలు అరుదైన రికార్డులు సాధించినప్పటికీ కోహ్లి.. కెప్టెన్‌గా మాత్రం అనుకున్న ఫలితాల్ని రాబట్టలేకపోయాడు. రాయల్ చాలెంజర్స్‌కు గత సీజన్ వరకు సారథ్యం వహించిన అతడు ఒక్క టైటిల్ కూడా గెలవకుండానే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. 2009, 11,16లో ఫైనల్ వరకు జట్టును తీసుకురాగలిగా తుది మెట్టుపై ఆర్సీబీ బోల్తా పడటంతో కోహ్లికి నిరాశ తప్పలేదు. ఇక ఇప్పుడు కేవలం ఆర్సీబీ బ్యాటర్‌గా ఉన్న కోహ్లి.. కెప్టెన్‌గా రోహిత్ లాంటి రికార్డు అందుకోవడం కష్టమే! సిక్సర్ల వీరుడు.. అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 250కి పైగానే సిక్సర్లు బాదాడు. ఈ ఘనత సాధించిన క్రికెటర్లలో షాహిద్ ఆఫ్రిది, క్రిస్ గేల్, సనత్ జయసూర్య తర్వాతి స్థానం ఆక్రమించాడు. ఇక కోహ్లి నమోదు చేసిన గణాంకాలు పరిశీలిస్తే... వన్డే క్రికెట్లో 43 సెంచరీలతో సత్తా చాటినప్పటికీ సిక్సర్ల విషయంలో మాత్రం వెనుకబడ్డాడు. ఇప్పటి వరకు కోహ్లి 125 సిక్సర్లు బాదాడు. ఈ విషయంలో ఈ మాజీ కెప్టెన్.. హిట్‌మ్యాన్‌ను అధిగమించడం అంత సులువేమీ కాదు! ఇక వీరిద్దరూ ఇప్పుడు ఆసియా కప్-2022, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలకు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నారన్న విషయం తెలిసిందే. చదవండి: Ashes Series:139 ఏళ్ల యాషెస్ చరిత్రకు తొలిసారి దెబ్బ పడనుందా! Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! -
'వన్డే క్రికెట్‌కు ముప్పు లేదు'.. కుండ బద్దలు కొట్టిన ఐసీసీ
వన్డే క్రికెట్‌కు ముప్పు పొంచి ఉందంటూ వస్తున్న ఊహాగానాలకు ఐసీసీ తెర దించింది. వన్డే క్రికెట్‌పై గురువారం స్పందిస్తూ.. ''దుష్ప్రచారం వద్దు.. పరిమిత ఓవర్ల ఆటకు ఎలాంటి ముప్పు లేదు'' అంటూ ఐసీసీ కుండ బద్దలు కొట్టింది. ఐసీసీ సీఈవో జియోఫ్ అల్లార్డిస్ మాట్లాడుతూ.. ''2023-27 వరకు ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ)లో భాగంగా ఇప్పటికే షెడ్యూల్ ఫైనలైజ్ అయింది. ఈ ప్రోగ్రామ్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. ఒక క్యాలెండర్ ఇయర్లో ఆయా జట్లు వన్డేలు మాత్రమే ఆడవు. వన్డేలతో పాటు టెస్టులు, టి20లు ఇలా సమానంగా క్యాలెండర్‌ను రూపొందిస్తున్నారు. అయితే వన్డేలు ఆడే సంఖ్య విషయంలో తగ్గించాలా లేదా అనేది ఆలోచిస్తాం. ఎందుకంటే ఇప్పటికే ఎఫ్టీపీ ప్రకారం క్యాలండర్‌ను రూపొందించాం. ఇప్పటికైతే వన్డేల విషయంలో ఎలాంటి మార్పులు లేవు. ఇక వన్డేలకు ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. టెస్టు, టి20ల్లాగే వన్డే క్రికెట్ కూడా బతికే ఉంటుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే మాట్లాడుతూ.. ఫ్రాంచైజీ క్రికెట్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు కారణం కొంతమంది దేశవాళీ టోర్నమెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే. అయితే దీనివల్ల అంతర్జాతీయ, ద్వైపాక్షిక క్రికెట్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. వీటిపై ఉన్న నిబద్ధత ఎప్పటిలాగే బలంగా ఉందని స్పష్టం చేశారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేలకు గుడ్‌బై చెప్పిన అనంతరం వన్డే క్రికెట్‌పై విభిన్న వాదనలు వచ్చాయి. బిజీ షెడ్యూల్ కారణంగా విశ్రాంతి దొరకడం లేదని.. దీనివల్ల ఆటగాళ్లు మానసిక ప్రశాంతతకు దూరమవుతున్నారని స్టోక్స్ పేర్కొన్నాడు. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ) పేరిట ఆటగాళ్లకు విశ్రాంతి లేకుండా ఆడించడం వలన తరచూ గాయాలపాలవ్వడం లేదా ఫిట్నెస్ కోల్పోవడమో జరుగుతుందని తెలిపాడు. పరిగెత్తడానికి మేం కార్లు కాదని.. మనుషులమే అని.. అందుకే వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు స్టోక్స్ వివరించాడు. కాగా స్టోక్స్‌కు చాలా మంది క్రికెటర్లు మద్దతు తెలిపారు. ఇంగ్లండ్ ప్రస్తుత కెప్టెన్ జాస్ బట్లర్ కూడా స్టోక్స్ నిర్ణయాన్ని సమర్థిస్తూ వన్డే క్రికెట్ వల్ల నష్టం ఎక్కువ ఉందని అభిప్రాయపడ్డాడు. మరికొంత మంది మాజీ క్రికెటర్లు ఒక అడుగు ముందుకేసి వన్డేలను రద్దు చేయడం మంచిదని అభిప్రాయపడితే.. రవిశాస్త్రి లాంటి మాజీలు వన్డేలను 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించి ఆడితే బాగుంటుందని పేర్కొన్నారు. తాజాగా ఐసీసీ వన్డే క్రికెట్లో ఎలాంటి మార్పులు లేవని.. యధాతథంగా కొనసాగుతుందని వెల్లడించడంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌పై వస్తున్న అనుమానాలకు బ్రేక్ పడినట్లయింది. చదవండి: మూడు గంటల్లోనే ఫలితం.. ఏడు గంటలు ఎవరు ఆడుతారు? Shubman Gill: మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు తిట్టుకున్నాడు.. కట్‌చేస్తే -
విండీస్‌పై భారత్ ఘన విజయం సిరీస్ క్లీన్ స్వీప్ (ఫోటోలు)
-
మూడు గంటల్లోనే ఫలితం.. ఏడు గంటలు ఎవరు ఆడుతారు?
టి20 క్రికెట్ రాకముందు వన్డే క్రికెట్‌కు యమా క్రేజ్ ఉండేది. రోజులో దాదాపు ఎనిమిది గంటలు సాగే మ్యాచ్ అయినా ఆసక్తికరంగా ఉండేంది. ఎందుకంటే అప్పటికి షార్ట్ ఫార్మాట్ పెద్దగా పరిచయం లేదు. ట్రయాంగులర్, ఐదు, ఏడు వన్డేల సిరీస్‌లు ఇలా చాలానే జరిగేవి. అప్పట్లో ఆయా జట్లు కూడా వన్డే సిరీస్‌లు ఆడడానికి ఉత్సాహం చూపించేవి. అందుకు తగ్గట్లుగానే ఐసీసీ కూడా ప్రణాళికలు రచించేది. కాల క్రమంలో పొట్టి ఫార్మాట్(టి20 క్రికెట్) బలంగా తయారవడం.. వన్డేల ప్రాధాన్యతను తగ్గించింది. మూడు గంటల్లో ముగిసేపోయే మ్యాచ్‌లు.. ఆటగాళ్లకు రెస్ట్ దొరికే సమయం ఎక్కువగా ఉండేది. వెరసి టి20లపై ఆటగాళ్లకు మోజు పెరిగిపోయింది. దీంతో టి20లు ఆడేందుకు వన్డే క్రికెట్‌కు దూరంగా ఉండడమే లేక రిటైర్మెంట్ ఇవ్వడమో జరుగుతుంది. ఇటీవలీ కాలంలో వన్డే క్రికెట్‌పై ఈ చర్చ మరింత ఎక్కువయింది. వన్డే క్రికెట్‌ను ఆపేస్తే మంచిదని కొందరు అభిప్రాయపడితే.. 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించి వన్డే మ్యాచ్‌లను రూపొందించాలని రవిశాస్త్రి లాంటి క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. వన్డే క్రికెట్‌కు పూర్వ వైభవం రావాలంటే మల్టీ సిరీస్‌లు.. ట్రయాంగులర్ సిరీస్‌లు ఎక్కువగా ఆడిస్తే మంచిదంటూ మరికొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా వన్డే క్రికెట్‌పై స్పందించాడు. ''మేం వన్డే మ్యాచ్‌లు ఆడే సమయానికి టెస్టులు తక్కువగా ఉన్నప్పటికి సమానంగా ఆడేవాళ్లం. కానీ సంప్రదాయ క్రికెట్‌తో వన్డే క్రికెట్‌ను ఎప్పుడూ పోల్చలేం. కానీ టి20 ఫార్మాట్ వచ్చాకా వన్డే క్రికెట్‌పై అందరికి ఆసక్తి తగ్గిపోయింది. ఒక టి20 మ్యాచ్‌లో మూడు గంటల్లోనే ఫలితం వస్తుంది.. అదే వన్డే మ్యాచ్ అయితే కనీసం ఏడు గంటలు ఆడాలి. ఏ ఆటగాడైనా ఫలితం తొందరగా వస్తున్న దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. ప్రస్తుతం జరుగుతుంది అదే. మూడు గంటల్లో ఫలితం వస్తుంటే.. ఏడు గంటలు ఎవరు ఆడతారు చెప్పండి. వన్డే క్రికెట్‌ను సరికొత్తగా డిజైన్ చేయాలి లేదంటే త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: వన్డే క్రికెట్ చచ్చిపోతుంది.. ఈ మార్పు చేయండి..! పంత్ మాటను లెక్కచేయని ధోని.. నవ్వుకున్న రోహిత్, సూర్యకుమార్ -
వన్డే క్రికెట్ చచ్చిపోతుంది.. ఈ మార్పు చేయండి..!
పొట్టి క్రికెట్ ప్రభావం కారణంగా నానాటికీ శోభ తగ్గిపోతున్న వన్డే ఫార్మాట్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డేలు అంతరించిపోకుండా మనుగడ సాగించాలంటే ఓ కీలక మార్పు చేయాలని సూచించాడు. వన్డేలు 50 ఓవర్ల పాటు సాగుతుండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారని.. ఈ ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించాల్సిన సమయం ఆసన్నమైందని, లేకపోతే వన్డే క్రికెట్ అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాడు. ఓవర్లను కుదించడం వల్ల వన్డేలకు మునపటి కంటే అధికమైన ఆదరణ లభిస్తుందని తెలిపాడు. గతంలో 60 ఓవర్లుగా సాగే వన్డే ఫార్మాట్‌ను 50 ఓవర్లకు కుదించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇటీవలి కాలంలో చాలామంది క్రికెటర్ల వన్డేలకు గుడ్‌బై చెబుతున్నందున ఈ మార్పుపై ఐసీసీ దృష్టి సారించాలని కోరాడు. 50 ఓవర్ల పాటు ఆట సాగడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీలవుతుంటే, ఆటగాళ్లు తీవ్ర అలసటకు లోనై ఒత్తిడికి గురవుతున్నారని అన్నాడు. ఈ విషయంలో ఐసీసీ ఇకనైనా మేల్కొనకపోతే వన్డే ఫార్మాట్ చచ్చిపోతుందని తెలిపాడు. ఇదే విషయాన్ని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా ప్రతిపాదించాడు. మరోవైపు వసీమ్ అక్రమ్ లాంటి దిగ్గజ ఆల్‌రౌండర్ అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్లో నుంచి వన్డే ఫార్మాట్‌ను తొలగించాలని వాదిస్తుండటం ఆసక్తికరంగా మారింది. చదవండి: 'అతడు డెత్ ఓవర్ల స్పెషలిస్టు.. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్‌కు ఎంపిక చేయండి' -
ప్రపంచకప్ తర్వాత హార్ధిక్ రిటైర్ అవడం ఖాయం
-
వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తే.. టీ20ల నుంచి కూడా తప్పించారు!
Ben Stokes ODI Retirement- Eng Vs SA ODI Series: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, వన్డే వరల్డ్‌కప్-2019లో తమ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు బెన్‌స్టోక్స్. ఇటీవలే అతడు ఇంగ్లండ్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టి స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను గెలవడంతో పాటు రీషెడ్యూల్డ్ టెస్టులో టీమిండియాను ఓడించి కెప్టెన్‌గా మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు. అందుకే ఇలా! అయితే, అనూహ్యంగా వన్డేలకు గుడ్‌బై చెబుతూ స్టోక్స్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా.. మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టమవుతోందన్న కారణంగానే తాను వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు స్పష్టం చేశాడు 31 ఏళ్ల స్టోక్స్. అంతేకాదు.. తాము కూడా మనుషులమేమని, పెట్రోల్ పోస్తే పరిగెత్తే కార్లు కాదని.. విశ్రాంతి లేకుండా ఆడటం ఎవరితరం కాదని ఇంగ్లండ్ బోర్డుకు చురకలంటించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఐసీసీ, క్రికెట్ బోర్డుల తీరును తప్పుబడుతున్నారు. విశ్రాంతి లేకుండా ఆడిస్తే ఆటగాళ్లకు పిచ్చెక్కిపోయి ఇలాగే రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘‘అప్పట్లో ఓసారి.. షెడ్యూల్ భయంకరంగా ఉంది.. నా వల్ల కాదని చెప్పాను. అందుకే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను. అయితే, ఈసీబీ నన్ను టీ20లు కూడా ఆడకుండా నిషేధం విధించింది’’ అంటూ పీటర్సన్ ఇంగ్లండ్ బోర్డు తీరును ఎండగట్టాడు. I once said the schedule was horrendous and I couldn’t cope, so I retired from ODI cricket & the ECB banned me from T20s too………….🤣 — Kevin Pietersen🦏 (@KP24) July 19, 2022 కాగా ఇంగ్లండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు పీటర్సన్. ఈ మూడు ఫార్మాట్లలో వరుసగా 8181, 4440, 1176 పరుగులు సాధించాడు. అయితే, ఈసీబీతో అతడికి విభేదాలు తలెత్తగా బోర్డుపై తీవ్ర విమర్శలు చేసిన పీటర్సన్ ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక 2013లో తన ఆఖరి వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడిన పీటర్సన్.. 2014లో చివరిసారిగా ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు. స్టోక్స్ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మంగళవారం(జూలై 18 )జరిగిన మొదటి వన్డే అతడికి చివరిది. ఈ మ్యాచ్‌లో స్టోక్స్ 5 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసిన రోజు వ్యవధిలోనే ఇంగ్లండ్ ప్రొటిస్‌తో పోరుకు సిద్ధమైంది. వన్డేలతో పాటు టీ20, టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: Eng Vs SA 1st ODI Series 2022: అదరగొట్టిన ప్రొటిస్ బౌలర్లు.. ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం! ఏకంగా.. 604 runs and 15 wickets on a sweltering day in Durham! Full highlights: https://t.co/AOpGzaJerX 🏴 #ENGvSA 🇿🇦 pic.twitter.com/VDjYwdNb0L — England Cricket (@englandcricket) July 20, 2022 -
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం!
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు భారీ కుదుపు! స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్యంగా వన్డేల నుంచి తప్పుకున్నాడు. తాను వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు స్టోక్స్ సోమవారం ప్రకటించాడు. దక్షిణాప్రికాతో డర్హమ్‌లో మంగళవారం జరిగే వన్డే మ్యాచ్ తన చివరిదని ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. ఇప్పటివరకు 104 వన్డేలు ఆడిన స్టోక్స్ 2919 పరుగులు చేశాడు. వాటిలో 3 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవలే స్టోక్స్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. స్టార్ ప్లేయర్ జోరూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పగ్గాలు చేపట్టిన అతను.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించాడు. అతని సారథ్యంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. 9 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్ నియామకం కూడా ఆ జట్టుకు బాగా కలిసొచ్చింది. ❤️🏴 pic.twitter.com/xTS5oNfN2j — Ben Stokes (@benstokes38) July 18, 2022 -
ODI Cricket: వన్డే క్రికెట్‌పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు.. ఒకవేళ అదే జరిగితే..
Ravichandran Ashwin: వన్డే క్రికెట్ ఇటీవలి కాలంలో ఎలాంటి కొత్త తరహా మార్పులు చూపించకుండా టి20లకు కొనసాగింపుగానే కనిపిస్తోందని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఒకవేళ ఇదే కొనసాగితే వన్డేల అస్తిత్వం ప్రమాదంలో పడుతుందని వ్యాఖ్యానించాడు. రెండు ఎండ్‌లనుంచి రెండు కొత్త బంతులను కాకుండా ఒకే బంతిని వాడితే రివర్స్ స్వింగ్ సాధ్యమవుతుందన్న అశ్విన్.. స్పిన్నర్లు కూడా ప్రభావం చూపిస్తే వన్డేల్లో బ్యాటర్లు, బౌలర్ల మధ్య సమతూకం ఉండి ఆసక్తికరంగా మారతాయని సూచించాడు. ఇక టీ20 మ్యాచ్‌కు కొనసాగింపుగా అన్నట్లు వన్డే మ్యాచ్ సాగితే.. అందులో ఉన్న మజా పోతుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో అశ్విన్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టు నేపథ్యంలో జట్టు వెంటే ఉన్న అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో టీమ్‌లోకి వచ్చిన రవీంద్ర జడేజా మెరుగైన ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. ఇక వన్డే ఫార్మాట్లో 151 వికెట్లు పడగొట్టిన అశూ.. టెస్టుల్లో 442 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: ICC World Cup Super League: వన్డే సిరీస్ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా? -
రికార్డుల కోసమే ఆడుతున్నట్లుంది.. రోహిత్-ధావన్ ద్వయం అరుదైన ఫీట్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల పంట పండిస్తున్నారు. ఇప్పటికే బుమ్రా, షమీలు బౌలింగ్‌లో అరుదైన ఫీట్లను అందుకోగా.. తాజాగా బ్యాటింగ్‌లో ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ ద్వయం పరుగులు విషయంలో కొత్త రికార్డును అందుకున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో వన్డే ద్వారా ఈ ఓపెనింగ్ జోడి 5వేల పరుగుల మార్క్‌ను క్రాస్ చేసింది. 5వేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి 114 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. కాగా సచిన్-గంగూలీ జోడి తర్వాత వన్డేల్లో తొలి వికెట్‌కు 5వేల పరుగులు జోడించిన రెండో ఓపెనింగ్ జోడిగా నిలిచి చరిత్రకెక్కింది. ఇంతకముందు వన్డే క్రికెట్లో సచిన్-గంగూలీ ద్వయం 136 ఇన్నింగ్స్‌ల్లో 6609 పరుగులు జోడించి తొలి స్థానంలో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో ఆసీస్ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనింగ్ జోడీ మాథ్యూ హేడెన్-ఆడమ్ గిల్‌క్రిస్ట్ (114 ఇన్నింగ్స్‌ల్లో 5472), విండీస్ లెజెండరీ ఓపెనింగ్ పెయిర్ గార్డన్ గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ (102 ఇన్నింగ్స్‌ల్లో 5150) ఉన్నారు. తాజాగా వీరి సరసన రోహిత్ శర్మ- ధావన్ జోడి చోటు సంపాదించింది. 5⃣0⃣0⃣0⃣ ODI runs in partnership for this dynamic duo! 👏 👏#TeamIndia captain @ImRo45 & @SDhawan25 become only the 2⃣nd Indian pair after the legendary duo of @sachin_rt & @SGanguly99 to achieve this feat. 👍 👍 Follow the match ▶️ https://t.co/8E3nGmlNOh #ENGvIND pic.twitter.com/gU67Bx4SeE — BCCI (@BCCI) July 12, 2022 చదవండి: Jasprit Bumrah: ఇంగ్లండ్ గడ్డపై బుమ్రా కొత్త చరిత్ర.. Mohammed Shami: షమీ సంచలనం.. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా -
వార్విక్షైర్ జట్టుకు ఆడనున్న కృనాల్ పాండ్యా
ఇంగ్లండ్ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ రాయల్ లండన్ కప్‌లో భారత క్రికెటర్ కృనాల్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు. ఆగస్టు 2 నుంచి 23 వరకు జరిగే ఈ టోర్నీలో కృనాల్ వార్విక్షైర్ కౌంటీ జట్టు తరఫున ఆడనున్నాడు. 31 ఏళ్ల కృనాల్ భారత్ తరఫున ఐదు వన్డేలు, 19 టి20 మ్యాచ్‌లు ఆడాడు. గత ఏడాది వన్డే ఫార్మాట్లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన కృనాల్ 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి అరంగేట్రంలో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. -
వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాటర్స్ అరుదైన ఫీట్
వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం, ఇమాముల్ హక్‌లు అరుదైన ఫీట్ సాధించారు. తమ కెరీర్లోనే ఈ ఇద్దరు భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. కొడితే హాఫ్ సెంచరీ లేదంటే సెంచరీ అనేంతలా వీరిద్దరి ఇన్నింగ్స్‌లు ఉంటున్నాయి. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బాబర్ అజం, ఇమాముల్ హక్‌లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. కాగా ఈ ఇద్దరికి వరుసగా ఆరో అర్థశతకం కావడం విశేషం. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా ఒకేసారి ఇద్దరు పాక్ బ్యాట్స్మన్లు వరుసగా సమాన అర్థశతకాలు నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. బాబర్ ఆజం 77, ఇమాముల్ హక్ 72 పరుగులు చేసి ఔటయ్యారు. చదవండి: PAK vs WI 2nd ODI: పాక్ కెప్టెన్‌పై తిట్ల దండకం.. వీడియో వైరల్ -
క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డు.. అరంగేట్రం తర్వాత పుట్టిన క్రికెటర్‌తో..!
IND VS NZ 2nd ODI: భారత్-న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య క్వీన్స్టౌన్ వేదికగా జరిగిన రెండో వన్డే సందర్భంగా క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డు ఆవిష్కృతమైంది. మహిళల క్రికెట్లోనే కాకుండా పురుషుల క్రికెట్లోనూ ఎవ్వరికీ సాధ్యం కాని అత్యంత రేర్ ఫీట్‌ను భారత మహిళా జట్టు సారథి మిథాలీ రాజ్ సాధించింది. ఈ మ్యాచ్‌లో అజేయమైన అర్ధ శతకంతో(81 బంతుల్లో 66 నాటౌట్, 3 ఫోర్లు) రాణించిన మిథాళీ.. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన, తన అంతర్జాతీయ ఆరంగ్రేటం తర్వాత నాలుగేళ్లకు పుట్టిన రిచా ఘోష్ (64 బంతుల్లో 65, 6 ఫోర్లు, ఒక సిక్స్)తో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో కనీవిని ఎరుగని రికార్డును తన పేరిట లిఖించుకుంది. Most 50+ scores by Indian captains against New Zealand in ODIs : 7* - Mithali Raj 6 - Md Azharuddin 6 - MS Dhoni 4 - Virat Kohli#NZvIND — Rhitankar Bandyopadhyay (@rhitankar8616) February 15, 2022 మిథాలీ రాజ్ 1999లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగ్రేటం చేయగా, రిచా ఘోష్ 2003లో జన్మించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ మిథాలీ రాజ్ ఖాతాలో పలు రికార్డులు వచ్చి చేరాయి. అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా, వన్డే క్రికెట్లో న్యూజిలాండ్‌పై అత్యధిక హాఫ్ సెంచరీలు(7) నమోదు చేసిన భారత కెప్టెన్‌గా, వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు(739) చేసిన టీమిండియా సారధిగా మిథాళీ పలు రికార్డులు నెలకొల్పింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్లు ధోని, కోహ్లిల రికార్డులను సైతం బద్దలు కొట్టింది. Most runs by Indian captains against New Zealand in ODIs : 739* - Mithali Raj 723 - MS Dhoni 678 - Md Azharuddin 487 - Virat Kohli Mithali has now scored more runs than any other Indian captains against NZ in ODIs.#NZvIND — Rhitankar Bandyopadhyay (@rhitankar8616) February 15, 2022 ఇదిలా ఉంటే, న్యూజిలాండ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా రెండో వన్డేలోనూ ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేయగా, న్యూజిలాండ్ వుమెన్స్ జట్టు 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అమిలియా కెర్(135 బంతుల్లో 119 నాటౌట్, 7 ఫోర్లు) అద్బుత సెంచరీతో కడదాకా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. టీమిండియాలో కెప్టెన్ మిథాలీరాజ్, రిచా ఘోష్ అర్ధ సెంచరీలతో చెలరేగగా, ఓపెనర్ సబ్బినేని మేఘన 50 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసి ఆకట్టుకుంది. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో మూడో వన్డే ఫిబ్రవరి 18న జరగనుంది. -
మనదే యువ ప్రపంచం
కరోనా కారణంగా కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా... మెగా ఈవెంట్ ప్రారంభమయ్యాక జట్టులోని ఆరుగురు కరోనా బారిన పడటం... అదృష్టంకొద్దీ మ్యాచ్‌లో ఆడేందుకు 11 మంది అందుబాటులో ఉండటం... ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో పోరాటం... వెరసి అండర్–19 వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో యువ భారత్ ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది. యశ్ ధుల్ కెప్టెన్సీలో భారత్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఈ టోర్నమెంట్‌ను అజేయంగా ముగించి సగర్వంగా స్వదేశానికి పయనమైంది. టోర్నీ మొత్తంలో ఏ ఒక్కరిపైనో భారత్ సంపూర్ణంగా ఆధారపడలేదు. అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్, షేక్ రషీద్, యశ్ ధుల్, నిశాంత్, రాజ్ బావా, విక్కీ ఒస్త్వాల్, రవి కుమార్... ఇలా ప్రతి సభ్యుడూ తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. తమ కెరీర్లో చిరస్మరణీయ ఘట్టాలను లిఖించుకున్నారు. న్యూఢిల్లీ: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన యువ భారత్ జట్టు అండర్–19 ప్రపంచకప్‌లో తమదైన ముద్ర వేసింది. ఏకంగా ఐదోసారి జగజ్జేతగా నిలిచి తమ పట్టు నిలబెట్టుకుంది. ఇప్పటివరకు 14 సార్లు అండర్–19 ప్రపంచకప్ జరగ్గా... యువ భారత్ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, మూడుసార్లు రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆంటిగ్వాలో శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. భారత పేస్ బౌలర్లు రాజ్ బావా (5/31), రవి కుమార్ (4/34) అదరగొట్టారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (84 బంతుల్లో 50; 6 ఫోర్లు), నిశాంత్ సింధు (54 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. రాజ్ బావా (54 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ దినేశ్ (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన రాజ్ బావా ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు అందుకున్నాడు. టోర్నీ మొత్తంలో 506 పరుగులు చేసి, 7 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా ఆటగాడు డేవల్డ్ బ్రెవిస్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెల్చుకున్నాడు. బీసీసీఐ అభినందన... అన్ని విభాగాల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి విజేతగా అవతరించిన యువ జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ప్రశంసల వర్షం కురిపించారు. రికార్డుస్థాయిలో ఐదోసారి ఈ మెగా ఈవెంట్లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 40 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. కోచ్, ఇతర సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేయనున్నారు. ‘అన్ని విభాగాల్లో మన కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. తమ శిబిరంలో కరోనా కలకలం రేపినా అందుబాటులో ఉన్న వారితో ముందుకు దూసుకెళ్లారు. హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ నిరంతరం కుర్రాళ్లలో ఉత్సాహం నింపారు’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. సత్కారం... ఇంగ్లండ్‌పై ఫైనల్లో విజయం తర్వాత యువ భారత జట్టు అంటిగ్వా నుంచి గయానాలోని భారత హై కమిషనర్ కార్యాలయానికి వెళ్లింది. భారత హై కమిషనర్ కేజే శ్రీనివాస భారత జట్టును సన్మానించారు. ఆ తర్వాత టీమిండియా గయానా నుంచి ఆదివారం సాయంత్రం స్వదేశానికి పయనమైంది. అమ్‌స్టర్‌డామ్ మీదుగా బెంగళూరు చేరుకోనున్న భారత జట్టు సభ్యులు అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు. ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ సీనియర్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. అహ్మదాబాద్ చేరుకున్నాక బీసీసీఐ అధికారికంగా యువ జట్టును సత్కరించి రివార్డులు అందజేయనుంది. ప్రధాని శుభాకాంక్షలు ప్రపంచకప్ నెగ్గిన భారత అండర్–19 జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. యువ జట్టు తమ ప్రదర్శనతో భారత భవిష్యత్ క్రికెట్ సురక్షితంగా ఉందని చాటి చెప్పిందని ఆయన అన్నారు. ‘యువ క్రికెటర్లను చూసి గర్వపడుతున్నాను. అండర్–19 ప్రపంచకప్ సాధించినందుకు అభినందనలు. అత్యున్నతస్థాయి టోర్నీలో ఆద్యంతం వారు నిలకడగా రాణించి భారత క్రికెట్ భవితకు ఢోకా లేదని నిరూపించారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. యువ జట్టు విజయం వెనుక బీసీసీఐ పాత్ర కూడా ఉంది. కొన్నేళ్లుగా అండర్–16, అండర్–19, అండర్–23 స్థాయిలో భారీ సంఖ్యలో మ్యాచ్‌లు, టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా కాస్త ఇబ్బంది ఎదురైన మాట నిజమే. ఈ నేపథ్యంలో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకున్నా భారత యువ జట్టు ఈసారి ప్రపంచకప్‌ను సాధించడం గొప్ప ఘనతగా భావించాలి. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. –వీవీఎస్ లక్ష్మణ్, ఎన్సీఏ హెడ్ -
అరుదైన ఫీట్‌కు అడుగు దూరంలో ఉన్న టీమిండియా బౌలర్
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్.. అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలరాయిని చేరుకునేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. విండీస్‌తో త్వరలో ప్రారంభంకాబోయే వన్డే సిరీస్‌లో మరో వికెట్ సాధిస్తే ఈ ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకునే 23వ భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఈ జాబితాలో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 269 మ్యాచ్‌ల్లో 334 వన్డే వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో 59 మ్యాచ్‌లు ఆడిన 31 ఏళ్ల చహల్.. 5.19 సగటున 99 వికెట్లు తీశాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్లు, 2 సార్లు 4 వికెట్ల ఘనతను సాధించాడు. ఈ ఫార్మాట్లో అతని అత్యుత్తమ గణాంకాలు 6/42గా ఉన్నాయి. కాగా, ఇటీవలి కాలంలో మునుపటి ఫామ్‌ను ప్రదర్శించలేకపోతున్న చహల్.. జట్టులోని వస్తూ పోతూ ఉన్నాడు. తాజాగా ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో ఛాన్స్ లభించినప్పటికీ 3 మ్యాచ్‌ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. అయినప్పటికీ విండీస్‌తో ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు చహల్ ఎంపికయ్యాడు. చదవండి: అందుకే ఐపీఎల్లో ఆడకూడదని డిసైడయ్యా.. ఆసీస్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
India vs South Africa 1st ODI: కొత్త కెప్టెన్సీలో కొత్త పోరుకు...
India vs South Africa ODI Series: కెప్టెన్‌గా కోహ్లి భారత క్రికెట్ జట్టును శిఖరానికి తీసుకెళ్లాడు. వ్యూహ ప్రతివ్యూహాలే కాకుండా మైదానంలో అతను చూపించే దూకుడు, అమితోత్సాహం అభిమానులు ఎప్పుడూ మరచిపోలేరు. అయితే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి, 2016 తర్వాత అతను ఒక ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగబోతున్నాడు. నాయకత్వ బాధ్యతలు లేకపోవడం కోహ్లి స్థాయిని తగ్గించకపోవచ్చు గానీ కొత్తగా మాత్రం కనిపించడం ఖాయం. మరోవైపు ముందు వైస్ కెప్టెన్‌గా ఎంపికై ఆ తర్వాత రోహిత్ శర్మ గైర్హాజరులో అదృష్టవశాత్తూ సారథిగా మారిన కేఎల్ రాహుల్ కొత్త పరీక్షకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన జట్టును అతను వన్డేల్లో విజేతగా నిలుపుతాడా అనేది ఆసక్తికరం. పార్ల్: టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సమరానికి సమయం ఆసన్నమైంది. నేడు జరిగే తొలి పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత అందించే ‘వరల్డ్‌కప్ సూపర్ లీగ్’లో ఈ మూడు వన్డేలు భాగం కాకపోయినా... ఇటీవలే ముగిసిన హోరా హోరీ టెస్టు సిరీస్ కారణంగా ఈ మ్యాచ్‌లూ ఆసక్తి రేపుతున్నాయి. రాహుల్‌కు భారత జట్టు కెప్టెన్‌గా ఇదే తొలి వన్డే మ్యాచ్ కావడం విశేషం. విరాట్ కోహ్లి చివరిసారిగా 2016 అక్టోబరులో వైజాగ్‌లో జరిగిన భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డేలో కెప్టెన్ గా కాకుండా ఒక బ్యాటర్‌గా మాత్రమే (ధోని నాయకత్వంలో) బరిలోకి దిగాడు. వెంకటేశ్‌కు చోటు! సహజంగానే టెస్టు జట్టులో లేని కొందరు ‘స్పెషలిస్ట్’ ఆటగాళ్లు వన్డేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. భువనేశ్వర్, దీపక్ చహర్, చహల్, శిఖర్ ధావన్‌లతో జట్టు కొత్తగా కనిపించనుంది. ‘100 వికెట్ల క్లబ్’కు మరో 3 వికెట్ల దూరంలో ఉన్న లెగ్‌స్పిన్నర్ చహల్ మరోసారి సీనియర్ జట్టు తరఫున తన స్థాయిని ప్రదర్శించాలని పట్టుదలగా ఉన్నాడు. రాహుల్‌తో పాటు ధావన్ ఓపెనింగ్ చేస్తాడు. మూడో స్థానంలో కోహ్లి మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాలని ప్రతీ అభిమాని కోరుకుంటున్నాడు. 2019 అక్టోబర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో శతకం సాధించని కోహ్లి ఇప్పుడు బ్యాటర్‌గా తన సత్తాను ప్రదర్శించాల్సి ఉంది. ఆరో స్థానంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. దాంతో భారత్ తరఫున 3 టి20లు ఆడిన వెంకటేశ్ అయ్యర్ వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రాహుల్ (కెప్టెన్), ధావన్, కోహ్లి, సూర్యకుమార్, పంత్, వెంకటేశ్, దీపక్ చహర్, భువనేశ్వర్, అశ్విన్, బుమ్రా, చహల్. -
India tour of South Africa: వన్డే జట్టులోకి వెంకటేశ్ అయ్యర్!
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు మరో బంపరాఫర్ తగిలే అవకాశం ఉంది. దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వెంకటేశ్ అయ్యర్ దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో మెరిసిన అయ్యర్ తాజాగా నాలుగో మ్యాచ్‌లో మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. చత్తీస్‌ఘర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ 133 బంతుల్లో 151 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. చదవండి: Vijay Hazare Trophy: రుతురాజ్ హ్యాట్రిక్ సెంచరీ.. దుమ్మురేపుతున్న మహారాష్ట్ర తాజా ప్రదర్శనతో వెంకటేశ్ అయ్యర్.. సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో బీసీసీఐ త్వరలో ఎంపిక చేయనున్న వన్డే టీమ్‌లో ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ద్వారా టీమిండియాలో అడుగుపెట్టిన వెంకటేశ్ అయ్యర్ త్వరలో వన్డే జట్టులోనూ ఆడే అవకాశం లభించనుంది. ఒకవేళ వెంకటేశ్ అయ్యర్ దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపికై రాణిస్తే ఆల్‌రౌండర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్నట్లే. ఇక ఇటీవలీ కాలంలో వెంకటేశ్ అయ్యర్ ప్రదర్శన చూసుకుంటే.. ►ఐపీఎల్ 2021 సీజన్: 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు, 3 వికెట్లు ►సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: 5 మ్యాచ్‌లు 155 పరుగులు.. 5 వికెట్లు ►ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టి20 సిరీస్: 3 మ్యాచ్‌ల్లో 36 పరుగులు.. 1 వికెట్ ►విజయ్ హజారే ట్రోఫీ: ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 348 పరుగులు.. 6 వికెట్లు 1⃣0⃣0⃣ up & going strong! 💪 💪@ivenkyiyer2512 continues his superb run of form. 👏 👏 #MPvUTCA #VijayHazareTrophy pic.twitter.com/iiow2ATC2n — BCCI Domestic (@BCCIdomestic) December 12, 2021 -
17 ఏళ్ల తర్వాత పాక్‌లో పర్యటించనున్న టీమిండియా..!
Team India Likely To Tour Pakistan After 17 Years For Asia Cup 2023: 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఆసియా కప్ 2023 నిర్వహణ హక్కులను దాయాది దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకోవడంతో టీమిండియా పాక్ పర్యటన అంశం తెరపైకి వచ్చింది. ఈనెల 15న దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పీసీబీకి ఆసియా కప్ 2023 వన్డే ఫార్మాట్ నిర్వహణ బాధ్యతలను అప్పచెబుతూ కౌన్సిల్ తీర్మానం చేసింది. వాస్తవానికి 2020లోనే ఆసియా కప్‌ను పాక్‌లో నిర్వహించాల్సి ఉండింది. అయితే అప్పట్లో పాక్ పర్యటనకు బీసీసీఐ ససేమిరా అనడంతో పీసీబీ ఆ బాధ్యతలను శ్రీలంకకు కట్టబెట్టింది. కరోనా కారణంగా శ్రీలంక కూడా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని చేతులెత్తేయడంతో అప్పట్లో టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పాక్ 2023 ఆసియా కప్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ నూతన చైర్మన్ రమీజ్ రాజా దృవీకరించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని వారు సంయుక్తంగా ప్రకటించారు. అన్నీ సజావుగా సాగితే టోర్నీని 2023 జూన్, జులై మాసాల్లో నిర్వహించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాగా, టీమిండియా చివరిసారిగా 2006లో పాక్‌లో పర్యటించింది. ఆ తర్వాత భారత్-పాక్‌ల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో పాక్ వెలుపల జరిగిన ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఇరు జట్లు తలపడ్డాయి. చదవండి: నువ్వు కాకపోతే ఇంకొకరు.. పంత్‌కు కోహ్లి వార్నింగ్..! -
మిథాలీ రాజ్.. 16 ఏళ్లలో తొమ్మిదోసారి ‘టాప్’
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఆమె.. తన 16 ఏళ్ల వన్డే కెరీర్లో తొమ్మిదోసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. గతవారం ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ 30 పాయింట్లు కోల్పోవడంతో మిథాలీ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించింది. పాక్‌తో జరిగిన 5 వన్డేల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో 49, 21 పరుగులు మాత్రమే చేసిన స్టెఫానీ.. తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఐదో ప్లేస్‌లో నిలిచింది. 🔝 @M_Raj03 has regained her position as the No.1 batter on the @MRFWorldwide ICC Women's ODI Player Rankings. Full list: https://t.co/jxTLqOK1gm pic.twitter.com/oAHUTu4eRY — ICC (@ICC) July 20, 2021 కాగా, అంతకుముందు వారం పాక్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయమైన సెంచరీ సాధించడం ద్వారా స్టెఫానీ గతవారం టాప్ ర్యాంక్‌కు చేరింది. మరోవైపు స్టెఫానీ ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఈ జాబితాలో ఆసీస్ ఆల్‌రౌండర్ ఎలైస్ పెర్రీ టాప్కు చేరుకుంది. ఇక బౌలింగ్ విభాగంలో కూడా స్టెఫానీ మూడు స్థానాలు దిగజారింది. మొత్తంగా స్టెఫానీ గతవారం జరిగిన పాక్ సిరీస్‌లో దారుణంగా విఫలం కావడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన పట్టును కోల్పోయింది. ఇక టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ మంధాన కెరీర్ అత్యుత్తమ మూడో ర్యాంక్‌కు చేరుకుంది. -
వన్డేల్లోనూ సత్తా చాటుతా పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అరుంధతి రెడ్డి... భారత మహిళల టి20 టీమ్‌లో సత్తా చాటి తన స్థానం పదిలం చేసుకున్న పేస్ బౌలర్. గత మూడేళ్లుగా టి20 ఫార్మాట్లో కీలక ప్లేయర్‌గా ఎదిగిన అరుంధతి తొలిసారి వన్డే, టెస్టు జట్టులోకి ఎంపికైంది. రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో పాల్గొనే టీమ్‌లో ఆమెకు అవకాశం లభించింది.ఇకపై వన్డేల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమంటున్న 23 ఏళ్ల పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కావడంపై... చాలా సంతోషంగా ఉంది. భారత జట్టుకు ఇప్పటికే ప్రాతినిధ్యం వహించినా... మరో ఫార్మాట్లో నాకు కొత్తగా అవకాశం దక్కుతోంది. టి20ల్లో నిలకడగా రాణించడం వల్లే నాకు ఈ చాన్స్ వచ్చిందని నమ్ముతున్నా. వన్డేల్లోనూ రాణించి జట్టు విజయంలో నేనూ పాత్ర పోషించగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఇంగ్లండ్‌లో ఆడాలనేది నా కల. ఇప్పుడు అక్కడికే భారత జట్టు తరఫున వెళుతుండటం గర్వకారణం. టి20ల్లో ప్రదర్శనపై... హైదరాబాద్ టీమ్‌నుంచి మొదలు పెట్టి ఇండియా ‘ఎ’ వరకు మెరుగైన ప్రదర్శన ఇచ్చిన తర్వాతే నాకు జాతీయ జట్టులో అవకాశం లభించింది. మూడేళ్ల క్రితం ఆడిన తొలి మ్యాచ్‌నుంచి చూస్తే ఇప్పుడు నా ఆట ఎంతో మెరుగైంది. నా తొలి సిరీస్‌లో శ్రీలంకతో ఆడిన మూడో మ్యాచ్‌తోనే నాకు మంచి గుర్తింపు దక్కింది. కొత్త బంతితో ఇన్నింగ్స్ ప్రారంభించిన నేను రెండు కీలక వికెట్లతో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాను. అయితే ఇంకా నేను ఆశించిన ‘అత్యుత్తమ మ్యాచ్’ ఇంకా రాలేదనేది నా అభిప్రాయం. కొన్ని సార్లు మనం ఎంతగా శ్రమించినా చివరకు ఫలితం లభించదు. అయితే నా ఆటను సెలక్టర్లు గుర్తించారు కాబట్టే టి20ల్లో రెగ్యులర్‌గా మారడంతో పాటు ఇప్పుడు వన్డేల్లోనూ పిలుపు లభించింది. ఇక తక్కువ సమయంలోనే రెండు ప్రపంచకప్‌లలో ఆడే అవకాశం రావడం నా అదృష్టం. పేస్ బౌలింగ్ పదునుపై... అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన తర్వాత నా బౌలింగ్‌లో వేగం, కచ్చితత్వం పెంచేందుకు ఎంతో శ్రమించా. కెరీర్ ఆరంభ రోజులతో పోలిస్తే ఇప్పుడు నా బౌలింగ్‌లో చాలా మార్పు వచ్చింది. నెట్స్‌లో సుదీర్ఘ సమయం పాటు సాధనతో లోపాలు సరిదిద్దుకుంటున్నా. ఇన్‌స్వింగర్ నా ‘స్టాక్ బాల్’ కాగా...అవుట్ స్వింగర్లు, ఆఫ్ కట్టర్లను సమర్థంగా ప్రయోగించగలుగుతున్నా. ఎన్ఎస్ గణేశ్ వద్ద కోచింగ్ మొదలు పెట్టిన నాకు రైల్వేస్ టీమ్‌కు ఆడే సమయంలో మూర్తి సహకరిస్తున్నారు. ఇతర సమయంలో ఆల్ఫ్రెడ్ అబ్సలమ్ వద్ద ప్రాక్టీస్ కొనసాగిస్తున్నా. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టా. మిథాలీ రాజ్ ప్రభావం... నాకు క్రికెట్‌పై ఆసక్తి కలగడానికి, ఆటలో ఎదిగేందుకు కూడా ఆమెనే స్ఫూర్తి. ఆమె ఆటను బాగా దగ్గరినుంచి చూశాను. నేను జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన సమయంలో జట్టులో మిథాలీ అక్క కూడా ఉంది. రైల్వేస్ జట్టు తరఫున ఆమె కెప్టెన్సీలో ఆడుతున్నా. సీనియర్ ప్లేయర్‌గా, మన హైదరాబాదీగా కూడా అన్ని సందర్భాల్లో మిథాలీ సహకారం నాకు లభించింది. నన్ను బాగా ప్రోత్సహిస్తూ తగిన విధంగా మార్గనిర్దేశం చేస్తోంది. కరోనా కాలంలో సుదీర్ఘ విరామంపై... ఎన్నో ఇతర క్రీడల్లాగే మహిళల క్రికెటర్లందరం కూడా గత ఏడాదంతా ఆటపరంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. టి20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు సంవత్సరం పాటు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేకపోయింది. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ఫిట్నెస్ సౌకర్యాలు కూడా వాడుకునే పరిస్థితి లేకపోయింది. ఇక ప్రాక్టీస్ చేద్దామంటే అకాడమీలూ మూసేశారు. పైగా కరోనాతో భయం కూడా. దాంతో ఆ సమయంలో క్రికెట్‌ను పూర్తిగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. చివరకు నేను ప్రాక్టీస్ కోసం వరంగల్‌కు వెళ్లిపోయాను. నా సహచర ప్లేయర్ ప్రణీషకు సొంత పిచ్, నెట్స్ ఉండటంతో అక్కడకు వెళ్లి సాధన చేసేదాన్ని. ఈ సారి జాగ్రత్తలూ తీసుకుంటూ ఆటపై దృష్టి పెట్టగలుగుతున్నాం. ‘పాఠాలు నేర్చుకుంటా’ ‘ఇటీవల లక్నోలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20ని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇలాంటి అనుభవంతో మున్ముందు తప్పులు సరిదిద్దుకుంటా. నేను గెలిపించాల్సిన మ్యాచ్‌లో విఫలమయ్యాను. చివరి ఓవర్లో సఫారీ జట్టు 9 పరుగులు చేయాల్సి ఉండగా...తొలి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చాను. తర్వాతి 3 బంతుల్లో 6 పరుగులు కావాలి. అయితే ఐదో బంతి ‘నోబాల్’గా వేశాను. అదనపు బంతితో వారికి మరో అవకాశం లభించి చివరి బంతికి విజయం సాధించగలిగారు. నేను ‘నోబాల్’ వేయకుంటే మా జట్టు గెలిచేదేమో’ -
వరుస 24 విజయాలతో జైత్రయాత్ర
మౌంట్ మాంగనుయ్: సమష్టి ప్రదర్శనతో మరోసారి మెరిసిన ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో వరుసగా 24వ విజయం నమోదు చేసింది. న్యూజిలాండ్ జట్టుతో శనివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 25 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేసింది. అలీసా హీలీ (39 బంతుల్లో 46; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. న్యూజిలాండ్ బౌలర్ కాస్పెరక్ మూడు వికెట్లు తీసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 25 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 128 పరుగులు చేసి ఓడిపోయింది. అమీ సాటెర్వైట్ (20), లియా తహుహు (21 నాటౌట్) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షుట్, వేర్హమ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. -
ఎదురులేని రైల్వేస్ జట్టు
రాజ్‌కోట్: దేశవాళీ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో తమకు ఎదురులేదని ఇండియన్ రైల్వేస్ జట్టు మరోసారి నిరూపించుకుంది. ఆదివారం ముగిసిన బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో మిథాలీ రాజ్ నాయకత్వంలోని రైల్వేస్ జట్టు 12వసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన రైల్వేస్ అన్నింట్లోనూ గెలిచి అజేయంగా నిలువడం విశేషం. ఇప్పటి వరకు ఈ టోర్నీ 14 సార్లు జరగ్గా... 12 సార్లు రైల్వేస్, ఒక్కోసారి ఢిల్లీ, బెంగాల్ జట్లు విజేతగా నిలిచాయి. జార్ఖండ్‌తో జరిగిన ఫైనల్లో రైల్వేస్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ సరిగ్గా 50 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఇంద్రాణి రాయ్ (49; 3 ఫోర్లు), మణి నిహారిక (39 నాటౌట్; 4 ఫోర్లు), దుర్గా ముర్ము (31; 3 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. రైల్వేస్ బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టగా, మేఘన సింగ్, ఏక్తా బిష్త్‌లకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. అనంతరం రైల్వేస్ 37 ఓవర్లలో మూడు వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (53; 6 ఫోర్లు), పూనమ్ రౌత్ (59; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. స్నేహ్ రాణా (22 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడింది. జార్ఖండ్ బౌలర్లలో దేవయాని రెండు వికెట్లు తీసింది. -
ఇంగ్లండ్ ఆటగాడిలో ధోని లక్షణాలు
పుణే: ఆదివారం జరిగిన ఆఖరి మూడో మ్యాచ్‌లో భారత జట్టు వన్డే సిరీస్‌ను 2-1 తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో స్యామ్ కరన్ వీరోచిత ఇన్నింగ్స్ (95 నాటౌట్) చూస్తే 'గ్రేట్ ఫినిషర్' మహేంద్ర సింగ్ ధోని లక్షణాలు కనిపించాయని బట్లర్ వ్యాఖ్యానించాడు. నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో, ఇంగ్లండ్ జట్టు 200 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో కరాన్ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, జట్టుని ముందుండి నడిపించడమే కాకుండా, మ్యాచ్‌లో చివరి వరకు పోరాడాడు. ఇటువంటి ప్రదర్శనలు మనం భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలో చూస్తుంటామని ఈ సందర్భంగా బట్లర్ గుర్తు చేశాడు. ‘ప్రస్తుతం అందరి కళ్లు ఏప్రిల్ 9 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ పైన ఉంటాయి. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్న స్యామ్ కరన్ నిన్న రాత్రి తను ఆడిన ఇన్నింగ్స్ గురించి చర్చిస్తాడని నేను అనుకుంటున్నాను. అంతరాతీయ క్రికెట్ ప్రపంచంలో అద్భుతమైన క్రికెటర్ గా, ఫినిషర్ గా ఎంఎస్ ధోని అంటే ఏమిటో మాకు తెలుసు. కనుక ధోనీ లాంటి గొప్ప ఆటగాడితో ఇలాంటివి పంచుకోవడం స్యామ్ కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐపీఎల్ కారణంగా మా ఆటగాళ్లకు కూడా ఎంఎస్ దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తుండడం నాకు ఆనందంగా ఉంది’అని మ్యాచ్ అనంతరం వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ బట్లర్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ 2021లో చెన్నై జట్టు తరఫున ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ కూడా ఆడనున్నాడు. భాగస్వామ్యాలు లేకే మ్యాచ్‌ను కోల్పోయాం ‘రెండో వన్డేలో 43.3 ఓవర్లలో 337 పరుగులు చేసిన ఇంగ్లండ్‌కు మూడో వన్డేలో 330 టార్గెట్ అంత కష్టమేమి కాదు, మేము ఆ స్కోరును చేధించగలమని అనుకున్నాం. రన్-రేట్ సమస్య అవుతుందని అనుకోలేదు, కాని మేము క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం, సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేక పోవడం వంటి అంశాలు ఇంగ్లండ్‌కు మ్యాచ్‌ను దూరం చేసింది. చిన్న, చిన్న పొరపాట్లు కలిసి పెద్దవిగా మారుతాయి. ఈ మ్యాచ్ లో అదే జరిగింది. మ్యాచ్ ఆరంభంలో మా బౌల్లర్లు క్రమశిక్షణగా బౌలింగ్ చేశారు,కానీ చివరి వరకు అది కొనసాగించలేదనే అనుకుంటున్నాను. భారత్ బ్యాట్స్మెన్లకు కొన్ని బౌండరీల విషయంలో కష్టపడకపోయినా సునాయాసంగా మేమే పరుగులు సమర్పించుకున్నాం. అవే మ్యాచ్‌లో 7 పరుగల తేడాతో ఓటమికి కారణమైంది’ అని బట్లర్ అన్నాడు. ( చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న క్రికెటర్ ఇతనేనంటే నమ్ముతారా! ) -
మ్యాచ్‌లో ఓడినా.. మనసులు గెలిచావోయ్ కరన్!
పుణే: ఆదివారం రసవత్తరంగా సాగిన ఆఖరి వన్డేలో ఏడు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ గెలిచినప్పటికీ, స్యామ్ కరన్ తన అసాధారణ బ్యాటింగ్ తో అందరి మనసులను గెలుచుకున్నాడు. మరో రకంగా చెప్పాలంటే మ్యాచ్‌లో ఓటమి తథ్యమనేలా కోహ్లి సేనని భయపెట్టాడు. స్యామ్ కరన్ ఐపీఎల్ 2020 ద్వారా భారత్ క్రికెట్ అభిమానులకి పరిచయమైన పేరు. గత సీజన్ లో చెన్నై జట్టు తరుపున ఓపెనర్‌గా, వన్‌డౌన్ గా బరిలోకి దిగి తన బ్యాట్‌తో మెరుపులు మెరిపించి భారత్‌లో తనకంటూ గుర్తింపు సంపాదించాడు. నిన్న జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ ద్వారా భారత్ క్రికెట్ అభిమానుల గుండెల్లో ఒకింత గుబులు పుట్టించాడు. మరో ఎండ్ లో ధీటైన బ్యాట్స్‌మెన్ లేకపోయినా ధైర్యం కోల్పోకుండా తన భీకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను చివరి వరకు లాక్కొచ్చి తన కెరీర్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ను ఆడాడు. భారత జట్టును భయపెట్టిన కరన్ స్యామ్ కరన్ (83 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) పట్టుదలతో ఆడి ఎనిమిదో వికెట్‌కు ఆదిల్ రషీద్ (22 బంతుల్లో 19; 2 ఫోర్లు)తో 57 పరుగులు... తొమ్మిదో వికెట్‌కు మార్క్ వుడ్ (21 బంతుల్లో 14; ఫోర్)తో 60 పరుగులు జోడించి ఇంగ్లండ్ విజయం ఖాయమనేలా చేశాడు. భారత్‌కు సునాయాసంగా దక్కాల్సిన విజయాన్ని తీవ్రంగా శ్రమించి మ్యాచ్‌ని చివరి బంతివరకు తీసుకెళ్లాడు. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన పోరులో భారత్ నెగ్గినా... స్యామ్ కరన్ తన అసాధారణ పోరాటం తో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ విజయానికి ఆఖరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. భారత బౌలర్ నటరాజన్ నేర్పుతో బౌలింగ్ చేసి స్యామ్ కరన్‌ను కట్టడి చేసి కేవలం ఆరు పరుగులిచ్చి టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు. భారత బౌలర్లు భువనేశ్వర్ (3/42), శార్దుల్ (4/67) కీలక వికెట్లు తీశారు. స్యామ్ కరన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... బెయిర్‌స్టోకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ( చదవండి: భారత్ తీన్మార్ ) -
ధావన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన కోహ్లి
పుణె : ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించిన తీరుని, ఈ విజయాన్నిఅందించడంలో కీలక పాత్ర పోషించిన శిఖర్ ధావన్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రత్యేకంగా కొనియాడాడు. 'ఇటీవల కాలంలో సాధించిన విజయాల్లో ఇది ఒక మధురమైన విజయంగా నిలిచిపోతుంది' అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత జట్టుకు, రోహిత్ రూపంలో స్వల్ప స్కోరుకే మొదటి వికెట్‌ను చేజార్చుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి, శిఖర్ ధావన్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ 105 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు గట్టి పునాది వేశారు. 'బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న దశలో పరగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్‌పై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ''ఇవాళ శిఖర్ ధావన్ ఆడిన తీరు, అతడు సాధించిన 98 పరుగులు స్కోర్ బోర్డులో చూపించే స్కోర్ కంటే విలువైనవి'' అని చెబుతూ ధావన్‌ని కోహ్లి అభినందనల్లో ముంచెత్తాడు. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ పుణేలో మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 98 పరుగుల చేసి తను ఫామ్‌లోకి వచ్చినట్లు ప్రకటించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్ మాన్ తన 18 వ వన్డే సెంచరీని కేవలం 2 పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. ( చదవండి : అరుదైన రికార్డు: సచిన్ తర్వాత కోహ్లినే ) -
‘శత’క్కొట్టిన పృథ్వీ షా
జైపూర్: ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న ముంబై యువ ఓపెనర్ పృథ్వీషా (89 బంతుల్లో 105 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో టచ్‌లోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట ఢిల్లీ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. హిమ్మత్ సింగ్ (145 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరోచిత పోరాటం చేశాడు. లోయర్ ఆర్డర్లో వశిష్ట్ (70 బంతుల్లో 55; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 31.5 ఓవర్లలోనే మూడు వికెట్లే కోల్పోయి 216 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ పృథ్వీ షా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (39; 6 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. తర్వాత పృథ్వీకి జతయిన సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి అర్ధసెంచరీ బాదాడు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించడంతో ముంబై విజయం సులువైంది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ► బెంగాల్: 315/6 (కైఫ్ అహ్మద్ 75, అనుస్తుప్ 58); సర్వీసెస్: 245 (రజత్ 90, పుల్కిత్ 53; ఇషాన్ పొరెల్ 2/31). ► జమ్మూకశ్మీర్: 279/9 (శుభమ్ 68, వివ్రత్ శర్మ 66); సౌరాష్ట్ర: 283/7 (చిరాగ్ జానీ 93 నాటౌట్, అర్పిత్ 66). ► హరియాణా: 299/9 (హిమాన్షు రాణా 102, రాహుల్ తెవాటియా 73); చండీగఢ్: 300/7 (మనన్ వొహ్రా 117, అంకిత్ 78). ► మహారాష్ట్ర: 295/8 (రుతురాజ్ గైక్వాడ్ 102; వైభవ్ అరోరా 4/45); హిమాచల్ ప్రదేశ్: 236 (అభిమన్యు రాణా 46, రాజ్వర్ధన్ 4/42). ► పుదుచ్చేరి: 273/6 (పారస్ డోగ్రా 101, ); రాజస్తాన్: 274/4 (మనేందర్ సింగ్ 115). -
ఓపెనింగ్ చేస్తానని వేడుకున్నా: సచిన్
న్యూఢిల్లీ : మార్చి 27... 1994... భారత క్రికెట్ గతిని మార్చిన రోజుల్లో ఇది అత్యంత ప్రధానమైనది. ఇదే రోజున క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తొలిసారి ఓపెనర్‌గా వచ్చాడు. న్యూజిలాండ్‌పై ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లో 82 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఆ తర్వాతదంతా తెలిసిన చరిత్రే. అప్పటివరకు మిడిలార్డర్లో ఆడిన తాను అనూహ్యంగా ఓపెనింగ్‌కు దిగేందుకు జట్టు మేనేజ్మెంట్ను తీవ్రంగా ప్రాధేయపడినట్లు చెప్పాడు. నాటి మ్యాచ్‌లో తన బ్యాటింగ్ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తూ అనుభవాలు పంచుకున్నాడు. ‘అప్పటివరకు వన్డేల్లో వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేసేవారు. ఓపెనింగ్‌కు దిగి నేను ఈ పద్ధతి మార్చాలనుకున్నా. ఇందుకోసం ఒక్క అవకాశం ఇమ్మంటూ, విఫలమైతే మళ్లీ అడగనంటూ జట్టు మేనేజ్మెంట్ను వేడుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌లో ప్రదర్శనతో నా ఓపెనింగ్‌పై మరో మాటకు తావు లేకపోయింది. అందుకనే... అభిమానులకు ఒక్కటే చెబుతున్నా. విఫలమవుతామనే భయంతో ప్రయోగాలకు వెనుకాడొద్దు’ అని సచిన్ చెప్పుకొచ్చాడు. -
50 ఓవర్ల మ్యాచ్; 571 పరుగుల విజయం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్థానిక టోర్నీలో సంచలనం నమోదైంది. 50 ఓవర్ల మహిళల క్రికెట్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఒక జట్టు 571 పరుగుల తేడాతో విజయం సాధించింది . ఎస్‌ఏసీఏ పీసీ స్టేట్‌వైడ్ మహిళల ఫస్ట్‌గ్రేడ్ మ్యాచ్‌లో నార్తర్న్ డిస్ట్రిక్స్, పోర్ట్ అడిలైడ్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ డిస్ట్రిక్స్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 596 పరుగుల భారీ స్కోరు చేసింది. నలుగురు క్రీడాకారిణులు సెంచరీల మోత మోగించారు. టెగాన్ మెక్ఫార్లిన్ (80 బంతుల్లో 136), టాబీ సవిలీ (56 బంతుల్లో 120), శామ్ బెట్స్ (71 బంతుల్లో 124 నాటౌట్), డార్సీ బ్రౌన్ (84 బంతుల్లో 117 నాటౌట్) చెలరేగి ఆడారు. నార్తర్న్ డిస్ట్రిక్స్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనకు దిగిన పోర్ట్ అడిలైడ్ ఒత్తిడిలో కేవలం 10.5 ఓవర్లలో 25 పరుగులకే కుప్పకూలింది. ఇందులో ఎనిమిది మందే బ్యాటింగ్ చేయడం గమనార్హం. ప్రతిభా కపూర్ 9 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచారు. -
వన్డేల్లో డబుల్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్
బులవాయో : జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో వన్డేలో పాకిస్తాన్ ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా పాక్ ఓపెనర్లు ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్‌లు నిలిచారు. తొలి వికెట్‌కు 304 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన పాక్ ఓపెనర్లు.. గతంలో శ్రీలంక ఓపెనర్లు సనత్ జయసూర్య-ఉపుల్ తరంగ కలిసి నెలకొల్పిన 284 పరుగులు అత్యధిక ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యాన్ని బద్ధలుకొట్టారు. 2006లో ఇంగ్లండ్‌పై లీడ్స్‌లో జరిగిన వన్డేలో లంక ఓపెనర్లు ఆ ఫీట్ నమోదు చేశారు. కాగా, నేడు 304 పరుగుల వద్ద సెంచరీ వీరుడు ఇమాముల్ హక్ (113: 122 బంతుల్లో 8 ఫోర్లు) ఔటైన తర్వాత జమాన్ మరింతగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ఫఖర్ జమాన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి పాక్ క్రికెటర్‌గా జమాన్ (210 నాటౌట్; 156 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్లు) నిలిచాడు. ఓవరాల్‌గా వన్డే క్రికెట్లో ద్విశతకాన్ని బాదిన ఆరో క్రికెటర్ జమాన్. వన్‌డౌన్ క్రికెటర్ అసిఫ్ అలీ (50 నాటౌట్; 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధ శతకం చేయడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లాడి కేవలం వికెట్ నష్టపోయి 399 పరుగులు సాధించింది. జింబాబ్వేకు 400 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఫఖర్ జమాన్ కంటే ముందు టీమిండియా క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మలతో పాటు న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్, వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్‌గేల్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. నాలుగో వన్డేలోనూ జింబాబ్వే చిత్తు! 400 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జింబాబ్వే ఈ మ్యాచ్‌లోనూ దారుణంగా విఫలమైంది. పాక్ బౌలర్ షాదబ్ ఖాన్ (4/28) చెలరేగడంతో 42.4 ఓవర్లాడిన జింబాబ్వే కేవలం 155 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో నాలుగో వన్డేలో పాక్ 244 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ట్రిపానో (44), చిగుంబురా (37), పరవాలేదనిపించారు. ఓపెనర్ మసకద్జ (22), పీజే మూర్ (20) పరుగులు చేయగా, ఇతర బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో సిరీస్‌లో మరో దారుణ ఓటమి చవిచూసింది. నాలుగు వన్డేలు నెగ్గిన పాక్ చివరి మ్యాచ్‌లోనూ నెగ్గి 5-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. ఫఖర్ జమాన్(210 నాటౌట్)కు ముందు ఓ వన్డేలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన పాక్ క్రికెటర్‌గా సయీద్ అన్వర్ (194 పరుగులు) ఉన్నాడు. 1997లో భారత్‌పై అన్వర్ ఈ ఇన్నింగ్స్ ఆడాడు. తాజా మ్యాచ్‌లో మరో రికార్డు కూడా బద్దలైంది. గతంలో శ్రీలంక ఓపెనర్లు సనత్ జయసూర్య-ఉపుల్ తరంగ కలిసి నెలకొల్పిన 284 పరుగులు అత్యధిక ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యాన్ని జమాన్-ఇమాముల్ హక్‌లు బద్దలుగొట్టారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 304 పరుగులు చేశారు. -
బంతి తీసుకున్నాడు... బరిలో నుంచి తప్పుకుంటాడా?
లీడ్స్: ఇంగ్లండ్‌తో మూడో వన్డే అనంతరం ఆటగాళ్లంతా మైదానాన్ని వీడుతున్న సమయంలో చోటుచేసుకున్న ఘటన బుధవారం తీవ్ర స్థాయి ఊహాగానాలకు తావిచ్చింది. అదేంటంటే, ఆట ముగిశాక డ్రెస్సింగ్ రూమ్‌కు వస్తూ భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని... అంపైర్లను అడిగి వారి నుంచి మ్యాచ్ బంతిని తీసుకున్నాడు. సరిగ్గా ఇదే విధంగా 2014లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో బెయిల్స్‌ను తీసుకున్న ధోని తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల పరిస్థితులకు తగినట్లు ఆడటం లేదంటూ విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రెండు ఘటనల మధ్య పోలిక మొదలైంది. ధోని పరిమిత ఓవర్ల క్రికెట్‌కూ త్వరలో వీడ్కోలు చెబుతాడంటూ మీడి యా హల్చల్ చేసింది. అయితే, ఎటువంటి సంచలన ప్రకటన రాకపోవడంతో చివరకు ఇదంతా ఊహాగానంగానే మిగిలిపోయింది. -
మ్యాచ్‌లో మ్యారేజ్ ప్రపోజల్..వైరల్!