Vijay Hazare Trophy 2022 - Maharashtra vs Uttar Pradesh, 2nd quarter final: టీమిండియా యువ ఆటగాడు రుత్‌రాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రకు సారథ్యం వహిస్తున్న రుత్‌రాజ్ ఏకంగా ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదాడు. ఈ టోర్నీ క్వార్టర్స్ ఫైనల్స్‌లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఈ అరుదైన ఘనత సాధించాడు.
శివసింగ్ మైండ్ బ్లాక్
మహారాష్ట్ర ఇన్నింగ్స్ 49 ఓవర్ వేసిన శివ సింగ్ బౌలింగ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. వరుసగా నాలుగు బంతులను రుతురాజ్ సిక్సర్లు బాదగా.. ఐదో బంతిని బౌలర్ నోబాల్‌గా వేసాడు. ఆ బంతిని కూడా సిక్స్ బాదిన రుతురాజ్ తర్వాతి రెండు బంతులను కూడా స్టాండ్స్‌కు తరిలించాడు.
ప్రపంచ రికార్డు
ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదడం లిస్ట్- ఏ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్‌లో 159 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 16 సిక్సులు, 10 ఫోర్లతో 220 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రుత్‌రాజ్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 330 పరుగులు చేసింది.
6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣
Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥
Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022
Comments
Please login to add a commentAdd a comment