
ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ షాన్ మార్ష్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్, అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై అతడు కేవలం టీ20 క్రికెట్‌లో మాత్రమే కొనసాగనున్నాడు. 39 ఏళ్ల మార్ష్ 2001లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు.
2022లో ప్రతిష్టాత్మక షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీని సారథిగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు మార్ష్ అందించాడు. లిస్ట్-ఎ కెరీర్‌లో 177 మ్యాచ్‌లు ఆడిన మార్ష్.. 44.45 సగటుతో 7158 పరుగులు చేశాడు. 26 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ఎన్నో అద్భుత విజయాలను షాన్ అందించాడు.
ఇక మార్ష్ అంతర్జాతీయ కెరీర్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తరపున 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. కాగా 2019లోనే టెస్టు క్రికెట్‌కు మార్ష్ గుడ్‌బై చెప్పాడు. టెస్టుల్లో అతడు 32.32 సగటుతో 2265 పరుగులు సాధించాడు.
అతడి టెస్టు కెరీర్‌లో 6 సెంచరీలు, 10 అర్ధ శతకాలు ఉన్నాయి. అదే విధంగా వన్డేల్లో 2773 పరుగులు, టీ20ల్లో కేవలం 255 పరుగులు మాత్రమే మార్ష్ చేశాడు. కాగా షాన్ మార్ష్ సోదరుడు మిచెల్ మార్ష్ ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు
Comments
Please login to add a commentAdd a comment