టెస్ట్‌లతో పాటు వన్డే క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా సంచలన ప్రకటన చేసిన డేవిడ్ వార్నర్ 50 ఓవర్ల ఫార్మాట్‌పై తనదైన ముద్ర వేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 37 ఏళ్ల వార్నర్ తన వన్డే కెరీర్‌లో మొత్తం 161 మ్యాచ్‌లు ఆడి 22 సెంచరీలు, 33 అర్దసెంచరీల సాయంతో 45.30 సగటున 6932 పరుగులు చేశాడు. వన్డేల్లో వార్నర్ అత్యధిక స్కోర్ 179గా ఉంది. వార్నర్ తన వన్డే కెరీర్‌లో దాదాపు 100 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు సాధించాడు.
వన్డేల్లో వార్నర్ సాధించిన ఘనతలు..
🏆2015 వరల్డ్ కప్ విజేత
🏆2023 వరల్డ్ కప్ విజేత
- వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్‌గా రెండో అత్యధిక పరుగులు
- వన్డేల్లో ఆస్ట్రేలియా తరపున రెండవ అత్యధిక సెంచరీలు
- వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు
- వన్డే ప్రపంచ కప్‌లలో ఆస్ట్రేలియా తరఫున రెండవ అత్యధిక పరుగులు
- 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరఫున సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్
- 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తరఫున లీడింగ్ రన్ స్కోరర్
- 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తరఫున లీడింగ్ రన్ స్కోరర్
- వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున ఆరో అత్యధిక రన్ స్కోరర్
కాగా, టెస్ట్‌లతో పాటు వన్డే క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా స్పష్టం చేసిన డేవిడ్ వార్నర్.. అవసరమైతే ఈ ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇస్తానని ఆసక్తికర స్టేట్‌మెంట్ ఇచ్చాడు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుండగా.. అప్పటికి తాను ఫామ్‌లో ఉండి, జట్టు తన సేవలు అవసరమనుకుంటే తిరిగి బరిలోకి దిగుతానని తెలిపాడు. వార్నర్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌తో మూడో టెస్ట్ సుదీర్ఘ ఫార్మాట్‌లో తనకు చివరి టెస్ట్ అని వార్నర్ స్పష్టం చేశాడు.
టెస్ట్‌లతో పాటు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఫ్రాంచైజీ అయిన దుబాయ్ క్యాపిటల్స్ వార్నర్‌ను తమ జట్టు కెప్టెన్‌గా ప్రకటించింది. దుబాయ్ క్యాపిటల్స్ విండీస్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ స్థానంలో వార్నర్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పింది. వార్నర్ ఐపీఎల్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ సభ్యుడిగా ఉన్నాడు. గత సీజన్‌లో అతను పంత్ గైర్హాజరీలో డీసీ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. దుబాయ్ క్యాపిటల్స్.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనుబంధ ప్రాంచైజీ అన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment