సిడ్నీ థండర్ (బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ) కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ మళ్లీ ఎంపికయ్యాడు. వచ్చే సీజన్ నుంచి వార్నర్ బాధ్యతలు చేపడతాడు. డేవిడ్ వార్నర్‌పై ఇటీవలే కెప్టెన్సీ నిషేధం ఎత్తివేసిన విషయం తెలిసిందే. వార్నర్ క్రిస్ గ్రీన్ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడు. వార్నర్ కెప్టెన్సీలో గ్రీన్ సాధారణ సభ్యుడిలా జట్టులో కొనసాగుతాడు. వార్నర్ గతంలో సిడ్నీ థండర్ కెప్టెన్‌గా పని చేశాడు. సిడ్నీ థండర్ కెప్టెన్‌గా మరోసారి ఎంపిక కావడంపై వార్నర్ హర్షం వ్యక్తం చేశాడు. బిగ్‌బాష్ లీగ్ తదుపరి సీజన్ (14వ సీజన్) డిసెంబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది. సిడ్నీ థండర్ తమ తొలి మ్యాచ్‌ను (అడిలైడ్ స్ట్రయికర్స్‌తో) డిసెంబర్ 17న ఆడుతుంది. సిడ్నీ థండర్ గత సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది.
కాగా, డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరఫున 112 టెస్ట్‌లు, 161 వన్డేలు, 110 టీ20లు ఆడి దాదాపు 19 వేల పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 98 అర్ద సెంచరీలు ఉన్నాయి. వార్నర్ 2009 నుంచి ఐపీఎల్‌లో కూడా ఆడుతున్నాడు. వార్నర్‌ను ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ వదులకుంది. త్వరలో జరుగబోయే ఐపీఎల్ వేలంలో వార్నర్ పాల్గొంటాడు. వార్నర్ ఐపీఎల్‌లో 184 మ్యాచ్‌లు ఆడి 6565 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో 11 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 301 పరుగులు చేశాడు.
వచ్చే సీజన్ కోసం సిడ్నీ థండర్ స్క్వాడ్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వెస్ అగర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, సామ్ బిల్లింగ్స్, ఆలివర్ డేవిస్, లాకీ ఫెర్గూసన్, మాట్ గిల్క్స్, క్రిస్ గ్రీన్, లియామ్ హాట్చర్, సామ్ కాన్స్టాస్, నిక్ మాడిన్సన్, నాథన్ మెక్‌ఆండ్రూ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, విలియం సాల్జ్‌మన్, డేనియల్ సామ్స్, జాసన్ సంఘా, తన్వీర్ సంఘా
Comments
Please login to add a commentAdd a comment