Sydney Thunder
-
రాణించిన కొన్‌స్టాస్.. వార్నర్ జట్టుకు ఊహించని గెలుపు
బిగ్‌బాష్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ సారథ్యం వహిస్తున్న సిడ్నీ థండర్‌కు ఊహించని విజయం దక్కింది. పెర్త్ స్కార్చర్స్‌తో ఇవాళ (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో థండర్ జట్టు 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (42 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. ఆఖర్లో టామ్ ఆండ్రూస్ (13 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆండ్రూస్‌కు క్రీస్ గ్రీన్ (16 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్) సహకరించాడు. ఈ ముగ్గురు మినహా థండర్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (8) సహా అంతా విఫలమయ్యారు. మాథ్యూ గిల్కెస్ 8, సామ్ బిల్లింగ్స్ 8, జార్జ్ గార్టన్ 1, హగ్ వెబ్జెన్ 6, మెక్ ఆండ్రూ 9 పరుగులకు ఔటయ్యారు. స్కార్చర్స్ బౌలర్లలో లాన్స్ మోరిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. బెహ్రెన్‌డార్ఫ్, అస్టన్ అగర్, కూపర్ కన్నోలీ, మాథ్యూ స్పూర్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. 97 పరుగులకే కుప్పకూలిన స్కార్చర్స్థండర్ 158 పరుగుల స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టమని అంతా అనుకున్నారు. అయితే ఆ జట్టు బౌలర్లు అద్భుతం చేశారు. కలిసికట్టుగా బౌలింగ్ చేసి స్వల్ప స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకున్నారు. క్రిస్ గ్రీన్ 3, నాథన్ మెక్ఆండ్రూ 2, మొహమ్మద్ హస్నైన్, తన్వీర్ సంఘా, టామ్ ఆండ్రూస్ తలో వికెట్ పడగొట్టారు. ఫలితంగా స్కార్చర్స్ 17.2 ఓవర్లలో 97 పరుగులకే చాపచుట్టేసింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ హార్డీ (22), నిక్ హాబ్సన్ (10), మాథ్యూ స్పూర్స్ (13), జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సామ్ ఫాన్నింగ్ (1), ఫిన్ అలెన్ (9), కూపర్ కన్నోలీ (7), అస్టన్ టర్నర్ (4), అస్టన్ అగర్ (7), లాన్స్ మోరిస్ (0), మహ్లి బియర్డ్మ్యాన్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సిడ్నీ థండర్ ఫైనల్‌కు చేరింది. ఆ జట్టు తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో (11 పాయింట్లు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. -
పదకొండేళ్ల తర్వాత తొలి హాఫ్ సెంచరీ.. అదీ 40 బంతుల్లో!
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్(Big Bash League- బీబీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఈ టీ20 లీగ్‌లో సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్.. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఎట్టకేలకు అర్ధ శతకం సాధించాడు. దాదాపు పదకొండేళ్ల అనంతరం బీబీఎల్‌లో తొలిసారి యాభై పరుగుల మార్కును అందుకున్నాడు.కెప్టెన్‌గా వార్నర్అయితే, విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన పొట్టి ఫార్మాట్లో(T20 Cricket) సుదీర్ఘ విరామం తర్వాత హాఫ్ సెంచరీ బాదిన వార్నర్ భాయ్.. అందుకోసం ఏకంగా 40 బంతులు తీసుకోవడం గమనార్హం. కాగా డిసెంబరు 15 బీబీఎల్ 2024-25 సీజన్ ఆరంభమైంది. ఈ క్రమంల డిసెంబరు 17న వార్నర్ కెప్టెన్సీలో తమ తొలి మ్యాచ్ ఆడిన సిడ్నీ థండర్ రెండు వికెట్ల తేడాతో అడిలైడ్ స్ట్రైకర్స్‌ను ఓడించింది.ఆరంభ మ్యాచ్‌లలో విఫలంనాటి మ్యాచ్‌లో వార్నర్ కేవలం ఏడు పరుగులే చేశాడు. అనంతరం.. సిడ్నీ సిక్సర్స్‌తో తలపడ్డ సిడ్నీ థండర్(Sydney Thunder) ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ వార్నర్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం పదిహేడు పరుగులే చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాత మెల్బోర్న్తో స్టార్స్‌తో మ్యాచ్‌లో వార్నర్ 19 పరుగులే చేసినా.. సామ్ బిల్లింగ్స్(72 నాటౌట్) కారణంగా.. సిడ్నీ థండర్ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో సోమవారం నాటి మ్యాచ్‌లో మెల్బోర్న్ గ్రెనేడ్స్తో మ్యాచ్‌లో మాత్రం వార్నర్ బ్యాట్ ఝులిపించాడు.ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడుసిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మెల్బోర్న్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్ ఆదిలోనే కామెరాన్ బాన్‌క్రాఫ్ట్(8) వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్ బ్యాటర్ షెర్ఫానే రూథర్‌ఫర్డ్(11), ఒలివర్ డేవిస్(10), సామ్ బిల్లింగ్స్(10) కూడా విఫలమయ్యారు.ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ గాడిన పెట్టే బాధ్యత తీసుకున్న ఓపెనర్ వార్నర్ నెమ్మదిగా ఆడాడు. వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ.. 40 బంతుల్లో యాభై పరుగులు మార్కుకు చేరుకున్నాడు. ఆ తర్వాత మరో పదిహేడు బంతుల్లోనే 36 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.మొత్తంగా 57 బంతులు ఎదుర్కొని పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో వార్నర్ 86 పరుగులు సాధించాడు. అతడి తోడుగా మాథ్యూ గిల్క్స్(23 నాటౌట్) కూడా రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సిడ్నీ థండర్ నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.2013లో చివరగాకాగా డేవిడ్ వార్నర్ బీబీఎల్‌లో చివరగా 2013లో అర్థ శతకం నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్ ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్లో ఆడుతున్నాడు. అయితే, ఐపీఎల్లో గతంలో మంచి రికార్డులే ఉన్నా మెగా వేలం 2025లో మాత్రం వార్నర్‌పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఒకవేళ బీబీఎల్‌లో గనుక పరుగుల వరద పారిస్తే.. అతడు ఐపీఎల్లో తిరిగి పునరాగమనం చేసే అవకాశం ఉంటుంది. కాగా తమ ఆటగాళ్లు ఎవరైనా గాయపడిన సందర్భంలో ఫ్రాంఛైజీలు .. వారి స్థానంలో అన్‌సోల్డ్‌గా ఉన్న క్రికెటర్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓపెనర్‌గా ఘనమైన రికార్డు ఉన్న వార్నర్ సేవలను పంజాబ్ కింగ్స్ లేదంటే లక్నో సూపర్ జెయింట్స్ వాడుకునే అవకాశం ఉంది.చదవండి: థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పే..; బీసీసీఐ ఉపాధ్యక్షుడి స్పందన ఇదేDavid Warner's first BBL half-century since 2013! 👏Things you love to see! #BBL14 pic.twitter.com/Uzjq8jamp3— KFC Big Bash League (@BBL) December 30, 2024 -
అరంగేట్రంలోనే రికార్డులు కొల్లగొట్టిన జూనియర్ రికీ పాంటింగ్
జూనియర్ రికీ పాంటింగ్‌గా పేరొందిన సామ్ కొన్‌స్టాస్ బిగ్‌బాష్ లీగ్‌లో తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్ 2024-25 ఎడిషన్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జూనియర్ రికీ 20 బంతుల్లోనే (8 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. బీబీఎల్‌లో సిడ్నీ థండర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కొన్‌స్టాస్.. ఈ ఫ్రాంచైజీ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.గతంలో ఈ రికార్డు అలెక్స్ హేల్స్ పేరిట ఉండేది. హేల్స్ 2021 సీజన్లో మెల్బోర్న్ స్టార్స్‌పై 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. థండర్ తరఫున మూడు, నాలుగో వేగవంతమైన హాఫ్ సెంచరీల రికార్డులు డేనియల్ సామ్స్, ఉస్మాన్ ఖ్వాజాల పేరిట ఉన్నాయి. సామ్స్ 23 బంతుల్లో, ఖ్వాజా 24 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు. మరోవైపు బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్నవయస్కుడిగానూ (19 ఏళ్లు) సామ్ కొన్‌స్టాస్ రికార్డు నెలకొల్పాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వెథరాల్డ్ (19 బంతుల్లో 40), జేమీ ఓవర్టన్ (35 బంతుల్లో 45 నాటౌట్), జేమ్స్ బాజ్లీ (12 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఫెర్గూసన్, క్రిస్ గ్రీన్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. తన్వీర్ సంఘా 2 వికెట్లు దక్కించుకున్నాడు.డేనియల్ సామ్స్ ఊచకోత183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన థండర్.. సామ్ కొన్‌స్టాస్ (27 బంతుల్లో 56), డేనియల్ సామ్స్ (18 బంతుల్లో 42 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఓటమి దిశగా సాగుతున్న థండర్‌ను డేనియల్ సామ్స్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గెలుపు బాట పట్టించాడు. సామ్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో లాయిడ్ పోప్ బౌలింగ్‌లో ఏకంగా 31 పరుగులు పిండుకున్నాడు. ఇందులో మూడు సిక్సర్లు, మూడు బౌండరీలు ఉన్నాయి. ఈ ఓవర్ మ్యాచ్ రూపురేఖల్నే మార్చేసింది. ఈ మ్యాచ్‌లో థండర్ సారధి డేవిడ్ వార్నర్ 7 పరుగులకే ఔటయ్యాడు. -
మళ్లీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్
సిడ్నీ థండర్ (బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ) కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ మళ్లీ ఎంపికయ్యాడు. వచ్చే సీజన్ నుంచి వార్నర్ బాధ్యతలు చేపడతాడు. డేవిడ్ వార్నర్‌పై ఇటీవలే కెప్టెన్సీ నిషేధం ఎత్తివేసిన విషయం తెలిసిందే. వార్నర్ క్రిస్ గ్రీన్ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడు. వార్నర్ కెప్టెన్సీలో గ్రీన్ సాధారణ సభ్యుడిలా జట్టులో కొనసాగుతాడు. వార్నర్ గతంలో సిడ్నీ థండర్ కెప్టెన్‌గా పని చేశాడు. సిడ్నీ థండర్ కెప్టెన్‌గా మరోసారి ఎంపిక కావడంపై వార్నర్ హర్షం వ్యక్తం చేశాడు. బిగ్‌బాష్ లీగ్ తదుపరి సీజన్ (14వ సీజన్) డిసెంబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది. సిడ్నీ థండర్ తమ తొలి మ్యాచ్‌ను (అడిలైడ్ స్ట్రయికర్స్‌తో) డిసెంబర్ 17న ఆడుతుంది. సిడ్నీ థండర్ గత సీజన్లో ఆఖరి స్థానంలో నిలిచింది.కాగా, డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరఫున 112 టెస్ట్‌లు, 161 వన్డేలు, 110 టీ20లు ఆడి దాదాపు 19 వేల పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 98 అర్ద సెంచరీలు ఉన్నాయి. వార్నర్ 2009 నుంచి ఐపీఎల్లో కూడా ఆడుతున్నాడు. వార్నర్‌ను ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ వదులకుంది. త్వరలో జరుగబోయే ఐపీఎల్ వేలంలో వార్నర్ పాల్గొంటాడు. వార్నర్ ఐపీఎల్లో 184 మ్యాచ్‌లు ఆడి 6565 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో 11 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 301 పరుగులు చేశాడు.వచ్చే సీజన్ కోసం సిడ్నీ థండర్ స్క్వాడ్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వెస్ అగర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, సామ్ బిల్లింగ్స్, ఆలివర్ డేవిస్, లాకీ ఫెర్గూసన్, మాట్ గిల్క్స్, క్రిస్ గ్రీన్, లియామ్ హాట్చర్, సామ్ కాన్స్టాస్, నిక్ మాడిన్సన్, నాథన్ మెక్ఆండ్రూ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, విలియం సాల్జ్‌మన్, డేనియల్ సామ్స్, జాసన్ సంఘా, తన్వీర్ సంఘా -
ఫ్రీ హిట్‌కు క్యాచ్ పట్టి సెలబ్రేషన్స్.. పాక్ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్
బిగ్ బాష్ లీగ్-2023లో భాగంగా శనివారం మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. సిడ్నీ థండర్ తరపున ఆడుతున్న పాకిస్తాన్ ఆటగాడు ఉసామా మీర్ గ్రౌండ్లో నవ్వులు పూయించాడు. ఏం జరిగిందంటే? మెల్బోర్న్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతి వేసే క్రమంలో బౌలర్ స్టిక్టీ ఓవర్ స్టాప్ చేశాడు. దీంతో మెల్బోర్న్ బ్యాటర్ బెన్క్రాప్ట్కు ఫ్రీహిట్ లభించింది. ఫ్రీహిట్ బంతిని బెన్‌క్రాప్ట్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని థర్డ్‌మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో ఉసామా మీర్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్‌ను పట్టిన అది ఫ్రీహిట్ అని మర్చిపోయిన ఉస్మామీర్ బంతిని త్రో చేయకుండా సంబరాల్లో మునిగితేలిపోయాడు. వెంటనే మరో సిడ్నీ ఆటగాడు బాల్ త్రో చేయమని సైగ చేస్తే.. అప్పుడు మీర్ వికెట్ కీపర్ వైపు త్రో చేశాడు. దీంతో ఆటగాళ్లు అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను మీర్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. The old catch off a free hit! Unlucky, Usama 😅 #BBL13 pic.twitter.com/eOnQC7v8p9 — KFC Big Bash League (@BBL) December 23, 2023 చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! ఓపెనర్లు ఎవరంటే? -
వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. తొమ్మిదేళ్ల తర్వాత ఆ లీగ్‌లో రీ ఎంట్రీ!
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొమ్మిదేళ్ల తర్వాత బిగ్‌బాష్ లీగ్‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ మెరకు బిగ్‌బాష్ లీగ్ 12వ సీజన్ ముందు సిడ్నీ థండర్‌తో రెండు సంవత్సరాల ఒప్పందాన్ని వార్నర్ కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని సిడ్నీ థండర్ ఆదివారం సోషల్ మీడియాలో వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం వార్నర్ జట్టులో చేరనున్నాడని సిడ్నీ థండర్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆట పట్ల పూర్తి అంకితభావంతో ఉంటా ఇక ఇదే విషయంపై వార్నర్ స్పందిస్తూ.. నా బిగ్‌బాష్ కెరీర్‌ను ప్రారంభించిన జట్టులోకి మళ్లీ తిరిగి రావడం నాకు సంతోషంగా ఉంది. నేను నా ఆట పట్ల పూర్తి అంకితభావంతో ఉంటాను.. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా నా సీనియర్లు చూపిన మార్గం నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎల్లవేళలా ఆటను ఆస్వాదిస్తూ ఉంటా. అదే విధంగా బిగ్‌బాష్ లీగ్ నుంచి భవిష్యత్తు ఆటగాళ్లను తయారు చేయడంతో నా వంతు పాత్ర పోషిస్తాను అని పేర్కొన్నాడు. కాగా 2011 బిగ్‌బాష్ లీగ్ తొలి సీజన్లో వార్నర్ అరేంగట్రం చేసినప్పటికీ.. అంతర్జాతీయ షెడ్యూల్, తదితర కారణాల వల్ల ఇప్పటి వరకు కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వార్నర్ ఈ లీగ్‌లో చివరసారిగా 2014 సీజన్లో కనిపించాడు. ఇక బిగ్‌బాష్ లీగ్(2022-23) సీజన్ డిసెంబర్13 నుంచి ఫిబ్రవరి 4 వరకు జరగనుంది. మరో వైపు డేవిడ్ భాయ్ యూఏఈ సరికొత్త టీ20లీగ్‌లో కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది. He's BACK. ⚡️@davidwarner31 signs with Sydney Thunder for two seasons ahead of #BBL12! ✍️ pic.twitter.com/pdEDcO6uLl — KFC Big Bash League (@BBL) August 20, 2022 చదవండి: IND vs ZIM: దీపక్ హుడా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! -
ఆండ్రీ రసెల్ సునామీ ఇన్నింగ్స్.. సిక్సర్లతో విధ్వంసం
Andre Russell: విండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ బిగ్ బాష్ లీగ్ 2021-22లో సునామీ ఇన్నింగ్స్‌తో ప్రళయంలా విరుచుకుపడ్డాడు. ప్రస్తుత సీజన్లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కరీబియన్ యోధుడు.. సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగించాడు. 6 బంతుల్లో 5 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 34 పరుగులు పిండుకుని మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసాడు. ప్రత్యర్ధి నిర్ధేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెల్బోర్న్ జట్టు 12 ఓవర్లలో 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన రసెల్.. 21 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్‌తో 5 సిక్సర్లు, ఫోర్‌తో అజేయమైన 42 పరుగులు సాధించి మరో 17 బంతులు మిగిలుండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా మెల్బోర్న్ స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసిన రసెల్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, రసెల్ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకు ఈ లీగ్‌లో(3 మ్యాచ్‌ల్లో) ఇది రెండో విజయం చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు -
ధోనీ స్టయిల్లో మ్యాచ్ ముగించాడు!
-
ధోనీ స్టయిల్లో మ్యాచ్ ముగించాడు!
సిడ్నీ: బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ టీమిండియా స్టార్ ప్లేయర్ ఎం.ఎస్ ధోనీ స్టయిల్ లో మ్యాచ్ ముగించాడు. అదేనండీ.. చివరి బంతికి అవసరమైన 5 పరుగులను ధోనీ తరహాలో సిక్సర్ కొట్టి మెల్ బోర్న్ స్టార్స్ పై ఉత్కంఠపోరులో విజయాన్ని అందించాడు. నిన్న జరిగిన టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన సిడ్నీజట్టు కెప్టెన్ షేన్ వాట్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్ బోర్న్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఓపెనర్లు మాక్స్వెల్(34), లూక్ రైట్(25) మంచి ఓపెనింగ్ ఇచ్చారు. కెవిన్ పీటర్సన్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. లక్ష్యఛేదనలో బ్యాటింగ్ కు దిగిన సిడ్నీ జట్టు ఓపెనర్ పాటర్ సన్ (28) పరవాలేదనిపించాడు. బ్లిజార్డ్(5), కెప్టెన్ వాట్సన్(3) నిరాశపరిచారు. ఇయాన్ మోర్గాన్ అజేయ హాఫ్ సెంచరీ(50 బంతుల్లో 71 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఇన్నింగ్స్ చివరి నాలుగు బంతుల్లో సిడ్నీ విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. మూడు బంతుల్లో 11 పరుగులే వచ్చాయి. గెలవాలంటే 5 పరుగులు కావాలి. చివరి బంతిని మోర్గాన్ సిక్సర్‌గా మలిచాడు. దాదాపు గెలిచామనుకున్న మెల్ బోర్న్ అనూహ్యంగా ఓడిపోగా.. సిడ్నీ జట్టును గెలిపించిన మోర్గాన్ హీరో అయిపోయాడు. ఎన్నో మ్యాచ్‌లతో సిక్సర్‌తో విన్నింగ్ షాట్ కొట్టి టీమిండియాకు గెలిపించిన ధోనీ తరహాలోనే మోర్గాన్ సిడ్నీ థండర్స్‌కు సిక్సర్ తోనే విజయాన్ని అందించాడు. -
మరోసారి చెలరేగిన హర్మన్ ప్రీత్
ఆల్బరీ: ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్(డబ్యూబీబీఎల్)లో భారత క్రికెట్ క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ కౌర్ తన దూకుడును కొనసాగిస్తోంది. బీబీఎల్ సిడ్నీ థండర్ తరపున బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్... వరుసగా రెండో మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకుంది. తాజాగా మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన టీ 20మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 30 పరుగులతో అజేయంగా నిలిచి థండర్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మెల్బోర్న్ స్టార్స్ నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో థండర్స్ రెండు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ థండర్ జట్టులో హర్మన్ ప్రీత్‌కు తోడు హైనెస్(35), స్టెఫానీ టేలర్(29), బ్లాక్ వెల్(21)లు రాణించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మెల్ బోర్న్ స్టార్స్‌ను హర్మన్ ప్రీత్ చావుదెబ్బ కొట్టింది. నాలుగు ఓవర్లలో 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో మెల్ బోర్న్ స్టార్స్ మహిళల పతనాన్ని శాసించింది. హర్మన్ ప్రీత్ విజృంభణతో మెల్బోర్న్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 116 పరుగులకే పరిమితమైంది. ఇదిలా ఉండగా, ఇరు జట్లు మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.ఆ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ 47 పరుగులతో రాణించింది. -
బిగ్‌బాష్ విజేత సిడ్నీ థండర్
* చెలరేగిన ఉస్మాన్ ఖాజా * ఫైనల్లో మెల్బోర్న్ స్టార్స్ ఓటమి మెల్బోర్న్: ఐదో సీజన్ బిగ్‌బాష్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీని సిడ్నీ థండర్ గెలుచుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో మైక్ హస్సీ నాయకత్వంలోని థండర్ 3 వికెట్ల తేడాతో మెల్బోర్న్ స్టార్స్‌పై విజయం సాధించింది. ఈ లీగ్ చరిత్రలో థండర్ తొలిసారి విజేతగా నిలవడం విశేషం. చాంపియన్ సిడ్నీ థండర్ జట్టుకు 4 లక్షల 50 వేల డాలర్లు (రూ. 3 కోట్ల 4 లక్షలు), రన్నరప్ మెల్బోర్న్ స్టార్స్‌కు 2 లక్షల 60 వేల డాలర్లు (రూ. కోటీ 75 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కెవిన్ పీటర్సన్ (39 బంతుల్లో 74; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ షాట్లతో చెలరేగగా, మిగతావారంతా విఫలమయ్యారు. థండర్ బౌలర్లలో వాట్సన్, క్రిస్ గ్రీన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉస్మాన్ ఖాజా (40 బంతుల్లో 70; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో థండర్ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఖాజా, జాక్ కలిస్ (27 బంతుల్లో 28; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 55 బంతుల్లోనే 86 పరుగులు జోడించి శుభారంభం ఇవ్వడంతో థండర్ గెలుపు సులువైంది. క్రిస్ లిన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. ఈ విజయం అనంతరం మైక్ హస్సీ బిగ్‌బాష్ సహా ఆస్ట్రేలియా గడ్డపై అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. మహిళల టైటిల్ కూడా థండర్దే... మొదటిసారి నిర్వహించిన మహిళల బిగ్‌బాష్ లీగ్ టైటిల్‌ను కూడా సిడ్నీ థండర్ చేజిక్కించుకోవడం విశేషం. ఫైనల్లో థండర్ 3 వికెట్లతో సిడ్నీ సిక్సర్‌ను ఓడించింది. ముందుగా సిక్సర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 115 పరుగులు చేయగా... థండర్ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసి నెగ్గింది. -
ఖాజా మెరుపులతో సిడ్నీ థండర్ గెలుపు
మెల్బోర్న్: బిగ్ బాష్ లీగ్ టైటిల్ ను సిడ్నీ థండర్ కైవసం చేసుకుంది. ఆదివారం మెల్ బోర్న్ స్టార్స్ తో జరిగిన ఫైనల్ పోరులో సిడ్నీ థండర్ మూడు వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి ట్రోఫీని అందుకుంది. థండర్ ఆటగాడు ఉస్మాన్ ఖాజా(70; 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు టైటిల్ ను అందించడంలో సహకరించాడు. టాస్ గెలిచిన సిడ్నీ థండర్ తొలుత బ్యాటింగ్ చేయాల్సిదింగా మెల్ బోర్న్ స్టార్స్ ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన మెల్ బోర్న్ స్టార్స్ 20.0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మెల్ బోర్న్ స్టార్స్ లో పీటర్సన్ (74; 39 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకట్టుకోగా, ల్యూక్ రైట్(23), డేవిడ్ హస్సీ(21) లు ఫర్వాలేదనిపించారు. అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సిడ్నీ థండర్ కు ఖాజా, కల్లిస్ లు శుభారంభాన్ని అందించారు. కల్లిస్ (28;27 బంతుల్లో 4 ఫోర్లు) కుదురుగా ఆడగా, ఖాజా బ్యాట్ ఝుళిపించాడు. ఈ జోడీ తొలి వికెట్ కు 86 పరుగుల భాగస్వామ్యాన్నినమోదు చేసి సిడ్నీ థండర్ ను పటిష్టస్థితికి చేర్చారు. కాగా, ఆ తరువాత షేన్ వాట్సన్(6), మైక్ హస్సీ(18), ఆండ్రీ రస్సెల్(10), బ్లిజార్డ్(16), గ్రీన్(8)లు నిరాశపరచడంతో మ్యాచ్ కాసేపు ఇరు జట్ల మధ్య దోబుచులాడింది. అయితే మెల్ బోర్న్ స్టార్స్ బౌలర్ వారల్ వేసిన చివరి ఓవర్ మూడో బంతిని రోహ్రర్ సిక్స్ గా మలచడంతో సిడ్నీ థండర్ ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే విజేతగా అవతరించింది.