బిగ్‌బాష్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ సారథ్యం వహిస్తున్న సిడ్నీ థండర్‌కు ఊహించని విజయం దక్కింది. పెర్త్ స్కార్చర్స్‌తో ఇవాళ (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో థండర్ జట్టు 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (42 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు.
ఆఖర్లో టామ్ ఆండ్రూస్ (13 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆండ్రూస్‌కు క్రీస్ గ్రీన్ (16 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్) సహకరించాడు. ఈ ముగ్గురు మినహా థండర్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (8) సహా అంతా విఫలమయ్యారు. మాథ్యూ గిల్కెస్ 8, సామ్ బిల్లింగ్స్ 8, జార్జ్ గార్టన్ 1, హగ్ వెబ్జెన్ 6, మెక్ ఆండ్రూ 9 పరుగులకు ఔటయ్యారు. స్కార్చర్స్ బౌలర్లలో లాన్స్ మోరిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. బెహ్రెన్‌డార్ఫ్, అస్టన్ అగర్, కూపర్ కన్నోలీ, మాథ్యూ స్పూర్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.
97 పరుగులకే కుప్పకూలిన స్కార్చర్స్
థండర్ 158 పరుగుల స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టమని అంతా అనుకున్నారు. అయితే ఆ జట్టు బౌలర్లు అద్భుతం చేశారు. కలిసికట్టుగా బౌలింగ్ చేసి స్వల్ప స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకున్నారు. క్రిస్ గ్రీన్ 3, నాథన్ మెక్‌ఆండ్రూ 2, మొహమ్మద్ హస్నైన్, తన్వీర్ సంఘా, టామ్ ఆండ్రూస్ తలో వికెట్ పడగొట్టారు. ఫలితంగా స్కార్చర్స్ 17.2 ఓవర్లలో 97 పరుగులకే చాపచుట్టేసింది.
స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ హార్డీ (22), నిక్ హాబ్సన్ (10), మాథ్యూ స్పూర్స్ (13), జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సామ్ ఫాన్నింగ్ (1), ఫిన్ అలెన్ (9), కూపర్ కన్నోలీ (7), అస్టన్ టర్నర్ (4), అస్టన్ అగర్ (7), లాన్స్ మోరిస్ (0), మహ్లి బియర్డ్‌మ్యాన్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సిడ్నీ థండర్ ఫైనల్‌కు చేరింది. ఆ జట్టు తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో (11 పాయింట్లు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment