sam konstas
-
రాణించిన కొన్‌స్టాస్.. వార్నర్ జట్టుకు ఊహించని గెలుపు
బిగ్‌బాష్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ సారథ్యం వహిస్తున్న సిడ్నీ థండర్‌కు ఊహించని విజయం దక్కింది. పెర్త్ స్కార్చర్స్‌తో ఇవాళ (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో థండర్ జట్టు 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (42 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. ఆఖర్లో టామ్ ఆండ్రూస్ (13 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆండ్రూస్‌కు క్రీస్ గ్రీన్ (16 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్) సహకరించాడు. ఈ ముగ్గురు మినహా థండర్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (8) సహా అంతా విఫలమయ్యారు. మాథ్యూ గిల్కెస్ 8, సామ్ బిల్లింగ్స్ 8, జార్జ్ గార్టన్ 1, హగ్ వెబ్జెన్ 6, మెక్ ఆండ్రూ 9 పరుగులకు ఔటయ్యారు. స్కార్చర్స్ బౌలర్లలో లాన్స్ మోరిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. బెహ్రెన్‌డార్ఫ్, అస్టన్ అగర్, కూపర్ కన్నోలీ, మాథ్యూ స్పూర్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. 97 పరుగులకే కుప్పకూలిన స్కార్చర్స్థండర్ 158 పరుగుల స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టమని అంతా అనుకున్నారు. అయితే ఆ జట్టు బౌలర్లు అద్భుతం చేశారు. కలిసికట్టుగా బౌలింగ్ చేసి స్వల్ప స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకున్నారు. క్రిస్ గ్రీన్ 3, నాథన్ మెక్ఆండ్రూ 2, మొహమ్మద్ హస్నైన్, తన్వీర్ సంఘా, టామ్ ఆండ్రూస్ తలో వికెట్ పడగొట్టారు. ఫలితంగా స్కార్చర్స్ 17.2 ఓవర్లలో 97 పరుగులకే చాపచుట్టేసింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ హార్డీ (22), నిక్ హాబ్సన్ (10), మాథ్యూ స్పూర్స్ (13), జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సామ్ ఫాన్నింగ్ (1), ఫిన్ అలెన్ (9), కూపర్ కన్నోలీ (7), అస్టన్ టర్నర్ (4), అస్టన్ అగర్ (7), లాన్స్ మోరిస్ (0), మహ్లి బియర్డ్మ్యాన్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సిడ్నీ థండర్ ఫైనల్‌కు చేరింది. ఆ జట్టు తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో (11 పాయింట్లు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. -
'ముమ్మాటికీ కోహ్లిదే తప్పు.. అతడిపై నిషేధం పడాల్సింది'
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli), ఆస్ట్రేలియా యువ బ్యాటర్ సామ్ కొన్‌స్టాస్ మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు సందర్భంగా కొన్‌స్టాస్ పిచ్‌పై నడుస్తుండగా కోహ్లి వచ్చి భుజాన్ని ఢీకొట్టడంతో వివాదం మొదలైంది. దీంతో కోహ్లి తీరును చాలా మంది తప్పుబట్టారు.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా కోహ్లిపై సీరియస్ అయింది. కోహ్లి మ్యాచ్ ఫీజులో ఐసీసీ 20 శాతం కోత విధించింది. అయితే తాజాగా ఈ వివాదంపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ హార్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముమ్మాటికి కోహ్లిదే తప్పు అని, అతడు తృటిలో నిషేధం నుంచి తప్పించుకున్నాడని హార్మిసన్ అభిప్రాయపడ్డాడు. "ఆడిలైడ్‌లో యువ ఆటగాడు కాన్స్టాస్ పట్ల విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు సరికాదు. ఆ సమయంలో విరాట్ మితిమీరి ప్రవర్తించినట్లు అన్పించింది. అతడు చేసిన పనికి నిషేధం విధించి ఉండాల్సింది. విరాట్ కోహ్లి అంటే నాకు కూడా ఎంతో ఇష్టం. అతడు జెంటిల్‌మేన్ గేమ్‌కు ఎంతో వన్నె తెచ్చాడు. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అది మీరి ప్రవర్తించకూడదు. ఇక కాన్స్టాస్ అద్బుతంగా ఆడుతున్నాడు.నిజంగా అతడి స్కూప్ షాట్లు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే హిట్టింగ్ వరకు సరే కానీ, అతడి వద్దా డిఫెన్సివ్ టెక్నిక్ ఉందా లేదా గుర్తించాలి. టెస్టు క్రికెట్లో డిఫెన్స్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యం. డేవిడ్ వార్నర్ వారసుడిగా అతడు నిరూపించుకోవాలి. సామ్‌కు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అతడికి ఇంకా కేవలం 19 సంవత్సరాలు మాత్రమే అని టాక్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్మిసన్ పేర్కొన్నాడు.ఆసీస్ గడ్డపై విఫలం..ఇక కోహ్లి గత కొంతకాలంగా టెస్టు క్రికెట్లో పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో తీవ్ర నిరాశపరిచిన విరాట్.. అదే తీరును ఆస్ట్రేలియా పర్యటనలో సైతం కనబరిచాడు.తొలి టెస్టులో సెంచరీ చేసిన కోహ్లి.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పూర్తిగా తేలిపోయాడు. సిరీస్ అసాంతం ఆఫ్‌సైడ్ బంతులను వెంటాడి తన వికెట్‌ను కోహ్లి కోల్పోయాడు. కోహ్లి ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన దృష్టిలో పెట్టుకుని కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే.చదవండి: SA T20: ఐపీఎల్ వద్దంది.. కట్ చేస్తే! అక్కడ కేన్ మామ విధ్వంసం -
‘కొన్‌స్టాస్ పది టెస్టులు కూడా ఆడలేడు.. అతడి బలహీనత అదే!’
ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) భవిష్యత్తుపై ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిన్సన్(Steve Harminson) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టీనేజర్ పట్టుమని పది టెస్టులు కూడా ఆడలేడని పేర్కొన్నాడు. కాగా డేవిడ్ వార్నర్(David Warner) రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ ఓపెనింగ్ స్థానంలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా తొలుత నాథన్ మెక్‌స్వీనీ వైపు మొగ్గుచూపింది.మెక్‌స్వీనీపై వేటు.. టీనేజర్‌కు పిలుపుటీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అతడిని జట్టుకు ఎంపిక చేసింది. అయితే, ఓపెనర్‌గా 25 ఏళ్ల మెక్‌స్వీనీ పూర్తిగా విఫలమయ్యాడు. పెర్త్ టెస్టులో అరంగేట్రం చేసిన అతడు రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 10, 0 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో(39, 10 నాటౌట్)నూ పెద్దగా రాణించలేకపోయాడు. మూడో టెస్టులో(9, 4)నూ పూర్తిగా విఫలమయ్యాడు.అరంగేట్రంలోనే అర్ధ శతకంఈ క్రమంలో మెక్‌స్వీనీపై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. 19 ఏళ్ల కుర్రాడైన సామ్ కొన్‌స్టాస్‌ను భారత్‌తో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేసింది. మెల్బోర్న్ టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొన్‌స్టాస్.. అరంగేట్రంలోనే అర్ధ శతకం(60)తో దుమ్ములేపాడు. సిడ్నీలోనూ రాణించిన ఈ కుడిచేతివాటం బ్యాటర్.. మొత్తంగా రెండు టెస్టుల్లో కలిపి 113 పరుగులు సాధించాడు.కోహ్లి, బుమ్రాలతో గొడవఇక బ్యాట్ ఝులిపించడమే కాకుండా.. టీమిండియా సూపర్స్టార్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలతో గొడవ ద్వారా కూడా కొన్‌స్టాస్ మరింత ఫేమస్ అయ్యాడు. తదుపరి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న పదహారు మంది సభ్యుల ఆసీస్ జట్టులోనూ అతడు స్థానం సంపాదించాడు.డిఫెన్సివ్ టెక్నిక్ లేదుఈ నేపథ్యంలో స్టీవ్ హార్మిన్సన్ మాట్లాడుతూ.. ‘‘నాకైతే కొన్‌స్టాస్ కనీసం పది టెస్టులు కూడా ఆడలేడని అనిపిస్తోంది. అలా అని అతడి భవిష్యత్తుపై నేనిప్పుడే తీర్పునిచ్చేయడం లేదు. కానీ.. ఈ పిల్లాడు గనుక ఒక్కసారి లయ అందుకుంటే సూపర్‌స్టార్ స్థాయికి ఎదగగలడు. ఇండియాతో సిరీస్‌లో అతడు ర్యాంప్ షాట్లు, స్కూప్ షాట్లు ఆడాడు.కానీ.. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో తలపడుతున్నపుడు వికెట్ కాపాడుకోవాల్సిన అంశంపై మాత్రం దృష్టి పెట్టలేదు. టెస్టుల్లో ఓపెనర్‌గా రాణించాలంటే డిఫెన్సివ్ టెక్నిక్ ముఖ్యమైనది. అయితే, కొన్‌స్టాస్ ఈ విషయంలో బలహీనంగా ఉన్నాడు.మరో డేవిడ్ వార్నర్ కావాలని కొన్‌స్టాస్ భావిస్తున్నట్లున్నాడు. అయితే, ఈ టీనేజర్‌కు వార్నర్‌కు ఉన్న టెక్నిక్‌లు లేవు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో కొన్‌స్టాస్ ఆడితే నాకూ సంతోషమే’’ అని పేర్కొన్నాడు. కాగా కొన్‌స్టాస్‌పై హార్మిన్సన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఆస్ట్రేలియాదే బోర్డర్- గావస్కర్ ట్రోఫీప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా సొంతగడ్డపై టీమిండియాను 3-1తో ఓడించింది. తద్వారా దశాబ్ద కాలం తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతేకాదు.. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా మ్యాచ్ బరిలో దిగనున్న కమిన్స్ బృందం.. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇక డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో ఆఖరిగా శ్రీలంకతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: IND vs ENG: విరాట్ కోహ్లి కీలక నిర్ణయం -
బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు
అరంగేట్రంలోనే అద్భుత అర్ధ శతకంతో దుమ్ములేపాడు ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్(Sam Konstas). బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో మెల్బోర్న్ టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ టీనేజర్. వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగి.. తొలి మ్యాచ్‌లో 60 పరుగులతో సత్తా చాటాడు.అనంతరం.. సిడ్నీ టెస్టులోనూ సామ్ కొన్‌స్టాస్ మెరుగ్గా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 45 పరుగులు చేశాడు. అయితే, భారత్‌తో ఆఖరిదైన ఈ టెస్టు మ్యాచ్‌లో కొన్‌స్టాస్.. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తో వాగ్వాదానికి దిగాడు. సిడ్నీలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి రోజు ఆటలో భాగంగా 185 పరుగులకు ఆలౌట్ అయింది.బుమ్రాతో గొడవ పడిన కొన్స్టాస్అదే రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టగా.. బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో.. ఆఖరి బంతి వేసే సమయానికి ఖవాజా తనకు కాస్త సమయం కావాలని అడగ్గా.. బుమ్రా విసుక్కున్నాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కొన్‌స్టాస్ బుమ్రాతో గొడవకు సిద్ధమయ్యాడు. ఇందుకు బుమ్రా కూడా గట్టిగానే బదులివ్వగా.. అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు.టైమ్ వేస్ట్ చేయాలని చూశానుఅయితే, ఆఖరి బాల్‌కు ఖవాజా వికెట్ పడగొట్టిన బుమ్రా... కొన్‌స్టాస్ వైపు చూస్తూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లంతా కూడా కొన్‌స్టాస్‌ను ఇక వెళ్లు అన్నట్లుగా సైగ చేస్తూ చుట్టుముట్టారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన కొన్‌స్టాస్.. ‘‘నాకు ప్రత్యర్థులతో పోటీ పడటం అంటే ఇష్టం.అయితే, టీమిండియాతో సిరీస్ నాకెన్నో విషయాలు నేర్పించింది. నిజానికి ఆరోజు నేను బుమ్రా సమయం వృథా చేయాలని ప్రయత్నించాను. టీమిండియాకు మరో ఓవర్ వేసే అవకాశం ఇవ్వకూడదని భావించాను. కానీ.. ఆఖరికి అతడే పైచేయి సాధించాడు.బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్ఏదేమైనా అతడొక ప్రపంచ స్థాయి బౌలర్. ఈ సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు తీశాడు’’ అని బుమ్రా నైపుణ్యాలను కొనియాడాడు. అదే విధంగా.. మెల్బోర్న్ టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లి(Virat Kohli)తో గొడవ గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘మ్యాచ్ పూర్తైన తర్వాత నేను కోహ్లితో మాట్లాడాను. నాకు అతడే ఆదర్శం అని చెప్పాను.నా ఆరాధ్య క్రికెటర్‌కు ప్రత్యర్థిగా బరిలో దిగడం నిజంగా నాకు దక్కిన గౌరవం. అతడు చాలా నిరాడంబరంగా ఉంటాడు. మంచి వ్యక్తి. అతడు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. శ్రీలంక పర్యటనకు గనుక ఎంపికైతే బాగా ఆడాలని నన్ను విష్ చేశాడు’’ అని 19 ఏళ్ల సామ్ కొన్‌స్టాస్ చెప్పుకొచ్చాడు. కాగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. జూనియర్ రిక్కీ పాంటింగ్‌గా పేరొందాడు.ఫైనల్‌కు ఆసీస్.. టీమిండియా ఇంటికిఇదిలా ఉంటే.. ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-3తో చేజార్చుకుంది. తద్వారా పదేళ్ల తర్వాత తొలిసారి కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతేకాదు.. టీమిండియాను వెనక్కినెట్టి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది. ఇక టీమిండియా తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లిష్ జట్టుతో తలపడనుంది. -
కొన్‌స్టాస్ ఓవరాక్షన్.. వైల్డ్ ఫైర్‌లా బుమ్రా!.. నాతోనే పెట్టుకుంటావా..?
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు తొలిరోజు ఆట రసవత్తరంగా సాగింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఇరుజట్ల క్రికెటర్లు పోటీపడ్డారు. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతికి చోటు చేసుకున్న పరిణామాలు టీమిండియా అభిమానులకు మాంచి కిక్కిచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?!బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) 2024-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్‌లో బుమ్రా కెప్టెన్సీలో గెలిచిన టీమిండియా.. అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలో అడిలైడ్‌లో ఓడిపోయి.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకుంది.రోహిత్ లేకుండానేఅయితే, మెల్బోర్న్ టెస్టులో కనీసం డ్రా చేసుకునే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేక ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విఫలమైన రోహిత్ శర్మ(ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 31 రన్స్) ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఆసీస్‌తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, టాపార్డర్ విఫలమైన కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4)తో పాటు శుబ్‌మన్ గిల్(20), విరాట్ కోహ్లి(17) నిరాశపరిచారు.పంత్ పోరాటం.. బుమ్రా మెరుపులుమిడిలార్డర్లో రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) రాణించగా.. నితీశ్ రెడ్డి(0) పూర్తిగా విఫలమయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్(14), ప్రసిద్ కృష్ణ(3) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. పదో స్థానంలో వచ్చిన బుమ్రా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 22 పరుగులు సాధించాడు.185 పరుగులకు ఆలౌట్ఇక బుమ్రా మెరుపుల కారణంగానే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు కూల్చగా.. నాథన్ లియాన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.కొన్‌స్టాస్ ఓవరాక్షన్ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. సిడ్నీలో శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతి పడటానికి ముందు ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) ఓవరాక్షన్ చేశాడు.బుమ్రా బౌలింగ్‌కు వస్తున్న సమయంలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కాస్త ఆగమన్నట్లుగా సైగ చేయగా.. బుమ్రా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. దీంతో నాన్- స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కొన్‌స్టాస్ బుమ్రాను చూస్తూ ఏదో అనగా అతడు సీరియస్ అయ్యాడు. వైల్డ్ ఫైర్‌లా బుమ్రా.. ఓ రేంజ్లో టీమిండియా సంబరాలుఈ క్రమంలో కొన్‌స్టాస్ అతి చేస్తూ బుమ్రా వైపు రాగా.. బుమ్రా కూడా అంతే ధీటుగా బదులిచ్చాడు. దీంతో అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు. అయితే, ఈ సంఘటన జరిగిన వెంటనే తన అద్భుత బంతితో ఖవాజా(2)ను అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో ఖవాజా ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టగానే టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ‘‘నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది’’ అన్నట్లుగా బుమ్రా కొన్‌స్టాస్ వైపునకు రాగా.. అక్కడే ఉన్న యువ పేసర్ ప్రసిద్ కృష్ణ కూడా కొన్‌స్టాస్‌కు కౌంటర్ ఇచ్చాడు. దీంతో ముఖం మాడ్చుకున్న 19 ఏళ్ల ఈ టీనేజర్ ఆట ముగిసిన నేపథ్యంలో నిరాశగా మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆఖరి బంతికి అద్భుతం చేశావు భయ్యా అంటూ టీమిండియా ఫ్యాన్స్ బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కొన్‌స్టాస్‌కు ఇలాంటి ఓవరాక్షన్ కొత్తేం కాదు. మెల్బోర్న్లో తన అరంగేట్ర టెస్టులో కోహ్లితో గొడవ పెట్టుకున్న కొన్‌స్టాస్‌కు.. బుమ్రా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈసారి తనతో నేరుగా పెట్టుకున్నందుకు.. ఆసీస్‌ను దెబ్బతీసేలా వికెట్‌తో బదులిచ్చాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!Fiery scenes in the final over at the SCG! How's that for a finish to Day One 👀#AUSvIND pic.twitter.com/BAAjrFKvnQ— cricket.com.au (@cricketcomau) January 3, 2025 -
యాక్షన్‌కు రియాక్షన్.. కొన్‌స్టాస్‌కు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన బుమ్రా
బాక్సింగ్ డే టెస్ట్‌లో వాతావరణం వేడెక్కుతుంది. ఆసీస్ ఆటగాళ్ల ఓవరాక్షన్‌కు భారత ఆటగాళ్లు ధీటుగా సమాధానం చెబుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ చేస్తుండగా ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ బాగా అతి చేశాడు. స్టాండ్స్‌లో తమ అభిమానులను రెచ్చగొడుతూ భారత ఆటగాళ్లపై ఉసిగొల్పాడు. కొన్‌స్టాస్ చేసిన ఈ అతి చర్యకు భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ధీటుగా బదులిచ్చాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో కొన్‌స్టాస్‌కు బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం బుమ్రా కొన్‌స్టాస్‌ను ఇమిటేట్ చేస్తూ తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ తంతుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Never mess with Virat Kohli and Indians pic.twitter.com/n2RXItIq2v— ` (@chixxsays) December 29, 2024కాగా, బుమ్రాకు వ్యక్తిగతంగా కూడా కొన్‌స్టాస్‌పై అసంతృప్తి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కొన్‌స్టాస్ బుమ్రాను ఎడాపెడా వాయించాడు. దీనికి బదులుగా బుమ్రా సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బంతితో కొన్‌స్టాస్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. Jasprit Bumrah's triumphant payoff celebration lights up the MCG after taking Sam Konstas' wicket 🙌 pic.twitter.com/2yd5JvWLbZ— CricTracker (@Cricketracker) December 29, 2024మ్యాచ్ విషయానికొస్తే.. నితీశ్ సూపర్ సెంచరీ అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 43 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కొన్‌స్టాస్‌ను (8) బుమ్రా.. ఖ్వాజాను (21) సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశారు. లబూషేన్ (20), స్టీవ్ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి ఆసీస్ స్కోర్ 53/2గా ఉంది. 105 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని ప్రస్తుతం ఆసీస్ 158 పరుగుల ఆధిక్యంలో ఉంది.భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. -
బుమ్రా బౌలింగ్‌లో చితక్కొట్టాడు.. సెహ్వాగ్‌ను గుర్తుచేస్తున్నాడు: భారత మాజీ క్రికెటర్
ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్(Sam Konstas)పై టీమిండియా మాజీ హెడ్‌కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. పందొమ్మిదేళ్ల ఈ యువ సంచలనం అద్భుత ఆట తీరుతో తనకు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag)ను గుర్తుచేశాడని పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) బౌలింగ్‌లోనూ చితక్కొట్టిన ఇలాంటి బ్యాటర్‌ను తాను చూడలేదంటూ కొన్‌స్టాస్‌ను రవిశాస్త్రి ఆకాశానికెత్తాడు.మెస్వీనీ స్థానంలోబోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా సొంతగడ్డపై భారత్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన మొదటి మ్యాచ్ సందర్భంగా నాథన్ మెక్‌స్వీనీ ఆసీస్ తరఫున అరంగేట్రం చేయగా.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల తర్వాత అతడిపై వేటు పడింది. వరుస ఇన్నింగ్స్‌లో విఫలమైన మెక్‌స్వీనీ స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా సామ్ కొన్‌స్టాస్‌కు పిలుపునిచ్చింది.ఊహించని రీతిలో దంచికొట్టాడుఈ క్రమంలో మెల్బోర్న్లో గురువారం మొదలైన బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా పందొమ్మిదేళ్ల ఈ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆరంభంలో భారత బౌలర్లకు ఎదుర్కొనేందుకు కాస్త సమయం తీసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత ఊహించని రీతిలో దంచికొట్టాడు.బుమ్రాకే చుక్కలు చూపించాడుముఖ్యంగా బుమ్రాను కొన్‌స్టాస్ ఎదుర్కొన్న తీరు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. 2021 సిడ్నీ టెస్టులో చివరిసారిగా బుమ్రా బౌలింగ్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సిక్స్ కొట్టగా... మూడేళ్ల తర్వాత మెల్బోర్న్ టెస్టులో మళ్లీ కొన్‌స్టాస్ రివర్స్ స్కూప్ ద్వారా సిక్స్ బాదాడు. తద్వారా తన బ్యాటింగ్ పవరేంటో చూపించాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 60 పరుగులు సాధించాడు.ఈ నేపథ్యంలో రవిశాస్త్రి సామ్ కొన్‌స్టాస్ ఆట తీరును తనదైన శైలిలో విశ్లేషించాడు. ‘‘కేవలం టెస్టులే కాదు.. వన్డే, టీ20లలోనూ బుమ్రాను ఇలా ట్రీట్ చేసిన బ్యాటర్‌ను చూడలేదు. విధ్వంసకర షాట్లు ఆడటంలో అతడు తన స్వాగ్‌ను చూపించాడు. క్రికెట్ నిబంధనలనే మార్చేసేలా అతడి ఆట ఉందనడం అతిశయోక్తి కాదు.వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకు వచ్చాడుఒకానొక సమయంలో కొన్‌స్టాస్‌ను కట్టడి చేసేందుకు తమ వద్ద ప్రణాళికలు లేక టీమిండియా బిక్క ముఖం వేసినట్లు కనిపించింది. ఆరంభంలో అతడు రెండు షాట్లు మిస్ చేసినపుడు కనిపించిన ఆనందం.. కాసేపట్లోనే ఆవిరైంది. అతడు హిట్టింగ్ మొదలుపెట్టగానే నాకు వీరేంద్ర సెహ్వాగ్ జ్ఞప్తికి వచ్చాడు.క్రీజులో కుదురుకున్నాక వీరూ ఎంతగా వినోదం పంచుతాడో.. కొన్‌స్టాస్ కూడా అలాగే చేశాడు. ఆసీస్ జట్టులో కొన్‌స్టాస్ గనుక తన స్థానం సుస్థిరం చేసుకుంటే భవిష్యత్తులో అతడికి తిరుగు ఉండదు’’ అని కొన్‌స్టాస్‌పై రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కొన్‌స్టాస్ లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.చదవండి: విశ్రాంతి కాదు.. నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజంWHAT ARE WE SEEING! Sam Konstas just whipped Jasprit Bumrah for six 😱#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/ZuNdtCncLO— cricket.com.au (@cricketcomau) December 26, 2024 -
కోహ్లికి అవమానం.. ఇంత నీచంగా ప్రవర్తిసారా?
మెల్బోర్న్ టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి అవమానం జరిగింది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో.. ప్రేక్షకులు పరుష పదజాలంతో అతడిని దూషించారు. దీంతో వెనక్కి తిరిగి వచ్చిన కోహ్లి సీరియస్‌గా చూస్తూ.. వారికి బదులిచ్చేందుకు సిద్ధం కాగా.. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతడికి నచ్చజెప్పి పంపించారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test) మొదలైంది.ఆసీస్ స్కోరు 474ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కంగారూ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. టాపార్డర్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal- 82) అద్బుత అర్ధ శతకంతో మెరవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(3) విఫలమయ్యాడు.ఆది నుంచే తడ‘బ్యాటు’.. ఆదుకున్న జోడీవన్డౌన్లో వచ్చిన కేఎల్ రాహుల్ 24 పరుగులకే నిష్క్రమించగా.. విరాట్ కోహ్లి(86 బంతుల్లో 36).. జైస్వాల్‌తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. దీంతో కాస్త కోలుకున్నట్లే కనిపించిన టీమిండియాకు.. వరుస ఓవర్లలో జైస్వాల్- కోహ్లి అవుట్ కావడంతో గట్టి షాక్ తగిలింది. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ 46 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.ఇదిలా ఉంటే.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ అవుటైన కోహ్లి.. పెవిలియన్‌కు వెళ్తుండగా.. ఆసీస్ ఫ్యాన్స్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఏంటీ మీ సంగతి?దీంతో వెనక్కి తిరిగి వచ్చిన కోహ్లి.. ‘‘ఏంటీ మీ సంగతి?’’ అన్నట్లుగా సీరియస్ లుక్ ఇచ్చాడు. అంతలో అక్కడ ఉన్న భద్రతా అధికారి.. కోహ్లిని అనునయించి.. నచ్చజెప్పి లోపలికి తీసుకువెళ్లాడు.కాగా బాక్సింగ్ డే టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా ఆసీస్ యువ ఓపెనర్, అరంగేట్ర బ్యాటర్ సామ్ కొన్‌స్టాస్(60)తో కోహ్లికి గొడవ(Virat Kohli- Sam Konstas Altercation) జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ కోహ్లి మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం మేర కోత కూడా విధించింది. ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? అయితే, ఈ గొడవను దృష్టిలో పెట్టుకుని ఆసీస్ మీడియాతో పాటు ఆ దేశ అభిమానులు కోహ్లి పట్ల అవమానకర రీతిలో వ్యవహరించారు. కోహ్లిని ఉద్దేశించి.. జోకర్ అన్న అర్థంలో ఆసీస్ మీడియా కథనాలు ప్రచురించింది. ఇక కంగారూ జట్టు అభిమానులేమో ఇలా గ్రౌండ్లో కోహ్లిని హేళన చేస్తూ అభ్యంతరకర భాష ఉపయోగించారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు. దిగ్గజ ఆటగాడి పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? అని సోషల్ మీడియా వేదికగా #Viratkohli #KingKohli అంటూ ట్రెండ్ చేస్తున్నారు.విమర్శించండి.. కానీభారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా సతీమణి, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ‘‘అత్యుత్తమ బ్యాటర్ పట్ల ఇలా అగౌరవంగా ప్రవర్తించడం సరికాదు. విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది. కానీ హద్దులు మీరి.. అసభ్యంగా వ్యవహరించకూడదు’’ అని సంజనా పేర్కొన్నారు.చదవండి: టీమిండియా అంటే చాలు, రెచ్చిపోతాడు.. స్టీవ్ స్మిత్ ప్రపంచ రికార్డుReally disrespectful behavior with country's best batter. Criticism is ok, but abuse crosses the line. Upholding the spirit of cricket and supporting our players with dignity.#ViratKohli𓃵 #INDvsAUS #AUSvIND pic.twitter.com/NnZPDkeOs7— Sanjana Ganesan 🇮🇳 (@iSanjanaGanesan) December 27, 2024 -
లబుషేన్‌కు రోహిత్ వార్నింగ్ ఇచ్చినా.. అంపైర్లు పట్టించుకోరా?
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ల తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్ మధ్య పరిగెత్తడం సరికాదని చెబుతున్నా.. పదే పదే అదే తప్పు పునరావృతం చేశారని మండిపడ్డారు. అంపైర్లు కూడా ఆసీస్ బ్యాటర్లను చూసీ చూడనట్లు వదిలేయడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత్- ఆసీస్ మధ్య గురువారం నాలుగో టెస్టు మొదలైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలిరోజు కంగారూ జట్టు పైచేయి సాధించింది. 86 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 311 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీతోఓపెనర్లలో అరంగేట్ర ఆటగాడు సామ్ కొన్‌స్టాస్(60), ఉస్మాన్ ఖవాజా(57) అర్ధ శతకాలతో మెరవగా.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(72) కూడా రాణించాడు. మిగతా వాళ్లలో అలెక్స్ క్యారీ(31) ఫర్వాలేదనిపించగా.. స్టీవ్ స్మిత్ గురువారం ఆట పూర్తయ్యేసరికి 68 పరుగులతో క్రీజులో ఉన్నాడు.లబుషేన్‌కు రోహిత్ వార్నింగ్ఇక భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా పరుగులు తీసే సమయంలో లబుషేన్(Marnus Labuschagne) పిచ్ మధ్యగా పరిగెత్తగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ అతడిని హెచ్చరించాడు. కామెంటేటర్లు సునిల్ గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్ ఈ విషయం గురించి చర్చిస్తూ ఆసీస్ బ్యాటర్ల తీరును తప్పుబట్టారు.అంపైర్లు ఏం చేస్తున్నారు?‘‘పిచ్ మధ్య పరిగెత్త వద్దని మార్నస్ లబుషేన్‌కు రోహిత్ శర్మ చెప్పాడు. అయినా.. మధ్య స్ట్రిప్ గుండా ఎందుకు పరిగెత్తాలి?’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ఇందుకు గావస్కర్ స్పందిస్తూ.. ‘‘సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) కూడా ఇలాగే చేశాడు. అయినా.. అతడిని ఎవరూ హెచ్చరించలేదు’’ అని అన్నాడు.ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘నిజానికి ఇది అంపైర్ల పని’’ అని పేర్కొనగా.. ‘‘అవును అంపైర్లు అలా చూస్తూ ఊరుకున్నారు. రోహిత్- లబుషేన్‌తో మాట్లాడుతుంటే.. జస్ట్ అలా చూస్తూ ఉండిపోయారంతే.. ఎందుకలా ఉన్నారో నాకైతే అర్థం కాలేదు’’ అని గావస్కర్ అన్నాడు. వీరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చదవండి: ఆసీస్‌తో బాక్సింగ్ డే టెస్టు: వ్యూహం మార్చిన టీమిండియా!.. అందుకే గిల్‌పై వేటు🗣 #RohitSharma gets disappointed, warns #Labuschagne for running on the pitch during the #BoxingDayTest 🧐#AUSvINDOnStar 👉 4th Test, Day 1 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/iNGMjtGXXQ— Star Sports (@StarSportsIndia) December 26, 2024 -
కోహ్లితో గొడవ.. ఆసీస్ యువ ఓపెనర్ స్పందన ఇదే
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో జరిగిన వాగ్వాదం(Virat Kohli- Sam Konstas Altercation)పై ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ స్పందించాడు. ఆటలో ఇలాంటివి సహజమేనని పేర్కొన్నాడు. అయితే, భావోద్వేగాలు అదుపులో లేకపోవడం వల్లే తామిద్దరం అలా గొడవపడ్డామని తెలిపాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత జట్టు ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది.అరంగేట్రంలోనే అదుర్స్ఇప్పటి వరకు మూడు టెస్టులు జరుగగా ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్- ఆసీస్ మధ్య మెల్బోర్న్లో గురువారం నాలుగో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్ సందర్భంగా 19 ఏళ్ల సామ్ కొన్‌స్టాస్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. దూకుడైన ఆటతో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.ముఖ్యంగా టీమిండియా పేస్ దళ నాయకుడు, ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను సామ్ ఎదుర్కొన్న తీరు విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. టీ20 తరహాలో దంచికొట్టిన సామ్ కొన్‌స్టాస్ 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు సాధించాడు. అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీలు బాది పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే, సామ్ కొన్‌స్టాస్ ఏకాగ్రతను దెబ్బతీసే క్రమంలో విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. దూకుడు మీదున్న సామ్‌కు భుజాలు తాకిస్తూ కోహ్లి కాస్త దుందుడుకుగా ప్రవర్తించినట్లు కనిపించింది. సామ్ కూడా అతడికి అంతే గట్టిగా బదులివ్వగా వాగ్వాదం జరిగింది. ఇంతలో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతపరిచారు.కోహ్లికి ఐసీసీ షాక్ఇక ఈ ఘటన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి విరాట్ కోహ్లికి షాకిచ్చింది. మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం మేర కోత విధించింది. ఇదిలా ఉంటే.. తన అభిమాన క్రికెటర్‌తో గొడవపై సామ్ కొన్‌స్టాస్ స్పందించిన తీరు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది.నేను గ్లోవ్స్ సరిచేసుకుంటున్నారవీంద్ర జడేజా బౌలింగ్‌లో తాను అవుటైన తర్వాత.. కోహ్లితో గొడవ గురించి సామ్ కొన్‌స్టాస్ మాట్లాడుతూ.. ‘‘ఆ సమయంలో మేమిద్దరం భావోద్వేగంలో మునిగిపోయి ఉన్నామేమో!.. అప్పుడు నేను గ్లోవ్స్ సరిచేసుకుంటున్నా. ఆ సమయంలో అతడు వస్తున్నట్లు గమనించలేకపోయా. అయినా క్రికెట్లో ఇవన్నీ సహజమే’’ అని 7క్రికెట్‌తో వ్యాఖ్యానించాడు. కాగా కోహ్లి తన అభిమాన క్రికెటర్ అని సామ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్అదే విధంగా తన ప్రణాళికల గురించి ప్రస్తావన రాగా.. ‘‘బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్. అయితే, అతడిపై ఒత్తిడి పెంచగలిగితేనే నేను పైచేయి సాధించగలనని తెలుసు. అందుకే దూకుడుగా ఆడుతూ.. అతడిని డిఫెన్స్‌లో పడేలా చేశాను. నిజానికి మ్యాచ్‌కు ముందు నేనేమీ ప్రత్యేక ప్రణాళికలు రచించుకోలేదు’’ అని సామ్ కొన్‌స్టాస్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. బాక్సింగ్ డే టెస్టులో తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆసీస్ 311 పరుగులు చేసింది. భారత బౌలర్లు బుమ్రా మూడు, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీశారు.చదవండి: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్The man of the moment 👊Sam Konstas chats with @copes9 about his first Test innings...And everything else that happened during it as well #AUSvIND pic.twitter.com/v7hhwMWgtB— 7Cricket (@7Cricket) December 26, 2024 -
విరాట్ కోహ్లికి ఐసీసీ భారీ షాక్
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli), ఆసీస్ అరంగేట్ర ఆటగాడు సామ్ కాన్స్టాస్ మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి రోజు ఆట సందర్భంగా అద్బుతంగా ఆడుతున్న కాన్స్టాస్ను కోహ్లి కవ్వించే ప్రయత్నించాడు.ఓవర్ పూర్తయ్యాక పిచ్‌పై అవతలి ఎండ్ వైపు నడిచి వెళుతున్న కాన్స్టాస్ను విరాట్ కోహ్లి తన భుజంతో బలంగా ఢీకొన్నాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. అయితే యువ క్రికెటర్ పట్ల కోహ్లి వ్యవహరించిన తీరును చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఒక సీనియర క్రికెటర్ అయివుండి అలా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కోహ్లిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో ఐసీసీ 20 శాతం కోత విధించింది. తమ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కోహ్లిపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.జరిమానాతో పాటు ఓ డిమెరిట్ పాయింట్ కూడా విరాట్ ఖాతాలో చేరింది. అయితే ఈ భారత మాజీ కెప్టెన్ మ్యాచ్ సస్పెన్షన్ మాత్రం తప్పించుకున్నాడు. కోహ్లిపై ఓ మ్యాచ్ నిషేదం పడుతుందని అంతా భావించారు. కానీ ఐసీసీ కేవలం ఫైన్‌తోనే సరిపెట్టింది.ఆసీస్‌దే పై చేయి..ఇక ఈ బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో కాన్స్టాస్(60), ఖావాజా(57), లబుషేన్(72), స్మిత్(68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్, సుందర్, జడేజా తలా వికెట్ సాధించారు.చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు -
IND Vs AUS: ఆసీస్ అరంగేట్ర ఆటగాడితో కోహ్లి వాగ్వాదం.. వీడియో వైరల్!
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు నుంచే వాడీవేడిగా సాగుతోంది. మొదటి రోజు ఆటలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, ఆసీస్ అరంగేట్ర ఆటగాడు సామ్ కాన్స్టాస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.19 ఏళ్ల సామ్ కాన్స్టాస్ తన డెబ్యూ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కాన్స్టాస్ జస్ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్‌ను సైతం అలోవకగా ఎదుర్కొని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఆసీస్ యువ సంచలనాన్ని అడ్డుకొనేందుకు భారత పేసర్లు చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలో కాన్స్టాస్ ఏకాగ్రతను దెబ్బ తీసేందుకు విరాట్ కోహ్లి స్లెడ్జింగ్‌కు దిగాడు.కాన్స్టాస్ నడిచి వస్తుండగా విరాట్ తన భుజం తగిలించాడు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. వెంటనే ఉస్మాన్ ఖావాజా, అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అయితే కోహ్లి చర్యలు ఐసీసీ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండడంతో జరిమానా పడే అవకాశముంది. కాగా ఈ సంఘటన తర్వాత కాన్స్టాస్ మరింత చెలరేగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 65 బంతులు ఎదుర్కొన్న 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు.చదవండి: గెలుపు పంచ్ ఎవరిదో? Kohli and Konstas come together and make contact 👀#AUSvIND pic.twitter.com/adb09clEqd— 7Cricket (@7Cricket) December 26, 2024 -
భారత్‌తో నాలుగో టెస్టు.. ఆసీస్ తుది జట్టు ప్రకటన
మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి భారత్‌తో జరగనున్న నాలుగో టెస్టు కోసం తమ తుది జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు ముందు తొడ కండరాల గాయంతో బాధపడిన ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ట్రావిస్ హెడ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో బాక్సింగ్ డే టెస్ట్‌లో హెడ్ ఆడనున్నాడు. కాగా ఆస్ట్రేలియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది.ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ స్ధానంలో యువ సంచలనం సామ్ కాన్స్టాస్కు ఆసీస్ జట్టు మెనెజ్‌మెంట్ చోటు ఇచ్చింది. 19 ఏళ్ల కాన్స్టాస్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకున్నారు. కాన్స్టాస్.. ఉస్మాన్ ఖావాజాతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.మరోవైపు గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన జోష్ హాజిల్ వుడ్ స్ధానంలో స్కాట్ బోలాండ్ తుది జట్టులోకి వచ్చాడు. బోలాండ్ ఇప్పటికే పింక్ బాల్ టెస్టులో సత్తాచాటాడు. మూడో టెస్టుకు హాజిల్‌వుడ్ అందుబాటులోకి రావడంతో బోలాండ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. మళ్లీ ఇప్పుడు అతడు జట్టు నుంచి బయటకు వెళ్లడంతో బోలాండ్కు ఛాన్స్ లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.తుది జట్టుఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్. -
‘అతడికి దూకుడు ఎక్కువ.. సూపర్ బ్యాటర్’
యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మైక్ హస్సీ ప్రశంసలు కురిపించాడు. బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తూ అతడు బ్యాటింగ్ చేసే విధానం చూడముచ్చటగా ఉంటుందని కొనియాడాడు. ఇక టీమిండియా వంటి పటిష్ట జట్టుపై ఓపెనర్‌గా అరంగేట్రం చేసే అవకాశం రావడం గొప్ప విషయం అని పేర్కొన్నాడు.ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం భారత్‌తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడుతున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో ఓడిపోయిన కంగారూలు.. అడిలైడ్‌లో గెలుపొందారు. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేశారు. అయితే, ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ టెస్టు ‘డ్రా’ గా ముగిసింది. ఈ క్రమంలో భారత్- ఆసీస్ మధ్య మెల్బోర్న్లో నాలుగు, సిడ్నీలో ఐదో టెస్టు జరుగనున్నాయి.కొత్త కుర్రాడికి చోటుఇందుకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం జట్టును ప్రకటించింది. పెర్త్ టెస్టుతో అరంగేట్రం చేసిన ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీని తప్పించి.. సామ్ కొన్‌స్టాస్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. ఒకవేళ డిసెంబరు 26 నుంచి జరిగే ‘బాక్సింగ్ టెస్టు’ (నాలుగో మ్యాచ్)లో తుది జట్టు తరఫున కొత్త కుర్రాడు బరిలోకి దిగితే చరిత్రే.వారిద్దరి తర్వాతడెబ్బై ఏళ్ల తర్వాత.. అంతర్జాతీయ టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న ఆసీస్ టీనేజ్ బ్యాటర్‌గా కొన్‌స్టాస్ ఘనత వహిస్తాడు. 1953లో ఇయాన్ క్రెయిగ్ 17 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ తరఫున స్పెషలిస్ట్ బ్యాటర్‌గా అరంగేట్రం చేశాడు. అయితే 2011లో ప్యాట్ కమిన్స్ (ప్రస్తుత కెప్టెన్) 18 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసినప్పటికీ అతను స్పెషలిస్టు బౌలర్(పేసర్)!ఈ నేపథ్యంలో మైక్ హస్సీ ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ.. ‘‘మెక్‌స్వీనీ పట్ల కాస్త కఠినంగానే వ్యవహరించారన్న మాట వాస్తవం. అతడిపై నాకు సానుభూతి ఉంది. అయితే, కొన్‌స్టాస్ తక్కువేమీ కాదు. బిగ్‌బాష్ లీగ్‌లో అతడి ఆట నన్ను ఆకట్టుకుంది.ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదుఅద్భుతమైన సందర్భంలో కొన్‌స్టాస్ అరంగేట్రం చేయబోతున్నాడు. 19 ఏళ్ల వయసులోనే టీమిండియా మీద.. అది కూడా బాక్సింగ్ డే టెస్టులో ఓపెనింగ్ బ్యాటర్‌గా అవకాశం. వావ్.. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేం ఉంటుంది’’ అని కొన్‌స్టాస్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.కాగా ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలతో పాటు ఆసీస్ ‘ఎ’, బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లలో కొన్‌స్టాస్ నిలకడగా రాణిస్తున్నాడు. భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టులో అజేయ అర్ధ శతకం (73 నాటౌట్) బాదాడు కొన్‌స్టాస్.అదే విధంగా.. అడిలైడ్‌లో డే-నైట్ టెస్టుకు ముందు భారత్‌తో జరిగిన సన్నాహక పింక్ బాల్ (రెండు రోజుల మ్యాచ్) పోరులో ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తరఫున శతకం (107) సాధించాడు. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కుర్ర బ్యాటర్.. శనివారం సిడ్నీ సిక్సర్‌తో మ్యాచ్ పూర్తయ్యాక ఆసీస్ టెస్టు జట్టుతో కలుస్తాడు.చదవండి: BGT: అతడిపైనే వేటు వేస్తారా?.. సెలక్టర్లపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఫైర్ -
BGT: ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు
టీమిండియాతో మిగిలిన రెండు టెస్టులకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టు నుంచి ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీకి ఉద్వాసన పలికింది. అతడి స్థానంలో సామ్ కొన్‌స్టాస్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటిచ్చింది.అతడి పునరాగమనంఅదే విధంగా.. ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్సన్కు కూడా భారత్‌తో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులకు ఎంపిక చేసింది. కాగా గాయం వల్ల 2021-22 యాషెస్ సిరీస్ తర్వాత టెస్టు జట్టుకు దూరమైన రిచర్డ్సన్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక సీన్ అబాట్ కూడా పునరాగమనం చేయగా.. అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ కూడా జట్టుతో కొనసాగనున్నాడు.ఇక పిక్క కండరాల నొప్పి కారణంగా మూడో టెస్టు సందర్భంగా గాయపడ్డ స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్.. నాలుగు, ఐదో టెస్టులకు పూర్తిగా దూరమయ్యాడు. కాగా ఆస్ట్రేలియా-‘ఎ’ తరఫున రాణించిన మెక్‌స్వీనీ టీమిండియాతో తొలి టెస్టు సందర్భంగా పెర్త్‌లో అరంగేట్రం చేశాడు.వరుస సెంచరీలతో చెలరేగిఅయితే, ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లోనూ అతడు నిరాశపరిచాడు. ఫలితంగా మెక్‌స్వీనీ (ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 72 రన్స్)పై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. సామ్ కొన్‌స్టాస్‌కు తొలిసారి పిలుపునిచ్చింది. కాగా సామ్ తన చక్కటి బ్యాటింగ్ శైలితో జూనియర్ రిక్కీ పాంటింగ్‌గా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. 19 ఏళ్ల ఈ యువ బ్యాటర్ ఇటీవల షెఫీల్డ్‌షీల్డ్ మ్యాచ్‌లో సౌత్ వేల్స్‌కు ప్రాతినిథ్య వహించాడు. సౌత్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో వరుస సెంచరీలు(152, 105) బాదాడు.ఫాస్టెస్ ఫిఫ్టీతోఅంతేకాదు.. భారత్-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా-‘ఎ’ తరఫున 73 రన్స్‌తో చెలరేగాడు. బిగ్‌బాష్ లీగ్‌లోనూ అడుగుపెట్టిన ఈ యువ సంచలనం.. సిడ్నీ థండర్ తరఫున అరంగేట్రంలోనే ఫాస్టెస్ ఫిఫ్టీ(27 బంతుల్లో 56) నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు.ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా సొంతగడ్డపై ఆస్ట్రేలియా భారత్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా.. అడిలైడ్ టెస్టులో ఆతిథ్య ఆసీస్ గెలుపొందాయి. ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ టెస్టు డ్రా అయింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమంగా ఉండగా.. మెల్బోర్న్(డిసెంబరు 26-30)లో, సిడ్నీ(జనవరి 3-7) నాలుగు, ఐదో టెస్టులు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌ల ఫలితంపైనే ఆసీస్- టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.భారత్‌తో మూడు, నాలుగు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్(వైస్ కెప్టెన్), స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, జే రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం