మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli), ఆసీస్ అరంగేట్ర ఆటగాడు సామ్ కాన్‌స్టాస్ మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి రోజు ఆట సందర్భంగా అద్బుతంగా ఆడుతున్న కాన్‌స్టాస్‌ను కోహ్లి కవ్వించే ప్రయత్నించాడు.
ఓవర్ పూర్తయ్యాక పిచ్‌పై అవతలి ఎండ్ వైపు నడిచి వెళుతున్న కాన్‌స్టాస్‌ను విరాట్ కోహ్లి తన భుజంతో బలంగా ఢీకొన్నాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. అయితే యువ క్రికెటర్ పట్ల కోహ్లి వ్యవహరించిన తీరును చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఒక సీనియర క్రికెటర్ అయివుండి అలా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో కోహ్లిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో ఐసీసీ 20 శాతం కోత విధించింది. తమ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కోహ్లిపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
జరిమానాతో పాటు ఓ డిమెరిట్ పాయింట్ కూడా విరాట్ ఖాతాలో చేరింది. అయితే ఈ భారత మాజీ కెప్టెన్ మ్యాచ్ సస్పెన్షన్ మాత్రం తప్పించుకున్నాడు. కోహ్లిపై ఓ మ్యాచ్ నిషేదం పడుతుందని అంతా భావించారు. కానీ ఐసీసీ కేవలం ఫైన్‌తోనే సరిపెట్టింది.
ఆసీస్‌దే పై చేయి..
ఇక ఈ బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో కాన్‌స్టాస్(60), ఖావాజా(57), లబుషేన్(72), స్మిత్(68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్, సుందర్, జడేజా తలా వికెట్ సాధించారు.
చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment