మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి భారత్‌తో జరగనున్న నాలుగో టెస్టు కోసం తమ తుది జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు ముందు తొడ కండరాల గాయంతో బాధపడిన ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ట్రావిస్ హెడ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో బాక్సింగ్ డే టెస్ట్‌లో హెడ్ ఆడనున్నాడు. కాగా ఆస్ట్రేలియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది.
ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ స్ధానంలో యువ సంచలనం సామ్ కాన్‌స్టాస్‌కు ఆసీస్ జట్టు మెనెజ్‌మెంట్ చోటు ఇచ్చింది. 19 ఏళ్ల కాన్‌స్టాస్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకున్నారు. కాన్‌స్టాస్.. ఉస్మాన్ ఖావాజాతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.
మరోవైపు గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన జోష్ హాజిల్ వుడ్ స్ధానంలో స్కాట్ బోలాండ్ తుది జట్టులోకి వచ్చాడు. బోలాండ్ ఇప్పటికే పింక్ బాల్ టెస్టులో సత్తాచాటాడు. మూడో టెస్టుకు హాజిల్‌వుడ్ అందుబాటులోకి రావడంతో బోలాండ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. మళ్లీ ఇప్పుడు అతడు జట్టు నుంచి బయటకు వెళ్లడంతో బోలాండ్‌కు ఛాన్స్ లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
తుది జట్టు
ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
Comments
Please login to add a commentAdd a comment