బాక్సింగ్ డే టెస్ట్‌లో వాతావరణం వేడెక్కుతుంది. ఆసీస్ ఆటగాళ్ల ఓవరాక్షన్‌కు భారత ఆటగాళ్లు ధీటుగా సమాధానం చెబుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ చేస్తుండగా ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ బాగా అతి చేశాడు. స్టాండ్స్‌లో తమ అభిమానులను రెచ్చగొడుతూ భారత ఆటగాళ్లపై ఉసిగొల్పాడు.
కొన్‌స్టాస్ చేసిన ఈ అతి చర్యకు భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ధీటుగా బదులిచ్చాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో కొన్‌స్టాస్‌కు బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం బుమ్రా కొన్‌స్టాస్‌ను ఇమిటేట్ చేస్తూ తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ తంతుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
Never mess with Virat Kohli and Indians pic.twitter.com/n2RXItIq2v
— ` (@chixxsays) December 29, 2024
కాగా, బుమ్రాకు వ్యక్తిగతంగా కూడా కొన్‌స్టాస్‌పై అసంతృప్తి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కొన్‌స్టాస్ బుమ్రాను ఎడాపెడా వాయించాడు. దీనికి బదులుగా బుమ్రా సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బంతితో కొన్‌స్టాస్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
Jasprit Bumrah's triumphant payoff celebration lights up the MCG after taking Sam Konstas' wicket 🙌 pic.twitter.com/2yd5JvWLbZ
— CricTracker (@Cricketracker) December 29, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. నితీశ్ సూపర్ సెంచరీ అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 43 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కొన్‌స్టాస్‌ను (8) బుమ్రా.. ఖ్వాజాను (21) సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశారు. లబూషేన్ (20), స్టీవ్ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి ఆసీస్ స్కోర్ 53/2గా ఉంది. 105 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని ప్రస్తుతం ఆసీస్ 158 పరుగుల ఆధిక్యంలో ఉంది.
భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment